కామాఖ్య అంబుబాచి మేళ పూర్తి వివరణ | Why the Temple Closes for 4 Days
Author Name:సింహీ అపరాజితా మహా మంత్రాలయం
Youtube Channel Url:https://www.youtube.com/@%E0%B0%95%E0%B0%AE%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A5
Youtube Video URL:https://www.youtube.com/watch?v=8lS1NslXyAM
Transcript:
(00:26) శ్రీ గురుభ్యోనమః అహం కమలానందనాథ అంబుబాచి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉత్సవం తాంత్రిక ప్రపంచంలో చాలామంది తాంత్రికులు ఈ రోజుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అంబుబాచి కామాఖ్యలో జరుగుతుంది. సతీదేవి శరీరాంగాలలో జననాంగం పడిన ప్రదేశం కాబట్టి ఆ జననాంగానికి ఉండేటువంటి సహజ లక్షణమైనటువంటి ఋతుక్రమం ఈ క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారికి కూడా ఉంటుంది.
(00:56) అంబుబాచి జరిగే రోజుల్లో నాలుగు రోజులు ఆలయాన్ని మూసి ఉంచుతారు. గతంలో గమనిస్తే నెలసరి రోజుల్లో స్త్రీలకు విశ్రాంతిని ఇచ్చేవారు. స్త్రీ పురుషుడు కన్నా ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా జీవిస్తుంది స్త్రీ వాళ్ళ నెలసరి ఏదైతే ఉంటుందో ఆ రోజుల్లో వాళ్ళు శారీరకంగా కొన్ని ఇబ్బందులని ఎదుర్కుంటారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళకి విశ్రాంతిని ఇవ్వడానికి ఒక గదిని కేటాయించి విశ్రాంతంగా ఉంచేవారు.
(01:27) అమ్మవారికి సంబంధించిన అంబుబాచిలో కూడా అమ్మవారికి విశ్రాంతిని ఇస్తారు ఎందుకంటే మహాక్షేత్రం కాబట్టి ప్రతిరోజు కొన్ని వేలాది మంది దర్శనానికి వస్తూ ఉంటారు. ఆవిడకి విశ్రాంతి లభించేది ఆ నాలుగు రోజుల్లో తరువాత నుంచి అమ్మవారు మరింత బలోపేతం అవుతుంది అని ఋతుక్రమం పూర్తఅయిన తర్వాత అంబుబాచి ఉత్సవం పూర్తఅయిన తర్వాత అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటుందని ప్రతీతి ఇక ఈ సమయంలో తెలటి వస్త్రాన్ని ఆ యొక్క భాగం యోని భాగం ఏదైతే ఉందో అమ్మవారికి సంబంధించిన గర్భాలయంలో దాని మీద పరిచి ఈ ఋతుక్రమం పూర్తయిన తర్వాత అంబు బాచి ఉత్సవం పూర్తఅయిన తర్వాత అందులో
(02:09) చిన్న చిన్న చీలికలు ముఖ్యమైనటువంటి వారికి అందజేస్తూ ఉంటారు. కొంతమంది ఈ ఉత్సవం పూర్తఅయిన తర్వాత దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎరుపురంగు వస్త్రాలు తీసుకెళ్లి లోపల నీళ్లల్లో ఉంటుంది కొండ యోని భాగం దాన్ని తాకుతూ ఈ వస్త్రాన్ని అందులో ముంచుతారు. తర్వాత దాన్ని తెచ్చుకుని కావలసిన ఆప్తులకి మిత్రులకి పంచిపెడుతూ ఉంటారు.
(02:32) ఆ వస్త్రం ధనం నిలవ చేసుకునేటువంటి ప్రదేశంలో ఉంచితే ఆ ధనం మరింత వృద్ధి అవుతుందని లక్ష్మీ ప్రదమైందని చాలా మంది నమ్మిక విశ్వాసం అందులో చాలా నిజం కూడా ఉంది అంటే చాలా మంది దాన్ని అనుభవపూర్వకంగా తెలియజేశారు. ఇక అంబుబాచి ఉత్సవం ఈ సంవత్సరం 22వ తారీకు నుంచి 26వ తారీకు వరకు జరుగుతుంది. ఈ రోజుల్లో ఆలయం మూసి ఉన్న ప్రతిరోజు వచ్చేటువంటి భక్తుల కన్నా అంబుబాచి ఉత్సవానికి వచ్చేటువంటి భక్తులు చాలా ఎక్కువమంది ఉంటారు.
(03:04) సాధారణంగా వచ్చేటువంటి భక్తులు కూడా ఆ రోజుల్లో అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చి బయట నుంచి నమస్కారం చేసుకని అమ్మవారికి సంబంధించిన ఏకబీజం అది తెలిస్తే కనుక బీజస్మరణ చేయనో లేదా కామాఖ్యా వరదే దేవి నీల పర్వతవాసిని త్వందేవి జగన్మాతా యోని ముద్రే నమోస్తుతే ఈ శ్లోకం తోటే అక్కడ పూజలన్నీ జరుగుతూ ఉంటాయి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మనల్ని దర్శనానికి తీసుకెళ్ళినటువంటి పండితులు కూడా మన చేత ఇదే చెప్పిస్తారు శిఖరానికి నమస్కారం చేసినప్పుడు కూడా ఇదే చెప్పిస్తారు.
(03:37) ఇక అంబుచి ఉత్సవం గురించి మాట్లాడుకుంటే ఈ అంబుబాచి ఉత్సవం గ్రహణ సమయంలో దేవీ దేవతలు ఎలాగైతే బలహీన పడతారని చెప్పానో అంబుబాచి సమయంలో అమ్మవారు విశ్రాంతంగా ఉంటుంది. ఈ సమయంలో తాంత్రిక పరమైనటువంటి విద్యల ప్రేరణకి అవకాశం లభిస్తుంది. అందుకే భారతదేశం అనే కాదు ఇతర దేశాల నుంచి కూడా తీవ్రమైన తాంత్రిక ప్రేరణ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉత్సవానికి విచ్చేసి ఆ నాలుగు రోజులు కూడా అక్కడ ఉండి రాత్రి భాగంలో వాళ్ళ విధులన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉంటారు.
(04:05) తాంత్రిక పరమైన ప్రేరణకి క్షేత్రం మొదటి నుంచి కూడా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఇక్కడ నిబంధనలు తక్కువగా ఉంటాయి. స్వేచ్ఛగా వాళ్ళ మార్గంలో ఎలాగైతే నైవేద్యాలు ఇక ఆచరణ విధానాలు చెప్పబడ్డాయో అలా స్వేచ్ఛగా చేసుకోవచ్చు అన్నమాట. మనం ఉండే ప్రదేశాల్లో అంత స్వేచ్ఛగా మనం తాంత్రిక పరమైన విధులు చేయలేం కానీ కామాఖ్యలో స్వేచ్ఛగా తాంత్రిక పరమైన విధులన్నీ నిర్వహించుకోవచ్చు రాత్రి భాగంలో కూడా ఇక అంబుబాచి ఉత్సవం జరిగే రోజుల్లో ఉదయ భాగం కన్నా సాధారణమైన భక్తులందరూ ఉదయ భాగంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
(04:39) తాంత్రిక పరమైన విధుల్లో కొనసాగేటువంటి వారు రాత్రికి ప్రాధాన్యత ఇస్తారు. సూర్యాస్తమనం అయిన తర్వాత మరుసటి రోజు సూర్యోదయం దాకా సాధనా క్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఈ నీలాచల పర్వతం కదా ఈ పర్వతం మీద ఎక్కడ కూర్చుని చేసినా ఒకే రకమైన ఫలితం వస్తుంది. అమ్మవారి ఆలయం ముందే అమ్మవారి శిఖరం కేసి చూస్తూ జపం చేయాలని నియమం ఏం లేదు ఆ క్షేత్రంలో ఏ ప్రదేశంలోనైనా అది గృహం కావచ్చు లేదా కొంత లోపలికి వెళ్తే అటవీ భాగంలో అనిపిస్తూ ఉంటుంది అంటే మార్గం అది అలా అనిపిస్తూ ఉంటుంది ఆ ప్రదేశంలో కూర్చునైనా సరే మనం ఎంచుకున్న మంత్రాలు సాధన చేయొచ్చు. మనం
