🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(293వ రోజు):--
మొదటి అర్హత వివేకం :- సత్యం నుంచి అసత్యాన్నీ, వాస్తవం నుంచి మిథ్యనూ, రూపం నుంచి సారాన్నీ, నీడ నుంచి పదార్థాన్నీ విడ మరిచి చూడగలిగే సామర్థ్యం. ఈ శక్తి లేని దెవరికి? మనం జంతువుల మో, క్రిములమో కాము. మన వివేచ నా శక్తిని దైనందిన జీవితంలో సదా వినియోగిస్తూ సభ్య సమాజంలో నివసిస్తున్న మనుషులం మనం.
రెండవది విరాగం :- అసత్యమైన బాధాకరమైన విషయాల నుంచి మనసును విముఖం చేసే శక్తి. ఇదేదో చాలా పెద్ద విషయంగా ఊహించు కొని భయపడకండి. మనందరి లోను ఉన్నదే ఇది. ఏదైనా ఒక వస్తువు కాని, విషయం కాని నీడ మాత్రమే ననీ, దానికి విలువ లేదనీ బుద్ధి నిస్సందేహం గానూ, నిర్దిష్టం గానూ నిర్ణయించి నపుడు, మనసు సహజం గానే దానికి విముఖ మౌతుంది. ఉదా హరణకు, స్వప్నంలో మీరొక రాకుమారిని వివాహ మాడారను కొండి. మెలకువ వచ్చినపుడు మీరు ఆ ప్రేమనూ, బాంధవ్యాన్నీ కోనసా గించలేరు. మెలకువ రాగానే మీకు తెలుస్తుంది, అదంతా వట్టిదని. స్వయంగా గ్రహించటం వల్ల కలిగిన విరాగమే వైరాగ్యం.
వేదాంతం అర్థం చేసుకోడానికి వివేకం, విరాగం అనే ఈ రెండు లక్ష ణాలు అవసరం. మూడవదైన ఉత్తమ మానవత్వ లక్షణాలు (షట్సంపత్తి) వాటంతటవే సమకూరి నాల్గవ లక్షణమైన ఆత్మ సాక్షా త్కారం కోసం ఆవేదన (ముముక్షు త్వం) పొందటానికి దారితీస్తాయి.
ప్రశ్న :- ఐతే, మనకూ ఈ లక్షణా లన్నీ కొంతమటుకైనా ఉన్నాయన్న మాట ; కాని, అవి తగినంతగా విక సించ లేదేమో ...
స్వామీజీ :- ఔను, ఈ లక్షణా లను మీరు ఉన్నత స్థాయి చింతన కు వినియోగించాలి. మన ఆలోచనా విధానాన్ని బాహ్యమైన ప్రాపంచిక విషయాల నుంచి మరల్చి, మన అంతరంగపు అట్టడుగు లోతుల్లో ఉన్న ప్రభావంతమైన అనంతత్వం వైపు మరల్చటానికి మార్గం చూపడ మే గీతోపనిషత్తుల ఉద్దేశం.
వేదాంత సాధకుడు తన విచారణ ను బాహ్య ప్రపంచంతో మొదలు పెడతాడు : ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది ? ఎక్కడికి వెళ్తుంది? బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకున్న తర్వాత దృష్టి మన శరీరం వైపూ, దాని పంచ జ్ఞానేంద్రియాల వైపూ మరలుతుంది. అంధునిగా జన్మించి నవానికి రూపం అంటే ఏమిటో తెలియదు. చెవిటి వానికి తుపాకి నుంచి వచ్చే పొగ కనిపిస్తుందంతే, ధ్వని వినిపించదు. రుచులనూ, సువాసన లనూ ఆస్వాదించ డానికి నాలుక, ముక్కు అవసరం. జ్ఞానేం ద్రియాలు లేకపోతే, మనకు ఈ ప్రపంచం లేనట్లే. బాహ్య ప్రపంచాన్ని మనం భావించే తీరు మన జ్ఞానేంద్రి యాల వల్లనేనని దీనిద్వారా అర్థం చేసుకోవాలి.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment