Tuesday, August 26, 2025

 *అవతార్ మెహర్ బాబా - 61*
🪷

రచన: బి. రామకృష్ణయ్య


*ద్వితీయాంధ్ర దేశ పర్యటన*

అక్కడ ఉన్నవారికి దర్శనమిచ్చి అమలాపురం బయలుదేరారు.

దారిలో బాబా బాగా ఆకలి వేస్తోందన్నారు. 'పప్పు, అన్నం కావాలి' అని అడిగారు. బొబ్బర్లంక గ్రామం వద్ద ఆపి అన్నం వెదకటం కోసం బయలుదేరారు. ఒక గుడిసె ముందు నిలబడి యున్న ఒక వృద్ధ స్త్రీని, అప్పుడే వండిన అన్నం చూసి కుటుంబశాస్త్రిగారు వెళ్ళి 'జీసస్ క్రీస్తు కొరకు కొంచెం అన్నం పెడతావా' అని అడిగి తీసుకొచ్చారు. బాబా ఆ అన్నం రెండు ముద్దలు తిని ఆ స్త్రీని కౌగిలించు కొని ఆమె అదృష్టవంతురాలని చెప్పారు. తన ప్రియతమ ప్రభువును కలవాలనే తపన ఆమెలో గుర్తించాడేమో బాబా అందుకని ఆకలి నెపంతో అన్నం కోసం కంగారుపెట్టి ఆ స్త్రీకి తన దర్శనం, ఆలింగన భాగ్యం కలుగజేసారు.

కొత్తపేటలో కొంతమంది బాబా కారును ఆపివేసారు. కొబ్బరికాయలు సిద్ధంగా ఉన్నాయి, కొబ్బరినీరు త్రాగమని అన్నారు. బాబా నేరుగా అమలాపురం వెళదామనుకుంటే కొత్తపేటలో ఆపడం, కొబ్బరినీళ్ళ గురించి చెప్పటం బాబాకు ఇష్టం కాలేదు. ఈలోగా బస్సులో వస్తున్న మండలి వారు 'బాబా త్రాగమన్నార'ని చెప్పడంతో కొబ్బరి నీళ్ళు త్రాగడం ప్రారంభించారు. ఆందరూ 4 కొబ్బరి కాయల నీళ్ళు త్రాగాలని బాబా ఆజ్ఞాపించారు. వెంటనే మళ్ళీ అమలా పురానికి ప్రయాణమయ్యారు. దారిలో కారు నడుపుతున్న ధర్మారావుగారికి కునుకువచ్చి కారు అదుపు తప్పి ప్రక్కనున్న రాళ్ళ గుట్టపై రెండు చక్రాలు ఎక్కాయి. బాబా తన చేతితో స్టీరింగ్ త్రిప్పారు. లేకపోతే ఒక్క క్షణంలో కారు ప్రక్కనున్న కాలువలో పడిపోయి ఉండేది. తృటిలో తప్పిన ప్రమాదానికి కారులోని వారికి ఒళ్ళు జలదరిస్తే బాబా మాత్రం హుందాగా కూర్చున్నారు. 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మధ్యాహ్నం గం.12.30లకు అమలాపురం చేరుకున్నారు. బాబాకు మండలి వారికి ఆల్ ఇండియా కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ కళా వెంకట్రావ్ అన్ని ఏర్పాట్లు చేసారు. బాబా ఎక్కడికి వెళ్ళినా వెంటనే ఉండి బాబాకు కావలసినవన్నీ స్వయంగా సమకూర్చాడు కళా వెంకట్రావ్.

'మంచితనమంటే స్వార్థ చింతన లేక పోవడం, నిస్వార్థంగా తోటి వారికి సేవ చేస్తే భగవంతుని సేవించినట్లే. నిస్వార్థ సేవ అంటే సేవ చేసాననే ఆలోచన కూడా రాకుండా ఉండటం' అని బాబా చెప్పారు. సాయంత్రం అమలాపురం బోర్డ్ హైస్కూల్ ఆవరణలో ప్రజాదర్శనం ఇచ్చారు బాబా. దాదాపు 7000 మంది దర్శనార్థులకు బాబా ప్రసాదం పంచిపెట్టారు. మరునాడు 01.03.54 రోజున ఉదయం కొంతమంది ప్రేమికుల ఇళ్ళకు బాబా వెళ్ళారు. తర్వాత ఆ సాయంత్రం అమలాపురం లోని రామకృష్ణ మఠం లో ప్రజాదర్శనం ఇచ్చారు. అటు నుండి రాజోలుకు ప్రయాణమై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిట్లో ప్రజాదర్శనం ఇచ్చారు. రాజోలు నుండి కొత్తపేటకు వెళ్ళే దారిలో ఒక కొబ్బరి తోటలోకి వెళ్ళి అందరినీ పిలిచి 'ఆ స్థలం రామావతారంలో తను చేసిన పనికి సంబంధం కలిగియుంద'ని చెప్పారు.   

