ఓం.
సనాతన ధర్మాన్ని ద్వేషించడం, సమూలంగా తొలగించాలనడం, (అమలులో లేని) మనుధర్మ శాస్త్రం అంటూ విషం కక్కడం,
కులాలలో కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అనే మూడింటి పై అందులోను సనాతనమంతా బ్రాహ్మణ వ్యవస్థయే అని వారిపైన గురి- రెడ్డి,కాపు,కమ్మలకు అసలు తెలియదని రెచ్చగొట్టే ప్రయత్నం ప్రారంభం చేస్తూ వారిలో కూడా తమలో ఉన్న హిందూ వ్యతిరేక భావాలను ఎక్కించడం, సమాజ వ్యవస్థను, రామాయణాది గ్రంధాలలోని విషయాలను వక్రీకరించడం ఇవన్నీ ఈ భారతీయ జీవన విధానాన్ని- సంస్కృతి, సాంప్రదాయాలను ముక్కలు చేసి, ఈదేశాన్ని మరోసారి బానిసత్వం వైపుకు తీసికెళ్ళేకుట్రలో భాగంగా ఉన్నాయి. అమాయకులైన ఎంతోమంది ఈ విదేశీ, నాస్తిక, హేతువాద, సమాజ వ్యతిరేక పవనాలు సృష్టించేవారి చేతుల్లో పడి చివరకు, వారి తర్వాత తరాలు ఎంత దుర్భర పరిస్థితుల్లో జీవించాల్సి
వస్తుందో గుర్తించాల్సి వస్తుంది.
ఇంట్లో ఉన్నా, గడప దాటి బయటకు వచ్చినా అందరు భారతీయులు. ఇతరులకు ఇబ్బంది ఉండకుండా ఎవరి వ్యక్తిగత, కుటుంబ జీవనం వారిది. ఆచారాలను, సంస్కృతి, సాంప్రదాయాలను సమన్వయం చేసుకుంటూ సనాతన భారతీయ జీవన విధానాన్ని అవసరమైన మేరకు సంస్కరించుకుంటూ ఐకమత్యంతో ముందుకు పోవడం ఈ భారతీయ సమాజం ముందున్న అత్యంత ప్రాధాన్యతతో కూడిన ప్రస్తుత సవాలు. అందరు జాగృతమవుతూ ఈ సమాజ విఘటన, దేశ వ్యతిరేక శక్తులను గుర్తిస్తూ, తగిన విధంగా నివారణ చర్యలకు ఉపక్రమించాలి. ధర్మో రక్షతి రక్షితః. హరిః ఓం తత్సత్.
No comments:
Post a Comment