*_“మాట హద్దు దాటితే — తప్పు._*
*_ఖర్చు హద్దు దాటితే — అప్పు._*
*_ఈ రెండూ హద్దులు దాటితే — మనశ్శాంతికే పెనుముప్పు.”_*
*_“సాధించే వాడికి కోరిక మాత్రమే ఉంటుంది, విమర్శించే వాడికి తీరిక మాత్రమే ఉంటుంది._*
*_విజయ శిఖరాలు సోమరులకు అందవు, పట్టుదలతో కృషి చేసే వారికి అవి తలవంచుతాయి.”_*
*_“ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడు, కానీ అధర్మం వైపు కన్నెత్తి కూడా చూడకు. కత్తి పోటుకన్నా — కర్మ పోటు చాలా తీవ్రమైనది.”_*
*_“దాచివున్న నీ శక్తిని బయటికి తీస్తే, దక్కవలసిన విజయాలు ఎన్నో నీ చేతికి వస్తాయి.”_*
*_“మన అవసరం ముగిసిన చోట మనకిచ్చే గౌరవమూ ముగుస్తుంది. అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి గానీ, అందని బంధాల కోసం ఆరాటపడకూడదు.”_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🥰🌹 🌸🙇🌸 🌹🥰🌹
No comments:
Post a Comment