Monday, January 26, 2026

 శ్రుతులు 
********
71.నీతులెన్నో 
చెపుతారు!
నిజం ఒక్కటీ 
చెప్పరు!

72.పాపాలు చేసినా
భయంలేదు!
అభిషేకాలు
ఉన్నాయిగా!

73.దేవుడా!నీకు
కానుకలిచ్చే
భక్తుల్లో
దొంగలెందరు?

74.సంపాదనముందు
నీతి నిజాయితీ
ఓడిపోతోంది
ఏంచేద్దాం?

75.సుంకాలు యుద్ధాలు
వదిలిపెట్టడు!
నోబెల్ శాంతి బహుమతి
కావాలంటాడు!

76.జీతం
సరే!
లంచం
హుర్రే!

77.హద్దుమీరిన
కల్తీలు!
జారిపోతున్న
శాల్తీలు!

78.సురాపానం
వద్దంటారా!
అది దేవతల
ప్రీతిపానం!

79.రోజంతా
ఎన్ని పాపాలో!
అందుకే గుళ్లో
నిత్యం పూజలు!

80.బంగారం ధర
బాగాపెరిగింది!
ట్రంప్ సుంకాల 
మహాత్మ్యం!
     *******
-తమ్మినేని అక్కిరాజు
       హైదరాబాద్
       26-1-2026

No comments:

Post a Comment