*భీష్మాష్టమి & రిపబ్లిక్ డే శుభాకాంక్షలు 💐*
భీష్మాష్టమి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో వచ్చే శుక్ల పక్షం అష్టమి తిథి రోజున తన శరీరాన్ని వదిలి వెళ్లాడు. అందుకే ఈ రోజును భీష్మ పితామహుడు మోక్షం పొందినట్లుగా పండితులు చెబుతుంటారు. అందుకే ఈ రోజును భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ భీష్మాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజున భీష్ముడికి తర్పనం సమర్పించినవారికి సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతుంటారు
ఈ రోజు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్త్భుం తెలుపుతున్నది.
కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ఈ దినాననే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు స్పష్టపరుస్తున్నది. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవాల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తున్నది. *''వైయాఘ్య్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే వసూ రామావతారాయ శంతనోరాత్మజాయచ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచారిణే''.* అంటూ ఈ రోజున భీష్ములకు తర్పణం విడవాలని చెబుతారు. ఈ తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన.
🙏🙏
No comments:
Post a Comment