జుట్టు మన జీవన శైలిని చెబుతుంది. || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6xxHa7zhN9g
Transcript:
(00:00) హాయ్ అండి అందరికీ నమస్కారం సంప్రదాయాల్ని ఆచార వ్యవహారాలని నాశనం చేస్తున్న ఆడవాళ్ళు పక్కదారి పడుతున్న అల్లుళ్ళు మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఈరోజు వీడియో ఏమిటి ఉత్తరప్రదేశ్ లోని సభ్య సమాజమే సిగ్గుపడేలాగా ఒక సంఘటన జరిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు దాని గురించి మనం కూడా చర్చించుకుందాం.
(00:28) అసలు సభ్య సమాజం సిగ్గుపడటానికి ఎటువంటి కారణాలు చూపిస్తున్నారు అంటే ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వావి వరసలని మర్చిపోతున్నారు అలాగే ఆచార వ్యవహారాలని సంప్రదాయాలని మన కట్టుబాటల్ని గాలికి వదిలేశారు. పిల్లనిచ్చిన అత్తగారినే పెళ్లి చేసుకున్నాడు ఒక అల్లుడు. పిల్లకన్నా తల్లే అందంగా ఉందని తల్లి చుట్టూ తిరుగుతున్నారు రిలేషన్ లో ఉంటున్నారు వెంటపడుతున్నారు వీళ్ళు ఒక అడుగు ముందుకు వేసి తెగించి కోర్ట్లోనే వివాహం చేసుకొని మా సంబంధాలని అంటే మా రిలేషన్ ని మీ అందరూ యాక్సెప్ట్ చేయండి అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయినట్టుగా వాళ్ళు వీడియో
(01:09) పోస్ట్ చేసుకున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది దీనంతటికీ కారణాలు మన పద్ధతులేనా మనం ముందుకి వెళ్ళిపోయాం ఎక్కడికో అనుకుంటున్నాం కదా ఇటువంటి నీచమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఈ సంఘటనలు చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు పెద్దవాళ్లే మన ఆచార వ్యవహారాలని మంట కలుపుతుంటే రేపు పిల్లలు ఏం చేస్తారు ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు.
(01:39) కానీ అదే ప్రేమ ఆ రక్త సంబంధాలని నాశనం చేస్తుంది. కుటుంబ వ్యవస్థలని పాడు చేస్తుంది పునాదులతో సహా కదిలిస్తుంది అన్న విషయం మర్చిపోతున్నారా? ఈ మధ్యన ఎక్కడ చూసినా ఒక్కటే టాకు వినిపిస్తుంది. అన్నా చెల్లెలు పెళ్లిలు చేసుకుంటున్నారు అక్క తమ్ముళ్లు పెళ్లిలు చేసుకుంటున్నారు అత్తగారిని కూడా ఇష్టపడుతున్నారు అత్తగారిని పెళ్లి చేసుకుంటున్నారు అత్తగారితో రిలేషన్ లో ఉంటున్నారు కన్న కూతురి జీవితాన్నే చేతులారా తల్లే నాశనం చేస్తుంది అన్న విషయాలు కూడా వినిపిస్తున్నాయి.
(02:12) కానీ బరి తెగించి మరీ బజార్న పడి మా వివాహ సంబంధాలు యక్సెప్ట్ చేయండి అన్న విషయం కూడా గమనార్హం మాట దీనంతటికీ కారణం ఏమిటి మన కుటుంబ వ్యవస్థ ఇంతగా దెబ్బ తినడానికి కారణం ఏమిటి ఉమ్మడ కుటుంబాలే కారణం అని నేను చెప్పొచ్చు అంటే ఉమ్మడ కుటుంబాలు లేకపోవడం అనే నేను చెప్తాను నేను నా ప్రతి వీడియోలో ఇదే చెప్తాను ఎందుకంటే ఇదివరకు ఒకే కుటుంబంలో కలిసి మెలిసి ఉండేవాళ్ళం మన గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ మన రిలేషన్స్ కి ఇంకా జీవం పోసేవారు పదంతల బలాన్ని ఇచ్చేవారు ఏ సంబంధం ఎటువంటిదో మనకు అర్థమైనట్టు చెప్పేవారు సొంత అక్క చెల్లి అన్న తమ్ములతో సమానంగానే మన కో సిస్టర్స్
(02:55) కో బ్రదర్స్ అంటే మన పెదనాయన చిన్నాయన పిల్లలు పెద్దమ్మ పిన్నమ్మ పిల్లలు సమానంగా తోడబుట్టినోలుగా వ్యవహరించేవాళ్ళం అలాగే అత్తగారు ఎలా ఉండాలి ఇంట్లో ఒక అల్లుడు వచ్చిన తర్వాత కూతురికి కి పెళ్లి చేసిన తర్వాత ఒక అల్లుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆమె బిహేవియర్ ఎలా ఉండాలి ఆమె ఎలా నడుచుకోవాలి కూడా మన శాస్త్రం చెప్పింది మన పురాణాలు చెప్తున్నాయి మన పెద్దవాళ్ళు చెప్పారు కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నాయా మామగారితో కోడలు ఎలా నడుచుకోవాలి బావగారితో మరదలు ఎలా నడుచుకోవాలి వదిన గారితో మరిది గారు ఎలా నడుచుకోవాలి ఇవన్నీ మనకి మన ఆచార వ్యవహారాలు మన సంప్రదాయాలు
(03:36) మనకి వెన్నతో పెట్టిన విద్య లాంటివి మరి అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు భారతీయ సంప్రదాయాలని మంట పెట్టడానికి మంట కలుపడానికి వీళ్ళఎవరు అసలు ఇవే పోకొళ్ళు చూసి మన పిల్లలు ఎంతగా నాశనం అవుతారో ఎంతగా రెచ్చిపోతారో ఒకసారి ఆలోచించండి. నైతిక విలువలు సామాజిక కట్టుబాట్లు మంట గలిపి గాలికి వదిలేస్తున్నారు. కన్న కూతురి జీవితంలో నిప్పులు పోస్తున్న తల్లి ఇంతకీ ఒక వయసు వావి వరస ఇవేమి తెలియదా ఇప్పటివ్కి వయసులో మనకంటే పెద్దవాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అంటే అబ్బాయి వయసు కన్నా అమ్మాయి వయసు పెద్దదయితే ఏమవుతుందో కూడా మన పెద్దవారు చెప్తున్నారు. ఈ రోజుల్లో అటువంటి
(04:18) కట్టుబాట్లు కూడా లేవు అన్ని పక్కన పెట్టేసారు నైతిక విలువలు సామాజిక కట్టుబాట్లు మంట కలిపేస్తున్నారు. మరి ఒకప్పుడు అత్తగారులు అల్లుళ్ళకి ఎదురు పడేవారే కాదు భోజనం పెట్టినా కూడా చాటున తలుపు చాటున ఉండి చూస్తూ భోజనం వడ్డించమని కూతురికి అప్పచెప్పేవారు అలాగే ఇలా చెంగు మొత్తం చీర చెంగు మొత్తం ఇలా వేసుకొని బాడీ కవర్ చేసుకునేవారు వాళ్ళ వస్త్రధారణ కూడా చాలా నిండుగా ఉండేది.
