Tuesday, August 26, 2025

 🙏 *రమణోదయం* 🙏

*బంధాలు కల్పించే త్రిపుటి భేదాలు స్థూల సూక్ష్మ దేహాలతో ఎంత వరకు ఉంటాయో, అంతవరకు అజ్ఞానమోహరూపమైన కారణ శరీరంతోగల బంధం నశించలేదనే చెప్పవచ్చు. అంతవరకు పునర్జన్మ కూడా పోనట్లే.*

శరీరం ఎంత చలిస్తే
అంత ఆరోగ్యం
మనస్సు ఎంత స్థిరంగా ఉంటే
అంత ఆనందం.

ఏదైనా ఒక్కవరం ఇవ్వమని
భగవంతుడిని ప్రార్ధిస్తూనే ఉంటాం.
ఈ జీవితమే ఒక వరమని
ఎప్పుడు అర్ధం చేసుకుంటాం..!!

మోక్షమనగా నీవు పుట్టనివాడని తెలుసుకోవడమే.
నిశ్చలత్వము పొంది, 
 'నేనే బ్రహ్మము' నని తెలుసుకో.
నిశ్చలత్వము పొందడమంటే మనోభావనలేవీ
లేకుండా ఉండడం.
కావలసినది 'తెలుసుకోడం' గాని 'భావించడం' కాదు.

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.766)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment