🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(294వ రోజు):--
తర్వాత, సాధకుడు తన మనో బుద్ధుల ధర్మం గురించి విచారణ మొదలు పెడతాడు. ఈవిధంగా, క్రమేణా, స్థూలమైన బాహ్య ప్రపం చం నుంచి, అంతరంగం లోని సూక్ష్మ ప్రపంచం వైపుకు విచారణ సాగుతుంది. అంతరంగంలో నిక్షి ప్తమై ఉన్న సత్యాన్ని బాహ్య ప్రపంచ పు విషయాలు పొరలలా కప్పి వేస్తా యనవచ్చు. మన శరీరం, దాని జ్ఞానేంద్రియాలు అన్నిటికంటే పెద్ద ఆటంకం. తర్వాత ఉన్నది గాలిపొర - దీనిని లోనికి పీల్చడం ద్వారా సూక్ష్మమైన శక్తులు మన శరీరం లోనికి ప్రవేశించి మన ప్రాణానికి ఆధారా లౌతాయి. మనస్సు అనే పొర అంతకంటే సూక్ష్మమైనది ; ఇవి కాక, బుధ్ధి, ఆనందం అనే పొరలు కూడా ఉంటాయి. మనం పొందే ఆనందమంతా ఆనందపు పొరల నుంచే ఉబుకుతుంది.
సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను చేరి, ముఖా ముఖి దర్శించడానికి ప్రయత్నించాలి. ఇదే నిజమైన ధ్యానం. ధరించిన వస్త్రాల వలె మన సహజ తత్వాన్ని మరుగు పరు స్తున్న పొరలన్నీ మాయమై, ఈ స్థితిలో స్వస్వరూప దర్శనం కలుగుతుంది.
ప్రశ్న :- కాని, వేదాంతం అర్థం చేసు కోటానికి మీరు చెప్పిన అర్హత లు నిజానికి లేకపోతే ఏం చెయ్యాలి?
స్వామీజీ :- వేదాంత గ్రంథాల్లో కొన్ని ఆధ్యాత్మికా భ్యాసాలున్నాయి. ఉదాహరణకు, కైవల్యోపనిషత్తు ఆఖరి అధ్యాయంలో ఈ పద్ధతి వివ రించబడింది : సర్వానికీ ఆధార భూతమైన పరమాత్మ గురించిన ఆ ఉపనిషత్తు నంతనూ గురువు సంపూర్ణంగా బోధించిన తర్వాత కూడా ఒక శిష్యుడు శూన్యభావంతో అక్కడే కూర్చున్నాడు, "ఉపనిషత్తు పాఠం ఎప్పుడు మొదలౌతుందో" అని ఆలోచిస్తూ. అతడికది కొంచ మైనా అర్థం కాలేదు.
పరమ దయాళువైన ఆ గురువు శిష్యునితో ఇలా చెపుతాడు, "నేను నీకొక విలక్షణమైన శ్లోకం నేర్పబోతు న్నాను. దీనిని నువ్వు రోజంతా జపించాలి - నడుస్తున్నా, స్నానం చేస్తున్నా, భోజనం చేస్తున్నా, ఆఖ రుకు ఏదైనా ఇంద్రియ వినోదంలో ఆనందిస్తున్నా సరే - దీనిని మననం చేస్తూనే ఉండాలి. ఇదే నీ పాపాలకు విరుగుడు. ఈవిధంగా ముప్ఫయి రోజులు చేస్తే, నీ మనసు నుంచి గత మంతా మాయమై పవిత్రమౌతుంది" శిష్యుడు ఈపని చేయగలిగితే, ఉప నిషత్తును అర్థం చేసుకోటానికి అవ సరమైన మనశుద్ధత అతడికి లభి స్తుందని గురువుగారికి తెలుసు.
ప్రశ్న :- భక్తిమార్గం సంగతేమిటి? (ఆధ్యాత్మిక విషయాల్లో) దాని స్దాన మేమిటి ?
స్వామీజీ :- ఆధ్యాత్మిక సాధన పద్దతు లన్నిటి ఉద్దేశం మనసును ధ్యానానికి అర్హమైన దానిగా చేయట మే. శరీరానికి కర్మయోగం ఉంది. భగవంతునికి సమర్పణ భావంతో మీ పని మీరు చెయ్యాలి. భావో ద్వేగం గల మనసుకు భక్తియోగం ఉంది. భగవంతునికి మీ ప్రేమ నీ యండి. అతడొక్కడే మిమ్మల్ని అంత గానూ ప్రేమించగలడు. బుధ్దికి జ్ఞాన యోగం ఉంది. వేదాంత గ్రంథాలను పఠించి, వాటిలో వెలువరించ బడిన భావాలను విచారణ చేయండి. బుద్ధి అడగ గలిగిన ప్రశ్న లన్నిటికీ అద్వైత వేదాంతంలో సమాధానం దొరుకు తుంది. అన్ని సాధ్యతలనూ వేదాం తం పరిగణిస్తుంది ; చివరకు, వాదిం చడానికేమీ మిగలదు బుద్ధికి.
భక్తిమార్గంలో, "నేను అంతటి నీ అతడికి అర్పిస్తున్నాను" అనే భావన మీకున్నపుడు, భగవంతుడు మీవద్దకు వస్తాడు. జ్ఞానమార్గంలో మీ బుద్ధి ద్వారా భగవంతుని చేరటా నికి ప్రయత్నిస్తారు. "నేనే స్వయంగా చేస్తాను ; నేనే నీవద్దకు వస్తాను" ఇలా ఉంటుంది మీ వైఖరి. కాని, ఈ క్రిందికి రావటం, పైకి వెళ్లడం అంతా ఒకటే. భగవంతునికి మీరు దగ్గరైన కొద్దీ, భగవంతుడు మీకు చేరు వౌతున్నాడు.
--***--
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment