Monday, January 26, 2026

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(292 వ రోజు):--
       31. ఆధ్యాత్మిక సాధకుడు 
      ప్రశ్న :- ఆధ్యాత్మిక పథంలో పయనం ఎప్పుడు మొదలుపెట్టాలి? 
       స్వామీజీ :- తక్షణం! మనకున్న భయాల వల్లే మనం ఆధ్యాత్మిక సాధనలకు దూరంగా ఉంటున్నాం. క్రైస్తవులు ఇలా ఆలోచిస్తారు : నేను పాపిని, పాపంలో పుట్టాను, పాపి ననే ముద్ర నాపై ఉంది.. ఇది నిరాశా వాదుల మనస్తత్వం. మనలో చాలా మందికి ఇటువంటి మనస్తత్వమే ఉంది. మనం మంచి  వాళ్ళ మయ్యాక మొదలు పెడదామనే అవి వేకపు ఆలోచనతో, మనం ఎప్పటికీ ప్రారంభించం. ఆధ్యాత్మిక సాధన ఉన్నది మనం ఎంత మంచిగా ఉండాలను కుంటే అంత మంచిగా చెయ్యడానికే. 
      ప్రశ్న :- విజయం సాధించాలంటే  వ్యక్తిలో తప్పకుండా ఉండాల్సిన గుణా లేవైనా ఉన్నాయా ?
       స్వామీజీ :- విచారణ చేయటా నికి అవసర మైన ధైర్యం సాధకునికి ఉండాలి. పూర్వకాలం ఎవరో గొప్ప ఋషి ఉపదేశించి నంత మాత్రాన సత్యానికి సంబంధించిన ప్రకటన లన్నిటినీ మనం సరైనవిగా అంగీక రించకూడదు. ఏవైనా కొత్త భావాల ను మనం స్వంతం చేసుకోడానికి ముందు, మన మనోబుద్దు లతో వాటిని జీర్ణం చేసుకోవాలి. ఏదైనా ఊహ గురించి వినినా, చదివినా, దాని భావం మన మదిలో ఉదయిం చే వరకూ దాని గురించి గాఢంగా ఆలోచించాలి. నిజానికి, అటువంటి విచారణ ద్వారానే ఏ వేదాంత సిద్ధాంతమైనా మనసుకు హత్తుకొని మన దైనిక జీవనం లోనూ, జీవన వ్యవహారాల లోనూ సరైన మార్గం చూపటం సాధ్యమౌతుంది. 
        ప్రశ్న :- కాని, మీ వద్దకు వచ్చి, మీ మాటలు విన్న మాలో కొందరం ఆదర్శవంతంగా జీవించడానికి ప్రయత్నించి నప్పటికీ, ఈ సత్యాను భవం మాకు కలగటం లేదు. బహుశా మేము ఆధ్యాత్మిక మార్గానికి ఇంకా సిద్ధం కాలేదేమో. 
      స్వామీజీ :- వేదాంతో పన్యాసాల వల్ల ప్రయోజనం ఉండాలంటే, జ్ఞానం కావాల్సిన అన్ని రంగాల్లో లాగే ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని కోరుకుంటున్న వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాల్సిందే. వేదాంతం నేర్చుకోవాలను కొనే విద్యార్థికి 4 ముఖ్య లక్షణాలు ఉండా లంటారు. దీన్ని విన్న వారందరికీ, ఇదంతా చాలా కష్టమని పించడం సహజమే. ఐతే జాగ్రత్తగా విశ్లేషిస్తే, సాధారణ జీవితం గడుపుతున్న పుడే మనం ఈ లక్షణాలను చేకూర్చు కున్నామని గ్రహించ గలం. వాటిని ఇప్పుడు ఇంకా పరిశుద్ధం చేయటం, వాటిని మరో దిశకు, అంటే ఆధ్యాత్మిక సాధన వైపు, మరల్చి కేంద్రీకరించడం మాత్రమే ఇక మీదట చెయ్యాల్సింది. 
        🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ 🌺

No comments:

Post a Comment