*_అందంగా ఉన్నానని మురిసిపోకు... అసలు నిజమైన అందం అంటే నీకు తెలుసా.?_*
*_ఈ రోజు ఉన్న అందం రేపు ఉంటుందా.? శరీరం అందం ఎన్ని సంవత్సరాలు.?_*
*_అయినా మనసు అందంగా లేనప్పుడు, బాహ్య అందం ఉన్న ఏమి లాభం.?_*
*_ఈ అందం ఎప్పటికి అయినా, మట్టిలో కలిసిపోతుంది... మనసు మంచిది అయితే, నువ్వు ఉన్నా లేకున్నా, నీ మంచితనం గురించి మాట్లాడుకుంటారు..._*
*_అందమంటే... చిన్ని పాప చిరునవ్వు అందం. అమ్మ మనసు అందం నీవు వేరే వాళ్లకు సహాయం చేస్తావు చూడు... అది చేసే చేసే నీ హృదయం అందం..._*
*_"మాట " జారడం సులభమే... కానీ, మాట పడిన వారికే తెలుస్తుంది, దాని "నొప్పి "._*
*_కట్టె కాలి బూడిద అయినా..."మాట " మాత్రం బతికే ఉంటుంది. కాబట్టి... ఆలోచించి, ఆచి తూచి మాట్లాడండి._*
*_ఒకరి ఆత్మవిశ్వాసాన్ని అహంకారం అనుకోకు. ఒకరి నిజాయితీని పొగరు అనుకోకు. ఒకరి మౌనాన్ని చేతకాని వాడని అనుకోకు..._*
*_ఒకరు పలకరించలేదని గర్వం అనుకోకు. ఒకరు నీకు తందాన పాడలేదని ఆగ్రహించకు._*
*_అడుగులకు మడుగులు వత్తలేదని దూరం చేసుకోకు. అలా చేస్తే ఈ లోకంలో... నువ్వు ఎప్పుడూ ఏకాకివే._*
*_ఐనా... మనుసులో స్వచ్ఛత, ప్రేమా, దయ, కరుణ, లేనప్పుడు... నీవు నా దృష్టిలో ఎప్పుడు అజ్ఞానివే...☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌿☘️🌿 🌷🙇♂️🌷 🌿☘️🌿
No comments:
Post a Comment