💐35శ్రీలింగమహాపురాణం💐
🌼నంది జనన వృత్తాంతం బ్రహ్మకు శివుని వరప్రదానం🌼
#ముప్పై ఐదవ భాగం#
సనత్కుమారుడునందీశ్వరునితోనందీశ్వరామీరుఉమాపతియైనశివునికిసేవచేసేభాగ్యం ఎలాపొందారోతెలియజేయండి" అనికోరాడు.నందిసనత్కుమారునికి తన వృత్తాంతం ఇలా చెప్పాడు.
"మహాత్మా! నా తండ్రి శిలాదుడు అంధుడు. పుత్రుడు కావాలనే కోరికతో అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై "శిలాదా! నేను దేవతల అధిపతినైన దేవేంద్రుడిని. నీ తపస్సుకి ప్రసన్నుడయ్యాను. వరం కోరుకో" అని అడిగాడు.
మా తండ్రి ఇంద్రునికి నమస్కరించి "ఇంద్రదేవా! అంధుడైన నాకు పుత్రుడు కావాలి. అయోనిజుడిగా స్త్రీ గర్భంనుంచికాకుండాస్వయంగా జన్మించి, మరణం లేని పుత్రుని ప్రసాదింపుము" అని కోరుకున్నాడు.
ఇంద్రుడు "మహర్షీ! నేను అయోనిజుడైన పుత్రుని వరంగా ఇవ్వగలను. కానీ మృత్యువు లేని పుత్రుని ఇవ్వలేను. పరమేశ్వరుడు సంకల్పంతో జరిగే సృష్టిలో అవ్యక్తుడైన ఆయన తప్ప మిగిలిన వారందరు కాల పరిమాణం కలిగిన ఆయుష్యు కలిగిమృత్యువుపొందవలసిందే.సృష్టి కర్త అయిన బ్రహ్మ కూడా ఆయుష్యు ముగిసిన తర్వాత మృత్యువు పొందుతాడు.
బ్రహ్మదేవుడు పరమేశ్వరుడి నుంచిఆయుష్యుతోజన్మించినవాడు. ఆయన ఆయువు రెండు పరార్థములకాలము.పరమేశ్వరుని నుంచి ఆవిర్భవించడం వలన ఉమాదేవికి పుత్రుడు అయ్యాడు. కావున మరణం లేని పుత్రుడు కావాలన్న కోరిక వదలినీతోసమానమైనతేజస్సు గల పుత్రుని అయోనిజుడిగా పొందుము" అని పలికాడు.
శిలాదుడు "అమరేశ్వరా! నేను నారద మహర్షి నుండి, "బ్రహ్మ అండము నుంచి పుట్టాడని, విష్ణుదేవునినాభినుండివెలువడినపద్మమునుండిజన్మించాడని విన్నాను.మీరుపరమేశ్వరుడి శరీరం నుంచి ఆవిర్భవించి ఉమాదేవికిపుత్రుడుఅయ్యాడంటున్నారు".
నాకు కలిగిన సందేహం తీర్చండి. కమలం నుండి జన్మించిన బ్రహ్మకు మానస పుత్రునిగా దక్షుడుజన్మించాడు. దక్షునికి కుమార్తె దాక్షాయణిగా ఉమాదేవి జన్మించి శివునికి భార్య అయ్యింది. అప్పుడు బ్రహదేవునికిఉమాదేవిమనవరాలుఅవుతుంది.మీరుబ్రహ్మపరమేశ్వరునికిజన్మించడం వలన ఉమాదేవికిపుత్రుడుఅయ్యాడు అన్నారు. ఇది ఎలా జరిగిందో చెప్పి సందేహం తీర్చండి" అని కోరాడు.
ఇంద్రుడు "మహర్షీ! నీ సందేహం సరైనదే! పరమేశ్వరుని సృష్టిలో అనేక బ్రహ్మాండాలు, విశ్వాలు, బ్రహ్మ, విష్ణుదేవులు వివిధ కల్పాలలో వివిధ కాలాలలో వివిధ రకాలుగా జన్మించారు. తత్పురుష, మేఘవాహన కల్పాలలో పరమేశ్వరుడిశరీరం నుండి బ్రహ్మ, విష్ణువులు ఉద్భవించారు.
మేఘవాహన కల్పంలో జగత్తుకు అధినాయకుడైన పరమేశ్వరుని వామభాగం నుండి జన్మించిన విష్ణువు మేఘరూపంలో అనేక దివ్య సంవత్సరాలు అదృశ్యంగా ఉన్నాడు. సృష్టి ఆరంభంకోసం విష్ణువు శివుని ప్రార్థించగా తన శరీరదక్షిణభాగంనుండిబ్రహ్మను సృష్టించి సృష్టి చేసే బాధ్యతను అప్పగించాడు.
బ్రహ్మ తనను సృష్టించిన పరమేశ్వరునికి నమస్కరించి "ప్రభూ! వామభాగం నుండి విష్ణువుని, దక్షిణ భాగం నుండి నన్ను సృష్టించారు. జగత్తుని సృష్టించే బాధ్యతను నాకు, పరిరక్షించేబాధ్యతనువిష్ణువుకిఅప్పగించారు.ఇప్పుడుసర్వముఅంధకారంతోనిండిపోయింది. విష్ణువుని నేను చూడలేక పోతున్నాను. విష్ణువుతో సహా సర్వముదివ్యదృష్టితోచూడగలిగేసర్వత్వాత్మకశక్తినినాకుప్రసాదించండి" అని ప్రార్ధించాడు. పరమేశ్వరుడు తథాస్తు అని భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో సర్వము చూడగలిగే శక్తి ఇచ్చిఅంతర్ధానమయ్యాడు.
బ్రహ్మవెంటనేఅంధకారబంధురమైన మహాసాగరం వద్దకు వెళ్లి సాగరంలో అగోచరంగా శేషతల్పం పై శయనిస్తున్న మహావిష్ణువుని చూశాడు. చతుర్భుజాలలో శంఖ చక్ర గదా పద్మాలు, పట్టుపీతాంబర వస్త్రాలు ,దివ్యాభరణాలు, హృదయం పైశ్రీవత్సముధరించి తేజస్సుతో ప్రకాశిస్తున్న నారాయణుని దర్శనం బ్రహ్మకు కలిగింది.
బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న విష్ణువు దగ్గరకు వెళ్లి "నారాయణా! గత కల్పంలో నన్నునీవుమ్రింగివేసావు.ఇప్పుడు నా వంతు వచ్చింది. నిన్ను మ్రింగివేస్తాను. నా నుంచి తిరిగి నిన్నుసృష్టిస్తాను"అనిమేల్కొలుపుతూ.అన్నాడు.శ్రీహరినిద్రలేచిబ్రహ్మవేపుమొదటఆశ్చర్యంగా చూసి అతని మాటలకు చిరునవ్వు నవ్వాడు.
బ్రహ్మ మహావిష్ణువుని చిన్నగా చేసిమ్రింగివేసాడు.తనశరీరంలో ప్రవేశించిన విష్ణువుని బ్రహ్మ తన కనుబొమలు మధ్య నుండి తిరిగి సృష్టించాడు. తిరిగి జన్మించిన మహావిష్ణువు బ్రహ్మ పక్కన నిలబడి పరమేశ్వరుని మనస్సులో ధ్యానించాడు. ఉగ్రరూపంలో దిగంబర రుద్రునిగా పరమేశ్వరుడు అక్కడకు వచ్చాడు. వేయి సూర్యుల, వేయి అగ్నుల తేజస్సుతో ప్రకాశిస్తున్న రుద్రునికి బ్రహ్మ విష్ణువులు నమస్కరించి స్తుతించారు. రుద్రుడు వారివంక చూసి అదృశ్యమయ్యాడు.
అప్పుడు విష్ణువు బ్రహ్మ వంక చూసి "బ్రహ్మదేవాఅవ్యయుడు, అవ్యక్తుడుఅయినపరమేశ్వరుడు తన శరీరవామభాగంనుండి నన్ను, దక్షిణభాగంనుండినిన్ను విశ్వ సృష్టి కోసం ఉత్పన్నం చేశాడు. నీవు అది మరచి కిందటి కల్పంలో జరిగిన దానికి బదులుగా నన్ను మ్రింగి తిరిగి సృష్టించావు. జరిగే సమస్తం ఈశ్వర సంకల్పంతోనే జరుగుతుంది అన్న సంగతి మరచి పోయావు.
అందుకే ఉగ్ర రుద్ర రూపంలో వచ్చి మనల్ని పరమేశ్వరుడు హెచ్చరించాడు. కనుక మన మిరువురంపరమేశ్వరునిధ్యానించి సృష్టి కార్యంఆరంభిద్దాం" అని పలికి వరాహ రూపం ధరించి మహాసాగరం లోపలికి వెళ్లాడు. సాగరంలో మునిగిన భూమిని పైకి తెచ్చి నిలిపాడు. భూమినిసమతలంచేసినదీనదాలు, పర్వతాలు, సముద్రాలు ఏర్పాటు చేశాడు.
బ్రహ్మదేవుడు శివుని ధ్యానించి భూభువర్లోకసువర్లోకమహర్లోకాలను సృష్టించాడు. తనమానస పుత్రులుగాసనకసనందసనాతనసనత్కుమారులనుసృష్టించాడు. వారు వైరాగ్య భావంతో తపస్సుకి వెళ్లారు. తరువాత బ్రహ్మదేవుడు సృష్టి వృద్ధి కోసం వశిష్ఠ మరీచి భృగు అంగిరస పులస్త్య పులహ క్రతు దక్ష అత్రి సంకల్ప ధర్మ అధర్ములు అనే పన్నెండు మందినిసృష్టించాడు. సృష్టించిన విశ్వానికి కాల పరిమాణం ఏర్పరచి నాలుగు యుగాలు ఏర్పాటు చేశాడు. కృత త్రేతా ద్వాపర కలి యుగాలు అని పిలువబడే నాలుగు యుగాలకు యుగ లక్షణాలు, యుగ ధర్మాలు నిర్ణయించాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట
కరణంగారి సౌజన్యంతో🌹
💜 ఓం శ్రీఉమా
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః
సుఖినోభవన్తు🙏
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
(సర్వం శ్రీశివార్పణమస్తు)
🌷🙏🌷
శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
No comments:
Post a Comment