పాపం చేసి కొబ్బరికాయ కొడితే పోతుందా 😳? తల్లిదండ్రుల కన్నీరు శాపం గా 😭 #shorts
Author Name:MrSomu Facts
Youtube Channel Url:https://www.youtube.com/@MrSomuFacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lEetJBTBLPA
Transcript:
(00:00) పితృ దోషం కన్నా ఎక్కువ శాపాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా బిడ్డల వలన తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీరు వచ్చినప్పుడు ఎందుకంటే మనిషి చేతులతో చేసిన కర్మను ఒక కొబ్బరికాయ కొట్టేసి తుడిచేయ దేవుడా అంటే దేవుడు తుడిచేస్తాడా మీరే చెప్పండి మన నాటింది ముళ్ళ చెట్టు అయితే పూజలు చేస్తే పూలు కాయలు కాస్తాయా అసలు వేదం ఏం చెప్పింది కర్మన్యవాదికారస్తే అని చెప్పింది ఉపనిషత్తులు ఏం చెప్పాయి యదా కర్మ యదాశుతం అని చెప్పాయి బుద్ధుడు ఏం చెప్పారు చిత్తమే మూలం అన్నారు అష్టావక్రుడు నీ బంధానికి కారణం నీ మనసే అన్నారు కానీ మనిషి ఏం కోరుకుంటున్నాడు పాపం చేసేందుకు
(00:28) స్వేచ్ఛ కావాలి కానీ ఫలితాన్ని అనుభవించ డానికి మాత్రం మనసు అస్సలు ఒప్పుకోదు. తన కోపాన్ని మర్చిపోలేడు కానీ పూజ శాంతి మాత్రం చేయిస్తాడు. తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉండలేడు కానీ పితృ తర్పణం చేస్తాడు. భార్యను ఏడిపిస్తాడు కానీ లక్ష్మీ పూజ చేయిస్తాడు. మోసం చేస్తాడు కానీ దోష నివారణ కోసం చుట్టూ ఉన్న దేవాలయాలను తిరుగుతూనే ఉంటాడు.
(00:45) ఇదా ఆధ్యాత్మికత అంటే బహుశా దీన్ని భయంతో చేసే వ్యాపారం అంటారేమో వీటికి నిజమైన పరిహారం ఏంటో తెలుసా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం నిన్ను నమ్మిన వారిని మోసం చేయకపోవడం తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పడం అహంకారాన్ని తగ్గించుకోవడం కోపం వచ్చినప్పుడు మౌనాన్ని పాటించడం కామాన్ని వదిలేసి వివేకాన్ని నిలబెట్టడం అధర్మంగా సంపాదించే డబ్బు కన్నా ధర్మాన్ని ఎంచుకోవడం ప్రేమించిన వారిని గౌరవించడం స్వార్థాన్ని తగ్గించుకొని సేవ చేయడం నిత్యం ఆత్మ పరిశీలన చేసుకోవడం ఇవి కదా పరిష్కారాలు ఎందుకంటే దేవుడు నీ చేతిలో రాయిని పెట్టలేదు బుద్ధిని పెట్టాడు
(01:15) దేవుడు నీకు తాయతుని ఇవ్వలేదు పుట్టుకతో వివేకాన్ని ఇచ్చారు అందుకే ధర్మం ఎప్పుడు భయాన్ని కాదు బాధ్య నేర్పిస్తుంది జాతకం మారితే జీవితం కొద్దిగా మారొచ్చేమో కానీ మనిషి మారితే మన చుట్టూన్న ప్రపంచమే మారిపోతుంది. కర్మ పశ్చాత్తాపం సేవ ప్రేమ క్షమ బాధ్యత మౌనం వివేకం ఆత్మ పరిశీలన నియమం త్యాగం ధర్మం చైతన్యం ఇవన్నీ ఆచరించి చూసిన వాళ్ళకి జీవితం ఒక ఆనందమయం అవుతుంది.
(01:40) తల్లిదండ్రులు తమ రక్తాన్ని పంచి ఎన్నో కష్టాలు పడి బిడ్డలను పెంచుతారు. కానీ బిడ్డలు పెరిగి పెద్దయ్యాక నా టాలెంట్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను అనే భ్రమలో బ్రతుకుతాడు. అసలు [గురకలు] తాము ఈ స్థితికి రావడానికి కారణమైన సృష్టికర్తలైనటువంటి తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడతారు ఇక్కడ సమాజంలో చాలా మందికి తల్లిదండ్రుల ఆస్తులు మాత్రమే కావాలి.
(01:57) కానీ వారి బాధ్యతలు వద్దు ఆస్తిని లాక్కోవడం వారిని వృద్ధాశ్రమంలో పడేయడం అసలు మానవత్వం అనేది ఎటుపోతుంది ఈ రోజుల్లో ఈరోజు మీరు తల్లిదండ్రులను వృద్ధాశ్రమానికి పంపుతుంటే మీ పిల్లలు పక్కనే ఉండి దగ్గర ఉండి చూస్తున్నారుగా పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులనే ఎక్కువగా నేర్చుకుంటారు. మనందరికీ తెలిసిన విషయమే ఇది.
(02:15) రేపు మనం కూడా వృద్ధులమైనప్పుడు ముసలి వాళ్ళమైనప్పుడు మన పిల్లలు కూడా మనల్ని నడి రోడ్డు మీద వదిలేస్తారు. వృద్ధాశ్రమంలో కాదు నడి రోడ్డు మీద అడుపుకొని తిని బ్రతకాల్సి వస్తది. మనం పిల్లలకు కేవలం డబ్బు సంపాదించే చదువులు మాత్రమే నేర్పించడం కాకుండా మానవ సంబంధాలు మానవత్వాలు కృతజ్ఞత భావము నైతిక విలువలు నేర్పడం చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి. చివరిగా ఒక్క మాట చెప్తాను వినండి దేవుడు ఎక్కడో లేడు వృద్యాప్యంలో ఉన్న మన తల్లిదండ్రుల రూపంలో మన ఇంట్లోనే మన కళ్ళ ముందే ఉన్నారు.
(02:39) వారిని నమస్కరిస్తే శివపార్వతులను నమస్కరించినట్లే వారికి పూజలు చేస్తే లక్ష్మీ నారాయణుల యొక్క పూజ చేసినట్లే ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈ మధ్య కొన్ని లాంగ్ వీడియోస్ చేస్తున్నాను. శివుడి గురించి మారేడు మహిమ గురించి విభూది గురించి శివుడి యొక్క నామస్మరణ గురించి వీడియోస్ చేశాను. తప్పకుండా ప్రతి ఒక్కరు లాంగ్ వీడియోస్ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
(02:59) హరే కృష్ణ ఓం నమః శశివాయ
No comments:
Post a Comment