🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
05/12/2025
1) నీదే..నీవే అయిన ఆత్మవస్తువును గురువూ ఇవ్వలేడు దేవుడూ ఇవ్వలేడు.
2)నేను-నేను అంటూ ఆ జ్ఞాన దీపం స్వరూపంగా మన హృదయంలో సదా వెలుగుతోంది కదా! "అదే" (పరబ్రహ్మము
3) ఈ క్షణం వఱకు జరిగిందంతా భగవదిచ్ఛ.
4)ఎక్కడో... ఏదో... ఉందని పరుగులు తీయడం మాని... ఉన్నదేదో తానున్నచోటనే ఉన్నదని ఊరక ఉండడమే వేదాంతం.
5)నటరాజు నర్తిస్తున్నపుడు ఆయన దివ్యాభరణాలు అన్నీ అసంకల్పితంగా చలించునట్లు, పరమేశ్వరుని చైతన్య శక్తి యొక్క ప్రభావం వలన అసంకల్పితంగా చలించే శంకరాభరణమే ఈ ప్రపంచము...
6) వ్యక్తికి ఎవడు సాక్షిగా ఉన్నాడో సమిష్టికి కూడా వాడే సాక్షిగా ఉన్నాడు.
No comments:
Post a Comment