*మాఘ పురాణము.....*
*🌹📌 8వ అధ్యాయము 📌🌹*
*💠 యమలోక విశేషములు 💠*
*మృగశృంగుని పట్టుదల చేతను, యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్రనుండి లేచినట్లు లేచి, వారు యమలోకమందు చూచిన వింతలూ, విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియజేసిరి. యమలోక మందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలనుభవించుచున్నారు.ఒక్కొక్క పాపి తానూ చేసిన పాపకర్మలకెంతటి శిక్షల ననుభవించుచుండిరో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప జేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వ్రేలాడగట్టి క్రింద మంటపెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు. అని చెప్పగా, వారి తల్లి దండ్రులు భయముతో వణికిపోయిరి.*
*అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి "మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆ నరక బాధనుండి బైటపడు ఉపాయము ఒక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమునందు నదీస్నానము చేసి, తనకు తోచిన దాన ములు, ధర్మములు, జపములు, తపములు మొదలైన పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసి ఉన్న పాపములన్నియు పటాపంచలై నశించుటయే గాక, స్వర్గలోక ప్రాప్తిని కూడా పొందవచ్చును. కావున మాఘమాస స్నానఫలము అంత ప్రసిద్ధమయినది.*
*మాఘమాసమునందు నదీస్నానము చేసి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను, శ్రీహరి దయకు తప్పని సరిగా పాత్రులగుదురు కావున మీరు భయపడవలసిన పనిలేదు. నరక బాధలనుండి బైటపడుటకు అంతకంటే సులభమార్గము మరి ఒకటి లేదు” అని ఆ కన్యలు వారి తల్లి దండ్రులకు వివరంగా వివరించారు.*
*రేపటి శీర్షికలో.....*
*🔥 పుష్కరుని వృత్తాంతము 🔥*
*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🪔🍁 🙏🕉️🙏 🍁🪔🍁
No comments:
Post a Comment