*_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏻వైష్ణవ భక్తుడు : భగవాన్ ! వైష్ణవులకు భగవద్గీతలో చరమ శ్లోకంగా భాసిల్లే "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ! అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః !!" అన్న దానిని తమరు ఎందుకు స్వీకరించ లేదు ?_*
*_🦚 మహర్షి : "త్వమేవ శరణం గచ్ఛ సర్వ భావేన భారత ! త్వత్ ప్రసాదత్పరం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ !!" అన్న దాన్ని గీతలో అదే అధ్యాయం నుంచి స్వీకరించాను నేను !!_*
*_♻️ మహర్షికి కొంతకాలం సేవ చేసిన ఆశ్రమ భక్తుడు ఈ విధంగా వ్యాఖ్యానం ఇచ్చారు..._*
*_వైష్ణవ భక్తుడు ప్రశ్నించిన మొదటి శ్లోకంలో "అన్ని విధులను వదలి నా(దైవం) వద్దకు రండి" అనే భావన ఉంటే, మహర్షి సెలవిచ్చిన రెండవ శ్లోకంలో "నన్ను శరణాగతి పొంది అన్నిటి నుండి విముక్తిని పొందు" అనే భావన ఉంది. అందుకే గీతాసారంలో మొదటి శ్లోకాన్ని కాక రెండో శ్లోకాన్ని మాత్రం స్వీకరించారు మహర్షి._*
*_♻️ శ్లోకాల తాత్పర్యం : "అర్జున ! సమస్త భావముల చేత నాకు(దైవం) శరణాగతి చెందు; అప్పుడు అన్ని బంధాల నుండి నిన్ను విముక్తుడిని చేస్తాను. ఏ మాత్రం విచారం చెందకు; సర్వధర్మాలను వదిలిపెట్టి శరణాగతి చెందు; నేను నిన్ను సకల పాపాల నుండి విడిపిస్తాను; శోకించకు !_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_*
*_🧘🏻 ఓం నమో భగవతే_*
*_శ్రీరమణాయ 🧘🏻♀️_*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచల శివ.._*
*_అరుణాచలా...!_*
🙏🇮🇳🎊🪴🦚🐍
No comments:
Post a Comment