Monday, January 26, 2026

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(296వ రోజు):--
       ప్రశ్న :- కాని, కొన్ని రోజుల్లో, కదల కుండా కూర్చొనటం కూడా కష్టం గానే ఉంటుంది ! 
      స్వామీజీ :- రోజంతా మీ మనసు ను కనిపెడుతూండండి. ఎవరైనా మిమల్ని గాయపరిచినా, విమర్శిం చినా, ధ్యానం కష్టంగా ఉంటుంది. ధ్యానానికి కూర్చున్నపుడు మీ మనసు ఆ సంఘటన వైపే పోతుం ది. అది జరిగిన తక్షణం మీ బుధ్ధి వివేచన ద్వారా ఆ మానసిక ఘాతా న్ని పట్టించుకొనటం మానివేయాలి. ఆ అవమానం జరిగినది నిజంగా మీ నిజమైన ఆత్మకు కాదనీ, మిమ్మల్ని ఆవరించి ఉన్న వస్తు ప్రపంచానికి మాత్రమే అది వర్తిస్తుందనీ మీకు మీరే నచ్చచెప్పుకోవాలి. అటువంటి దానితో మీకేం పని? విడిచేయండి. 
      ప్రశ్న :- ఆత్మ గురించి తెలుస్తే, నిజానికి నేను ధ్యానం చేయాల్సిన ఆవశ్యకతే ఉండదు. కాని, నాకది తెలియనప్పుడు, తెలియని దాని గురించి ధ్యానం చేయడం ఎలా సాధ్యం ?
        స్వామీజీ :- భగవంతుని వర్ణిం చడం సాధ్యం కాదని వేదాంత గ్రంథాలన్నీ చెప్తాయి ; వివరించ డానికి సాధ్యం కాని దానిని వివరిం చడానికి ప్రయత్నిస్తాయి. సర్వోత్కృ ష్టమైన సత్యాన్ని వివరించడానికి అందరూ ఒకే మాటలను వాడినా, అవేవీ నిర్దిష్టమైన వర్ణనలు కావు, సూచకాలు మాత్రమే. అవి సూచించిన దిశలో మీ మనసు నిలపండి. అదే ధ్యానం. మనసుకు అంతం అది. 
      ప్రశ్న :- రోజుకు రెండుసార్లు ధ్యానం చెయ్యడం ఎప్పుడు మొదలు పెట్టాలి ?
        స్వామీజీ :- "నేనెప్పుడూ భోజ నం చెయ్యాలి?" అని నా బిడ్డ నన్నడిగితే, "ఇప్పుడు కాదు" అని సమాధానం చెప్తాను. ప్రశ్నలోనే తెలుస్తోంది అతడికిపుడు ఆకలిగా లేదని. వంటగదిలోకి వెళ్లి అన్నం పెట్టమని అడుగుతూ, లేకపోతే బిస్కెట్లన్నీ తినేస్తానని గొడవచేస్తే, "అన్నం ఇప్పుడే తిను" అంటాను. సాయంకాలాలు చక్కగా ధ్యానం చేయటం మొదలు పెట్టారని మీరు చెప్తే, అప్పుడు అనుమతి నిస్తాను మీకు రెండుసార్లు ధ్యానం చెయ్య టానికి. 
       ప్రశ్న :- ధ్యానం ఆధ్యాత్మిక సాధన కొత్తగా ప్రారంభిస్తున్న వారి కోసమా ? 
        స్వామీజీ :- కాదు, అది ప్రారంభ కుల కోసం కాదు. వాళ్ళు కూర్చొని నిద్రపోతారంతే. దానివల్ల కూడా శరీరానికి కొంత లాభం ఉంటుందన టంలో సందేహం లేదు - ముఖ్యం గా, నెమ్మదిలేని వారికి ; కాని, అది ఆధ్యాత్మికం కాదు. 
       మొదట్లో చెయ్యాల్సినది మనసు నూ, బుద్ధినీ నిశ్చలంగా, ప్రశాంతం గా, స్థిమితంగా, ఏకాగ్రంగా, నిష్కప టంగా చేసుకోటానికి శ్రమించడం. చెయ్యాల్సిన పనులన్నిటినీ శ్రద్ద తోనూ, ఏకాగ్రత తోనూ చేయటం ద్వారా దీనిని దినచర్యలో భాగం గానే అభ్యసించి సాధించవచ్చు. 
        అద్దంలా ఉండండి ! అంతటినీ ప్రతిబింబించండి ; మీతో దేన్నీ ఉంచుకోవద్దు. అద్దం ఎదుటకు ఏది వచ్చినా సరే, దాని రూపం అక్కడే నిలిచిపోదు. ఏదీ ఉంచుకోవద్దు! 
                     --***--
      🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment