Monday, January 26, 2026

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(295వ రోజు):-- 
                     32. ధ్యానం 
      ప్రశ్న :- ధ్యానం అంత ముఖ్య మైనదని ఎందుకంటారు ?
    స్వామీజీ :- మనిషి అంటే మనసు ధ్యానం మనసు మీద పనిచేస్తుంది. ధ్యానానికి అంతిమ గమ్యం సాక్షాత్ కారం. అహం అనే స్వప్నావస్థ నుంచి అనంతత్వం లోనికి మీరు మేల్కొంటారు. 
        ప్రశ్న :- కాని, ధ్యానానికి కావాల సిన నిశ్చలత నా మనసుకు ఎన్నడూ ఉండటం లేదనిపిస్తోంది. 
        స్వామీజీ :- ధ్యానం చెయ్యాల్సి నది మనసును నిశ్చలం చేసుకోవ టం కోసమే. ధ్యానం చేస్తున్నపుడు, ఆలోచనకూ ఆలోచనకూ మధ్య వచ్చే నిశ్శబ్దం ఎంత గంభీరంగా ఉంటుందో గమనించండి, రెండు సముద్ర కెరటాల మధ్యలో వలె. మంత్రం జపిస్తున్నపుడు, మంత్రానికీ మంత్రానికీ మధ్యన వచ్చే గాఢమైన నిశ్శబ్దం వైపు మీరు చూస్తున్నారు. దైనందిన జీవితంలో కూడా మనం ఒక ఆలోచన నుంచి మరో ఆలోచన వైపు గెంతు తూంటాం, ఆలోచనల మధ్యనున్న నిశ్శబ్దాన్ని ఎన్నడూ గమనించ కుండా. ఏ రెండు ఆలోచనల నైనా పరిశీలించండి, ఆఖరుకు అవి అశ్లీలమైన వైనా సరే పర్వాలేదు, వాటికి అట్టడుగున ఉన్న నిశ్శబ్దం ఒకే విధంగా ఉంటుంది. 
       ప్రశ్న :- కాని, గమనించే వాళ్ళం మనమే ; నేననేది, నిశ్శబ్దాన్ని గమని స్తున్నది మనమే నని. 
        స్వామీజీ :- మీరు పుస్తకాలు అతిగా చదువుతున్నారు. చూడటా నికి ఏమీ లేకపోతే, చూచేవాడు ఎలా ఉంటాడు ? ఆ సందులో మీరు దూరాలి (ఆ స్థితిలోకి మీరు చేరాలి); అదే మీ (ధ్యానానికి)ద్వారం. 
       ప్రశ్న :- వాసనల (స్వభావసిద్ధ మైన పోకడలు) సంగతేమిటి ?
        స్వామీజీ :- ఏం వాసనలు ? ఎవరికున్నాయి వాసనలు? ఇటువంటి బుద్ధి సంబంధమైన భావనల నుంచి మీరు బయట పడాలి. బుధ్ధిని వాడాల్సినది బుధ్ధి కి అవగతం కాని సత్యమొకటున్న దని గ్రహించటం కోసమే. బుధ్ధి వేసే ప్రశ్న లకు సమాధానం చెప్పి తృప్తి పరుస్తూ, మీరు బుధ్ధిని అధిగమిం చాలి. కర్ర సాయంతో గోడ అవతల కు గెంతేవాడు, ఎత్తుకు చేరాక కర్రను తనతో ఉంచుకోడు; వదిలేస్తాడు. 
     కదలకుండా ఒకచోట కూర్చొనటం మాత్రమే చేసినా, మనసుకు కొంతైన నిశ్చలత వస్తుంది. మీ సమస్యలన్ని టినీ కాసేపు విడిచేయండి; అవెక్కడి కీ పోవు, తర్వాత మీకోసం వేచి ఉంటాయి. నిద్రనుంచి మేల్కొంటే మీ పాత సమస్యలన్నీ ఇంకా ఉన్నట్లే ఇది కూడా. 
         🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment