*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼♂️ భక్తుడు : భగవాన్ ! లోకమంతా "ఈశ్వర లీల" అని, అంతా "బ్రహ్మమే" అని అంటారు కదా ! అయితే ఈ "చెడుగుణాలు, చెడుఅలవాట్లు కూడా పోగోట్టుకోవాలి" అని అంటారు ఎందుకు ?_*
*_🦚 భగవాన్ శ్రీరమణమహర్షి : ఎందుకా ! చెప్తాను విను. శరీరం ఉంది కదా ! దానికి ఎక్కడో ఒక వ్రణం (పుండు) పుడుతుంది అని అనుకో ! అది శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే, బాధ కలిగిస్తుంది. సాధారణ చికిత్సకు పోలేదంటే వైద్యుడు వచ్చి, కత్తితో ఆ భాగం కోసి, చెడు రక్తం తీసివేసి మంచి రక్తం బయటకి పోకుండా రక్షణగా ఒక కట్టు కట్టడం లేదా ? ఆ వ్రణం కోయకుండా వదిలితే, లోపలంతా కుళ్లుతుంది. కోసిన తరువాత కట్టు కట్టలేదంటే, చీము పడుతుంది._*
*_అట్లాగే మానవుని విషయంలోనూ అంతే. చెడుగుణాలు, చెడుఅలవాట్లు మానవుల విషయంలో పుండు లాంటివి. కోసి వేయకుంటే క్రిందకు దిగజారిపోతారు. ఎలాంటి వ్యాధో, అలాంటి చికిత్స చేయాలి.!!_*
*_♻️ గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_*
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
No comments:
Post a Comment