*మన జీవితంలో వెలుగులు (నేడు దీపావళి సందర్భంగా)*
🌹మన జీవితం లో 'అంధకారం'... అనేది మన 'అఙ్ఙానముకు' మరియు మన 'నిరాశకు' చిహ్నం. అలాగే..,
🌿వెలుగు అనేది మన 'ఙ్ఞానానికి' మరియు మన జీవితంలో 'ఆనందానికి' చిహ్నం.
🌹అఙ్ఞానమనే చీకటి నుంచి... ఙ్ఞానమనే వెలుగులోకి ప్రయాణించడమే ‘దీపావళి’ పండుగలోని అంతరార్ధం.
🌿‘దీప’ అంటే దీపము....‘ఆవళి’ అంటే వరుస... దీప + ఆవళి అంటే.. దీపాల వరుస అని అర్ధం...
🌹దీపం ఐశ్వర్యం అయితే... అంధకారం దారిద్ర్యం .. దరిద్రాన్ని పారద్రోలి, ఐశ్వర్య మార్గంలోకి ప్రయాణిచడమే ‘దీపావళి’ పండుగ...
🌿'దీపం’ త్రిమూర్తి స్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి.
🌹‘ఎర్రని’ కాంతి బ్రహ్మదేవునికి..,
‘నీలి’ కాంతి శ్రీమహావిష్ణువుకి..
‘తెల్లని’ కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు.
🌿సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం
భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే
త్రాహిమాన్నరకాద్ఘోరాత్ - దివ్య జ్యోతిర్నమోస్తుతే
🌹ఏ దీపమైనా మూడు వత్తులు వేసి వెలిగించాలి గానీ.. ఒక వత్తు దీపం.... రెండు వత్తుల దీపాలు.. వెలిగించరాదు.
🌿‘మూడు వత్తుల' దీపం.. గృహానికి శుభాలు చేకూరుస్తుంది...
🌹ముల్లోకాలలోని అంధకారాన్ని పారద్రోలి లక్ష్మీ నిలయంలా చేస్తుంది. నరకం నుంచి రక్షిస్తుంది.
🌿దీపం సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం. అటువంటి దీపాన్ని..ఆవు నేతితోగానీ.. నువ్వుల నూనెతోగానీ..భక్తిగా వెలిగించాలి...
🌹మరెంతో భక్తిగా నమస్కరించాలి అని పై శ్లోకం అర్థం.
🌹 దీపం - లక్ష్మీ స్వరూపం 🌹
🌿దీపం ఉన్నచోట సర్వసంపదలు తాండవిస్తాయి.., ఆనందాలు వెల్లివిరుస్తాయి., సుఖ, సంతోషాలు చోటు చేసుకుంటాయి.
🌸అందుకే నిరంతరం మన పూజామందిరంలో దీపం వెలుగుతూండాలనే నియమం పెట్టారు.
🌹 దీపం - విజయానికి చిహ్నం 🌹
🌿అందుకే పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే సైనికులకు, రాజులకూ విజయతిలకం దిద్ది విజయహారతులిచ్చి పంపేవారు..
🌸నిజానికి ‘దీపాన్ని’ మట్టి ప్రమిదలోనే వెలిగించాలి. మట్టి ఉష్ణాన్ని తనలో లీనం చేసుకుంటుంది. అందుకే ఎంతసేపు వెలిగినా మట్టి ప్రమిద వేడెక్కదు.
🌿మనం ఆర్భాటం కొద్దీ ఉపయోగించే వెండి, ఇత్తడి, రాగి, కంచు ప్రమిదలు దీపం వెలిగించిన కొద్దిసేపటికే వేడెక్కిపోతాయి. ఆ వేడిని భూమాత భరించలేదు, కనుకనే వట్టి నేలపైన దీపం వెలిగించరాదు.
🌸ప్రమిదలో ప్రమిద వేసి మూడు వత్తుల దీపం వెలిగించాలి.
🌹 ఇది సాంప్రదాయం 🌹
🌿మానవదేహం మట్టి నిర్మితం. అందుకే మనం ఎంత నలుగు పెట్టుకుని రుద్దినా., ఎన్ని సబ్బులు అరగదీసినా., ఎన్ని షాంపూలతో స్నానం చేసి వచ్చినా.., మన దేహంపై ఎక్కడ రుద్దినా కాస్తో కూస్తో మట్టి రాలుతుంది. గమనించండి.
🌸ఈ మానవదేహం ఓ మట్టి ప్రమిద. ఈ ప్రమిదలో జ్యోతి రూపంతో భాసిల్లేవాడే ‘పరమాత్మ’.
🌿ఆ జ్యోతి ఈ మానవ ప్రమిదలో వెలుగుతున్నంత సేపు ఈ దేహం చైతన్యవంతంగా, ప్రాణంతో ఉంటుంది. దీపం లేని ప్రమిదకు విలువ ఉండదు.
🌸అందుకే మనిషి మరణించిన తర్వాత ఆ పార్థివదేహం తల దగ్గర ఒంటి వత్తు దీపం వెలిగిస్తారు. ఈ దేహంలోని జ్యోతి బయటకు వెళ్లిపోయింది అని తెలియ చెప్పడానికి ఆ దీపం నిదర్శనం.
🌿ఇక్కడ మాత్రం ఒంటి వత్తు దీపాన్నే వెలిగించాలి. కారణం..
‘ఏకో పరాత్మా బహుదేహ వర్తిః’
దేహాంతర్గతుడైన పరమాత్మ ఒక్కడే. ఇది వేదాంతార్థం.
🌸ఇక.. అగ్నిదేవుని రూపమే ఈ దీపం. మన హైందవధర్మానికి మూలస్తంభాలు నాలుగు వేదాలు. అందులో తొలివేదం.. ‘ఋగ్వేదం’.
🌿‘అగ్నిమీళే పురోహితం యఙ్ఞస్య దేవమృత్విజమ్ హోతారం రత్నధాతమమ్’
🌸ఇది ఋగ్వేదంలోని తొలి ఋక్కు. ఈ ఋక్కుతోనే వేదం ప్రారంభమవుతుంది. అంటే...
🌿తొలిసారిగా కీర్తించబడిన తొలి దేవుడు ‘అగ్ని’. అంటే ‘జ్యోతి స్వరూపం’. ఈ జ్యోతి స్వరూపమే పురహితాన్ని కోరే తొలి పురోహితుడు.. ఋత్విక్కుడూను.
🌸మన జీవితంలోని మంచి, చెడులలో మనకు తోడుగా ఉంటూ, మార్గ దర్శకత్వం వహించేది ఈ జ్యోతి ఒక్కటే. కనుక ఆ ‘జ్యోతి' ని ఉపాసించడం., ఆరాధించచడం మన ధర్మం.
🌿నరకాసుర సంహారంతో సకల లోకాలు కష్టాల అంధకారంలోంచి సంతోషమనే వెలుగులోకి వచ్చాయి. అందుకే నరకచతుర్దశి నుంచే మన సుఖ, సంతోషాలను వ్యక్తం చేయడానికి నిదర్శనంగా దీపాలు వెలిగించాలి.
🌸ఆ వెలుగులో మన జీవితం, మన కుటుంబం, మన నవసామాజిక సమాజం పయనించాలి.
🌿ఈ దీపావళి పండుగ రోజున మీకు.. మీ కుటుంబానికి.., సకల దేవతల ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ...
🌸దీపావళి శుభాకాంక్షలతో... మీ మాధవ కొల్లి.
No comments:
Post a Comment