24-10-2024-గురువారము- శుభమస్తు.
🌹🌹🌹🌹 గుడ్ మార్నింగ్ 🌹🌹🌹🌹
ఇంట గెలిచి రచ్చ గెలవమని ఒక సామెత వున్నది. మనం గొప్ప గొప్ప సాధనలేవో చేయవలసిన అవసరము లేదు. మన బాధ్యతలు అదే మన కుటుంబ సభ్యులందరితో సఖ్యతగా ఉంటూ మనము చేయవలసిన కర్తవ్యములు సరిగా చేస్తే చాలు.చాలా గొప్ప ధర్మాన్ని పాటించిన వారమవుతాము. కుటుంబ బంధాలు మనము కోరి ఏర్పర్చుకున్నవి కాదు. సృష్టి సహజముగా వచ్చిన బంధాలు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, మనము జన్మ నిచ్చిన పిల్లలు, తన జీవితాన్ని మనకు ఇచ్చి, మన జీవితాన్ని పంచుకుంటూ - ఇద్దరి జీవితాలు కలిసి ఒకే జీవితముగా - ఒక కుటుంబానికి మూలమైన జీవిత భాగస్వామి - మనతో కలసి పుట్టి పెరిగిన మన అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు - ఇలా మన బంధాలు, బంధుత్వాలు దెబ్బతినకుండా మనము చేయవలసిన కర్తవ్యాలు చేస్తూ - వారిని సంతోషముగా ఉంచుతూ - మనము సంతోషముగా ఉండటమే మంచి జీవితం.
ఇవి ప్రతి మనిషి మొదటి బాధ్యతలు. ఎవరి స్థానములో వారి కర్తవ్యాలు సరిగా చేయాలి.
దీనినే ధర్మము అని ఆధ్యాత్మికత చెబుతున్నది. ఇది జీవితము మొత్తము చేయవలసిన సృష్టి ఏర్పాటు చేసిన బాధ్యత. దీనిని సక్రమముగా చేయాలంటే - మన స్వార్ధం, మన కోపతాపాలు, కోరికలు అన్నీ అదుపు చేసుకుంటూ - ఉన్న అందరితో మంచిగా ఉంటూ - నేను కూడా సంతోషముగా ఉండటం అనే జీవిత కాల సాధన మంచితో చేసే తపస్సు లాంటిదే....
కుటుంబ జీవన సాఫల్యత అద్భుతమైన ఆధ్యాత్మికత. ఎందుకంటే అవి నీవు తగిలించుకున్నవి కావు - సృష్టి నిన్ను తీర్చిదిద్దటానికి ఏర్పాటు చేసినవి.ఇక్కడ సరిగా ఉంటే సృష్టి ఇచ్చిన జీవితపు ఆట బాగా ఆడినట్లే. కుటుంబము స్వార్ధము కాదు. ఇదే నిజమైన ఆధ్యాత్మిక సాధన. మన అసలు స్వరూపము, గుణాలు, బుద్దులు, ఇక్కడే తెలుస్తాయి.ఇక్కడ గెలిస్తే ఆధ్యాత్మికతలో మోక్షం అనే చివరిమెట్టుకు అదే దారి చూపిస్తుంది. గెలుపు - ఓటమి మన చేతిలోనే వుంది.మంచి ఎప్పుడు గెలిపిస్తుంది.............
🌹🌹🌹🌹god bless you 🌹🌹🌹🌹
No comments:
Post a Comment