Tuesday, August 26, 2025

 తెలుసుకోండి...250825
తెలియజేయండి....
*పాండవుల సంతానం*

 ‌‌.      పాండురాజు భార్యలు కుంతీ, మాద్రులకు వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పుట్టారు. ఈ అయిదుగురు ‘పంచపాండవులు'గా లోకంలో ప్రసిద్ధిచెందారు. పంచపాండవులకు ద్రౌపది భార్య అయింది. ద్రౌపది అగ్నిజ్వాలనుంచి జన్మించింది. ఈమెకు పాంచాలి అనే పేరు గూడ వుంది.

ద్రౌపది యందు ధర్మరాజుకు ప్రతివింద్యుడు, భీమసేనునికి శ్రుతసోముడు; అర్జునునికి శ్రుతకీర్తి నకులునికి శతానీకుడు; సహదేవునికి శ్రుతసేనుడు పుట్టారు. వీరినే ఉపపాండవులని పిలుస్తారుఇంకనూ ధర్మరాజుకి స్వయంవరంలో లభించిన దేవిక అనే స్త్రీకి యౌధేయుడు పుట్టాడు. భీమసేనునికి జరంధర వలన సర్వగుడు; హిడింబకు ఘటోత్కచుడు పుట్టారు. అర్జునునికి సుభద్రవల్ల అభిమన్యుడు పుట్టాడు. నకులునికి చేది వంశజురాలైన రేణుమతికి నిరమిత్రుడు పుట్టాడు. సహదేవునికి స్వయంవరంలో లభించిన విజయకు సుహోత్రుడు పుట్టాడు.

పాండవపుత్రులైన పదునొకండు మందిలోనూ కురువంశాన్ని నిలిపిన వాడు అభిమన్యుడు. అతనికి విరాటరాజు కూతురు ఉత్తరనిచ్చి వివాహం చేశారు. ఉత్తర, అభిమన్యులకు పరీక్షిత్తు పుట్టాడు. పాండవులు, ఉపపాండవులు సత్సంబంధాలు పెంచి పోషించారు. వీరికి శ్రీకృష్ణుడు, బలరాముడు, విదురుడు అండగా ఉన్నారు.

 సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.
 శైలజ వాస్తు జ్యోతిషాలయం 9059743812

No comments:

Post a Comment