🦚జ్ఞాన ప్రసూనాలు🚩
08/12/25
1) "నేను" అనే ఆత్మ స్ఫురణలో సదా ఉండడమే గొప్ప సాధన.
2) సముద్రంలో అలలు ఎంతగా ఎగిసిపడుతున్నా సముద్ర గర్భం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. అలాగే మన సమస్యలు ఆందోళనలు కూడా పైపైనవే. "నేను"లో ఇవేమీ ఉండవు.
3) భగవంతుడి దర్శనం అయ్యే సూచనలు ఏవి ?
ఎవరిలోనైతే అనురాగ సంపత్తి విశేషంగా వ్యక్తమవుతుందో, అతడు భగవంతుడి దర్శనానికి అతి చేరువలో ఉన్నాడని గ్రహించవచ్చు. అనురాగ సంపత్తి అంటే ఏమిటి? అవి వివేకం, వైరాగ్యం, జీవులపట్ల దయ, సాధు సేవ, సాధు సాంగత్యం, భగవంతుని నామ గుణ కీర్తనం, సత్యసంధత మొదలైనవి. అనురాగం యొక్క ఈ లక్షణాలను చూసినప్పుడు భగవద్దర్శనం అయ్యే కాలం ఎంతో దూరంలో లేదని నిశ్చయంగా చెప్పవచ్చు.
4) అనేక జన్మలలో చేసిన పుణ్య కర్మ ప్రభావము, ఎవరి మనసులైతే చాలా పరిశుద్ధముగా వుంటాయో, ఎవరైతే గొప్ప ఆధ్యాత్మిక సాధనలు గత జన్మలలో చేసి వుంటారో,
అటువంటి వారికి మాత్రమే ఆత్మానుభవం పొందిన గురువు సాహచర్యం లభిస్తుంది. ఆయన దయవలన వారు ఆత్మానుభవమును పొందుతారు".
5) ప్రపంచం ఒక అతిథి గృహం. మీరు ప్రేమించే ప్రతి ఒక్కరూ వస్తారు, ఒక్క క్షణం ఉంటారు, చివరికి వెళ్లిపోతారు.
వారి ఉనికి ఒక బహుమతి, ఒక ఆస్తి కాదు. వారి సందర్శన మీలో అనుబంధాన్ని కాదు, కృతజ్ఞతను నింపనివ్వండి.
ఎందుకంటే ఇక్కడ మనం ఉంచుకోవడానికి ఏదీ లేదు, ఇక్కడ ఉన్నప్పుడు మనం కాపాడుకోవడానికి మాత్రమే మనది.
No comments:
Post a Comment