అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-124.
254d3;258e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1️⃣2️⃣4️⃣.```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
```
*భగవద్గీత*
➖➖➖✍️.```
(సరళమైన తెలుగులో).```
*#నాలుగవ అధ్యాయము:*
*4*జ్ఞాన యోగము.*
————————————-
*42. వ శ్లోకము:*
*”తస్మాదజ్ఞానసమ్భూతం హృత్త్సం జ్ఞానాసినాత్మనఃl*
*ఛిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ఠ భారతll”*
```
“ఓ అర్జునా! నీలో అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం నీ మనసులో అనేక సందేహములను లేవదీస్తూ ఉంది. ముందు నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టు. జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహములను నరికెయ్యి. అలా నిరుత్సాహంగా కూలబడకు. లే. ఆయుధం పట్టు. నీవు క్షత్రియుడవు. క్షత్రియ ధర్మం అయిన యుద్ధం చెయ్యి నీవు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు. నీకు ఏ బంధనములు అంటవు.” ఇదీ పరమాత్మ బోధ.
ఈ శ్లోకంలో కొన్ని పదాలు వాడారు. "అజ్ఞానసమ్భూతమ్" అంటే అజ్ఞానము వలన పుట్టినవి. సంశయములు, మోహము, మొదలైనవి అజ్ఞానం నుండి పుడతాయి. మనలో ఉన్న సకల దుర్గుణములు, అనుమానాలు, దుష్టసంకల్పాలకు మూలము మనలో ఉన్న అజ్ఞానమే. అజ్ఞానము అంటే ప్రతిదానినీ దాని వాస్తవిక స్వరూపంతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవడం. అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడటం. అన్నీ మనకే కావాలని అనుకోవడం అన్నిటికీ నేనే మూలం నావలననే జరుగుతున్నాయి అని భావించడం.
"జ్ఞానాసినా" అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానము అనే కత్తితో నరికెయ్యాలి. అంటే జ్ఞానము కత్తి వంటిది. అది అజ్ఞానాన్ని కోసేస్తుంది. చీకటి పోవాలంటే వెలుగు రావాలి. అజ్ఞానం పోవాలంటే జ్ఞానము అనే కత్తి కావాలి.
"హృత్త్సమ్" అంటే ఈ అజ్ఞానము, అనుమానాలు, మోహము ఇవన్నీ ఉండే స్థావరము ఎక్కడో కాదు మన హృదయమే దానినే మనసు, చిత్తము అని కూడా అంటారు. మన శత్రువులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు అని అర్ధం చేసుకోవాలి. మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించే కంటే మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. హృదయములో తిష్ట వేసుకొని ఉన్న అజ్ఞానాన్ని అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి కానీ మరొకడు నివృత్తి చేయలేరు.
ఎలాగంటే మన నెత్తిమీద బరువును మరొకరు దించగలరు. మన అప్పు మరొకరు తీర్చగలరు. కాని మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి. మరొకరు తింటే మన ఆకలి తీరదు. అలాగే మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని, అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి. దానికి జ్ఞానం సంపాదించాలి.
ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి "యోగమాతిష్ఠ" అంటే యోగమును ఆచరించాలి. అంటే నిష్కామ కర్మ యోగమును అవలంబించాలి. మనలో ఉన్న అజ్ఞానం, సందేహములు పోవడానికీ, జ్ఞానం రావడానికీ, అవసరమైనది నిష్కామ కర్మయోగము ఎటువంటి సంగము అంటే అటాచ్ మెంట్ లేకుండా, నిస్వార్థంగా, కర్తృత్వభావన లేకుండా, ఏకాగ్రచిత్తంతో కర్మలు చేయడం. వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మబంధనములు అంటవు.
అందుకే ఓ అర్జునా! నేను యుద్ధం చేస్తే నా చేతుల్లో వీళ్లంతా మరణిస్తారు. వర్ణ సంకరం అవుతుంది. ఆ పాపం నేను భరించలేను. అందుకని నేను యుద్ధం చేయను. సన్యాసం తీసుకుంటాను, భిక్షాటన చేసి జీవిస్తాను. ఈ రక్తపు కూడు తినలేను అనే పనికిమాలిన మాటలు కట్టిపెట్టి 'ఉత్తిష్ఠ" అంటే లే. ఆయుధం పట్టు. నిష్కామంగా, కర్తృత్వ భావన లేకుండా యుద్ధం చెయ్యి ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు.
అయినా అర్జునుడిలో ఏమీ చలనం కలగలేదు. అందుకే పరమాత్మ తన బోధను కొనసాగించాడు.
ఉపనిషత్తులయొక్క, బ్రహ్మవిద్యయొక్క, యోగశాస్త్రము యొక్క సారమయిన భగవద్గీతలో, జ్ఞాన యోగము అను నాలుగవ అధ్యాయము సంపూర్ణము.✍️```
*ఓం తత్సత్! ఓం తత్సత్!! ఓం తత్సత్!!*
```(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
No comments:
Post a Comment