Thursday, May 14, 2026

నాకు అమ్మ లాంటి జీవితం వద్దు సర్, 12 ఏళ్ల చిన్నారి చెప్పిన మాట #parentingtips #genderequality #girl

నాకు అమ్మ లాంటి జీవితం వద్దు సర్, 12 ఏళ్ల చిన్నారి చెప్పిన మాట #parentingtips #genderequality #girl

Author Name:Harshavardhan Gangodi

Youtube Channel Url:https://www.youtube.com/@kidshealth_dr.harsha

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SSEjJxPb4LU



Transcript:
(00:00) 12 ఏళ్ళ అమ్మాయి కిచెన్ లో హెల్ప్ చేయమంటే కోపపడుతుంది గ్లాస్ లో నీళ్లుు తీసుకొని రమ్మంటే కూడా చిరాకు పడుతుందని ఒక మదర్ ఓపిక తీసుకొచ్చింది. ఫస్ట్ చూసి మొండితనం అనుకున్నా కానీ టైం ఇచ్చాక పాప ఇలా చెప్పింది. సర్ నేను మా అమ్మని చూస్తూ పెరుగుతున్న మా అమ్మ నాన్న జాబ్ నుండి నేను మా తమ్ముడు స్కూల్ నుండి సాయంత్రం వస్తాం అందరూ రెస్ట్ తీసుకుంటాం కానీ అమ్మకు మాత్రం రెస్ట్ ఉండదు.
(00:19) వచ్చిన వెంటనే వంట రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అందరికన్నా లేట్ గా పడుకుంటుంది మళ్ళీ అందరికన్నా పొద్దున లేసి అదే పని సర్ ఇలాంటి లైఫ్ నాకు వద్దు సార్ అందుకే నేను కిచెన్ పని నేర్చుకోను [సంగీతం] చేయను అని చెప్పింది. ఇదిఒక చిన్న పాప మాట కాదు ప్రతిరోజు మన ఇంట్లో జరిగిన నిజం పిల్లలు మనం చెప్పేదే కాదు మనని చూసి నేర్చుకుంటారు.
(00:37) కానీ కిచెన్ పని నేర్చుకోవడం అనేది తప్పేమి కాదు కదా ఇదొక లైఫ్ స్కిల్ అంటే సర్వైవల్ స్కిల్ అని నేను మా తమ్ముడిని వంటరంలోకి రమ్మని చెప్తే మా నాన్నమ్మ తిడుతూ ఉంటుంది సర్ అది నీ పని నువ్వే నేర్చుకోవాలి మగపిల్ల పని కాదు అని అలా ఎందుకు సార్ ఒక 30 సంవత్సరాల ముందు డివిజన్ ఆఫ్ లేబర్ ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఇంట్లో పని చేసుకుంటూ ఉండేవాళ్ళు మగవాళ్ళు ఎక్కువగా బయట పని చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ బయట పని చేసుకుంటూ ఉన్నారు ఇద్దరూ కలిసి పిల్లలు మెచ్చుతున్నారు కాబట్టి ఇంటి పనుల్లో కూడా
(01:02) ఇద్దరూ కలిసి షేర్ చేసుకోవాలి మన పిల్లలకు కూడా అలానే నేర్పించండి లేకుంటే మన కూతుర్లు అందరూ బర్డెన్ ఫీల్ అవుతారు మన సన్స్ అందరూ డిపెండెంట్ ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ కి గ్రాండ్ పెండ్స్ కి నాకో చిన్న రిక్వెస్ట్ మన కూతుర్లకు మాత్రమే కాదు మన కొడుకులకు కూడా ఇలాంటి లైఫ్ స్కిల్స్ అనేవి ఈక్వల్ గా నేర్పించాలి.
(01:19) అప్పుడే వాళ్ళు పెద్దయ్యాక రెస్పాన్సిబుల్ గా ఈక్వల్ గా పార్టిసిపేట్ చేసే అడల్ట్స్ అవుతారు. అప్పుడు వాళ్ళకు రిలేషన్షిప్స్ లో కూడా ఎక్కువ ప్రేమ, గౌరవం ఆనందం దక్కుతాయి. లైఫ్ స్కిల్స్ అన్నవి మన కూతుర్లకు మాత్రమేనా లేదా మన కొడుకులకు కూడా నేర్పించాలా మీరేమంటారు కామెంట్స్ లో చెప్పండి. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్ థాంక్యూ.

No comments:

Post a Comment