Monday, January 26, 2026

 [1/26, 13:30] +91 94918 93164: పతనానికి మొదటి మెట్టు

ఈర్ష్య నుంచి ద్వేషం జన్మిస్తుంది; ద్వేషం నుంచి కలహాలు పుట్టుకొస్తాయి. కలహాల వల్ల మనసు భ్రమపడుతుంది. చివరికి మనిషే పతనమవుతాడు.

మనిషి జీవితంలో ఉన్నతికి, లేదా పతనానికి ప్రధాన కారణం అతడి గుణాలే అని పురాణకాలం నుంచి ఎన్నో కథనాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని చెడు ప్రవృత్తులు ముఖ్యంగా ఈర్ష్య, అసూయ మన ప్రగతికి అతిపెద్ద శత్రువులు. ఇవి నిప్పులా హృదయాన్ని కాల్చేస్తాయి. ప్రశాంతతను హరిస్తాయి. చివరికి చరిత్రహీనుల్ని చేస్తాయి. ఎన్ని దానధర్మాలు చేసినా, పూజలూ వ్రతాలూ ఆచరించినా, ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే, ఇతరుల శ్రేయస్సును చూసి అసూయపడితే అది మనల్నే దహించి వేస్తుంది. ఏ దానాలు, పూజలు దానినుంచి రక్షించవు. దీనికి ఎన్నో ఉదా హరణలు ఉన్నాయి. రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా, తన కొడుకు భరతుడు అన్నకి అనుయాయిగానే మిగి లిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయింది. తానె ప్పుడో గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ని అడవికి పంపించింది. ఇంత చేసినా భర తుణ్ని రాజుగా చూసుకోలేకపోయింది. తన కొడుకును ఎలాగైతే చూడకూడదని అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి. అసూయతో అన్యాయంగా ప్రవర్తిం చినా తాను కోరుకున్న ఫలితాన్ని పొందలే కపోయింది. చివరికి ఎవరి కోసమైతే తాను అంత దారుణానికి ఒడిగట్టిందో ఆ కన్న కొడుక్కే మానసికంగా దూరమై బాధపడింది.
అందుకే ‘ఈర్ష్యా వ్యాధిః శరీరస్యం, ధర్మ నాశస్య కారిణీ' అన్నారు పెద్దలు. మహా భారతంలో పాండవ పుత్రులను చూసి పసిప్రాయం నుంచి కళ్లలో నిప్పులు పోసుకున్నారు కౌరవులు. యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం నిర్వహించినప్పుడు, పాండవుల వైభవాన్ని కళ్లారా చూసిన దుర్యోధనుడు తీవ్రంగా అసూయ చెందాడు. పాండవుల ప్రతిభను, ధర్మాచరణను, విజయాన్ని తట్టుకోలేక వంచనకు పాల్పడ్డాడు. అతడు చేసిన కుట్రలు, కుతంత్రాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. చివరికి దుర్యో ధనుడి అసూయ అతణ్నే కాదు, అతడి వంశం మొత్తాన్ని నాశనం చేసింది. శిశుపా లుడు తన జీవితమంతా కృష్ణుణ్ని ద్వేషిస్తూ గడిపాడు. ఆయన గొప్పదనాన్ని సహిం చలేకపోయాడు. రాజసూయ యజ్ఞంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న కృష్ణుణ్ని దూషించి సుదర్శన చక్రానికి బలయ్యాడు. అసూయ ఎంత పెరిగితే, అది అంతటి ముప్పు తెస్తుంది.

'అసూయా పాపస్య మూలం' అన్నది రుషి వాక్యం. అసూయ అన్నిరకాల పాపా లకు మూలమని దానర్థం. అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి. మన స్ఫూర్తిగా వారిని అభినందించాలి. చేతనైతే వారినుంచి స్ఫూర్తి పొంది విజయపథంలో ముందుకు సాగాలి.
మావూరు విజయలక్ష్మి
[1/26, 13:30] +91 94918 93164: సత్య మార్గం

