Monday, January 26, 2026

 _*ఏమైపోయాయి*_ 
_*నీ గుణతంత్రం..*_
_*రణతంత్రం..*_
--------------------------------------
_*పదవీ వ్యామోహాలూ*_
_*కులమత బేధాలు*.._
_*భాషాద్వేషాలు చెలరేగే నేడు*_
_*ప్రతి మనిషీ మరియొకని*_
_*దోచుకొనే వాడే..*_
_*తన సౌఖ్యం..తన భాగ్యం*_
_*చూసుకునేవాడే..*_

_*ఎక్కడ చూసినా కల్లోలమే*_
_*అవినీతి రాజ్యమే*_
_*దేవుడికీ లేదు*_ _*మినహాయింపు*_
_*గుళ్ళూ,గోపురాలు..*_
_*విగ్రహాలు..ధ్వజస్తంభాలు..*_ 
_*వీటిపైనా నీచరాజకీయాల మోహరింపు...!*_

_*కుటిల రణతంత్రం..*_
*_కుట్ర కుతంత్రం.._*
*_మాయా మంత్రం.._*
_*ఇదేనా మన గణతంత్రం..?*_
*_కాదే.._*
*_ప్రతి ఒక్కడికి_* *_స్వేచ్ఛాస్వతంత్రం.._*
*_అహింసో పరమో ధర్మః.._*
*_అంటూ బాపూ బోధించిన_* 
_*తారక మంత్రం..*_
*_సత్యమేవ జయతే అన్న_*
*_భారతీయ సూత్రం.._*
*_ఇవేగా నిజమైన గణతంత్రం.._*
*_వీటిని నమ్మి నడిచే కదా_*
*_ఈ గడ్డ అయింది_* 
*_ఇంత పవిత్రం!_*

*_రాముడు ఏలిన భూమి_*
*_రావణుల పాలైంది అదేమి..?_*
*_ఒకనాటి మేచ్చులను_* 
*_మించిన తుచ్చులు_*
*_పాలకులై మెడలకు_*
*_బిగిస్తున్నారు ఉచ్చులు..!_*
*_తరిమేసామని కక్షగట్టిన_*
*_తెల్లదొరలు దుర్మార్గంలో_*
*_తమను మించిన_* 
*_నల్లదొరల పాల్పడేసి పోయారే_*
*_సత్యాగ్రహాలు చేసి శనిగ్రహాలను_* *_తెచ్చుకున్నామే.._*
*_లాఠీ దెబ్బలను మించిన_*
*_లూటీ దెబ్బలు_* *_చవిచూస్తున్నామే..!_*

*_ఇదేమి చోద్యం.._*
*_నీచ రాజకీయ సేద్యం.._*
*_వికటించిన స్వరాజ్యవైద్యం.._*
*_మన జీవితాలన్నీ_* 
*_బడాబాబుల నైవేద్యం.._*
*_కుడిఎడమల దగాదగా_*
*_దోచేస్తున్నారు ఎగాదిగా.._*

*_నా బొందూ అంటూ_*
*_ఎన్నుకున్న నేతలే రాబందులై_*
*_జనాలను ఇలా_* 
*_పిప్పి చేసేస్తుంటే_* 
*_నమిలి నమిలి_*
*_ఓ రాజ్యాంగమా.._*
*_ఇలా విలపిస్తున్నావా_* 
*_కూడు దొరకని_*
*_పేదోడి రూపంలో_*
*_కుమిలి కుమిలి_*
*_నడిరోడ్డుపై మానం పోయిన_* 
*_ఆడకూతురిలా గుండె పగిలి.._*
*_వెన్ను విరిగిన అన్నదాతలా_*
*_పార్లమెంటు ముందు_* 
*_పొగిలి పొగిలి.._*
*_ఎంత ఏడ్చుకున్నా_*
*_ఆగుతుందా ఈ ఘోరకలి.._*
*_అధికార మదంతో విర్రవీగే_*
*_పెద్దోళ్ల డబ్బు ఆకలి..!_*

*_చేసేసాం తప్పు.._*
*_మన గణతంత్రం..గుణతంత్రం_*
*_చెడుపై తిరుగుబాటు_* 
*_చేసే రణతంత్రం.._*
*_అన్నీ పెట్టేసి తాకట్టు.._*
*_తెలుసుకోలేక  రాజకీయ మంత్రగాళ్ళ కనికట్టు.._*
*_ఇప్పుడేడిస్తే ఏం లాభం_*
*_నువ్విప్పుడు చచ్చిన శలభం.._*
*_ఇలాగే..చేవ చచ్చి నువ్వుంటే_*
*_ఎన్నిసార్లయినా నిన్ను మోసం_* 
*_చేయడం సులభం.._*
*_ఓటుకు నోటు.._*
*_ఇదే నీ తీరైనంత కాలం_*
*_మార్పు దుర్లభం.._*

*_ఇప్పటికైనా మేలుకో.._*
*_తప్పు తెలుసుకో.._*
*_ఈ కనికట్టు..లోగుట్టు.._*
*_తీసికట్టు నేతల పనిపట్టు..._*
*_మందు కొట్టు అంటూ_* 
*_నీ గుమ్మం తొక్కే నేతల_* 
*_చెంప పగలకొట్టు_*
*_ఈసారి తిప్పికొట్టు_*
*_నువ్వు కోరుకునే మార్పు_*
*_రాలేదో..రాజ్యాంగం మీదొట్టు!_*

🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪

_రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలతో.._
    
*_సురేష్ కుమార్ ఎలిశెట్టి_*
     *_9948546286_*
     *_7995666286_*
      *_విజయనగరం_*

No comments:

Post a Comment