Thursday, June 18, 2026

మాట మీద నిలబడటం గొప్పతనమా? మూర్ఖత్వమా? | The Trap of Consistency | PRATIKULA VEDAM || Telugu Podcast

మాట మీద నిలబడటం గొప్పతనమా? మూర్ఖత్వమా? | The Trap of Consistency | PRATIKULA VEDAM || Telugu Podcast

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=helNuFgBTrA



Transcript:
(00:00) మీ స్కూల్స్ మీ తల్లిదండ్రులు ఈ సమాజం అందరూ కలిసి మీకు నూరుపోసిన అత్యంత ప్రమాదకరమైన చెత్త ఏంటో తెలుసా జీవితాంతం ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఒకసారి నమ్మితే ప్రాణం పోయినా ఆ నమ్మకాన్ని వదలకూడదు అని పదే పదే మీకు నేర్పించారు. కానీ ఎప్పుడైనా కళ్ళు తెరిచే వాస్తవాన్ని చూసారా కన్సిస్టెన్సీ అనేది డెడ్ బాడీస్ కి మాత్రమే ఉండే లక్షణం అంటే శవాలు మాత్రమే కన్సిస్టెంట్ గా ఉంటాయి.
(00:29) కానీ ప్రాణం ఉన్నది ఏదైనా సరే ఈ ప్రకృతిలో ప్రతి క్షణం మారుతూనే ఉంటది. మనిషి మెథడ్ ని చాలా జాగ్రత్తగా ఎటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ లేకుండా గమనిస్తే అది అచ్చం ఒక స్త్రీ కడుపులో ఉండే అండంలా ఉంటది. ఒక అండం కోసం కోట్ల కొద్ది వీర్యకణాలు గుడ్డిగా విపరేతమైన వేగంతో ఉన్మాదంతో దాడి చేస్తాయి. కానీ వాటన్నిటిలో ఏదో ఒక్క వీర్యకణం మాత్రమే దాన్ని చేదించుకొని లోపలికి చొచ్చుకొని వెళ్తది.
(00:57) ఆ ఒక్క క్షణం లోపలికి వెళ్ళగానే ఆ మరు క్షణమే ఆ అండం వెంటనే తన చుట్టూ ఒక ఇనప గోడ కట్టేసుకుంటది. ఇక వేరే ఏ కణాన్ని లోపలికి రానివ్వదు. శాశ్వతంగా పర్మనెంట్ గా అది లాక్ అయిపోద్ది. మన మెదడు కూడా ఎగ్జాక్ట్ గా ఇదే పనిచేస్తది. అది ఎప్పుడూ ఒక అండం లాగే ఖాళీగా దేనికోసమో ఎదురు చూస్తూ ఉంటది. మీరు పుట్టినప్పటి నుంచో మీకు ఊహ తెలిసినప్పటి నుంచో సమాజం మీ తల్లిదండ్రులు మీ గురువులు ఈ మీడియా మీ చుట్టూ లక్షలాది ఐడియాల్ని వదులుతారు.
(01:26) ఏదో ఒక బలహీనమైన క్షణంలో ఒక నమ్మకం ఒక ఐడియా ఒక ఐడియాలజీ మీ మెదడులోకి ఒక స్పెర్మ్ లాగా దూసుకుపోతది. అంతే ఇక ఆ క్షణం నుండి మీ ఆలోచనల ప్రవాహం ఆగిపోద్ది. మీ మెదడు మూసుకుపోతుంది. ఇక ఆ క్షణం నుండి మీ కళ్ళ ముందు సాక్షాత్ు సత్యమే వచ్చి నిలబడిన మీ మెదడు దాన్ని లోపలికి రానివ్వదు. కానీ ఎందుకు అలా జరుగుతుంది ఎందుకంటే ఆ ఒక్క ఐడియా ఆ ఒక్క సిద్ధాంతం ఇప్పుడు మీ అహంకారంగా మారిపోయింది.
(01:57) మీరు ఆ ఆలోచనలతో మమేకం అయపోయారు. ఇది నా నమ్మకం ఇది నా మతం ఇది నా పార్టీ ఇది నా సిద్ధాంతం అని దానికిఒక లేబుల్ వేసుకుంటారు. ఒక్కసారి మీరు ఆ నమ్మకాన్ని గట్టిగా పట్టుకున్నారంటే ఇక అప్పటి నుండి ఆ నమ్మకమే మిమ్మల్ని పట్టి బంధిస్తది. ఇక అక్కడి నుండి మీరు ఆ ఐడియాకి యజమాని కాదు ఆ ఐడియాకి మీరు బానిస ఆ తర్వాత మీ కళ్ళ ముందు ఎంత పచ్చి నిజం కనబడినా మీ బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేయదు.
(02:24) ఇది నా నమ్మకానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇది అబద్ధం అని దాన్ని సింపుల్ గా పక్కకు తోసేస్తది. దీన్నే చాలామంది కన్సిస్టెన్సీ అనుకుంటారు. సమాజం ఈ కన్సిస్టెన్సీని ఒక గొప్ప లక్షణంగా ఒక మహోన్నతమైన క్యారెక్టర్ గా పోడుతది. వాడు మాట మీద నిలబడే మనిషిరా కమిట్మెంట్ ఉన్నవాడు వాడు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు అని చెప్పట్లు కొడతది.
(02:47) కానీ నిజానికి వాడు ప్రాణాలు ఇస్తున్నది సత్యం కోసం కాదు తన మెదడులో పాతుకుపోయిన ఆ మొండితనం కోసం తన ఈగోని సంతృప్తి పరుచుకోవడం కోసం సమాజం ఎప్పుడూ మార్పును చూసి భయపడతది. అందుకే ఒకే రకంగా ప్రవర్తించే రోబర్ట్లను చూసి మనం మురిసిపోతాం. మీరు ఎప్పుడైనా ఒక పబ్లిక్ మీటింగ్ కి వెళ్ళారా ఈ రోడ్ల మీద చేసే ఆందోళనలు నినాదాలు స్లోగన్స్ ఎందుకు పుట్టాయో ఎప్పుడైనా విశ్లేషించారా మీరు ఒక గుంపులో నిలబడి పిడికిలి బిగించి నరాలు తెగేలా గొంతు చించుకొని ఒక నినాదం అరుస్తారు.
(03:16) ఆ క్షణంలో మీరు ఎంతో గొప్ప విప్లవం తేస్తున్నారని సమాజాన్ని ఉద్ధరిస్తున్నారని మీ ఫీలింగ్ బట్ ఆ నినాదం ఎవరి కోసం మీరు అరిస్తే ఎదుటి వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి వాళ్ళకి జ్ఞానోదయం అయిపోద్ది అనుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకొకరు లేరు. మీరు అరుస్తున్న కొద్ది మీరు చేస్తున్నది ఏంటంటే మీ మెదడులో ఆ పిచ్చిని మరింత లోతుగా మరింత బలంగా పాతుకుపోయేలా చేసుకుంటున్నారు.
(03:38) ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద మీరు 10 మందికి వినబడేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాక ఇక వెనక్కి తగ్గడానికి మీ ఈగో ఒప్పుకోదు. మీ మెదడు ఒక ఆటో సేషన్ మోడ్ లోకి వెళ్ళిపోద్ది. నేను 10 మంది ముందు ఒక మాట అన్నాను దానికి కట్టుబడి ఉండాలి లేకపోతే నా పొరువు పోద్ది నన్ను పిరికివాడు అనుకుంటారు ఆ భయమే మిమ్మల్ని ఒక బానిసగా మారుస్తది.
(04:00) ఆ గుంపులో ఆ అరుపుల మధ్యలో మీ ఇంటెలిజెన్స్ మీ లాజిక్ మీ ప్రశ్నించే తత్వం అన్ని మురికి కాలవలోకి వెళ్ళిపోతాయి. ఇక మిగిలేది ఏంటి కేవలం ఒక గుడ్డి నమ్మకం ఒక మూర్ఖపు కమిట్మెంట్ పోనీ కనీసం ఈ చదువుకున్న వాళ్ళు ఇంటలెక్చువల్స్ సైంటిస్ట్లు వీళ్ళైనా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు అనుకుంటున్నారా వాళ్ళు ఇలాంటి వాళ్లే సైన్స్ అంటేనే నిరంతరం నిజాన్ని వెతకడం కానీ పాతతరం సైంటిస్ట్లు ఈ కొత్త ఇన్వెన్షన్స్ ని కొత్త థియరీల్ని ఎందుకు అంత ఆవేశంగా వ్యతిరేకిస్తారో ఎప్పుడైనా గమనించారా ఒక సైంటిస్ట్ అనేవాడు తన జీవితంంతా ఒక థియరీ మీద బతుకుతాడు.
(04:32) అదే సత్యం అనే నమ్మాడు వందల పేపర్లు రాసాడు అవార్డులు తీసుకున్నాడు స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పాడు. తీరా అతనికి 60 70 ఏళ్ళ వచ్చాక ఎవడో ఒక 30 ఏళ్ల కుర్రాడు వచ్చి సార్ మీరు ఇన్ని దశాబ్దాలుగా చెప్పిన థియరీ తప్పు ఇదిగో ఇది అసలైన నిజం ఇవిగో సాక్ష్యాలు అని ప్రూవ్ చేస్తే ఆ ముసలి సైంటిస్ట్ మెదడు దాన్ని స్వీకరించలేదు. ఎందుకంటే ఆ మెదడు అప్పటికే బ్లాక్ అయిపోయిఉంది.
(04:58) ఆ ముసలి వ్యక్తి ఈగో దాన్ని ఒక భయంకరమైన అటాక్ లా భావిస్తది. సత్యాన్ని సత్యంగా చూసే ధైర్యం ఆ సైంటిస్ట్ కి ఉండదు ఎందుకంటే ఆ కొత్త సత్యాన్ని గాని ఒప్పుకుంటే తను ఇన్నాళ్లు బ్రతికిన జీవితం తను సాధించిన అవార్డులు తన పేరు ప్రతిష్ట అన్ని ఒక పెద్ద అబద్ధం అని ఒప్పుకోవాల్సి ఉంటది. తన గతం అంతా ఓడిపోయినట్లు అవుతది. ఆ భారాన్ని మోయలేకే వాళ్ళు కొత్త ఆలోచనల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
(05:23) వాళ్ళకు సైన్స్ మీద ప్రేమ కంటే సత్యం మీద దాహం కంటే వాళ్ళ అహంకారమే వాళ్ళ ఐడెంటిటీనే వాళ్ళకి ముఖ్యం. నిరంతరం ప్రతి క్షణం మారుతున్న సత్యాన్ని స్వీకరించాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ మీ మెదటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచుకోవాలి. ఏ క్షణంలో ఏ సత్యం వచ్చే మీ పాత నమ్మకాలన్నిటిని కూల్ చేస్తుందో అన్నదానికి మీరు సిద్ధంగా ఉండాలి. కానీ మీకు ఆ ధైర్యం లేదు ఎందుకంటే తలుపులు తెరిచి ఉంచారు అనుకోండి ఏ గాలి వేస్తుందో ఏ తుఫాను వస్తదో దానివల్ల మీ లోపల కూరుకుపోయిఉన్న నమ్మకాల చెత్త అంతా ఎక్కడ కొట్టుకుపోతుందో అన్న వణుకు మీ లోపల ఉంది.
(05:56) మీకు ఎప్పుడూ ఒక పక్క క్లారిటీ కావాలి. ఒక సాలిడ్ గా ఉండే రూపం కావాలి. మీకంటూ ఒక సాలిడ్ ఐడెంటిటీ కావాలి కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ ఐడెంటిటీయే మీ పాలిట జైలు నేను హిందువుని, నేను ముస్లిం ని, నేను క్రిస్టియన్ని, నేను కమ్యూనిస్ట్ ని, నేను క్యాపిటలిస్ట్ ని, నేను ఫలానా కులానికి చెందిన వాడిని, ఫలానా సిద్ధాంతాన్ని మాత్రమే నమ్మేవాడిని ఇలాంటి ఏవేవో ఇనప గోడలన్నీ కట్టుకొని ఆ గోడల మధ్య కూర్చొని చాలా భద్రంగా ఫీల్ అవుతుంటారు.
(06:23) ఆ ఐడెంటిటీ లేకపోతే మీరు శూన్యం అండ్ ఆ శూన్యాన్ని ఆ ఖాళితనాన్ని ఫేస్ చేసే దమ్ము మీకు లేదు. అందుకే ఎవడో పుట్టించిన ఒక చెత్త ఐడియాని తలకెక్కించుకొని దాన్ని ప్రాణం కంటే మిన్నంగా పట్టుకొని అదే నా జీవితం అదే నా అస్తిత్వం అని భ్రమలో బ్రతుకుతున్నారు. స బ్రతికున్నవాడు చైతన్యం ఉన్నవాడు ప్రతి క్షణం మారుతూనే ఉంటాడు.
(06:48) ఎందుకంటే జీవితం అంటేనే మారుతూ ఉండేది. సపోజ్ ఈరోజు మీరు ఒక మాట ఇచ్చారు కానీ ఎందుకు ఇచ్చారు ఎందుకంటే ఈరోజు మీరున్న పరిస్థితులు ఈరోజు మీకున్న ఆలోచన స్థాయి ఈరోజు మీకున్న అవగాహన ఇలా ఉన్నాయి కాబట్టి కానీ రేపు ఉదయానికి పరిస్థితులు మారుతాయి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు సత్యం మరో కొత్త కోణంలో దర్శనం ఇస్తది. కానీ అప్పుడు కూడా ఆ లేదు లేదు నేను నా పాత మాటకే కట్టుబడి ఉంటాను అనడం మూర్ఖత్వం కాదా అది కమిట్మెంట్ కాదు అది మీ చైతన్యానికి మీకు మీరే చేసుకుంటున్న ఆత్మహత్య కన్సిస్టెన్సీ అనేది సమాధిలో ఉండే శవాలకు ఉండే లక్షణం మరి మీరు ప్రాణాలతో ఉన్న శవాలా కాదుగా
(07:22) ఒక్కసారి మీ లోపలికి మీరు తిరిగి చూసుకోండి మీ బ్రెయిన్ లోకి చొచ్చుకెళ్ళిన ఆ మొట్టమొదటి ఆలోచన ఏంటి ఏ నమ్మకం మిమ్మల్ని ఇలా లాక్ చేసి పడేసింది మీ మతమా మీ జాతీయమా మీ రాజకీయ సిద్ధాంతమా మీ ఆదర్శాలే ఏదైతేనే అది మిమ్మల్ని ఒక మానసిక వికలాంగుడిగా మార్చేసింది. నిజమైన స్వేచ్ఛ అంటే బయట ఎక్కడో సమాజంలోనో రాజ్యాంగంలోనో దొరికేది కాదు ఈ నమ్మకాల జైలు నుంచి ఈ కుళ్ళపోయిన ఐడెంటిటీల చెరసాల నుంచి బయట పడటమే నిజమైన స్వేచ్ఛ.
(07:52) మీ మెదడు తలుపులు బద్దలు కొట్టండి. ఏ ఐడియాకి ఏ సిద్ధాంతానికి బానిస కాకండి. నాకు ఏమీ తెలియదు నేను దేనికి కట్టుబడి లేను అన్న ఆ ఖాళీతనాన్ని ఆస్వాదించండి. ఆ శూన్యంలో నిలబడగలిగే ధైర్యాన్ని తెచ్చుకోండి అప్పుడే మీరు ఈ విశ్వంలో ఉన్న అనంతమైన సత్యాన్ని చూడగలరు అండ్ అప్పుడు మాత్రమే ఈ అనంతమైన ఆకాశంలో ఉన్న మైండ్లోకి మీకు ఎప్పుడూ అర్థం కాని సత్యం దానంతట అదే వస్తది.
(08:22) లేదంటే ఆ మూసుకుపోయిన అండం లోపలే ఆ పిచ్చి నమ్మకాల పురుగుల్ల కుళ్లిపోతారు. నిర్ణయం మీదే

No comments:

Post a Comment