తిరువణ్ణామలై ( అరుణచలం) మహా దీపం సమయంలో పర్వతం లోపల వినపడే శబ్దం రహస్యం! అరుణాచలం దీపo పండుగ అపూర్వమైనది. దీనికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ దీపానికి జ్ఞాన దీపం, శివజ్యోతి, పరంజుడర్ అనే పేర్లు కూడా ఉన్నాయి.
దీపం వెలిగించడం వల్ల కలిగే లాభాలు:
*తిరువన్నామలై(అరుణాచలం)లో వెలిగించిన కార్తీక దీపం చూసిన 21 తరాల వారికి ముక్తి కలుగుతుంది.
*అరుణాచల కొండనిచూసి 'అరుణాచల శివ' అని చెబితే ఆ మంత్రాన్ని 3 కోట్ల సార్లు జపించిన పుణ్యం కలుగుతుంది.
*అరుణాచలం శిఖరం వద్ద దీపం వెలిగించినప్పుడు పర్వతం లోపలి భాగంలో శబ్దం విన్నట్లు రామనర్, శేషాత్రి స్వామి తెలిపారు.
*అరుణాచలం కార్తీక దీపం వెలిగిస్తే ఆ జ్యోతి కిరణాల వల్ల ఆత్మ బలం పెరుగుతుంది.
*దీపం వెలిగించిన రోజున 5 సార్లు గిరి ప్రదక్షిణ చేసిన వారి పాపాలకు సంపూర్ణ విముక్తి లభిస్తుంది.
*అరుణాచల కార్తీక దీపం దర్శనానికి సిద్ధులు వస్తారని నమ్మకం. పర్వత శిఖరంలో దీపo వెలిగించే నెయ్యిలో శక్తివంతమైన మూలికా నూనెలను కలుపుతారని సిద్ధార్థులు చెబుతున్నారు. ఇది దుష్ట శక్తులను నాశనం చేస్తుంది.
*అరుణాచల కార్తీక దీపం అప్పుడు గిరి ప్రదక్షిణ చేసినవారు 1000అశ్వమేధ యాగం చేసిన ఫలితాలు కలుగును. కార్తీక దీపం శివలింగం ముందు నెయ్యితో వెలిగిస్తే జీవితం వెలుగుతుంది.
*అరుణాచలం కార్తీక దీప దృశ్యం చూసినవారికి అన్ని దానాలు ఇచ్చిన పుణ్యం కలుగుతుంది. 🕉️శ్రీ అరుణాచల శివ🙏🏻🕉️ శ్రీ అరుణాచల శివ 🙏🏻🕉️ శ్రీ అరుణాచల శివ 🙏🏻🕉️ శ్రీ అరుణాచలా 🙏🏻
No comments:
Post a Comment