(04:50) అల్లుడుగారికి ఎదుటుపడి మాట్లాడేవారు కాదు అదేవిధంగా అల్లుళ్ళు కూడా అత్తగారికి ఒక మంచి గౌరవం ఇచ్చేవారు తల్లితో సమానంగా చూసేవారన్నమాట అత్తగారు మామగారులు కూడా అల్లుడిని కన్న బిడ్డలాగా సాకేవారు. మరి ఈరోజు ఇటువంటి సంప్రదాయాలు దెబ్బ తినడానికి కారణం ఏమిటి? చిన్నతనం నుంచి మన వస్త్రధారణలో మార్పులు చేర్పులు ఎందుకు చోటు చేసుకుంటాయో మీకు తెలుసా? పెద్దవాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తారు మనకి ఇలా ఉండాలి అలా ఉండదు అని ఎలా జుట్టు ముళ్ళు వేసుకోవాలి ఎలా జళ్ల వేసుకోవాలి జుట్టు వదిలితే ఏమవుతుంది ఇవన్నీ చెప్పేవారు ఎందుకంటే జుట్టు మన జీవనశైలిని చెబుతుందన్నమాట అలాగే
(05:34) వస్త్రధారణ కూడా వస్త్రధారణ అనేది ఎదుటివారి నుంచి గౌరవం పొందడానికి అర్హులం అని చెప్తుంది. అలాగే వాళ్ళ నీచమైన ఆలోచనల్ని అక్కడే అరుకొడుతుంది. మన మాట తీర అన్నది మనల్ని సమాజంలో ఒక పెద్ద పీట వేసి కూర్చోబెడుతుంది. మరి ఈరోజు అవేమీ లేవు కదా మరి జుట్టు జీవనశైలిని ఎలా చెప్తుంది అంటే చిన్నతనం నుంచి ఒక రెండు జడలు వేసుకునే పాపను చూసుకుంటే యుక్త వయసు వచ్చే వరకు రెండు జడలు వేసుకుంటూ ఉంటారు పిల్లలు.
(06:05) ఆ తర్వాత ఒక్క జడ వేసుకున్న తర్వాత వారికి పెళ్లీడు వచ్చిందని అర్థం చెప్తుంది. తర్వాత వాలు జడకు వచ్చేసరికి తలనిండా గంపిడు పూలు పెట్టేసరికి ఈమె కొత్తగా పెళ్లైన స్త్రీ అని చెప్తుంది. ఆ తర్వాత వచ్చిన క్రమంలో వాలిజడ వేసుకుంటూ సింగిల్ పువ్వు ఒకటి పెట్టుకునే సరికి పిల్లలతో ఉన్న తల్లి అని చెప్తుంది. ఆ వాలు జడ కాస్త ముడి పెట్టుకుంటే అంటే కొప్పు పెట్టుకొని అందులో పువ్వులు ముడుస్తే ఈమె అల్లుళ్ళు వచ్చిన స్త్రీ అని చెప్తుంది.
(06:35) మరి జుట్టు అంత జీవన విధానాన్ని మనకు నేర్పుతుంది. అంతేగాక సమాజంలో ఎవరైనా టక్కుమని మన పరిస్థితిని గాని మనం ఏ పొజిషన్ లో ఉన్నాం కానీ గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన స్థానాలు గాని ఈమె వయసు అది ఈమె ఉన్న పరిస్థితి అని కరెక్ట్ గా చెప్తుందన్నమాట జుట్టు జీవనశైలి విధానాన్ని. అలాగే మన వస్త్రధారణ కూడా ఇక్కడ వయసులు చిన్నవైనా ఆ రోజుల్లో త్వరగా పెళ్లిలు చేసేవారు పిల్లలకి వీళ్ళు కొప్పులు వేసుకొని ఉండేవారు ఒక పెద్ద రకంగా ప్రవర్తించేవారు పెద్ద తరహాలో ఉండేవారు.
(07:11) మరి ఈ రోజుల్లో అలా ఎక్కడా లేదు కదండీ మన వస్త్రధారణ గాని మనం చూపుతున్న ఈ స్టైల్స్ గాని జుట్టులు వదులుకొని తిరగడం గాని వయసుకొచ్చిన పిల్లలు ఉండి కూడా మగపిల్లలున్న ఆడపిల్లలున్నా ముఖ్యంగా తల్లి వేసే వేషాలు గాని నాటకాలు గాని సమాజంలో దిగజారిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నాయ అన్నమాట. వాళ్ళతో పాటు పిల్లలను కూడా దిగజారుస్తున్నారు. మరి ఇదివరకు వస్త్రధారణ కొత్తగా పేలైనప్పుడు చక్కటి ఉల్లిపర లాంటి సారీస్ కట్టేవారు తర్వాత పిల్లలతో ఉన్నప్పుడు సిల్క్ సారీస్ కట్టేవారు అల్లుడు వస్తున్నాడు పిల్లలు పెళ్లిడికి వచ్చారు అంటే కాటన్ సారీస్ కట్టేవారు ఆ తర్వాత ముతక చీరలు కట్టేవారు
(07:51) మరి నానమ్మ జేజమ్మల వయసులు ఉన్నప్పుడు ఇంకా సవరాలు వేసి పెద్ద ముళ్ళు పెట్టి మా వయసు అదని చెప్పేవారు మరి ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు అలా ఉన్నారా చెప్పండి తండ్రి ఏమో దసరా బుల్లోలా రెడీ అవుతున్నాడు ముఖ్యంగా తల్లి వచ్చేసరికి తల్లి పాత్ర చాలా హీనంగా దిగజారిపోయింది సమాజంలో వయసుకవచ్చిన పిల్లలతో పాటు వీళ్ళు పిల్లల్లా రెడీ అవుతున్నారు మేకప్ లాస్ారు లిప్‌స్టిక్ లాస్ ఉన్నారు వయసుకవచ్చిన కొడుకులు ఉన్నా కూతుర్లు ఉన్నా వీళ్లే పిల్లల్లా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళ వస్త్రధారును కూడా వెస్టర్న్ కల్చర్ లో ఉన్నప్పుడు జుట్టులు లూస్ హెయిర్
(08:27) వదిలేసుకొని తిరుగుతున్నప్పుడు మరి పిల్లతో పోటీగా సమానంగా తల్లి ఉన్నప్పుడు అల్లుడు చూపు అత్తగారి మీద పడతది కూతురు కాపురం నాశనం అవుద్ది అని చెప్పి మన జీవన విధానమే చెప్తుంది. అందుకనే పిల్లల్లో పెద్దవాళ్ళు ఉండాలని బాధ్యతగా నడుచుకోవాలని మన వేసుకునే బట్టలు నిండుగా ఉండాలని జళ్లు చక్కగా అల్లుకోవాలని ఏ వయసుకు తగ్గ ముచ్చట ఆ వయసులో ఉండాలని అలా ప్రవర్తించాలని మాట తీరు కూడా అలా ఉండాలని మన సంప్రదాయాలు మనకు చెప్తున్నాయి.
(09:02) మరి ఇంతకీ దిగజారిపోయేటట్టు ఈరోజు సమాజం ఇక్కడి వరకు వచ్చింది అంటే కేవలం మన ప్రవర్తనే అని నేను గట్టిగా చెప్తున్నాను. కామానికి బలైపోతున్న ఆడవాళ్ళు ఈరోజు సొసైటీలో ఎక్కువైపోయారండి ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఉంటున్నారు. చేతులారా కన్న బిడ్డల జీవితాన్నే నాశనం చేస్తున్నారు అంటే చిదిమేస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా ఎంత వయసు వచ్చినా కనిపించకుండా వయసు కప్పేసుకొని మేకప్‌లు వేసుకొని రకరకాల దుస్తులు ధరిస్తూ వాళ్ళ అందవిహీనమైన మొఖాన్ని దాచుకుంటూ ఈ సొసైటీలో మేము ఇంకా చిన్నవాళ్ళమే అని చూపించుకుంటున్నారు.
(09:43) దీనివల్ల ఎంతగా దిగజారిపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరి సొసైటీలో ఇటువంటి వింత వింత పరిణామాలు చోటు చేసుకోకుండా మనం పాత పద్ధతుల్లో వెళితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మీ పెద్దవాళ్ళ దగ్గర మంచి చెడ్డలు తెలుసుకోండి. అలాగే మనం ఇదివరకు రోజులతో ఏకీభవిస్తే ఎవరికీ ఇటువంటి అక్రమ సంబంధాలు గాని వినకూడని మాటలు గాని వినిపించవు కనిపించవున్నమాట మరి ఈ వీడియో పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చేసి చెప్పండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.
(10:14) వీడియో చివర్లో చిన్న ట్యాగ్ అండి మీకోసం ప్రశాంతమైన జీవితం మనందరికీ కావాలంటే నిజాయితీగా బతకాలి అన్న మాట అయితే మర్చిపోకండి మరి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment