🦚జ్ఞాన ప్రసూనాలు🚩
07/12/25
1) ఉపనిషత్తులు చదవడం వలన ఆత్మానుభవం కలుగదు. ఆత్మానుభవం కలిగాక నీవు మాట్లాడే ప్రతిమాట ఉపనిషత్తే అవుతుంది!
2) తాను లోకంలో ఉండటం కాదు తనలోనే లోకం ఉన్నది అని ఉన్నవాడు లోక కళ్యాణ కారకుడు.
3) మరణం అంటే అదృశ్యమే. అదృశ్యం అంటే కేవలం దృశ్యం లేకపోవడమే. ద్రష్ట ఉంటాడు.
4) ఏ లక్షణాలూ లేని రాయికి కూడా మొక్కుతున్నావు కదా! రాయికన్నా హీనమా మనిషి? వాడెటువంటి వాడైనా ఈశ్వరుడుగా చూడు.
5) భగవంతుణ్ణి ఆశ్రయిస్తే భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు తన భక్తుణ్ణి రక్షిస్తాడు.
No comments:
Post a Comment