*దృఢమైన బుద్ధి అనేది జీవితంలో అలవరుచుకోవలసిన సుగుణాలలో ఒకటి.*
*దృఢ నిశ్చయులమై ఉండాలి. ఎప్పుడైతే అలా ఉన్నామో, అప్పుడు మన అంతరంగంలో పరిపక్వత ప్రారంభమౌతుంది. ఎంతకాలం అలా ఉండగలమో అన్నది మన ప్రతిభకు కొలబద్ధ.*
విశ్వాసం అంటే గంటో, రెండు గంటలో ఉండవలసినది కాదు. సహనముంటేనే భగవదనుగ్రహం లభిస్తుంది.
ఆధ్యాత్మిక జీవితానికి నిదానము, సహనము అవసరం. భక్తి విశ్వాసాలను కలిగి ఉండాలి. వాటి విషయంలో అనుమానం గానీ, బలహీనతగానీ కలిగియుండరాదు.
No comments:
Post a Comment