🦚జ్ఞాన ప్రసూనాలు🚩
09/12/25
1) "నేను ఆత్మను చేరుకోవడానికి ఎంత దూరమో తెలుసా? కుండ మట్టిని చేరుకోవడానికి ఎంత దూరమో అంతదూరం నామరూప చిత్రములు తెరను చేరుకోవడానికి ఎంతదూరమో అంతదూరం.
2) ప్రతి జీవి కనుపాపల్లో వెలిగే జ్యోతి శ్రీ అరుణాచలేశ్వరుడు. ప్రతి జీవి శ్వాసలో కదిలే వాయువు శ్రీకాళహస్తీశ్వరుడు.
3) దైవానుభవం కలగాలంటే, తానులేని ప్రపంచమైనా ఉండాలి. ప్రపంచం లేని తానైనా ఉండాలి.
4) సకలమూ పరమాత్మలో ఉన్నది. పరమాత్మయే అయి ఉన్నది.
ఆ పరమాత్మ నాలో ఉన్నాడు. నేనే అయి ఉన్నాడు.
5) నామ మాత్రానికైనా సరే రెండవ వస్తువును అంగీకరిస్తే, సమస్య తెగదు.
ఉన్నది ఒకే వస్తువు అని ఉన్నప్పుడు, సమస్యే లేదు.
No comments:
Post a Comment