మూసిన గుప్పిట చూస్తే అందరికీ ఒకలాంటి ఆసక్తి, లోపల ఏముందోనని! ఏదో ఒకటి ఉండాలన్న ఆశ చాలా మందిది. అలాంటివారికి ఏమీలేదని చెబితే ఒక పట్టాన నమ్మరు. తెరచి ఖాళీ చెయ్యి చూపించినా ఏదో మోసం చేశావనేవాళ్లే ఎక్కువ. ఏ కొద్ది మందో కనిపిస్తున్న దాన్ని నమ్ముతారు. తార్కికంగా ఆలోచిస్తారు. ఆ చేతిలో ఏమున్నా లేకపోయినా తమకు ఒరిగేదేమీ లేదన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. తాము ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా తమ పని తాము చూసు కుంటారు. సమస్యంతా మిగిలిన వాళ్లతోనే. వీరికి సత్యం చెప్పి నమ్మించడం కన్నా అసత్యంతో మభ్యపుచ్చడం తేలిక. ఆ బలహీనతను తమ స్వార్థానికి వాడుకునేవారిని ఎందరినో మనం చూస్తుంటాం.

ఒక మర్రిచెట్టు దగ్గర జనాలు గుమిగూడి ఉండటం చూశాడు బ్రహ్మయ్య. వారంతా ఆ చెట్టు తొర్రలో చెయ్యి పెట్టడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. తొర్రలో చెయ్యి పెడితే ఏదో అద్భుతమైన అను భూతి కలుగుతుందని, మహత్తర శక్తులు వస్తాయని అందరూ చెప్పుకొంటున్నారు. చెట్టు తొర్రలో చెయ్యి పెట్టగానే వారి ముఖాలు ఒక్క క్షణం 'అబ్బా.. ' అన్నట్లుగా ముడుచుకుంటున్నాయి. చెయ్యి తీసి ఇవతలకు రాగానే జనాలు వారిని చుట్టిముట్టి ఎలా ఉందీ అనడుగుతు న్నారు. దానికి వారంతా 'ఎంత బాగుందో... అద్భుతం' అంటూ ముఖా నికి నవ్వు పులుముకుని చెబుతున్నారు
అదేంటో తానూ తెలుసుకోవాలనుకుం టాడు బ్రహ్మయ్య. చాలాసేపు నిలబడి మొత్తానికి చెట్టు దగ్గరికి చేరాడు. తొర్రలో చెయ్యి పెట్టి 'అబ్బా' అని అరి చాడు. జనం అదేమీ పట్టించుకోకుండా అతణ్ని చుట్టుముట్టి ఎలా ఉందని అడి గారు. బ్రహ్మయ్య నొప్పి పెడుతున్న తన చేతిని వారికి చూపిస్తూ, 'అద్భుతం లేదు, గిద్భుతం లేదు! గండు చీమలు కుట్టాయి...' అని వాస్తవం చెప్పాడు. అది విని గండు చీమలతో కుట్టించుకోవడా నికా ఇంత తోసుకుని వెళ్తున్నది... అని నవ్వుకుని కొందరు తమ సమయం వృథా కాకుండా కాపాడినందుకు బ్రహ్మయ్యకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు. మరి కొందరు అతణ్ని కోపంగా చూస్తూ... 'నువ్వు స్వార్థపరుడివి, కుళ్లుబోతువి... ఆ అద్భుత అనుభవం మేం పొందకూడదని అబద్దం చెబుతున్నావు' అని ఆక్షేపించారు. నేటి సమాజధోరణికి అద్దం పడుతుందీ కథ.

ఇతరులను మభ్యపెట్టాలనుకోవడం, నేను మోసపోయాను కాబట్టి వాళ్లకీ అదే జర గాలనుకోవడం వివేకవంతుల లక్షణం కాదు. నిజం నిష్ఠూరంగానే ఉండవచ్చు, అంత మాత్రాన దాన్ని దాచనవసరం లేదు. కాకపోతే చెప్పి ఒప్పించడానికి చాలా ధైర్యం కావాలి. 'నిజములాడువాని నిందించు జగమెల్ల' అని వేమన అన్నట్లుగానే వాస్తవాలను అంత త్వరగా అంగీకరించదు లోకం. అయినా సరే, ఉత్తములు సత్య మార్గాన్నే ఎంచుకుంటారు. అందుకు ఫలితంగా మొదట కష్టాలూ అవమానాలూ ఎదురైనా చివరికి విజయం వారిదే.
డాక్టర్ గోనుగుంట్ల శ్రీనివాసరావు

No comments:

Post a Comment