(05:13) సాధన చేసే మంత్రాలు శుద్ధ విద్యాక్రమాలు అయితే కనుక గణపతి బాల సుబ్రహ్మణ్యం ఇటువంటివి చేస్తే ఉదయ భాగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మహావిద్యా క్రమాల్లో తామస విద్యలు ఏది ప్రేరణ చేస్తున్నా రాత్రి భాగంలో ఈ సాధనా క్రమాన్న అంతటిని కూడా నిర్వహిస్తూ ఉండాలి. అమ్మవారికి ఋతుకాలంలో ఆవిడ సాధారణంగా బలహీనంగా ఉంటుంది. ఆవిడకి సంబంధించిన అంగదేవతలు ఎవరైతే ఉన్నారో దేవీ దేవతలు ఆమనాయనలో చెప్పబడిన వాళ్ళు వాళ్ళలో ఏ మంత్రాన్ని ప్రేరణ చేసినా కూడా అమ్మవారికి బలాన్ని చేకూర్చినట్టు అందుచేతనే సాధారణంగా చేసేటువంటి జపానికి శతాధికమైన ఫలితం లభిస్తుంది ఆ క్షేత్రంలో
(05:50) నేను గతంలో కూడా గ్రహణం వీడియోలో చెప్పాను ఇది పురస్చరణలో చేసినప్పుడు ఒక లక్ష జపం చేయమంటే క్షేత్రాశ్రితంగా ఒకవెయ జపం చేసేసి లక్ష కింద దాన్ని పరిగణించకూడదు అని చెప్పేసి ఈ సమయంలో కూడా చైతన్యాన్ని మాత్రం బలోపేతం చేసుకోవడానికి ఉంటుంది. సంఖ్యారూపంగా దానిని గణించకూడదు. అంబుబాచి నాలుగు రోజుల్లో క్షేత్రంలో ఎక్కడైనా సరే సాధన నిర్వహించుకోవచ్చు.
(06:14) తామసమైన సాధన చేసేవాళ్ళు సాధారణంగా మచానకాళ అని ఉంటుంది అక్కడికి వెళ్లి సాధన చేస్తూ ఉంటారు. చతుర్ధానికి సంబంధించిన ప్రేరణ కూడా ఈ క్షేత్రంలో చేస్తారు. ఇక్కడ క్షుద్ర దేవతలు అంటారు వాళ్ళు కూడా దేవతలే కాకపోతే వాళ్ళకు ఉన్న తామస లక్షణం తీవ్రంగా ఉంటుంది కాబట్టి రౌద్రంగా ఉంటారు కాబట్టి రౌద్రేతి క్షుద్రః అని చెప్పి క్షుద్ర దేవతలు అని వాళ్ళని పిలుస్తూ ఉంటారు.
(06:38) ఆ దేవీ దేవతలకు సంబంధించినటువంటి విధులు వాళ్ళ సాధన మార్గాలు కూడా ఈ సమయంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇవన్నీ గణాల కింద పరిగణిస్తారు క్షుద్ర దేవతలని కూడా అమ్మవారి ముందు అందుచేతను అటువంటి సాధన జరిగినా సరే అది అమ్మవారికి చెందుతుంది ఆవిని బలోపితం చేసినట్టే అని బలంగా విశ్వసిస్తారు. అందుచేతను ఎంచుకున్నటువంటి మార్గం ఏదైనా సరే ఈ క్షేత్రాన్ని ఆశ్రయించి అంబుచి సమయంలో సాధన చేస్తే చాలా తీవ్రమైనటువంటి ఫలితాలు సాధారణంగా ఆశించినటువంటి ఫలితాల కన్నా ఎక్కువ స్థాయిలో లభిస్తాయి అని చెప్పేసి అంబుబాచి ఉత్సవానికి అంత ప్రాధాన్యత ఇస్తారు.
(07:12) అమ్మవారి నెలసరి రోజులు నాలుగు ఉంటాయి. మృగసరా నక్షత్రం నాలుగో పాదం లగాయితూ ప్రారంభం అవుతుంది అంబుబాచి అని చెప్తారు. కానీ మన పంచాంగంలో చూస్తే అప్పటికి ఉత్తరా నక్షత్రం ఉండొచ్చు బహుశా మృగసరా నాలుగో పాదంలో ప్రారంభం అయింది అలాగే ఆరుద్ర నక్షత్రం పూర్తిగా ఉంటుంది పునర్వసువు నక్షత్రానికి పూర్తఅవుతుంది అని శాస్త్రాలు చెప్తాయి.
(07:33) అయితే ప్రాంతాన్ని బట్టి పంచాంగ గణనలో నక్షత్రాల యొక్క గణనలో మార్పులు ఉంటాయి. సౌరమానం చాంద్రమానంలో పంచాంగ గణితంలో ఎలాగైతే 10 రోజులు వ్యత్యాసం వస్తూ ఉంటుందో చాలా విషయాల్లో గతంలో కూడా మనం చూసాం పుష్కరాల్లో 10 రోజుల ముందే సౌరమానం పాటించేటువంటి వాళ్ళు స్నానాదులు చేసేసేవారు వాళ్ళ అంటే సౌరమాన పద్ధతి ప్రకారం వాళ్ళకి ముందుగా వచ్చిందన్నమాట అలాగే వీళ్ళు ఎంచుకున్నటువంటి కాలమానము పంచాంగమును బట్టి ఈ జూన్ 22వ తారీకు నుంచి 26వ తారీకు దాకా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది.
(08:05) ఉత్సవం తర్వాత చేసుకునేటువంటి దర్శనం చాలా గొప్పది కానీ లక్షల్లో జనం ఉంటారు. కొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవడానికి దర్శనం చేసుకోవడానికి విగ్రహం ఉండదు చైతన్యమే గర్భాలయంలోకి వెళ్లి ఆ కొండను తాకితే చాలు ఇక ఆ కొండ భాగం ఏదైతే ఉంటుందో యోని భాగం అని చెప్పింది నీళ్ళల్లో ఉంటుందన్నమాట. సాధారణంగా కొంతమంది ఆ నీళ్ళను తాకి శిరస్సు మీద చల్లుకోవడం నీటిని తాగడం లాంటివి చేస్తూ ఉంటారు.
(08:28) వాస్తవంగా అవకాశం ఉన్నవాళ్ళు కొండను స్పృషిస్తే మన శరీరాన్ని మనం ముట్టుకుంటే ఎలా ఉంటుందో అంత సున్నితంగా ఉంటుంది. ఆ క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు కొండను స్పృసిించి నీటిని శిరస్సుమై చల్లుకోవాలని శాస్త్రం కూడా చెప్తుంది. ఇక చాలామంది జల సందోహం వల్ల వెళ్లి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని వచ్చేసేవాళ్లే తప్ప తాకే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు.
(08:51) ఇక ఏ క్షేత్రానికి వెళ్ళినా గాని అక్కడ ఉండేటువంటి ఇబ్బందులు కూడా అక్కడ ఉంటాయి. ఇక అంబుబాచి అనేటువంటిది చాలా ప్రధానమైన ఉత్సవం ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తాంత్రికులను ఆకర్షించి ఆ సమయంలో తాంత్రిక పరమైనటువంటి సాధనలు నిర్వహించుకోవడానికి కేంద్రమైనటువంటి సమయం ఆ సమయానికి చాలామంది వస్తూ ఉంటారు. కాస్త అక్కడికి ప్రవేశించేటువంటి వాళ్ళు వచ్చేటువంటి వాళ్ళు ఇతరమైనటువంటి బాధ్యతలతో రాకూడదు.
(09:14) అంబుబాచి జరిగే రోజుల్లో మనం ఎవరితోనైనా మిత్రులతో కలిసి వెళ్ళినా కూడా వాళ్ళతో ఎక్కువ సమయం గడపడం ఇటువంటివి చేయకూడదు అక్కడికి వెళ్ళేటువంటి వ్యక్తి అంబుబాచి సమయాన్ని ఎలా వినియోగించుకోవాలంటే తనలో తను మానసికంగా రమిస్తూ అంటే తనతో తను మాట్లాడుకుంటూ అది కూడా దేని గురించి అంటే అమ్మవారి యొక్క వైభవం కేవలం కామాఖ్య అమ్మవారి వైభవం అని కాదు మనం ఎంచుకుని సాధన చేస్తున్న మంత్రానికి సంబంధించిన వైభవాన్ని తలుస్తూ ఉదయ సమయం అంతా కూడా ఖర్చుపెట్టి రాత్రి భాగంలో సూర్య స్తమనం అయిన తర్వాత సాధనకు ఉపక్రమించాలి.
(09:47) ఫలానా ప్రాంతంలోనే ఈ సాధన చేయాలి లేదా దశమహావిద్యల్లో ఆయా మంత్రాలు చేస్తూ ఉంటారు కదా ఆయా దేవతలకు సంబంధించిన ఆలయం దగ్గరికే వెళ్లి సాధన చేయాలని నియమం ఏమీ లేదు. ఆ క్షేత్రంలో కొండ మీద ఎక్కడ ఉండైనా సరే చక్కగా సాధన నిర్వహించుకోవచ్చు. అంబుబాచి ప్రారంభం అవ్వడానికి ఒక రోజు ముందు నుంచే పైకి వెళ్లే వాహనాలు నిలుపుదల చేస్తారు ఇది దృష్టిలో పెట్టుకొని ముందుగానే మీరు ఏర్పాటు చేసుకున్న పై భాగంలో ఏర్పాటు చేసుకున్న వసతి అవ్వి ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి.
(10:16) లక్షలాది మంది జనం ఉంటారు గత సంవత్సరం 36 లక్షల మంది వచ్చారు. ఈ సంవత్సరం 50 లక్షలకు పైబడి రావచ్చని అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ వాళ్ళ యొక్క అంచన దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఏదైనా మనం కొంచెం వసతి చూసుకోవడం మంచిది. అక్కడ వసతి కూడా ఈ రోజుల్లో చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది సాధారణంగా ఒక వ000 రూపాయలు ఉన్నది ఎనిమిది నుంచి 9వ000 రూపాయలు ఒక గదికి వసూలు చేసే అవకాశం ఉంటుంది.
(10:41) ఇవి ముందుగానే నమోదు చేసుకుని అంబుబాచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఇది చాలా గొప్ప సమయం వచ్చే సంవత్సరం అని వాయిదా వేయడం మంచి పని కాదు ఎందుకంటే వచ్చే సంవత్సరానికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం అప్పట్లో కుంభమేళ ఒకటి నిర్వహించారు కదా ఆ కుంభమేళలో ఆ రోజున స్నానం చేస్తే మౌని అమావాస్య ఆ రోజున స్నానం చేస్తే ఎంత మంచి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితాన్ని నాలుగు రోజులు వరుసుగా ఇచ్చేటువంటి రోజులు అంబుబాచి అవకాశం ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో చక్కగా మీరు ఎంచుకున్నటువంటి సాధనలు ఆ క్షేత్రంలో ఆశ్రయించి పరదేవత యొక్క దివ్య
(11:16) కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరు. ఇక నేను కూడా ప్రస్తుతం సుమారుగా జూలై 5ఆరు తారీకుల దాకా అందుబాటులో ఉన్నాను నేను కూడా ఆయా క్షేత్రాల దర్శనానికి వెళ్తున్నాను. వచ్చిన తర్వాత మరల ఈ ఛానల్లో వీడియోలు కొనసాగుతూ ఉంటాయి. మీ ఆదరాభిమానాలకు ఎప్పుడూ కూడా ధన్యుడిని శుభవస్తు
No comments:
Post a Comment