Thursday, June 18, 2026

 లక్షల శ్లోకాలు గల*

*"మహాభారత" సారాంశం...*

*తొమ్మిది వాక్యాలలో..*

*ఆణిముత్యాలు వంటి "ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి".*

*1. మీ పిల్లల 'అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు' తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు. *

*ఉదాహరణ: "కౌరవులు."*

*2. నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని 'అధర్మం' కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.*

* ఉదాహరణ: "కర్ణుడు" *

*3. యోగ్యత తెలుసుకోకుండా 'పుత్ర వాత్సల్యం' తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.*

*ఉదాహరణ :- "అశ్వత్థామ".*

*4. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ 'నిర్వీర్యుడై' బ్రతకవలసి వస్తుంది.*

*ఉదాహరణ :-" భీష్ముడు."*

*5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము 'దురహంకారం' తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.*

*ఉదాహరణ :-"దుర్యోధనుడు "*

*6."స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది".*

*ఉదాహరణ: "ధృతరాష్ట్రుడు." *

*7. తెలివితేటలకి 'ధర్మం, సుజ్ఞానం' తోడైతే విజయం తప్పక లభిస్తుంది.*

*ఉదాహరణ: "అర్జునుడు".*

*8. 'మోసం,కపటం,' జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. *

*ఉదాహరణ: "శకుని."*

*9. నీవు 'నైతిక విలువలు' పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.*

*ఉదాహరణ: "యుధిష్ఠిరుడు."*

No comments:

Post a Comment