దేశంలో అన్ని రాష్ట్రాలలోకంటె ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువమంది ప్రేమికులు ఉన్నారు. అందుకే కాబోలు బాబా ఆంధ్ర దేశంలో విరివిగా పర్యటించారు. ఒంటి గంటకు బాబా జిల్లా బోర్డు ఉన్నత పాఠశాలలో ప్రజాదర్శన మిచ్చారు. బాబా అడిగి పుకార్ తో పాట పాడించుకొని 'ఫనా, బకా' అనే స్థితుల గురించి ప్రవచన మిచ్చారు. దాని సారాంశం ఇలా చెప్పారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'ఆత్మ పరమాత్మ వద్దకు పయనించినప్పుడు నాలుగు స్థితుల అనుభూతి కలుగుతుంది. మొదటి ప్రయాణం ఫనాలో రెండు స్థితులు. రెండవ ప్రయాణం బకాలో రెండు స్థితులుంటాయి. మూడవ ప్రయాణం కేవలం సద్గురువులకు మాత్రమే అనుభూతిలోకి వస్తుంది. అది కుతుబీయత్ అనేది. నాలుగవది శరీరం త్యజించడంతో ముగిసే ప్రయాణం. మొదటి ప్రయాణం అహం బ్రహ్మాస్మి. నేను భగవంతుడ ననే అనుభూతితో అంతమౌతుంది. రెండవ ప్రయాణం భగవంతునిలో నిజంగా ఉండడమే. మూడవది మానవ శరీరంలో భగవంతుని జీవితం జీవించడం. మరియు నాల్గవది మానవ శరీరాన్ని త్యాగం చెయ్యడం. శరీరాన్ని వదిలిన తర్వాత కూడా అనంత అస్తిత్వానుభవం శాశ్వతంగా ఎరుకతో ఉండిపోతుంది'.
📖

కె. డి. ఆర్. ఎమ్. ప్రేమికులు రాజోలు నుండి కొత్తపేటకు ప్రయాణించే జీపు ప్రమాదానికి గురై గోతిలో పడిపోయింది. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో అందరూ ప్రాణాపాయం నుండి తప్పించు కున్నారు. బాబా చేసిన అద్భుతం వల్లనే బ్రతికి బయటపడ్డామని వారు బాబాకు చెప్పగా బాబా తాను ఏ అద్భుతమూ చేయలేదని అసలు ఆ వార్త తానిప్పుడే వింటున్నానని చెప్పారు. అలాంటి అద్భుతాలు తనకు అంటగట్టరాదని బాబా పలుమార్లు చెప్పారు. ప్రేమికులకు తన ఎడల గల ప్రేమ విశ్వాసాల శక్తి వల్ల అలాంటి వెన్నో జరుగుతాయని తనకు ప్రత్యక్షంగా అలాంటి చిన్న విషయాలు అంటగట్టరాదని అందరి హృదయాలను భౌతికం నుండి పరమార్ధం వైపు మరల్చి ప్రేమమయమైన నవమానవాళిని సృష్టించడమే తన ప్రస్తుత అవతారంలో
చేయబూనిన ఒకే ఒక అద్భుతమని అది తన మౌన విరమణ పై ఆధారపడి యున్నదని పలుమార్లు చెప్పారు.

కొత్తపేటలో నేషనల్ క్లబ్బులో ఏర్పాటు చేసిన ప్రజాదర్శన కార్యక్రమంలో దర్శనమిచ్చి ప్రసాదం పంచిపెట్టారు. దాదాపు 4000 మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం రాజమండ్రికి చేరుకొని గురుకులంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ప్రత్యేక సమావేశాన్ని 01.03.54 రాత్రి 9 గంటల నుండి నిర్వహించారు. బాబా తన స్వహస్తాలతో అందరికీ కాఫీ ఇచ్చారు.

బాబా కె.డి.ఆర్.ఎమ్, సెంటర్లను నిలిపి వేశానని ప్రతి ఒక్కరు ఎవరికి వారే సెంటర్ కాగలరని చెప్పారు. ఆంధ్రులు చూపించిన ప్రేమ తనను కదిలించిందని చెప్పి బాబా అందరిలో గల తప్పులను, బలహీనత లను క్షమించమని కోరుతూ అందరి తరపున క్షమాపణ పొందుతూ భగవంతుని ముందు అందరి తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాప ప్రార్థన చేయించారు. అందరి తప్పులు ఆ రాత్రి క్షమించబడతా యని, ఆ తరువాత చేసే ఎవరి తప్పులకు వారిదే బాధ్యత అని బాబా చెప్పారు.

'నన్ను హృదయ పూర్వకంగా ప్రేమించండి. అదొక్కటే నాకు కావలసింది. నన్ను ప్రేమించండి, అప్పుడు నన్ను మీరు చూడ గలరు. నన్ను ప్రేమించేవారే ఆంధ్రలో నా సెంటర్లు' అని చెప్పి రెండవ మారు పశ్చాత్తాప ప్రార్థన చదివించి 02.03.54 ఉదయం గం. 2.35 ని.లకు సమావేశం ముగించారు. బాబా అనుమతితో అందరూ 3 గంటల నుండి విశ్రాంతి తీసుకున్నారు.
🪷
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment