Friday, August 21, 2020

సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం

సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం

🙏మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము.

ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి.

1. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు.

ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ( ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతోందో) మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు.

2. రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుసుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు.

౩. ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన యలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది.
ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు అతడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగడు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని వగుస్తాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను.

4. ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది.
పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇత: పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే వుండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారివి వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచాకూడదని మనకు చెప్పే కదా ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం వున్నవాడు కాదు.

5. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకు లోనయి తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమె ఆయనకు ప్రధానం. మద మాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో, వివేకం ఉదయింప చేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేసారో చూపించారు.

💐 కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కధల ద్వారా తెలుసుకుంటాం. 💐

1. ఈ వ్రతం చాతుర్వర్ణాల వారు ఈ ఐదు అధ్యాలలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూసాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమె పరిమితం అని చేసే విషప్రచారానికి గొడ్డలిపెట్టు.

2. ఈ కధల ద్వారా కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్ధకామమోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి.

3. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది.

4. దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియచేస్తుంది.

5. చెడు త్వరగా అర్ధమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం, మన మెంటాలిటి తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే యిట్టె పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది.
ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకధా తరంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నతిస్థితిని పొంది ఇహపరసౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కధ మనకు ఏమి చెబుతోంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయి అని నా మనవి.🙏



Source - Whatsapp Message

కొన్ని మహిమాన్విత దేవాలయాలు

🙏 సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు: 💥
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.

💦 నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

🔥 నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,
3. మంజునాథ్.

👃 శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్

🌊 సముద్రమే వెనక్కివెళ్లే
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

👧🏻 స్త్రీవలె నెలసరి అయ్యే
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,
2. కేరళ దుర్గామాత.

🌈 రంగులు మారే ఆలయం.
1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు
1. కాణిపాకం,
2. యాగంటి బసవన్న,
3. కాశీ తిలభండేశ్వర్,
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

స్వయంభువుగా
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
ఆరునెలలకు ఒకసారి తెరిచే
1. బదరీనాథ్,
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం.

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

12 ఏళ్లకు ఒకసారి
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

స్వయంగా ప్రసాదం
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

ఒంటి స్తంభంతో
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

రూపాలు మారే
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

ఛాయా విశేషం
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్

ఇంకా...
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్, కంచి,
చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం etc

పూరీ
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.

ఇవి మనకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి.🕉💐💐💐🙏



Source - Whatsapp Message

ఆనందం

ఆనందం

సద్గురు :- 🤘తన జీవితంలో ఒక్క క్షణం కూడా ఆనందం తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అది సాధ్యం కానేకాదు, ప్రపంచంలోని అత్యంత బాధామయ వ్యక్తికి కూడా ఆనందం అంటే ఏమిటో తెలుసు. అతను ఆనందాన్ని పొందలేడని కాదు. అతను బాధను ఎలా అయితే పొందగలడో, అలాగే ఆనందాన్ని కూడా పొందగలడు.

ప్రస్తుతం ఆ భాధామయ వ్యక్తి సమస్య ఏమిటంటే అతను దాన్ని నిలుపుకోలేకపోతున్నాడు. నిజానికి అతను చాలా బాధలో ఉన్నాడు. ఎందుకంటే అతను ఆనందాన్ని కోల్పోయాడు. అవునా, కాదా? మనుషులు ఎంతో బాధలో ఉండటానికి ఒక కారణం, ‘నిన్న ఎంతో బాగుండింది, కానీ ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది?’ అని అనుకోవటమే. అది వారి బాధని అనేక రెట్లు పెంచుతుంది, అవునా, కాదా? అంటే ప్రతి ఒక్కరూ వారి జీవితంలో, కనీసం ఒక్క క్షణమైనా, ఆనందాన్ని అనుభవించారు.

మిమ్మల్ని మీరు ఒక్క క్షణమైనా ఆనందపరుచుకోగల సామర్ధ్యం మీకు ఉందంటే, మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ఆనందపరుచుకోగల సామర్ధ్యం కూడా మీకు ఉంటుంది

నేను “మిమ్మల్ని మీరు” అని ఎందుకు అంటున్నానంటే, మిమ్మల్ని మీరే బాధపెట్టుకోగలరు లేదా ఆనందపరుచుకోగలరు. మీరు అనుభూతి చెందేది మీలోనే, మీ బయట కాదు. మీరు ఆనందంగా ఉండటానికి మీ అవగాహనలో రావలసిన ప్రాధమిక మార్పు ఇదే.

అంతర్గతానందం ఎలా పొందాలని అందరూ అడుగుతారు. నేను వారిని అడుగుతాను, ‘మీకు బాహ్యనందం అంటే ఏమిటో తెలుసా?’ అని. మద్యం తీసుకోవటం వలన మీకు ఆనందంగా అనిపించి ఉండవచ్చు. మీరు దాన్ని ‘బాహ్య ఆనందం’ అని అనుకుంటుండవచ్చు. కానీ మీరు ఏమి చేసినా సరే, ఎప్పుడూ మీ లోపలే మీకు ఆనందంగా అనిపిస్తుంది. ఎల్లప్పుడూ మీలోనే అనిపిస్తుంది, అవునా, కాదా? ఎప్పుడూ మీ బయట కాదు.

మీరు ఇప్పుడు బాధగా ఉండటానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే, మీరు ఆనందపడకుండా, ఆనందాన్ని వెతుకుతున్నారు. మీరు ఆనందాన్ని అనుభూతి చెందేది మీలోనే అని అర్ధం చేసుకోకుండా, ఏదో ఆనందం బయట ఉన్నట్లు మీ శక్తినంతటినీ బయట ఉన్నవాటి మీద కేంద్రీకరిస్తున్నారు.

మీరు సంతోషంగా లేకపోవటానికి కారణమేమిటంటే మీ ఆనందానికి ఆధారమైన ‘మీ’ నుండి మీరు దూరంగా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఆనందాన్ని వీధిలో ఎక్కడో వెతుక్కోడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారన్న వాస్తవమే బాధని సృష్టిస్తుంది. ఎందుకంటే ఆనందం ఇక్కడ, అంటే మీ లోపల ఉంది, కానీ మీరు ఎక్కడికో వెళుతున్నారు. మీరు దాని నుండి దూరంగా వెళుతున్నారు.

మీరు ఆనందాన్ని పొందగలరు. కాకపోతే మీరు దాన్ని కొన్ని క్షణాలు మాత్రమే సృష్టించుకుంటున్నారు. మిగతా సమయమంతా మీరు ఎంతో బాధను సృష్టించుకుంటున్నారు.

మీలో మీకు కావలసిన విధంగా ఒక్క క్షణాన్నైనా సృష్టించుకోగల సామర్ధ్యం మీకు ఉంటే, మీకు కావలసిన విధంగా మరొక క్షణాన్ని సృష్టించుకోగల సామర్ధ్యం మీలో ఉండదా? మరొకటి, మరొకటి, ఇంకొకటి.. అదృష్టవశాత్తు, జీవితమంటే ఇంతే, ఒకసారి ఒక్క క్షణమే. క్షణాలు ఒక్కసారే గుంపుగా వచ్చి, మీ మీద దాడి చేయట్లేదు. అవి ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగానే వస్తున్నాయి. మీకు ఈ క్షణంలో ఆనందంగా ఉండడం ఎలానో తెలిస్తే, మీరు ఇక ఆపై ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు. అది ఎలానో మీకు తెలియకపోతే, మీరు ఎప్పటికీ ఆనందంగా ఉండరు. 🤘



Source - Whatsapp Message

Thursday, August 20, 2020

ఆధ్యాత్మిక సాధన

🌹|| ఆధ్యాత్మిక సాధన || 🌹

👉 దేహంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యం బావుంటుంది. దేశమంటే మనుషులు. మనుషులంతా సంఘటితంగా ఉంటేనే ఏ దేశానికైనా భవిష్యత్తు. దేహమైనా, దేశమైనా క్లిష్టపరిస్థితులు తప్పవు. వాటిని ఎదుర్కొనేందుకు సంకల్పబలం అవసరం. సంకల్పం అధినేతదైతే బలాన్ని అందించేది ప్రజలు. సంకల్పబలం గట్టిదైతే దైవబలం తప్పక తోడవుతుంది.
ఎందరో మహానుభావుల త్యాగాలు, మహర్షుల తపస్సుతో పునీతమైంది ఈ భూమి. వేదాలు, పురాణాలు ఈ దేశానికి దిక్సూచిగా నిలిచాయి. ఉన్నతమైన సంస్కృతీ సంప్రదాయాలు అబ్బురపరచే కళలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి !!

నాగరికతతోపాటు మనుషుల్లో స్వార్థమూ పెరిగింది. అనేక సదాచారాలు మరుగున పడిపోయాయి. ఈ తరంవారు వాటిని మూఢవిశ్వాసం అని కొట్టిపారేసినా వాటిని కోరుకునేవారూ లేకపోలేదు. ప్రవచనకర్తలు ప్రస్తావిస్తే ఆశ్చర్యంగా వినేవారూ ఉన్నారు !!

ఆధ్యాత్మిక సాధనలు ఎవరినైనా శుద్ధిచేస్తాయి. చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక సాధన చేసిన గురువులు ఎంతో పవిత్రంగా తయారై భగవంతుడికి దగ్గరవుతారు. గులాబీ తోటలో ఎక్కువకాలం గడిపేవారు తమతో ఆ గులాబీ పరిమళాన్ని వెంటబెట్టుకుని వెడతారు. ఆధ్యాత్మిక సాధన చేస్తూ, ఆ పరిమళానికి దగ్గరైనవారు ఆ గురువుకు శిష్యులుగా మారతారు !!

ఉన్నత శిఖరాలకు చేరుకోవడం, చేరుకున్నాక అక్కడే ఉండగలగడం అంత తేలికైన విషయం కాదు. కఠినతరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అవి మనిషికి బలాన్నీ ఇస్తాయి.
దక్షిణాఫ్రికాలో రైలు నుంచి నెట్టివేతకు గురైన మహాత్మాగాంధీ, అనంతరకాలంలో ఎన్నో క్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. స్వాతంత్య్ర పోరాటం, జైలుశిక్షలు... ఎన్నో ఎదుర్కొన్నారు. అది ఆయనలో శక్తిని పెంచింది. అనేకం సాధ్యమయ్యేలా చేసింది. ఇరవై ఏడేళ్లపాటు జైలు జీవితం గడిపిన నెల్సన్‌ మండేలా ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులు ఆయనను శక్తిమంతుణ్ని చేశాయి. నోబెల్‌ శాంతి పురస్కారం, దక్షిణాఫ్రికా అధ్యక్షపదవి కోరి వరించాయి !!

మదర్‌ థెరెసా, రాక్‌ ఫెల్లర్‌, అంబేడ్కర్‌, సచిన్‌ తెందూల్కర్‌, చార్లీచాప్లిన్‌... ఎవరిని తీసుకున్నా, జీవితంలో వారు ఆ స్థాయిని చేరడానికి కారణం- కఠిన పరిస్థితులు. అంతకుమించి- రాజీపడని మనస్తత్వం, పట్టుదల.వేగంగా పరుగులు తీసే ప్రపంచంలో మనిషి మనశ్శాంతికి ప్రార్థన, ధ్యానం అవసరం.ప్రార్థనలో అనంతశక్తితో సంభాషించవచ్ఛు ఆ అనంతశక్తి చెప్పేదేమిటో తెలుసుకోవడానికి ధ్యానం దోహదపడుతుంది !!

వేరుపడటానికి, ఏకాంతంగా గడపడానికి సమయం కేటాయించాలి మనిషి. అంతర్ముఖంగా ప్రయాణించడానికి సమయం కావాలి. బాహ్య ప్రపంచంతో సంబంధాన్ని తెంచుకుంటేగానీ అంతరంగంతో సంబంధం కలుపుకోవడం సాధ్యపడదు. ఒంటరితనంలోనే తెలుస్తుంది- మనిషికి తాను ఒంటరికాదనే సత్యం !!

‘భగవంతుడా... నా జీవితం ఎందుకింత కఠినం’ అని రోజూ కుమిలిపోతుంటే, ఒక్కటే సమాధానం- ‘నీలో బలం పెరుగుతోంది గొప్పవాడివి కావడానికి... భరించు కొంతకాలం. బలమైనవారు గొప్ప పనులు సాధిస్తారు !!

విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు, ఎవరికీ సౌకర్యంగా ఉండదు. ఎదురైన పరిస్థితిని ఒక సవాలుగా తీసుకుని, ఒక పథకం ప్రకారం ఎదుర్కొంటే విజయం తప్పక లభిస్తుంది!!👍



Source - Whatsapp Message

శ్రీకృష్ణుడు కష్టజీవి ఏమిటీ?!

"శ్రీకృష్ణుడు కష్టజీవి ఏమిటీ?!"

🙏 హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు.
ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు

ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు.

శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు.

చూశారా! పురిటికందుకే ఎన్ని కష్టాలో!

కేవలం కొన్నిరోజుల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన.

అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది.

కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి.

ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకరయుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ శ్రీకృష్ణుడే జయించాడు.

కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది.

యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు.

అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ, ఒక హత్యానేరాన్నీ మోశాడు.

ఎన్నో కష్టాలు పడి, పరిశోధించి, శమంతకమణిని సాధించి తెచ్చి, తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు.

జాంబవతిని పెళ్ళాడేముందు, ఆమె తండ్రియైన జాంబవంతునితో భయంకరయుద్ధం చేశాడు.

అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు, మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది.

జీవితమే ఒక పోరాటమయింది శ్రీకృష్ణునికి.

చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే,

చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు.

తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు.

ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు.

కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా,

శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె!

శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది.

తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగుపెంటలైపోతున్నా,

విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు.

అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి.

శ్రీకృష్ణుని జీవితం పూలపానుపేమీ కాదు; దారుణమైన ముళ్ళబాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో, అష్టకష్టాలతో గడిచిందో ఈసారి మీరే చెప్పండి.

మనకు చిన్న కష్టం వస్తే చాలు, ఎంతో బాధపడి పోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడేనని నిందిస్తాం. కాని, భగవంతుడు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా మానవరూపం దాల్చి, మానవులకంటే ఎక్కువ కష్టాలూ, సమస్యలూ అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాల్లో వందోవంతు కష్టాలు పడిన మానవులు ఎవరైనా ఉన్నారా?
నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే! కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే! అనుభవించడం కష్టం. కాని, శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు.🙏

Source - Whatsapp Message

A rare conversation between Ramkrishna Paramahansa & Swami Vivekanand

A rare conversation between Ramkrishna Paramahansa & Swami Vivekanand

🤘Swami Vivekanand:- I can’t find free time. Life has become hectic.

Ramkrishna Paramahansa:- Activity gets you busy. But productivity gets you free.

Swami Vivekanand:- Why has life become complicated now?

Ramkrishna Paramahansa:- Stop analyzing life.. It makes it complicated. Just live it.

Swami Vivekanand:- Why are we then constantly unhappy?

Ramkrishna Paramahansa:- Worrying has become your
habit. That’s why you are not happy.

Swami Vivekanand:- Why do good people always suffer?

Ramkrishna Paramahansa:- Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don’t suffer.
With that experience their life becomes better, not bitter.

Swami Vivekanand:- You mean to say such experience is useful?

Ramkrishna Paramahansa:- Yes. In every term, Experience is a hard teacher. She gives the test first and the lessons afterwards.

Swami Vivekanand:- Because of so many problems, we don’t know where we are heading…

Ramkrishna Paramahansa:- If you look outside you will not know where you are heading. Look inside. Eyes provide sight. Heart provides the way.

Swami Vivekanand:- Does failure hurt more than moving in the right direction?

Ramkrishna Paramahansa:- Success is a measure as decided by others. Satisfaction is a measure as decided by you.

Swami Vivekanand:- In tough times, how do you stay motivated?

Ramkrishna Paramahansa:- Always look at how far you have come rather than how far you have to go. Always count your blessing, not what you are missing.👍



Source - Whatsapp Message

మా రేడియో, మా ప్రపంచమూ...

మా రేడియో, మా ప్రపంచమూ...

- ఓ సాహిత్య అభిమాని

📻 పల్లె జీవితంలో రేడియో తెల్లవారకముందు అమ్మ పూజ చేస్తూ స్నానం చేసిన తర్వాత పూజ చేస్తూ భక్తి సంగీతం, భక్తి పాటలు వినడంకోసం రేడియో ఆన్ చేయడంతో మా ఇల్లు, పల్లె కూడా తెల్లారేది. సేద్యం పనులు, పొలంపనులు ఉన్నప్పడు వేకువ జామున నాలుగు గంటలకే పల్లె మేల్కొంటుంది. ఎద్దులకు కుడితి తాపి, మడక బండిలో వేసుకుని పొలం కేసి బయలుదేరేముందు చద్ది తాగి ఏడుగంటల వరకు మళ్లో పనిచేయడం..

ఊరి పక్కన పొలాల్లో పనిచేస్తున్నప్పుడయితే సరిగ్గా ఏడున్నరకు కడప రేడియోలో పాటల కోసమో మడి వద్దనుంచి ఏదో ఒక వంక పెట్టుకుని ఇంటికి వచ్చి 15 నిమిషాలు పాత పాటలు వినేసి మళ్లీ పరుగెత్తడం.. ఆ లోపలే నాన్నగాని, తాత గాని చూసారంటే పనిమాని పాటలు వింటున్నందుకు తిట్లు తప్పేవి కాదు మరి.


ఘంటసాల భగవద్గీత
ఎమ్సెస్ రామారావు సుందరకాండ.
పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం (ఆడెనమ్మా శివుడు ఆడెనమ్మా భవుడు అంటూ పుట్టవర్తి వారి స్వరం రేడియోలో తాండవిస్తుంటే శివుడు తాండవమాడుతున్నట్లే అనిపించేది మాకు ఆ వయసులో.. )

ఘంటసాల లలితగీతాలు తలనిండ పూదండ దాల్చిన రాణీ, మొలకా నవ్వుల లోన వినిపించరావే.., బహుదూరపు పా

ఘంటసాల పద్యాలు.. పల్లెటూర్లలో బాల్యాన్ని ఉద్దీపింపజేసిన దివ్యగాన ఝరి


భానుమతి, సుశీల, లీల,జిక్కి, వసంతకుమారి, కోమల, మోహన్‌రాజ్, పిబి శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం,
పాటలతో దివ్యత్వాన్ని అనుభవించిన మధుర భావనలు మాకు రేడియో ద్వారానే అందాయి.

కేవలం రేడియోలో పాటలు వింటూ వాటిని స్పీడుగా రాసుకుంటూ 75 నుంచి 82 వరకు నాలుగు 200 పుటల పుస్తకాలలో 1200 మరపురాని పాటలను ఎక్కించుకున్న బాల్యం నాది.

ఒక సారి విన్నప్పుడు పాటను పూర్తి చేయలేక పోతే మరోసారి ఆ పాట రేడియోలో వచ్చే దాకా కాచుకుని ఉండి రెండో సారి, మూడోసారి పాట వింటూ పూర్తి పాట రాసుకుని ఎగిరి గంతేసేవాడిని..

ఇవ్వాళ ఆ పుస్తకాలు లేవు. ఆ పాటలు లేవు. అమృత సమానమైన జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. పై చదువులకు, తర్వాత సామాజిక ఉద్యమాలకు జీవితం మలుపులు తిరిగిన క్రమంలో పాటల పుస్తకాలు పోగొట్టుకున్నాం. 1980 నుంచి 83 దాకా నాలుగేళ్లపాటు డజను నోటు పుస్తకాలలో నిత్యం రాస్తూ వచ్చిన డైరీలూ పోయాయి. రాయచోటిలో శంకరాభరణం సినిమా వస్తే వెర్రి ఉన్మాదంతో రోజు మార్చి రోజు అర్థ రూపాయి టిక్కెట్టుతో నేలమీద కూర్చుని 13 సార్లు చూసి సినిమా హాల్ లోనే పుస్తకంలోని డైలాగులను మొత్తంగా రాసుకుని పదిలంగా కాపాడుకున్న సినిమా డైలాగుల సంపూర్ణ పుస్తకం కూడా పదేళ్ల తర్వాత పోగొట్టుకున్నాను. జీవితంలో ఒక సినిమాను ఇన్ని సార్లు చూడటం అదే మొదటిసారి, చివరి సారి కూడా...

రాయచోటి లైబ్రరీలో ఆరుద్రగారి సమగ్రాంధ్రసాహిత్యం 1,2 3 భాగాలు చూసి నివ్వెరపోయిన క్షణంలో సభ్యత్వం తీసుకుని మరీ ఇంటికి తెచ్చుకుని తెల్లవారేంతవరకు రాస్తూ -మూడు రోజులలోపు పుస్తకం ఇచ్చేయాలి మరి- నాకు నచ్చిన తెలుగు పద్యాలు, ఆ పుస్తకాల్లోని ముఖ్య ఘటనలను 3 నోటు పుస్తకాలలో నింపి పెన్నిదిలాగా దాచుకున్న రోజులవి.

ఇలా ఎన్నని గుర్తుకు తెచ్చుకోవాలి.. నిజంగా అవి నిరుడు కురిసిన హిమసమూహములే.


తెల్లవారకముందే తెలియగ నాస్వామి
మళ్లీ పరుండేవు లేరా... మళ్లీ పరుండేవు లేరా..
ప్రపంచంలో ఏ భాషలో అయినా ఏ ఇంట్లో అయినా ఒక అమ్మ తన కొడుకును ఈ విధంగా నిద్రలేపడం జరుగుతుందంటే నాకయితే నమ్మబుద్ధి కాదు. మన మానసిక ప్రపంచావరణలను మైమరపించి, పరవశింపచేసే ఇంతటి కమనీయ కరుణామయ పాటను ఈనాటికీ వినే భాగ్యం మనకు కలుగుతుందంటే తెలుగు వారిగా మనం చేసుకున్న భాగ్యం అనుకుంటాను. సూర్యుడింకా మొలవని ఉదయ కాలంలో, ఈ పాట వినే భాగ్యానికి నోచుకున్న పిల్లల జన్మ ధన్యం. కాదంటారా?

మా బాల్యాన్ని వెన్నెల చల్లదనం సాక్షిగా చందమామ కథలు వెలిగించడం ఎంత నిజమో కడప రేడియో వారు 70, 80ల మధ్య కాలంలో పాటలతో, పద్యాలతో చక్కటి సంగీతంతో వెలిగించడం కూడా అంతే నిజం. 1963లో తన పెళ్లి సందర్భంగా నాన్న కొన్న ఆ పిలిప్శ్ రేడియో ఓ పది పదిహేనేళ్లు మా పల్లె జీవితాన్ని పండివెన్నెలంత చల్లగా, ఆరుబయట తడిసిన ఇసుక ముద్దలంత చల్లగా పండించింది. ఎలా మర్చిపోగలం.

బిస్మిల్లాఖాన్ విషాద సన్నాయి సంగీతాన్ని మేం మొట్టమొదటగా మా కడప రేడియో ద్వారానే విన్నాం. ఆ సన్నాయి పలికింది ఎవరో తెలియదు.. అమ్మ తర్వాత చెప్పింది. తను ఫలానా అని. మానవ విషాదాన్ని సంగీత ప్రకంపనల ద్వారా నోటితో ఆలపించిన ఆ అమరగానం ఎప్పుడు విన్నా సరే కళ్లు చమరుస్తాయి.

తుషార శీతల సరోవరానా అనంత నీరవ నిశీధిలోనా అంటూ లీల పాడే.. వెన్నులో చలి పుట్టించే ఆ కోమల విషాద స్వరం.. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా అంటూ సుశీల దివ్య స్వరంతో పాడుతుంటే రేడియో ముందు తల వాల్చి నిశ్సబ్ద అనిశ్శబ్ద మహా వలయంలోకి ఎటో వెళ్లిపోవడం. గత అరవైఏళ్లుగా మనసున మల్లెల మాలలూగిస్తున్న భానుమతి సహజ సంగీత స్వరం పలికించిన సావిరహే తవదీనా, శ్రీకర కరుణాల వాల వేణుగోపాలా, మనసున మల్లెల మాలలూగనే పాటలలోని దివ్యత్వం...

పగలే వెన్నెలా అంటూ ఒకే ఒక్క పాటతో ప్రపంచంలోని వెన్నెలనంతటినీ పాటల ముద్దగా మార్చి మన చేతికందించిన జానకి నాద స్వరం.. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా...అంటూ ఘంటసాలతో గొంతు కలిపి గత 60 ఏళ్లుగా తెలుగు వాకిళ్లలో దివ్యగానంతో వెన్నెలను ప్రవహింపజేస్తున్న జిక్కి గళంలోని జాణత్వం...

చివరిగా ఎవరి పేరు ఇక్కడ చేర్చకపోతే ఈ మొత్తం వర్ణనకు విలువ లేకుండా పోతుందో ఆ గాన గంధర్వుడు మన ఘంటసాల దివ్య స్వరంలోంచి జాలువారిన అమృతమయమైన పాటలు, పద్యాలు, శ్లోకాలు..ఓహ్. రేడియో తప్ప మరే వినోద వస్తువూ, చివరకూ టేప్ రికార్డర్ కూడా కొనలేని ఆనాటి మాపల్లె బతుకులకు, మా బాల్యానికి వేగు చుక్కలాగా దారి చూపింది రేడియో మాత్రమే.

కృష్ణా ముకుందా మురారీ అంటూ ఘంటసాల వారు పాడిన ఆ విశ్వ గానం ఒక ఎత్తైతే ఆ పాట చివరలో అయిదు నిమిషాల పాటు వచ్చే ఆ విశ్వచలన సంగీతం జీవితంలో మర్చిపోగలమా? ఈ పాటలోని చివరి సంగీతం రేడియోలో వచ్చినా, ఇప్పుడు సిస్టమ్‌లో పెట్టుకుని విన్నా, లేక శ్రీరామ జయంతి వంటి ఉత్సవాల సందర్భంగా పల్లెల్లో గ్రామ్‌ఫోన్ రికార్డు రూపంలో విన్నా నాకు ఆ దివ్య సంగీతం తప్ప ప్రపంచంలో ఇంకేమీ కనిపించదు, వినిపించదు.

తెలుగు పద్యం ఎంత కమనీయంగా ఉంటుందో బాల్యంలో మా పాఠశాలలో తెలుగు టీచర్ సహదేవరెడ్డి గారి పద్య గానం ద్వారా విన్నాను. పాఠశాల వదిలిపెట్టాక ఇంటికి వస్తే రాత్రి, ఉదయం కడప రేడియోలో అదే పద్యాలను ఘంటసాల గొంతు పాడుతుంటే వినడం.. పద్యాన్ని చదవడం కాకుండా పాడి వినిపిస్తే ఎంత గొప్పగా ఉంటుందో మా తెలుగు టీచర్, మా ఘంటసాల బాల్యం సాక్షిగా మాకు రుచి చూపించారు. అందుకే జీవితంలో ఇన్ని దశలు మారి అయిదో దశకం సమీపిస్తున్నా, భావజాలం పరంగా నా ఆలోచనలు ఎన్ని మార్పులకు గురయినా
తెలుగు పద్యాన్ని మర్చిపోవడం నాకు సాధ్యం కావటం లేదు. మా బాల్యాన్ని ఉద్దీపింపజేసిన కమనీయ సంస్కృతి పాట, పద్యం. వీటిని మర్చిపోవడం ఎలా సాధ్యం..

ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవమూ..

అంటరానివాడెవడంటే మా వెంటరాని వారే..
హరిజనులెవరంటే మా అనుంగుసోదరులే

ఇవి మా చిన్నప్పుడు ఆనాటికి మాకు అంతగా అర్థం కాని సామాజిక అసమానతలను, సమస్యలను రేడియో పలికించి వినిపించిన చైతన్య గీతాలు. ఈ దేశం ఇంకా మనుషులతో కూడిన దేశంగా లేదని బానిసలు, బానిస యజమానులు మాత్రమే ఉన్న దేశమని లీలగా, అస్పష్టంగా మాకు తలపించిన పాటలివి.

రేడియోలో పాట వింటూ బాణీపై పట్టు సాధించడం రెండు మూడు సార్లు వినగానే పాటను జ్ఞాపకంలా మార్చుకుని దాన్ని సాధన చేయడం. ఊరిదగ్గర పొలాల్లో సేద్యం పనులు చేసేటప్పుడు, ఊరికి దూరంగా చేలలోకి వేళ్లేటప్పడు. ముఖ్యంగా గుండ్రంగా ఉండే మా ఊరి చెరువు గట్టును దాటుకుంటూ గుట్టల్లో చేలవద్దకు వెళ్లేటప్పుడు నోటికొచ్చిన ప్రతి పాటను, పద్యాన్ని, శ్లోకాన్ని గట్టిగా గొంతెత్తి ఆలపిస్తూ పోవడం. -ఎవరేమనుకున్నా గొంతెత్తి పాటడం ఆపేది లేదు-

కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్..అంటూ శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో రుక్మిణి తన కోసం రథంపై వచ్చిన శ్రీకృష్ణుడిని కనులారా చూసుకుని నిరుత్తరురాలైన సందర్భంగా ఘంటసాల పాడిన పోతన భాగవతంలోని పద్యం. కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్..

నారద తుంబురాది గంధర్వ గాయకులు కమనీయ స్వరాలన్నీ ఒక చోట చేరి అవతరించిన మానవ కరుణామయ స్వరం ఘంటసాలవారిది. ఆయన తన సినీ జీవితంలో పాడిన వందలాది పద్యాలలో అగ్రపీఠం కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ పద్యానికే దక్కుతుంది. ఈ పద్యం ఆడియో వింటూంటేనే ప్రాణం చమరుస్తుంది. ఇక సినిమా లేదా ఆ సినిమాలోని రుక్మిణీ కల్యాణ ఘట్టాన్ని మాత్రమే కట్ చేసుకుని చూస్తూ పద్యం వింటే మనకిక ప్రపంచం ఏదీ గుర్తు ఉండదు. ఘంటసాలవారు పాడిన అన్ని పద్యాల్లో ఈ పద్య గానంతో ఆయన గంధర్వ కంఠం తారాస్థాయికి చేరుకుందనిపిస్తుంది.


కస్తూరీ తిలకం లలాటఫలకే
వందేశంభు ముమాపతిం..
శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం.. సీతాపతిం..
ఏనుగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా..
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు ..
దుర్వారోద్యమ బాహుమూల..
అటజని గాంచి భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహర్ముహుర్లుఠదభంగ తరంగ
పాటునకింతులోర్తురే... కృపారహితాత్మక...
జయత్వదభ్రమద్భుంజగ

నేనొక పూలతోట కడ.. కరుణశ్రీ పుష్ప విలాపం నుండి

శ్రీశ్రీ గేయాలను బట్టీ పట్టి పాడుకునే వరకూ వచ్చింది.


ఆ చిన్న వయసులో ప్రతి పదానికి అర్థం తెలిసినా తెలియకపోయినా ముఖ్యంగా ఘంటసాల, సుశీల పద్యగానామృతాన్ని, జీవితం పొడవునా వెంటాడుతున్న ఆ ఆపాత మధుర సంగీత ఝరిని జుర్రుకుంటూ రేడియో ముందు తలవాల్చి తాదాత్మ్యత చెందిన అద్భుత క్షణాలను ఎలా మరవగలం..

ముఖ్యంగా కనీసం టేప్ రికార్డు కొనడానికి కూడా స్తోమత లేని 70ల కాలంలో పలెల్లో రేడియో ఒక వినోద సాధనంగా పేదవారికి, మధ్యతరగతికి, సకల వర్గాల వారికి పెన్నిధిగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఆరోజుల్లో పేదవారు పెళ్లి చేసుకుంటే కట్నం చదివింపులలో ఇతరత్రా ఏమి వచ్చేవో కాని పెళ్లి కొడుకు చేతుల్లో కొత్త రేడియో మిలమిల మెరిసేది.

మా ఊరికి పక్కనున్న కురవ పల్లిలో కురవ యువకులు పెళ్లి చేసుకున్నాక ఇలా కట్నం రూపంలో సంపాదించుకున్న కొత్త రేడియో పట్టుకుని గొర్రెలు, మేకలు మేపుకుంటూ ఎర్రటి ఎండలో చేలు చెలకల్లో పాటలు పెట్టుకుని వింటూంటే "అబ్బా వీళ్లదిరా జన్మంటే" అని ఎన్ని సార్లు అనుకున్నామో.

దశాబ్దాలుగా విశ్వచలన సంగీతం

విశ్వాంతరాళాల్లోంచి వస్తున్న మౌన విషాద సంగీత ఝరిని వినాలంటే అప్పుడూ,ఇప్పుడూ కూడా ఉదయాన్నే రేడియో కార్యక్రమాలు మొదలు కాకముందే రేడియో పెట్టుకుని వినాల్సిందే.. వందేమాతరం పాటను వేయడానికి ముందే రేడియోలో గత కొన్ని దశాబ్దాలుగా స్వరం లేని మౌన విషాద సంగీతం ఒకటి సంగీత ప్రియుల గుండెలను పిండేస్తూ కొనసాగుతోంది. ఒక్కసారి వింటే దాన్ని ఇక మర్చిపోలేము.

విశ్వరహస్యాలను మనముందు నిశ్శబ్దంగా ఆవిష్కరిస్తున్నట్లు.. సుదూర గ్రహాంతరాళాలనుంచి ఏదో తెలియని ప్రాణి మానవజాతికి సందేశమిస్తున్నట్లుగా గంభీరంగా, విషాదంగా, అమృతోపమానంగా ఉదయాన్నే వినిపించే ఆ మౌన సంగీతం విశ్వ చలన సంగీతంలా మనసును తాకేది. 24 గంటల పాటు ప్రసారాలు నడిచే కాలం కాదు కాబట్టి మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రాంతీయ రేడియోలు అప్పట్లో పునఃప్రారంభ సమయంలో ఈ ప్రారంభ సంగీతాన్ని వినిపించేవి.

ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే వెంటాడే సంగీతమది. రేడియోకు దూరమైపోవడంతో ఈ మధ్య కాలంలో దాన్ని వినే భాగ్యం కోల్పోయాం. దాన్ని ఎవరయినా ఎంపీ3 పాటగా మార్చి ఆన్‌లైన్‌లో పెట్టి ఉంటే లింకు చెబితే మరోసారి జన్మ ధన్యమవుతుంది.

గత సంవత్సరం సాక్షి పత్రిక ఫ్యామిలీ ఎడిషన్ తొలి పేజీలో కుడివైపున కాలంలో ఈ రేడియో, ప్రభుత్వ టెలివిజన్ ప్రారంభ సంగీతంపై ఎవరో ఒక పాఠకుడు ఒళ్లు పులకరించే కథనం రాశారు. దాన్ని భద్రంగా తీసి ఉంచాను కాని ఇంట్లో పేపర్ల మోత గుట్టలుగా పేరుకుపోవడంతో నేను లేనప్పుడు, ఆమె యధాప్రకారం దాన్ని కూడా అంగడికి వేసేసింది. - ప్రపంచంలో పుస్తకాలు, అమూల్యమైన సమాచారం పోవడం, పోగొట్టుకోవడం, అంగడిపాలైపోవడం ముందుగా ఇంటినుంచే మొదలవుతుందనుకుంటాను-. పీత బాధలు పీతవి లెండి..

పేపర్లను భద్రంగా కాపాడుకోవడం అందులో పరాయి రాష్ట్రంలో వాటిని భద్రపర్చుకోవడం ఎంత ముఖ్యమో మనం లక్షరకాలుగా వాదిస్తే, వాటిని వదిలించుకోవడం ఎంత ముఖ్యమో, అద్దె ఇళ్లలో స్పేస్ సమస్య పరిష్కారానికి అది ఎంత అవసరమో లక్షన్నర రకాలుగా వారూ వాదిస్తారు కదా... మనం అవేమీ పట్టించుకోం కదా. ఇక్కడే మనం నోరు తెరిచి అడిగే అర్హత కోల్పోతుంటాం..


రేడియో సినిమాలు, నాటికలు

70వ దశాబ్దంలో రేడియో ద్వారా సినిమాలు, నాటికలు వినడం మరో అద్భుతం. పాత సినిమాలు చూడాలంటే ఊర్లలో టెంట్లకు పోతే చాలు. కాని దానికోసం రాత్రి 8 గంటలకు మైలు దూరం నడిచి టెంటు కెళ్లి రాత్రిపూట సినిమా చూసి నడిరేయిలో ఏరు దాటి ఊరు రావాలి. చీకటంటే భయం కాబట్టి అప్పట్లో సినిమా చూడాలంటే పెద్దవాళ్లు రావాలి, వారు అనుమతించాలి. లేకుంటే ఎంత మంచి సినిమా అయినా సరే చూడలేం.

కాని నెలలో మూడో వారమో నాలుగో వారమో మరి గుర్తులేదు నెలకు ఒక్కసారి రేడియోలో పగటి పూటే సినిమా వస్తుంది. దృశ్యం లేకుండా కేవలం ఆడియో రూపంలోనే సినిమాను వినాలంటే రేడియోనే కదా మార్గం. 72 నుంచి 80 వరకు ఒక ఎనిమిదేళ్ల కాలం ఎన్ని చక్కటి పాత సినిమాలు, నాటికలు రేడియో ద్వారా విన్నామో..

నాకు బాగా గుర్తున్న రేడియో సినిమా పూజాఫలం. సినిమా పూర్తయ్యాక చాలా కాలం నన్ను వెంటాడిన సినిమా.. ఇప్పటికీ ఎప్పుడైనా ఈ సినిమా చూశానంటే మతి పోతూంటుంది. సినిమా మొత్తం భావుకత్వం.. ఎంత చక్కటి సాప్ట్ పాత్రలు. హీరో హీరోయిన్‌లకు బదులు కథ కనిపించే సినిమా, అరుపులు, పెడబొబ్బలు లేని చల్లటి, మెత్తటి సినిమా చూడాలంటే పూజాఫలం ఒక్కసారైనా చూడాల్సిందే..

ముఖ్యంగా ఈ సినిమాలోని పగలే వెన్నెలా జగమే ఊయలా పాటను మరవగలమా..! సినీ సంగీతం బతికి ఉన్నంతవరకు తెలుగు వాళ్లకు పగటి వెన్నెలను రుచి చూపిస్తూ ఊగించే పాట. పదేళ్లుగా నా సినీ పాటల కలెక్షన్‌లో మొట్టమొదటి స్థానం దీనికే. దీని తర్వాతే ఏ పాటయినా..

1986లో అనుకుంటాను ప్రాంతీయ టీవీ ఛానెళ్ల మోత లేని కాలంలో ఓ ఆదివారం సాయంత్రం తెలుగు సాహిత్యంపై నా ఎంఫిల్ రీసెర్చ్ పనిమీద రంగనాయకమ్మ గారిని కలవడానికి హైదరాబాద్ వెళితే వనస్థలిపురం ప్రాంతంలో కర్ప్యూ వాతావరణం.. ఎందుకంటే దూరదర్శన్‌లో ఆరోజు పూజాఫలం వస్తోంది. ఇళ్ల బయట జనం కనిపిస్తే ఒట్టు.. అదీ పూజాఫలం సినిమా పవర్...

ఇలా జాతి జాతి సామూహికంగా ఒక వినోదం కోసం చెవులు రిక్కించుకుని వింటూ వచ్చిన ఆ బంగారు రోజులు మళ్లీ వస్తాయా. మన ఇంట్లో మన టీవీ, మన ఆడియో, మన కంప్యూటరూ, మనం కొని తీసుకువచ్చిన స్వంత సీడీ, డీవీడీలలోని సినిమాను ఒకరమో ఇద్దరమో పెట్టుకుని యాంత్రికంగా చూసే కాలంలో పెరుగుతున్నామిప్పుడు.

మనకు నిజంగా సామూహికానందం ఏమిటో ఇప్పుడు తెలియదేమో అనిపిస్తోంటోంది. పల్లెల్లోనూ, పట్నాల్లోనూ జీవితం చప్పిడిగా మారిపోయింది. డబ్బు సంపాదన, అమెరికాకు, కాకపోతే మరో దేశానికో పరుగులు తీయవలసిన వాతావరణంలో ఊరంతా ఒక చోట చేరి ఒక పండుగను, ఒక ఉత్సవాన్ని, ఒక హరికథను, ఒక వినోదపు ఆనంద క్షణాలను మనకు మనంగా, గుంపులో ఒకరుగా విని తరించే అవకాశం మనకు ఏనాటికైనా వస్తుందా?

కొత్త బంగారు లోకాల మాటేమిటో గాని మనదైన పాత బంగారాన్ని మన కళ్లముందే జారవిడుచుకుంటున్నాం.. నిజంగా తల్చుకుంటే బాధేస్తుంది.. 20 ఏళ్ల కాలంలో ఏం కోల్పోయామో, ఏం కోల్పోతున్నామో తల్చుకుని గుండె అవిసేలా ఏడవాలనిపిస్తుంది అప్పుడప్పుడూ.

పనిదినాల్లో అన్ని ఒత్తిళ్లనూ భరించి ఏ శనివారం సాయంత్రమో ఆదివారమో అన్ని పనులూ మానుకుని ఒక గంట సేపు నా పాత పాటల కలెక్షన్ నుంచి నరాలను కాకుండా హృదయాన్ని పిండే మా కాలం పాటలను కళ్లు మూసుకుని వారానికి ఒకసారయినా వినగలిగితే, మనసులోనే పాడుకుంటూ కన్నీళ్లు కార్చగలగితే ఎంత బావుంటుందో.🤔

Source - Whatsapp Message

కర్మసిద్ధాంతం ...శరీరం .. మనస్సు

కర్మసిద్ధాంతం ...శరీరం .. మనస్సు..


రచన: డా. పీ. ఎల్.ఎన్.ప్రసాద్


కర్మలని జయించడం ఎలా ? ప్రారబ్ధం లో లేని కర్మలు.. ఏవి ? శరీరం మనస్సు వేరు కర్మ ఫలాలు అనుభవిస్తాయా ?
వాస్తవానికి ఏ ఇంద్రియం ఒక కర్మ చేస్తుందో ఆ ఇంద్రియమే కర్మకి కారణం అవుతుంది. మనం ఏ ఇంద్రియాన్ని సద్వినియోగం చేసినా, దుర్వినియోగం చేసినా , కర్మ ఫలాలు ఆ ఇంద్రియమే పొందుతుంది..


కొందరికి వ్యంగ్యాలు నిందలు, హేళన , తిరస్కారం గా మాట్లాడటం అలవాటు.. తెలివితేటలు గా మాట్లాడుతున్నామని అనుకుంటారు.. ప్రకృతి లోకి ఇలా నీచమైన వాక్కు పంపితే , ప్రకృతి క్షమించదు.


వాక్కు దుర్వినియోగం చేస్తే, అదే వాక్కు తిరిగి వస్తుంది.. ఎదో ఒకనాడు, వాక్కు దుర్వినియోగం చేయడం వలన , తీవ్రమైన వ్యధ కి లోనై, ఒకరిని బాధించకూడదనే సత్యం కన్నీరు కారుస్తూ నేర్చుకుంటారు..


ఇదే కళ్ళు. కాళ్ళు. ప్రతి ఇంద్రియానికి వర్తిస్తుంది.. మంచి చేయలేక పోయిన చేదు చేయకూడదు..ఆస్తులు లేకపోయినా. అప్పులు ఉండకూడదు కదా..
ప్రతి ఆలోచన ఒక కర్మ.. ప్రతి మాట ఓక కర్మ..


చేతులు కాళ్లతో చేసేవి మాత్రమే కర్మలు కావు. మనస్సు తో చేసే కర్మలకి ఎక్కువ ఫలాలు ఉంటాయి.. మనస్సు ద్వారా చేసే కర్మ ఫలాలని
ప్రతి ఇంద్రియం అనుభవిస్తుంది...
వ్యాధుల వల్ల వచ్చే నొప్పులని , మనస్సు వేదన గా మార్చి అందిస్తుంది..
నొప్పుల వలన పడే బాధ కన్నా, " ఆ నొప్పి ఉందే, "
అనే మానసిక వేదన మానవుడు అనుభవిస్తాడు..
ఇది ప్రారబ్ధ కర్మ లో లేదు..మనం ఆ అనవసరమైన
కర్మ అనుభవించనక్కర లేదు...ఇది కొత్త కర్మ అవుతుంది..


మన జీవితం లో మనకి బాధ కలిగించే ప్రతి కర్మ ఫలాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటాము. పొద్దున లేచినప్పటినుండీ, శరీరం అనుభవించే బాధల వలన , పనులు సకాలం లో జరగక పోతే మనకి చిరాకు కలిగి, దానికి కారణం అని అనుకుంటున్న వాళ్ళని నిందిస్తుంటాము.
మనకి గౌరవ మర్యాదలు తగ్గాయని అహంకారం తో ఇతరులపై చిందులు వేయడం. మన మనస్సుకి హాయిగా ఆహ్లాదం కలిగిలా ఇతరులు మాట్లాడక పోవడం చేత వచ్చే కోపం.. ఇతరులు మనకి నచ్చిన వాళ్ళని తిట్టడం
,మనకి నచ్చని వాళ్ళని పొగడటం చేస్తే మనం క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేక పోవడం వలన వచ్చే పోట్లాటలు. ఇవన్నీ మనం వర్తమాన కాలం లో చేస్తున్న అనవసరమైన కొత్త కర్మలు.


మనం ఇలా ప్రారబ్ధం లో లేని కొత్త కర్మలు చేస్తూ , వీటికి తగిన ఫలాలు అనుభవిస్తూ , “ఇదంతా నా ముఖాన రాశి ఉంది”. “నా ప్రారబ్ధం ఇది “ అని అనుకుంటున్నాము.
కష్టాలు మీ ప్రారబ్ధం కావచ్చు. ఆ కష్టాలని ఎదుర్కోవడం లో పడే మానసిక వేదన చిరాకు కోపం ఆందోళన ఇతరులని తిట్టడం మీ ప్రారబ్ధం లో లేవు. ఈ సమయం లో మనం మనస్సు ని మాటని అదుపులో పెట్టుకోలేక పోవడం వలన దేనికి తగిన దుష్కర్మ ఫలం వెంటనే అనుభవిస్తాము.
మనస్సు వాక్కు అదుపులో లేక పోతే ఫలాలు తక్షణం వస్తాయి.. మనస్సుని మాటని అదుపులో పెట్టుకోగలిగితే, ఈ బాధలు వేదనలు ఏవీ రావు మనం అనుభవించనక్కర లేదు. శరీరం ఇంద్రియాల ద్వారా అనుభవించేది బాధ.,

సంతోషం:
మానవుడు మనస్సు ద్వారా అనుభవించేది వేదన , ఆనందం . మీ ఆనందం మీ చేతి లోనే ఉన్నది అనే విషయం అర్ధం అవుతున్నది కదా. ఎదుటి వాడు మన గత జనం లో మనం వాక్కు ని దుర్వినియోగం చేస్తే , ఇప్పుడు దానికి ప్రతిగా ఎవడో వచ్చి నానా మాటలు అని వెళతాడు.
వాక్కు కనుక దుర్వినియోగం ఐతే దానికి ఫలితం వాక్కు అనుభవించవలసి వస్తుంది. అదే వాక్కు శిక్షించబడుతుంది. పదిమంది చేత నిందలు పడటం ద్వారాకాని, కొన్ని సార్లు అసాధారణ పరిస్థితుల్లో వాక్కు దూరం ఐనా ఆశ్చర్యం లేదు.

ఈ కర్మ సిద్ధాంత ధర్మసూక్ష్మం తెలిసి చిరునవ్వు నవ్వ గలిగితే , మీరు ఆ కర్మ జయించారు, కొత్త కర్మ కూడా చేయలేదు. కర్మలని జయించే పద్ధతి ఇదే
శరీరం బాధ పడుతుంటే మనస్సు బాధ పడక్కర్లేదు.” అయ్యో శరీరం బాధ పడుతోందే “ అని మీ మనస్సు కూడా వేదన పొందితే, మీరు లేని కష్టం అనుభవిస్తున్నారు అని అర్ధం.

అలాగే మన మనస్సు వేదన పొందితే , దానిని అదుపులో పెట్టుకోలేక పోతే వెంటనే శరీరం తీవ్రం గా ప్రభావితం అవుతుంది అప్పుడు వివిధ వ్యాధులు రావచ్చు.

ప్రారబ్ధం ప్రకారం గతం లో ఎవరి మనస్సునో బాధించిన కారణంగా మీ మనస్సు మాత్రమే ఇప్పుడు కొద్ది కాలం వేదన పొందాలి మనస్సు అదుపు తప్పడం వలనా ఆ ప్రభావం శరీరం మీద పది ఏ హార్ట్ ఎటాక్ వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఇది ప్రారబ్ధ కర్మ లో లేదు. కేవలం మనస్సు అదుపు లో లేనందువల్ల శరీరం అనవసరం గా అనుభవించే కొత్త కర్మ కొత్త వ్యాధి. ఇది ఏ జాతకం లో కనిపించక పోవచ్చును.
మనం తెలివితక్కువగా కొని తెచ్చుకునే కర్మలు వ్యాధులు జాతకం లో కనబడవు దీనికోసం జ్యోతిష పండితులని నిందించకండి . మీ మనస్సుని వాక్కు ని అదుపు లో పెట్టడం నేర్చుకుంటే కర్మలని జయించ వచ్చును.
🙏🏼

Source - Whatsapp Message

ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదునియమాలు

ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు చేదునియమాలు

🤘 1.ప్రకృతి యొక్క మొదటి నియమం : ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి.

2. ప్రకృతి యొక్క రెండవ నియమం : ఎవరివద్ద ఏమిఉంటుందో వారు దానినే పంచుకోగలరు. సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు. జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు. భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు. భయస్తులు భయాన్నే పంచగలరు.

3. ప్రకృతి యొక్క మూడవనియమం : మీకు మీజీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి. ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది. మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి. ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది. నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది. అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది. దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది. సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది.

విషయం చేదుగా ఉన్నా ఇది నిజం .🤘



Source - Whatsapp Message

గురుదక్షిణ

గురుదక్షిణ

🙏పూర్వ కాలంలో గురు శిష్యులు ఉండేవారు. కొన్ని సంవత్సరాల పాటు గురువు దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకొని శిష్యుడు జ్ఞానం సంపాదించాడు. తన దగ్గరి నుండి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి సమయం ఆసన్నమైంది అని గురువు శిష్యుడిని పిలిచి ఆశ్రమం నుండి వెళ్లడానికి అనుమతి ఇస్తాడు.
శిష్యుడు గురువు పై ఉన్న గౌరవంతో "గురువుగారూ..! ఇన్నాళ్ళుగా మీ బోధనల వలన నేను అపారమైన జ్ఞానం సంపాదించాను. మీరు నాకందిచిన ఈ జ్ఞానానికి గురు దక్షిణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కానీ స్థాయికి సరిపడేంత విలువైనది ఏదీ నాకు కనిపించడం లేదు.. కనుక మీరు ఏం కావాలో కోరుకోండి.. దాన్ని మీ గురు దక్షిణ గా సమర్పించుకుంటాను." అని గురువుతో పలికాడు.
ఆ మాటలు విన్న గురువు చిన్నగా నవ్వుతూ "నాపై నీకున్న గౌరవానికి సంతోషిస్తున్నాను. నాకు ఏమీ అవసరం లేదు. నువ్వు బాధ్యతగా, ధర్మ బద్ధంగా జీవితం కొనసాగించు.. అదే గురుదక్షిణ" అని హితవు పలికాడు.

శిష్యుడు గురువు మాట వినకుండా " మీరు నన్ను అడిగి తీరాల్సిందే.. మీరు అడిగింది ఎంత కష్టమైనా, ప్రపంచం అంతా గాలించి అయినా సరే తెచ్చి ఇస్తాను. దయచేసి మీకు ఏం కావాలో విన్నవించండి" అని వేడుకున్నాడు.

గురువు ఎంత చెప్పినా అతడు వినాకపోయే సరికి గురువు గారు ఇలా అడిగారు. "చూడు నాయనా..! ఈ సృష్టిలో ఎవరికీ, దేనికీ పనికిరానిది ఏదైనా ఉంటే అది నాకోసం తీసుకురా.. నీకు ఎంత సమయం కావాలన్నా తీసుకో.. ఎప్పుడు నీకు నేను అడిగింది దొరుకుతుందో అప్పుడు దాన్ని నాకు గురు దక్షిణగా సమర్పించు. " అని చెప్పాడు గురువు.

గురువు మాటలు విన్న శిష్యుడు "ఏమిటి గురువు గారూ... ! పనికిరాని వస్తువా .. ! నేను ఎంతో కష్టతరమైన కోరిక కోరుతారు అనుకుంటే ఇంత సులభంగా అడిగారేమిటి..? క్షణాల్లో తీసుకొస్తాను" అని శిష్యుడు అక్కడి నుండి సెలవు తీసుకుని వెళ్ళాడు..

శిష్యుడు వెళ్తూ వెళ్తూ దారిలో ఎండిపోయి రాలిన ఆకుల్ని చూసాడు. ఇవి పనికి రానివే కదా అని గురువుకు ఇద్దాం అని తీసి సంచిలో వేశాడు. కాస్త దూరం నడిచి ఆలోచించాడు.. ఎండిపోయిన ఆకుల వలన లాభం లేకపోలేదు.. వీటిని కాల్చి ఆ మంటతో చలి కాచుకోవచ్చు. లేదా వంట కోసం పొయ్యిలో వేసి మంట వెలిగించ వచ్చు. కనుక ఇవి గురువు గారికి ఇవ్వడం కుదరదు అని సంచిలో నుండి తీసి పారేశాడు. మళ్లీ ఆలోచించి వీటిని కాల్చడం వలన బూడిద వస్తుంది. ఆ బూడిద గురువు గారికి ఇస్తాను అనుకుని వాటిని తగళబెడతాడు. బూడిదను తీసుకెళుతు, దీనితో పాత్రలు శుభ్రం చేయవచ్చు. కనుక ఇది కూడా గురువు గారికి ఇవ్వలేను అని బూడిద విడిచి పెట్టి ముందుకు సాగుతాడు.

ఈసారి అతడికి ఒక బావి కనపడుతుంది. ఆ బావి దగ్గర పాడుబడిన ఒక చేంతాడు కనపడుతుంది. ఈ తాడు తెగిపోయి ఉంది. కనుక నీళ్ళు తెండడానికి ఇది పనికి రాదు. కనుక అది ఇవ్వాలి అనుకుంటాడు. కానీ ఆలోచించి కనీసం కట్టెలు కట్టడానికైన తెగిన తాడు ఉపయోగపడుతుందని దాన్ని విడిచి పెడతాడు.

ఇంకాస్త ముందుకు పోతాడు. చిన్న రాళ్ళ గుట్ట కనపడుతుంది. రాయిని తీసికెళ్ళి ఇద్దాం అని తీసుకుంటాడు. ఇంతలో ఒక పిల్లవాడు వచ్చి అక్కడ ఉన్న రాయిని తీసుకుని ఆ రాళ్ళ గుట్టకు ఎదురుగా ఉన్న చింత చెట్టు చూసి చింత కాయల్ని కొడతాడు. అది పనికి వచ్చేదే అని విడిచి పెడతాడు..
కొంత దూరం పోయాక విరిగా కుండని దారిలో చూస్తాడు.. పగిలిన కుండ అసలు దేనికీ పనికిరాదు అని సంతోషంగా ఆ పెంకులు గురువుగారికి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇంతలో ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఆ పెంకు ముక్కల్ని తీసుకుని వెళ్తుంటే వాళ్ళని పిలిచి అవెందుకు మీకు అని అడుగుతాడు. మేము ఈ పెంకుముక్కళ్తో తొక్కుడు బిళ్ళ ఆట ఆదుకుంటాం అని జవాబు చెప్తారు. దానితో అది కూడా పనికి వచ్చేదే అని నిరాశగా విడిచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు అంతా వెతికి ఎక్కడా ఏమీ దొరకక నిరాశగా గురువు దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగుతాడు.
"గురువుగారూ మీ బోధనల ద్వారా నేను పూర్తి జ్ఞానం సంపాదించా అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది.. ఈ సృష్టిలో పనికిరాని వస్తువు ఏదీ ఉండదు. ప్రతి ఒక్కటీ ఏదో ఒక విధంగా ప్రతి జీవికీ అవసరమైనది. ఒకరికి అనవసరమైన వస్తువు మరొకరికి అవసరమైన వస్తువు అవుతుంది. ఈ విషయాన్ని నేను గ్రహించలేక అంతా తెల్సు అని గార్వపడ్డాను. నన్ను క్షమించండి అని గురువు పాదాలపై పడ్డాడు.

బదులుగా గురువుగారు " చూడు నాయనా ఇప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడివి అయావు. నేను జ్ఞాన బోధన మాత్రమే చేశాను. దాని ద్వారా మీరు జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలి.. ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడేలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. సమాజంలో నీకంటూ ప్రత్యేక స్థానం నువ్వు కలిగి ఉంటే అదే నాకు గురుదక్షిణ అని చెప్పి శిష్యుడిని పంపిస్తాడు.

గురువు మన నుండి ఏమీ ఆశించడు. మన విజయాన్ని తన విజయంలా భావించి మనకంటే ఎక్కువ సంతోష పడతాడు. అటువంటి గురువులకు మనం ఇవ్వగలిగే గురు దక్షిణ వాళ్ళు మనకు నేర్పిన విలువల్ని పాటించి సమాజంలో నిలబడటమే. అటువంటి గురువు మనం ఏం ఇవ్వాలని అనుకున్నా అది తక్కువే.. కనుక మనకు విద్య నేర్పిన గురు వులు ఎప్పుడు ఎక్కడ కనపడినా రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం.🙏



Source - Whatsapp Message

కర్మ - ఖర్మ

కర్మ - ఖర్మ

🤔 తలరాతని తప్పించుకోలేమా?
అసలు తలరాత అంటే ఏమిటీ?

ఆయుష్షు తీరో, జవసత్వాలుడిగో నశించిపోయిన భౌతిక శరీరాలు వారసత్వం భరించలేక మరోశరీరానికి కర్మల్ని బదిలీచేస్తాయి. శరీరాలు నశించిన కర్మశేషాలు నశించవు. వెన్నంటే వస్తాయి, వెంటాడుతునే ఉంటాయి. ఆ కర్మశేషాలనుభవించడానికి మరల మరల జన్మించడం.
మనకి ఆ కర్మశేషాలు గుర్తుండక పోవచ్చు కానీ, మరిచిపోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు. ఇదే విధి లేదా తలరాత లేదా లలాటలిఖితం.

కర్మలకు మరణం లేదు. మనిషి మరణించినా కర్మలు మరోజన్మకు పయనిస్తాయి. గతజన్మ కర్మలు కంటికి కనిపించవు. కానీ, ఈ జన్మలో అనుభూతమౌతాయి. పూర్వజన్మల కర్మబీజ ఫలాలే విధిరాతలు. గతజన్మల కర్మలశేషఫలంకు అంటే విధికి , నేటి కర్మల ఫలితంకు అనుసంధానింపబడి సాగుతుంది ఈజన్మ జీవనయానం.
సాధారణంగా కష్టకాలంలో లేదా దుఃఖ సమయంలో గాని, అనుకునేరీతిలో జీవనం సాగనప్పుడు, అనుకోని అవాంతరాలప్పుడు అనిపిస్తుంటుంది - ఇదంతా మన తలరాత అని. మనచేతిలో ఏదీలేదు, తలరాత ఎలా వుందో అలా జరుగుతుంది, తప్పించుకోలేమని భావిస్తాం. ఇదో నిరాశావాదం. ప్రారబ్ధమే మనిషిని నడిపిస్తే, అంతా విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏమీ లేదా? విధి చేతిలో మనం కీలుబొమ్మలమైతే ఇక మనం చేయగలిగింది ఏముందీ? ఇది నా తలరాత అని అనుకున్నంతకాలం ఆవేదన తప్పదు, నిరాశ వీడదు.

జన్మించిన ప్రతీజీవి విధికి తలవొగ్గక తప్పదు. కానీ, ప్రతిఒక్కరికి విధిని ఎదిరించేశక్తి వుంది. విధి బలీయమైనదే కావొచ్చు... కానీ, దానిని మార్చుకోవచ్చు... వజ్ర సంకల్పంతో, నిరంతర సాధనతో, అకుంఠిత భక్తితో. ఇందుకు ఉదాహరణంగా కొన్ని గాధలు గుర్తుచేసుకుందాం -

విధిరీత్యా అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడి, తన ఆత్మ విశ్వాసంతో, వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి - సత్యవంతుల కధ మనందరికీ విధితమే.
పదహారు ఏళ్ళు మాత్రమే ఆయుష్షు ఉన్న మార్కండేయుడు తన అకుంఠితభక్తితో యముణ్ణి జయించి, శివుని ఆశిస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా?
చదువునందు రాణించలేక, తను చెప్పింది అవగాహన చేసుకోలేకపోతున్న శిష్యుని హస్త సాముద్రికాన్ని పరిశీలించి, నాయనా! నీకు విద్యారేఖ లేదు, చదువుకునే యోగం లేదు, కాబట్టి నీవు తిరిగి నీ ఇంటికి వెళ్లి, తగిన వృత్తిని స్వీకరించడం మంచిదని చెప్పిన గురువుగారి మాటలకు మనస్సు భారమై, ఇంటికి బయలుదేరి, మార్గమధ్యంలో దప్పికై, ఓ రాతిగిలక బావి దగ్గర ఆగి, దాహం తీర్చుకుంటూ, తాడు ఒరిపిడికి అరిగిన ఆ రాతిగిలకను చూసి, బలహీనమైన తాడువల్ల రాయే అరగగా, నేను సాధనతో విద్యను ఆర్జించలేనా అన్న దృఢ నిశ్చయంకు వచ్చి, పదునైన రాతిముక్కతో చేతిపై విద్యారేఖను గీరుకోని, తిరిగి గురువు చెంతకు వెళ్ళి, నిరంతర సాధనతో అనతికాలంలోనే విద్యను అభ్యసించి, సంస్కృత వ్యాకరణం వ్రాసిన పాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా?

అందరం ఒకటి గుర్తుంచుకోవాలి - మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయం. విధిరాతలు స్వయంకృతం. స్వీయకర్మలే మన విధిరాతలు. అంటే మన విధిరాత విధాతలం మనమే. గతజన్మల కర్మశేషాలే నేటి విధిరాతలయినట్లు, నేటి కర్మలే మరుజన్మ విధిరాతలు. కర్మలు చేయడం అనివార్యం. ఆ కర్మలలో కొన్ని ప్రారబ్దాలుగా మూటకట్టుకోవడం నిజం. అవి అనుభవించడానికి జన్మించడం తప్పదు. ఇలా పుట్టడం ... గిట్టడం ... తప్పదా ఈ చక్రపరిభ్రమణం ... రాదా ముక్తి?
వస్తుంది ... ఎప్పుడు? గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు... ' స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః'
ఈశ్వరార్పణ బుద్ధితో, భగవత్ కైంకర్యబుద్ధితో కర్మలు చేస్తే జ్ఞాన మోక్ష సిద్ధులు ప్రాప్తమౌతాయి.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్ర మివామ్బసా
ఎవరు కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి, ఆసక్తి లేకుండా తన కర్మలు ఆచరిస్తారో, అటువంటి వారు నీటిచే అంటబడని తామరాకు వలె పాప ఫలితంచే ప్రభావితులు కారు.

ప్రతీ ఒకరు చింత చింతన వీడి సానుకూల దృక్పధం ఏర్పరుచుకోవాలి.

ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం కలిగి ఉండాలి.
సానుకూల భావం సాధనా సోపానం.
సంకల్పం దృఢమైతే సాఫల్యం సమక్షంలోనే.👍



Source - Whatsapp Message

గొప్పవాడు

గొప్పవాడు
- కొయిలాడ రామ్మోహన్‌రావు

గొప్పవాడు


‘నేనెందుకు ఈ ఇంట్లో పుట్టాను... నేను ఏం పాపం చేశాను? మా నాన్న డాక్టరో కలెక్టరో ఎందుకు కాలేదు? నేను ఎందుకిలా పేద కుటుంబంలో ఒక స్కూల్‌ టీచర్‌ ఇంట్లో పుట్టాను? నా స్నేహితులంతా ఏం పుణ్యం చేశారని గొప్పగొప్ప కుటుంబాలలో పుట్టారు?’ అని అనుకోని రోజు లేదు నా జీవితంలో.
నా స్నేహితుల తండ్రులంతా గొప్ప గొప్ప ఉద్యోగాలో వ్యాపారాలో చేస్తున్నారు. నాకు మెరిట్‌ మీద గొప్పవాళ్ళు చదివే స్కూల్లో సీటు వచ్చిందిగానీ, లేకపోతే గవర్నమెంటు స్కూల్లో చదవాల్సిన దౌర్భాగ్యం పట్టేది. చదువులో నేనెప్పుడూ ఫస్టే. నాకున్న తెలివితేటలవల్లే నా ఫ్రెండ్స్‌ అంతా నన్ను ఎప్పుడూ వదలరు. చదువులో వాళ్ళ సందేహాలన్నీ తీరుస్తూ వాళ్ళకు బాగా దగ్గరయిపోయాను. వాళ్ళు నాకు గిఫ్ట్‌లూ బొమ్మలూ చాక్లెట్లూ బిస్కెట్లూ ఇవ్వడానికి పోటీపడుతూ ఉంటారు. అలా మా నాన్న కొనిపెట్టలేనివన్నీ నా తెలివితేటలతో సంపాదించుకుంటున్నాను. అయినా నాకెంతో అసంతృప్తి. ‘ఇవన్నీ నేనే ఎందుకు సంపాదించుకోవాలి? ఇద్దరక్కలతో సరిపెట్టుకుని ఉండొచ్చు కదా? సరైన సంపాదన లేనప్పుడు నన్నెందుకు కనాలి?’ అని తరచుగా అనుకుంటూ బాధపడుతూ ఉంటాను. ‘వచ్చే జన్మలో నాకిలాంటి నాన్న వద్దు, ఈ పేదరికమూ వద్దు. గొప్పవారింటిలోనే పుట్టాలి’ అనుకుంటూ ఉంటాను చాలాసార్లు.
ఇలా ఆలోచించుకుంటూ మా ఇంటికి ఎదురుగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌ వైపు చూశాను. సరిగ్గా అప్పుడే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ దేవరాజ్‌ బయటకు వచ్చి సిగరెట్‌ కాల్చుకుంటున్నాడు. ఆ సీన్‌ నేను రోజూ చూసేదే. రోజూ అతనలా బయటకు రావడం, ఒక పోలీసు వచ్చి సిగరెట్‌ ముట్టించడం, అతను దర్జాగా పచార్లు చేస్తూ సిగరెట్‌ కాల్చడం వంటి సీన్‌ చూడడం నాకు అలవాటైపోయింది. అప్పుడప్పుడూ అతనికి కాఫీయో, టీయో అందిస్తుంటే, అతను విలాసంగా తాగుతూ పచార్లు చేస్తుంటే, దారిన వెళ్ళేవాళ్ళు వంగి వంగి దణ్ణాలు పెడుతున్నప్పుడూ పోలీసులు చాలా గౌరవంగా సెల్యూట్‌ చేస్తున్నప్పుడూ ‘అబ్బా, ఇతనిదెంత గొప్ప ఉద్యోగం... నేను కూడా పెద్దయ్యాక పోలీస్‌ ఆఫీసర్ని అవుతాను’ అనుకునేవాడిని.
ఇలా ఆలోచిస్తుండగా చల్లగాలి నన్ను తాకింది. ఇదేమీ నాకు కొత్త కాదు. మా ఇంట్లోకి రాదుగానీ, ఇంటి నుంచి బయటకొస్తే మాత్రం గాలి ఎప్పుడూ వీస్తూనే ఉంటుంది. కానీ ఈసారి గాలి నన్ను తాకినప్పుడు చాలా విచిత్రమనిపించింది. నన్ను తాకిన గాలి, అంత విసురుగా లేకపోయినా, దాని తాకిడికి నేను పైకి తేలిపోతున్నట్లు అనిపించింది. అనిపించడమేమిటి... నిజంగానే తేలిపోతూ, అలా అలా ఇన్‌స్పెక్టర్‌ దగ్గరదాకా వెళ్ళిపోయాను. అయితే, అతను నన్ను గమనించలేదనుకుంటా... సీరియస్‌గా సిగరెట్‌ కాల్చడంలో మునిగిపోయాడు. ఇంకాస్త దగ్గరకు పోయినా, అతనిలో చలనం లేదు. అంత దగ్గరగా అతన్ని చూడటం నాకదే మొదటిసారి. దగ్గర్నుంచి చూస్తే పెద్ద సినిమా విలన్‌లా కనిపించాడు- నేనొక హీరోలా ఆరాధించే దేవరాజ్‌. అతనికి ఇంకా దగ్గరయి మీద పడిపోతున్నాను ఇప్పుడు. గాలి నన్ను తోసేస్తోంది. దేవరాజ్‌ నన్ను కొట్టేస్తాడేమోనని విపరీతంగా భయపడిపోయాను.
ఆశ్చర్యం! నేను అతనిమీద పడిపోయినా అతనిలో ఏ చలనమూ లేదు. ఏమీ జరగనట్లే తన పనిలో తానున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ, ఎవరో జాగ్రత్తగా దించినట్లు మెల్లగా కిందకు దిగాను.
ఏం జరుగుతుందో నాకేమీ అర్థంకావడం లేదు. భయం భయంగా అటూ ఇటూ చూశాను. ఎవరూ కనబడలేదు. ‘నన్నెవరు - గాలిలో అలా అలా తిప్పి, నేలమీదకు దించారు? ఇది కలా నిజమా?’ అనుకుంటూ బెంబేలెత్తిపోయాను. భయంతో ఇంట్లోకి పరిగెత్తాలని ప్రయత్నించాను. ఊహూ... సాధ్యం కాలేదు. నన్నెవరో పట్టి ఆపుతున్నట్లు అనిపించింది. గింజుకున్నా అంగుళం కూడా కదలలేకపోయాను. ఏడవడం మొదలుపెట్టాను.
దేవరాజ్‌ నా పక్కనే ఉన్నాడుగానీ, నేను ఏడవడం అతనికి పట్టినట్లు లేదు. నేనక్కడున్నట్లు కూడా తెలియనట్లే ప్రవర్తిస్తున్నాడు. ‘ఏయ్‌ ఏడవకు. నీకేమీ కాదు’ అన్నారెవరో. భయం భయంగా అటూ ఇటూ చూశాను. ఎవరూ కనబడలేదు.
‘‘ఎవరు? ఎవరు?’’ అని అన్నివైపులా చూస్తూ భయంగా అరిచాను. అయినా దేవరాజ్‌లో ఏ రియాక్షనూ లేదు.
‘‘ఏయ్‌ కిరణ్‌... భయపడకు. నీకేమీ కాదని చెబుతున్నాను కదా’’ అని చిరాగ్గా అన్నారెవరో.
మాటలు వినబడుతున్నాయిగానీ, ఎవరు మాట్లాడుతున్నారో తెలియకపోవడంతో నా భయం ఇంకా పెరిగింది. మళ్ళీ గాలి నన్ను తాకింది. ఈసారి అది విసురుగా లేదు...
చల్లగా సుతారంగా హాయిగొలిపేలా ఉంది.
‘‘భయపడకు. నేను గాలిని. నీ కొత్త నేస్తాన్ని’’ అంటూ ఎవరో మెల్లగా మాట్లాడటం వినిపించింది. షాక్‌ తిన్నాను.
‘‘గాలా..!’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘అవును గాలినే’’ అంటూ సమాధానం వచ్చింది.
‘‘గాలి మాట్లాడుతుందా? నేను నమ్మను. నువ్వు దెయ్యానివో భూతానివో లేదా ఆత్మవో అయి ఉంటావు’’ అన్నాను కొంత ధైర్యం తెచ్చుకొని. చిన్నగా నవ్వు వినిపించింది.
‘‘నేను కాదు, నువ్వే ఆత్మవి’’ అంటూ మళ్ళీ నవ్వు వినిపించింది. నాకు కోపం వచ్చింది. దాంతో కొంత ధైర్యమూ వచ్చింది.
‘‘నేను ఆత్మనేమిటి? నిక్షేపంలా బతికున్న వారినెవర్నయినా ఆత్మ అంటారా?’’ అంటూ విసుగ్గా అరిచాను.
‘‘నా మాట నమ్మవు కదా, సరే... పద’’ అంటూ గాలి నన్ను మా ఇంటివైపు తోసింది. దాంతో ఇంట్లోకి వచ్చి పడ్డాను.
ఇంట్లో అమ్మా నాన్నా ఒక మూలన కూర్చుని ఏడుస్తున్నారు. అక్కలిద్దరూ బిక్కుబిక్కుమంటూ వాళ్ళనే చూస్తున్నారు. చాలాసేపట్నుంచి ఏడుస్తున్నారు కాబోలు అందరి కళ్ళూ ఎర్రబడి, ఉబ్బిపోయి ఉన్నాయి. పిన్నీ, బాబాయీ అమ్మా నాన్నలను ఓదారుస్తున్నారు. అమ్మ కాస్త తేరుకుందిగానీ, నాన్న అలా ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళెందుకు ఏడుస్తున్నారో అర్థంకాలేదు. అలా తికమకపడుతుండగా నా దృష్టి వాళ్ళ పక్కనే ఉన్న ఒక స్టూల్‌పై పడింది. దానిమీద దండ వేసిన నా ఫొటో ఉంది. షాక్‌తో నా బుర్ర గిర్రున తిరిగింది.
‘మై గాడ్‌... నేను చచ్చిపోయానా?’ అని మనసులో అనుకుంటున్న మాటలు తెలిసిపోయినట్లున్నాయి. గాలి మళ్ళీ మాట్లాడింది.
‘‘నేను చెబితే నమ్మలేదు కదా... ఇప్పుడు ఒప్పుకుంటావా నువ్వే ఆత్మవని?’’ అంటూ ప్రశ్నించింది.
‘‘ఒప్పుకుంటాను. మరి నేను ఎలా చనిపోయాను... నీకేమైనా తెలుసా?’’ అని అడిగాను ఏడుస్తూ.
‘‘ఓ... నీకు గుర్తులేదా? నిన్న నీ స్నేహితులతో స్విమ్మింగ్‌పూల్‌కి వెళ్ళావు కదా... వాళ్ళు నీకు ఈత నేర్పుదామని ప్రయత్నిస్తుండగా, నువ్వు నీటిలో మునిగి చనిపోయావు’’ అని అంటుంటే, నాకు ఆ సంఘటన గుర్తువచ్చింది. నీటిలో మునిగిపోతూ ఊపిరి ఆడక కొట్టుకోవడం వరకూ గుర్తుంది.
ఆ తర్వాత ఏమైందో ఇప్పుడే తెలిసింది.
‘అయ్యో, పదేళ్ళకే నాకు నూరేళ్ళు నిండిపోయాయా?’ అనుకుంటూ బాధపడ్డాను.

గొప్పవాడు

ఆపకుండా ఏడుస్తున్న నాన్నను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. ‘నాన్నకు నా మీద ఇంత ప్రేముందా?’ ఇది నేనెన్నడూ ఊహించని విషయం. ‘స్ట్రిక్ట్‌ మిలటరీ డిసిప్లిన్‌తో హిట్లర్‌లా ఉండే మా నాన్నేనా ఇలా చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నది?’ అనుకోగానే నా మనసెంతో విలవిలలాడింది. నాకు ఊహ తెలిసి నాన్నెప్పుడూ నాతోగానీ అక్కలతోగానీ అమ్మతోగానీ ప్రేమగా మాట్లాడటం చూడలేదు. ఆయన ప్రేమనంతా మనసులోనే దాచేసుకుంటున్నారని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇన్నాళ్లూ నాన్నను అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడ్డాను. ‘ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం?’ అనుకోగానే మనసంతా చేదుగా అయిపోయింది. నాన్నను ఓదార్చాలనీ ఆయన కన్నీరు తుడవాలనీ నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిరాశగా వెనుదిరిగాను.
‘‘పద, అలా తిరిగొద్దాం. నీ మనసు తేలిక అవుతుంది’’ అంది నా కొత్త నేస్తం. నా ప్రమేయం ఏమీ లేకుండా గాలిలో తేలిపోయాను. ఎక్కడికెళ్తున్నామో తెలియలేదు. అడగాలని కూడా అనిపించలేదు. దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించి, ఒక ఇంట్లో దిగాను గాలితో. ఇల్లు కాదది... పెద్ద భవంతి.
డైరెక్ట్‌గా లోపలి హాల్లోకి వెళ్ళాం. అక్కడ దేవరాజ్‌ వినయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతన్నెప్పుడూ అలా చూడలేదు. అతనికి ఎదురుగా సోఫాలో కూర్చుని దర్జాగా కాళ్లు ఊపుతున్న పెద్దమనిషి ఒకడు కనిపించాడు.
‘‘ఎవరితను? దేవరాజ్‌ ఎందుకిలా పిల్లిలా అయిపోయాడు?’’ అని ప్రశ్నించాను కనబడని గాలిని. వెంటనే సమాధానం వచ్చింది.
‘‘అతని పైఅధికారి ఎస్పీ దామోదర్‌’’ అంటూ.
‘ఓహో... ఈ ఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ కన్నా గొప్పవాడన్నమాట’ అనుకున్నాను.
‘‘అయితే, డాక్టర్‌ సంజీవ్‌ అపాయింట్‌మెంట్‌ దొరకలేదా... ఏం, అంత బిజీ డాక్టరా?
నా గురించి చెప్పలేదా?’’ అంటున్న దామోదర్‌ మాటల్లో దర్పం తొంగిచూస్తోంది.
‘‘ఆ డాక్టర్‌ ఎవరనుకుంటున్నారు...మనమంటే భయపడడానికి? ఆయన ఐజీ గారి అల్లుడు’’ అని వినయంగానే అన్నాడు. ఆ మాటలు విన్న దామోదర్‌కి బుర్ర గిర్రున తిరిగినట్లుంది.
‘‘ఐజీ అంటే చాలా పెద్ద పోలీస్‌ అధికారి’’ అని గాలి చెబితే, ‘‘ఆయన ఎస్పీకన్నా గొప్పవాడన్నమాట.
నాకు అతన్ని చూడాలని ఉంది, చూపిస్తావా?’’ అంటూ ఆశగా అడిగాను.
‘‘ఓ... దానికేం భాగ్యం?’’ అంటూ నన్ను ఎత్తుకుని పరుగు తీసింది గాలి. పావుగంట తర్వాత ఐజీ బంగళాకు వెళ్ళాం. ఇంద్రభవనంలా ఉంది ఆ బంగళా.
‘‘ఇదేమిటి... ఇక్కడ ఇన్ని కార్లున్నాయి.

గొప్పవాడు

ఐజీ ఇంట్లో ఎంతమంది ఉంటారేమిటి?’’ అని అడిగాను కుతూహలంగా.
‘‘నాకూ అదే అనుమానం వచ్చింది. ఇక్కడ ఇన్ని కార్లు ఉండే అవకాశమే లేదే, ఎందుకిన్ని కార్లున్నాయి ఇక్కడ? ఓ... ఇక్కడి కార్లలో సగం ఇన్‌కమ్‌టాక్స్‌ వాళ్ళవే. ఏదో రైడ్‌ జరుగుతున్నట్లుంది. లోపలికెళ్ళి చూద్దాం పద’’ అంది గాలి.
‘‘అదిగో అక్కడ తెల్లబట్టలేసుకుని మొహం మాడ్చుకొని ఉన్నాడే... అతనే ఐజీ ప్రకాశరావు’’ అని చెప్పగానే అటు చూశాను కుతూహలంగా.
‘‘ఇదేమిటి? ఇతను ఎస్పీకన్నా డాబుగా దర్జాగా ఉంటాడనుకున్నాను. మా స్కూల్లో అటెండర్‌కన్నా వినయంగా నిల్చున్నాడేమిటి?’’ అంటూ ఆశ్చర్యంగా అడిగాను.
‘‘నువ్వు ఊహించింది కరెక్టే. మామూలు రోజుల్లో అయితే అతని గర్వానికి అంతుండేది కాదు. ఇప్పుడు ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్ల వలలో చిక్కాడు. అక్రమంగా బోలెడు డబ్బు సంపాదించి ఇలా దొరికిపోయాడు’’ అని గాలి అంటుండగా, ఎవరూ చూడకుండా ఐజీ, కమిషనర్‌ కాళ్ళమీదపడి బతిమాలుతున్నాడు.
‘ఓర్నీ... ఐజీయే గొప్పవాడనుకుంటే, ఈ కమిషనర్‌ ఇంకా గొప్పవాడన్నమాట’ అనుకున్నాను.
ఐజీ ఎంత బతిమాలినా ఫలితం లేదు. చకచకా పని పూర్తిచేసుకుని బయల్దేరాడు కమిషనర్‌. గాలి నన్ను కమిషనర్‌ కార్లో కూర్చోబెట్టింది. ఎందుకని నేను అడగలేదు. నాకు పనేమీలేదు కదా, ఇదొక కాలక్షేపంలా ఉంది.
ఊహించని విధంగా మేము కమిషనర్‌తోపాటు సీఎం ఛాంబర్‌లోకి ప్రవేశించాం. కమిషనర్‌కి ముఖ్యమంత్రి దగ్గర బాగా పరపతి ఉన్నట్లుంది.
ఏ అడ్డూ లేకుండా అతను సీఎంను తొందరగానే కలవగలిగాడు.
‘‘సో... మీ మొదటి అడుగే జయప్రదం అయిందన్నమాట. కంగ్రాచ్యులేషన్స్‌. నల్లడబ్బు బాగా దొరికినట్లుంది? ప్రకాశరావు ఎంత నీతిపరుడిలా నటించేవాడు! ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేం. ఇదే స్ఫూర్తితో ముందుకు దూసుకుపోండి. ఇంకా పెద్ద అవినీతి తిమింగలాలను పట్టాలి మనం’’ అని సీఎం ప్రశంసిస్తుంటే కమిషనర్‌ వినయంగా నమస్కరిస్తున్నాడు థాంక్స్‌ చెబుతూ.
‘సీఎం అందరికన్నా గొప్పవాడన్నమాట’ అనుకున్నాను. సీఎం, కమిషనర్‌ ఏవో విషయాలు మాట్లాడుకుంటుంటే ‘ఇక బయల్దేరుదాం’ అని గాలితో చెబుదామనే లోపల ‘‘ఏమైంది? నిన్న పార్వతీశం మాస్టారు రాలేదా? ఆయనెప్పుడూ మానేయలేదు కదా? ఏమైందో కనుక్కున్నారా?’’ అంటూ సీఎం అడుగుతుంటే కంగుతిన్నాను. మా నాన్న పేరు కూడా పార్వతీశమే.
‘‘వాళ్ళ అబ్బాయి ఈతకని వెళ్ళి ప్రమాదవశాత్తూ చనిపోయాడట. అందుకే...’’ సెక్రటరీ ఆ వాక్యం పూర్తిచేయకుండానే ‘‘వ్వాట్‌?’’
అంటూ అప్రయత్నంగా పైకి లేచాడు సీఎం. దాంతో కమిషనర్‌ కూడా గాభరాపడుతూ లేచినిలబడి, ‘‘ఎవరు సార్‌, ఈ మాస్టారు?’’
అని అడిగాడు కుతూహలంగా.
‘‘పార్వతీశం గారు నాకు చదువు చెప్పిన రామేశం మాస్టారి అబ్బాయి. ఆ మాస్టారివల్లే నేను బాగా చదువుకుని ఈ స్థాయి కొచ్చాను. మా అబ్బాయి ‘హరి’ చదువులో వెనకబడితే ఎంత మంచి టీచర్లతో కోచింగ్‌ ఇప్పించినా ఫలితం లేకపోయింది. పార్వతీశం మాస్టారి పాఠాలు మాత్రం వాడి బుర్రకెక్కాయి. ఆయన ఎంత గొప్పవాడంటే... ఏనాడూ... ప్రతిఫలంగా నా దగ్గరనుంచి నయా పైసా తీసుకోలేదు. ఏరోజూ నా పరపతిని వాడుకోలేదు. ‘అన్ని దానాలకన్నా విద్యాదానం గొప్పది. విద్యను అమ్ముకోకూడదు’ అనేవారు. తను నా కొడుక్కి ట్యూషన్‌ చెబుతున్నట్లు కనీసం తన భార్యకు కూడా చెప్పకుండా దాచారు. ఆ విషయం తెలిస్తే ఆమెగానీ ఆమె బంధువులుగానీ నా పరపతిని వాడుకుంటారేమోనని ఆయన భయం. సెక్రటరీ గారూ... పదండి మనం వెంటనే మాస్టారింటికి వెళ్ళాలి’’ అంటూ హడావిడి పడుతుంటే, నాకు ఏడుపు ఆగలేదు. పశ్చాత్తాపంతో నేను కుమిలి కుమిలి ఏడుస్తుంటే, గాలి నన్ను ఓదార్చినట్లు, నా చుట్టూ అలుముకుంది.
‘‘నీకు ఈ విషయం తెలియాలనే ఇంత వరకూ తీసుకొచ్చాను. నీకిప్పుడు అర్థమైంది కదా, గొప్పవారెవరో? ఇంతకాలం నీకు మీ నాన్న గొప్పతనం తెలియలేదు కదా. నీ తెలివితేటలకు ఇన్నాళ్ళూ గర్వపడుతున్నావు కదా- అవి నీకు ఎలా వచ్చాయి? మీ నాన్న జీన్స్‌ నుంచీ మీ నాన్న నీకు చెప్పిన చదువునుంచీ ఆయన నీకిచ్చిన ట్రైనింగ్‌ నుంచీ... కాదంటావా?’’ అని అడిగితే ఏడుస్తూ తలూపాను.
‘‘బహుశా, మీ నాన్న గొప్పతనం నువ్వు తెలుసుకోవడానికే దేముడు నిన్ను ఇంతవరకూ ఆత్మగా ఉంచాడు. ఆ పని అయిపోయింది కదా, నువ్విప్పుడు శాశ్వతంగా విశ్వంలో కలిసిపోతావు. త్వరలోనే మరో జన్మ ఎత్తుతావు. మరి, వచ్చే జన్మలో ఏమవ్వాలని కోరుకుంటావు?’’ అని అడగ్గానే, క్షణం కూడా ఆలోచించకుండా ‘‘టీచర్‌’’ అన్నాను.

(వృత్తే దైవంగా భావించే ఉపాధ్యాయులందరికీ ఈ కథ అంకితం)

Source - Whatsapp Message

పెళ్లంటేనూరేళ్లు

పెళ్లంటేనూరేళ్లు

🙏తాళాలు, తప్పట్లు, పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడు ముళ్లు, బంధువుల సందడి ఇది భారతీయ హిందూ సంప్రదాయ పెళ్లి. ఇల్లంతా పచ్చటి తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల కోలాహలంతో.. పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి చెప్పనక్కరలేదు. చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు వధువు, వరుడు.



పవిత్రంగా భావించే హిందూ సంప్రదాయ పెళ్లిలో చాలా విశిష్టతలున్నాయి. చాలా ఆచారాలు, సందప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం వెలుతులో కొత్తజీవితాన్ని ఆహ్వానిస్తున్న వధూవరులు.. పెళ్లికి పరమార్థం చెప్పే వేదమంత్రాలు.. శ్రావ్యంగా వినిపించే మంగళవాయిద్యాలు.. మనస్పూర్తీగా దీవించే పెద్దలు.. అందరికీ ఆహ్వానం పలికే పచ్చటి పందిరి.. ఘుమఘుమల సువాసనలతో నోరూరించే విందు భోజనం.. అన్నింటి మేళవించే.. తెలుగింటి పెళ్లి వైభోగం. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలంటే.. అయితే పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్ధానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది.
హిందూ సంప్రదాయానికి అద్దంపట్టే తెలుగు పెళ్లిలోని విశేషాలు, వాటి విశిష్టతలు ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకుందాం..

బాసికంపెళ్లిఅంటేయేమిటి ?

ముందుగా వధూవరుల అలంకరణకు ఖచ్చితంగా ఉపయోగించేది బాసికం. వధూవరుల నుదుటిపై కాంతులీనే ఆభరణమే బాసికం. దీన్ని పూలతో, బియ్యపు గింజల కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. దీన్ని పెళ్లి సమయంలో ఖచ్చితంగా వధూవరులు కట్టుకోవాలి. ఎందుకనే డౌట్ అందరికీ ఉంటుంది. దృషి దోష నివారణకు బాసికాన్ని కడతారు. సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి బాసికాన్ని కడతారు.

జీలకర్ర, #బెల్లం

జీలకర్ర, బెల్లం కలిపితే ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి కలుగుతుందని సైన్స్ చెబుతోంది. జీలకర్ర, బెల్లం పెట్టడం వల్ల తలపై ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలాగే జీలకర్ర, బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది. అలా వధూవరులు కూడా కలిసిపోవాలని పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.

వధూవరుల మధ్యలో తెర మధ్యలో ఉంచే తెరకు కూడా అర్థం ఉంది.

వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు పరమాత్మ దర్శనం కావాలంటే మాయను తొలిసారి తలపై చేతులు ఉండగా భ్రూమధ్య స్థానంలోనే చూస్తారు. ఇలా వాళ్ల బంధం బలపడుతుందని అర్థం.

కన్యాదానం దానం చేస్తే ఆ వస్తువుతో మనకు అన్ని సంబంధాలు తెగిపోతాయి.

కానీ పెళ్లిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది కన్యాదానం. పెళ్లికూతురి తండ్రి తన కూతురిని వరుడికి దానం ఇస్తారు. పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ, అర్థ, కామ, మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు వధువు తండ్రి. ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని కోరుకున్నట్లు. బ్రహ్మముడి వధువ చీర అంచును, వరుడి ఉత్తరీయం చివరలను కలిపి ముడి వేయటం అంటే జీవితాంతం ఆశీస్సులను, బ్రాహ్మణాశీర్వచనాలను దంపతుల కొంగులతో ముడివేయటమే. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి వేయిస్తారు.

ఉంగరాలు తీయటం పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం వధూవరులతో పాటు.. చుట్టూ ఉన్న వాళ్లందరికీ చాలా సరదా. చూడటానికి చాలా సరదాగా కనిపించే తంతు ఇది.

పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది.

మంగళసూత్రం సూత్రంఅంటేదారం.

మంగళప్రదమైంది కనుగ మంగళ సూత్రం. ఇది వైవాహిక జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వరుడు, వధువు మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు. మూడు ముళ్లే ఎందుకు ? మనకు మూడుతో విడదీయరాని సంబంధం ఉంది. త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలా మూడుకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి ముడులు కూడా మూడు ఉన్నాయి. అలాగే మనకు స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల శరీరం ఉన్నా, లేకున్నా వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం.

మాంగళ్య ధారణ సమయంలో మంత్రం మాంగళ్యధారణ సమయంలో చదివే మంత్రానికి చాలా విశిష్టత ఉంది.

మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభగే త్వంజీవ శరదాం శతమ్.

అంటే నా జీవితానికి కారణమైన ఈ సూత్రంతో నేనే నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను. నీ మెడలోని మాంగల్యంతో నీవు శత వసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నా జీవితం, నా జీవనగమనం ఈ మాంగళ్యంపైనే ఆధారపడి ఉందని అర్థం.

తలంబ్రాలు-తలంబ్రాలు

వివాహంలో ముఖ్య ఘట్టం. వధూవరుల భావి జీవితం మంగళమయం కావటానికి మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు. వీటికి వాడేవి అక్షతలు.

(అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం.)

ఇక దానికి బియ్యాన్నే ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని వాడతారు. పాణిగ్రహణం కన్యచేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం. వరుడు తన కుడి చేతితో వధువు కుడిచేతిని పట్టుకోవటాన్ని పాణిగ్రహణం అంటారు. ఇకపై నేనే నీ రక్షణ భారం వహిస్తానని సూచించటానికి,

(పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయిపైకి ఉండేలా చేయి పట్టుకోవాలి.)

దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా ఇంటికి రమ్మని ఆహ్వానించటం.

హోమం పవిత్రమైన అగ్ని మనిషికి, దేవునికి వారధిగా ఉంటుంది
హోమం చుట్టూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు అంగీకరిస్తున్నట్టు అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడు సార్లు తిరుగుతారు.

ఏడుఅడుగులపరమార్థం

భార్యా భర్తలు ఇద్దరు కలిసి వేసే ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి అర్థం ఉంది. ఇద్దరు కలిసి సంసార బాధ్యతలు తీసుకుంటామని, ఇద్దరం ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని, ఇద్దరం కలిసి కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని, కష్టసుఖాలలో కలిసి ఉంటామని, ఇద్దరు కలిసి పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని, ఇద్దరం కలిసి సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతామని, జీవితాంతం పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు.

నల్లపూసలుధరించేదిఎందుకు

మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా ఉండటానికి ధరిస్తారు. అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.

భార్య, భర్తకు ఏ వైపు ఎలాంటి కార్యాలలోనైనా భర్తకు భార్య ఎడమ వైపునే ఉండాలన్నది నియమం.

పూజలు, దానాలు, ధర్మాలు చేసేటప్పుడు భార్య, భర్తకు ఎడమవైపునే ఉండాలి.

కన్యాదానం, విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడి వైపున ఉండాలి.

కాలితోబియ్యంనెట్టడంఎందుకు ?

కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో కాలుపెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. లక్ష్మీ నివాసముండే వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశంను గడపపై ఉంచుతారు. ఇలా దీన్ని ఇంట్లోకి నెట్టుతూ లోపలికి పెళ్లికూతురు వస్తే లక్ష్మీదేవినే ఆ ఇంట్లోకి తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం. ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం వస్తుందని నమ్మకం.🙏



Source - Whatsapp Message

Wednesday, August 19, 2020

మహా ప్రపంచంలో నాటి దేశాల పేర్లు...నేటి వాడుక పేర్లు

మహా ప్రపంచంలో నాటి దేశాల పేర్లు...నేటి వాడుక పేర్లు

భరత ఖండం...భారత
త్రై విష్ఠనమ్...టిబెట్
బ్రహ్మ......బర్మా
నేపాళం.....నేపాల్
కాంభోజ.....కంబోడియా
సింహపురం...సింగపూర్
జప...........జపాన్
ఋషి........రష్యా
హరివర్షపం.....ఐరోపా
ధనమార్గ........డెన్మార్క్
శర్మన్ ణ్.....జర్మనీ
సుయోధన్.....స్వీడన్
అగ్నిఖండ్...ఇంగ్లాండ్
యుగంధర......యుగాండా
నవార్క........న్యూయార్క్

కళాపూర్ణ / కపీలారణ్య...కాలిఫోర్నియా
(ఒకప్పుడు కపిల మహర్షి ఆశ్రమం)

అర్కవలయం...ఆర్కిటిక్
(ఎటు చూసినా తెల్లని వలయకారంలో ఉంటుంది)

ఆర్కోధది..... ఆర్కిటిక్ సముద్రం
(తెల్లని నీరున్న సముద్రం)

ప్రశాంతో ధది...పసిఫిక్
సముద్రము (అనగా ఎల్లప్పుడూ ప్రశాంతంగా వుండునది)

ఆర్ఘ్య (ఆర్య) ఖండము ....ఆసియా ఖండము. (అనగా ఆర్యులు నివసించినది)

హిందూ దేశము....ఇండియా
ఆశ్వాకాయన ...ఆఫ్ఘనిస్తాన్
( అప్పట్లో గుఱ్ఱములు ఎక్కువగా కల దేశము)

మంగళాయ.... మంగోలియా
ఆర్యన్.......ఇరాన్
మఖ........మక్కా
మేదిని........మదీనా
లాస్మాంజల.....లాసేంజిల్స్
అస్త్రాలయా....ఆస్ట్రేలియా
(ఒకప్పుడు రావణాసురుడు తన దివ్య అస్త్రాలను రహస్యముగా దాచి ఉంచిన దేశము)

నవజయఖండ... న్యూజిలాండ్
బ్రాహ్మఅంగము... బర్మింగ్హామ్
అజపతి......ఈజిఫ్ట్.
పాతాళదేశము...అమెరికా
(భారత దేశమునకు వ్యతిరేకంగా పాతాళం వైపున ఉన్నది)

భీష్మాఆర్కా....బిస్మార్క
కన్యా.....కెన్యా
మాయాదేశము..మెక్సికో
అతులాంతకోధది...అట్లాంటిక్ సముద్రము
రత్నాకరము....అరేబియా సముద్రము.
మహాద్వీపము...ఆసియా,ఐరోపా ఖండాలు కలిపి మహా ద్వీపముగా పిలువబడ్డాయి.

(ఆగస్టు1947 తర్వాత ఏర్పడ్డ దేశం కాబట్టి పాకిస్థాన్ ఆ తర్వాత పుట్టిన దేశము కావున దానికి అంత ప్రత్యేకత లేదు, భారత దేశంలో అంతర్భాగమే)

సేకరణ :-
జి.టి.శ్రీనివాస్ ఆచార్యులు
మాజీ సైనికుడు
విజయనగరం
ఫోన్ : 9493688414

Source - Whatsapp Message

conditioning

ఊర్లలో, కొత్తగా ఇంటికి తీసుకొచ్చిన కోడిని ఇంటి ఆవరణకు అలవాటు చేయడానికి, ఒక వారం రోజుల పాటు, ఒక గుంజేకు(కర్రకు) తాడుతో కట్టేస్తారు, తర్వాత దాన్ని విడిచిపెట్టిన ఊరు మొత్తం తిరిగి తిరిగి చీకటి పడే ముందు అదే ఇంటికి వచ్చి గంప చుట్టూ తిరుగుతది కానీ పారిపోదు ఎందుకంటే దాన్ని అలా conditioning చేశారు. ఎంత అంటే పంజరంలో ఉన్న చిలుక ఎగురుతున్న పక్షుల్ని చూసి వాటికి ఏదో రోగం వచ్చింది కావొచ్చు అనుకునే అంత conditioning చేస్తారు.అదే విధంగా ఒక ఏనుగు ఎంత పెద్ద వృక్షమైన విరగొట్టే అంత బలం గలిగి ఉంటుంది, కానీ దాన్ని ట్రైన్ చేసిన మవాటి ఒక చిన్న కట్టెకు కట్టిన సరే అది తెంపుకొని పారిపోదు, ఆ ఏనుగుని పుట్టినప్పటి నుండి అలా కండిషనింగ్ చేస్తారు కాబట్టి.

Ex:- సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు బాగా ఫాలో అయ్యే ఒక మహిళ, ఎవరైనా న్యూ జనరేషన్ అమ్మాయి మోడరన్ గా తనకు నచ్చినట్టు తాను బ్రతికితే బరితెగించి బ్రతుకుతుంది అంటారు, కానీ వారు మాత్రం అందమైన పంజరంలో జీవిత ఖైదు అయ్యాము అని మాత్రం ఒప్పుకోరు..

అదే విధంగా Western countries లో,కొత్తగా ఇంటికి తెచ్చిన కుక్కను కొన్ని రోజుల పాటు ఇంటి ఆవరణలో ఒక fence వేసి పెడతారు, తర్వాత ఆ కుక్క ఆ (fence) కంచె దాటి వెళ్లే ప్రయత్నం life లో చేయదు, దీనే habitual conditioning అంటారూ. అలాగే ఒక ఏనుగు కావొచ్చు, ఎద్దు కావొచ్చు, గుర్రం కావొచ్చు ఒక చిన్న తాడుతో కట్టిపడేస్తే అక్కడే పడి ఉంటాయి కానీ సంకెళ్ళు తెంచుకుని ముందుకు వెళ్లలేవు దీనే psychological conditioning అంటారు.

ఇలా మనుషులు కూడా పుట్టి పెరుగుతున్న టైంలో ఆల్మోస్ట్ అన్ని ఆచార వ్యవహారాల్లో conditioning చేయబడుతారు,

Ex:- ఒక ముస్లిం కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన మతమే గొప్ప, అల్లా మాత్రమే దేవుడు అనుకుంటాడు, అదే విధంగా హిందు లేదా ఇతర మతల్లో పుట్టిన వాడు తన దేవుడే గొప్ప తన మతమే గ్రేట్ అనుకుంటాడు. ఇలా వారిని వారి చుట్టూ పక్కల ఉన్న సమాజం, కుటుంబం, ఆచారాలు, పరిసరాలు అన్ని నిరంతరం conditioning చేస్తుంటాయి, at the end of the day వారు నేర్చుకున్నది నిజం, మిగతాది అబద్ధం లేదా అవాస్తవం అని అనుకుంటారు కానీ నిజాన్ని ఒప్పుకోరు.

Ex:- ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లేదా బాలయ్య ఫ్యాన్ లేదా ఇంకో హీరో అనుకుందాం అసలు ఆ వ్యక్తి వీళ్లకు ఎందుకు ఫ్యాన్ అనే విషయం వాడికి కూడా సరిగ్గా తెలీదు బట్ చుట్టు పక్కన ఉన్నవారిని చూసి అనుకరిస్తాడు ఒకవేళ అలా చేయకపోతే వాడు తేడా అని ముద్ర పడుతుంది, కనుక, వీడు లైఫ్ లో ఎప్పుడు కూడా వాడు అభిమానించే హీరో ఎందుకు గొప్పవాడు అని ఆలోచించకుండా గుడ్డిగా అభిమానం పెంచుకుంటాడు,ఆ హీరో గురించి ఏ రోజు తప్పుగా ఆలోచించడానికి కూడా సాహసం చేయడు, వాళ్ళ హీరో గురించి ఎవరైనా తప్పుని తప్పు అని point out చేసి చూపిస్తే, వాళ్ల మీద ఎటాక్ చేస్తారు, వీరి మెదడు ఎంత భయంకరంగా conditioning అవుతుందంటే వాడి మతమే గొప్ప, వాడి సంప్రదయమే గొప్ప, వాడి హీరోనే గొప్ప, వాడి కులమే గొప్ప, వాడి ప్రాంతమే గొప్ప ఇలాంటి arrogant mindset develop అవుతుంది. చివరకు వాడు నిజం ఏంటో అబద్ధం ఏంటో గ్రహించకుండా బావిలో కప్పలగా తాను అనుకున్నదే కరెక్ట్ అనే భావనలో బ్రతికి చివరికి ఒక ముర్కుడిలాగా చనిపోతాడు, ఇలాంటి వారు బాగా ముదిరిపోతే తీవ్రవాదులు లేదా మత ఛాందస వాదులుగా తయారు అవుతారు...!!!

Every child is a born atheist, freethinker and freebird but later on they become fundamentalists, casteist, arrogant hero worshippers when they grow up. అంటే పుట్టిన ప్రతి బిడ్డకు తన మెదడులో కులం,మతం,దేవుడు,ద్వేషం లాంటి భావాలు లేకుండా పుట్టి, పెరుగుతున్న క్రమంలో కుటుంబాన్ని, సమాజాన్ని, తన చుట్టూ ఉన్న పరిసరాల్ని చూసి నేర్చుకుంటాడు.

బాల్యంలో పిల్లల్లో ఉన్న questioning పెరిగి పెద్ద అవుతుంటే ఉండకపోడానికి కారణం, అతని మెదడు మొత్తం తరతరాల చెత్తతో మురుకి పట్టిపోతుంది (conditioning వల్ల) కాబట్టి వాడు నమ్మిన దేవుడ్ని కానీ, వాడు అభిమానించే హీరోని కానీ వాడి మతాన్ని కానీ ఎవరైనా కొంచెం విమర్శించిన తట్టుకోలేడు. వాడు బాల్యం నుంచి నమ్మింది తప్పు అని తెలిస్తే వాడి ego దెబ్బ తిని దాడులు చేస్తారు. ఇలా conditioning చేయబడిన మనుషులు జీవితం మొత్తం ఏదో ఒక ism ఇజంని గాడిద లాగా మోస్తూ మోస్తూ చివరకు నడుం విరిగి చనిపోతారు.

Note:- చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, break the barriers and explore the life beyond the boundaries of conditioning.
మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్న అన్ని విషయాలు కరెక్ట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు కాబట్టి మనం నేర్చుకున్న విషయం నిజం కాకపోతే, అసలు నిజమేంటో అని శోధించి తెలుసుకోవాలి.

దీన్ని మనం unlearning process అంటాం. సరైన విషయాలు నేర్చుకుంటూ, విశ్వ మానవుడిగా ప్రతి ఒక్కరు ఎదగాలి.

Source - Whatsapp Message

1947 నుండి 1979 వరకు భారత కేంద్ర విద్యా మంత్రుల పేర్లను చూడండి !!

🏹🏹🏹🏹🏹

1947 నుండి 1979 వరకు భారత కేంద్ర విద్యా మంత్రుల పేర్లను చూడండి !!

1. మౌలానా ఆజాద్

2. హుమాయున్ కబీర్

3. మొహద్ కరీం చాగ్లా

4. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్

5. నూరుల్ హసన్

ఈ పేర్లన్నీ కాంగ్రెస్ పాలనలో 32 సంవత్సరాలలో భారతీయ చరిత్రను నిర్లక్ష్యంగా వక్రీకరించిన ఇస్లాంవాదులు.

పోరస్, లలితాదిత్య విద్యాపీఠ్, చంద్రగుప్తా విక్రమాదిత్య, మహారాణా ప్రతాప్, పృథ్వీరాజ్ చౌహాన్, ఛతపతి శివాజీ మొదలైన వారి గురించి మన విద్యార్థులకు తెలియకపోవడం వింత కాదు, కానీ బాబర్ నుండి u రంగజేబు వరకు మొఘల్ చక్రవర్తుల గురించి మాత్రమే తెలుసు. 🤬

మంత్రులు ఒక నిర్దిష్ట ఎజెండా కింద పనిచేశారు ......

👇👇

1. హిందువులకు వారి జ్ఞానాన్ని హరించండి!

2. హిందూ మతాన్ని మూఢ నమ్మకాలతో నిందించండి!

3. హిందువులు తమ గుర్తింపు గురించి సిగ్గుపడే విధంగా మారచండి!

4. విద్యా వ్యవస్థను అబ్రహమైజ్ చేయండి.

5. హిందూ మతానికి వ్యతిరేకంగా పుకార్లు వ్యాప్తి చేయడానికి మీడియాను నియంత్రించండి!

ఈ అర్ధంలేని వాటిని సిగ్గు లేకుండా అంగీకరించడానికి హిందువులను బలిపశువులుగా చేశారు.

భారతదేశ 1 వ విద్యా మంత్రి మౌలానా ఆజాద్ అసలు పేరు మీకు తెలుసా?

అతని పేరు "गुलाम मुहियुद्दीन अहमद खैरुद्दीन - अल - हुसैनी"

అవును, అతను భారతీయుడు కాదు.
అతని జన్మస్థలం మక్కా, ఆమె తల్లి మక్కాకు చెందినది మరియు అతని తండ్రి మదీనా నుండి.
ఆశ్చర్యకరంగా భారతదేశ మొదటి విద్యా మంత్రి పాఠశాల నుండి ఎటువంటి అధికారిక విద్యను పొందలేదు.
మదర్సా నుండి విద్య పొందాడు.
గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్‌ అని పిలిచేవాడు.
1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది.
మనమీద ఎంత దాడి జరుగుతున్నా ఇన్నాళ్లు భరించాం ఇలాంటివి ఈయన పేరుతో ఇతడి జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉందా.
ఎంత హాస్యాస్పదంగా, ఒక ఆధునిక భారతదేశాన్ని సృష్టించే బాధ్యత మదర్సా విద్యావంతుడికి ఇవ్వబడినది.

Source - Whatsapp Message

జాతులు ఒకదానికొకటి జనాభా నియంత్రణను చేసుకుంటున్నాయి.

🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️


🎉🎊💜 "ఆత్మ" 💜🎉🎊

🧘‍♀️🧘‍♀️🧘‍♀️ (soul) 🧘‍♀️🧘‍♀️🧘‍♀️

🐓 జాతులు ఒకదానికొకటి జనాభా నియంత్రణను చేసుకుంటున్నాయి.

ఉదాహరణకు ;

పాము జాతిని గ్రద్ద, నెమలి నియంత్రిస్తుంది.

కప్ప జాతిని చేప, పాములు, పక్షులు నియంత్రిస్తాయి.

🦃చిన్న జంతువులను పెద్ద జంతువులు తినివేస్తాయి.ఇలా వాటి జనాభా నియంత్రణ కొనసాగుతుంది.

🦖అంతేతప్ప జంతు జాతిని నియంత్రించడానికి, లేదా వాటిని చంపడానికి మానవజాతికి ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికారం లేదు.

🦄ఇవాళ చైతన్య పరిణామ క్రమంలో మానవజాతి అన్ని జీవజాతుల కంటే ముందు ఉన్నది. సకల ప్రాణి కోటి మానవ చైతన్య పరిణామానికి దోహద పడుతుంది.

🐿️జంతుజాతులన్నీ కూడ మానవ చైతన్య పరిణామానికి ప్రత్యక్ష , పరోక్ష సహకారాన్ని అందిస్తున్నాయి.

🐏జంతు జాతులన్నీ మానవజాతికి అనుంగు తమ్ముళ్ళులాంటి వారు. వాటిని చంపడం అంటే మానవ చైతన్య పరిణామాన్ని చంపు కోవడమే!.

🦜 మీరు కలలు కంటున్నట్లుగానే జంతుజాతులు పక్షిజాతులు, ఇతర జీవజాతులు, వృక్ష జాతులు కలలుగంటున్నాయి.

🦚మీరు లక్ష్యాలను నిర్దేశించు కున్నట్లయితే అవి కూడా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని భూమి మీద ప్రవేశించాయి.

🦆జంతుజాతులన్నీ ఇతర లోకాల నుండి భూమి మీదకు వచ్చిన ప్రతినిధులు.

🦅దేహంలో ఒక చెయ్యి విరిగి పోయి తొలగించ బడినపుడు అంగవైకల్యం ఏర్పడుతుంది. దేహానికి కొంత వెలితి ఏర్పడుతుంది.
అట్లాగే ,
జీవజాతుల చైతన్య పరిణామానికి మానవజాతి ఆటంకం కలిగించి తన చైతన్య పరిణామానికి తాను విద్రోహం చేసు కుంటున్నది.

🐔 జంతు జాతిని హింసిస్తున్నారంటే మిమ్మల్ని మీరు హింసించు కుంటున్నారని తెలుసుకోండి.

🦈జంతు జాతిని హింసించడం, చంపడం ద్వారా మానవజాతి చాలా పెద్ద తప్పు చేస్తున్నది. దానివల్ల మానవజాతి చైతన్య పరిణామానికి చాలా హాని జరుగుతుంది.

🦉వైద్య శాస్త్ర ప్రయోగాల కోసం జంతుజాతులను ఎంచుకొని వాటిని హింసించడం, వాటిపై ప్రయోగాలు చేయడం చాలా హీనమైన చర్య.

🐍అంతర్ ప్రయాణం చేసి అంతర్ ప్రపంచం నుండి క్రొత్త క్రొత్త విషయాలు రాబట్టి వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఉంటే వైద్య శాస్త్రము ఎన్నో వేల రెట్లు అభివృద్ధి చెంది ఉండేది.

🐂జంతువుల దేహాలు ,మృత జీవకణాల పై ప్రయోగాలు చేసి అభివృద్ధి చేసిన వైద్యశాస్త్రము మీకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదు.

🐇 ఇవాళ మీరు అభివృద్ధి చేసుకున్న అలోపతి వైద్య శాస్త్రము మానవ దేహానికి,మానవ చైతన్య పరిణామానికి ఏ మాత్రము పనికిరాదు.

🧜 ఆత్మ, దేహము,మరి చైతన్య పరిణామము క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పరిశోధన చేసి చికిత్స చేసిన వాడే నిజమైన వైద్యుడు.

🧚భూమి మీద చైతన్య పరిణామానికి మీ అలోపతి వైద్యులు అంతరాయం కలిగిస్తున్నారు.

🧙వారి వైద్య విధానం చాలా అసమగ్రంగా ఉంది. ఆ వైద్యము మానవ దేహానికి ఏ మాత్రము సహాయపడేదిగా లేదు.

👩‍🏭ఈ వైద్య శాస్త్రం గురించి మరింత లోతుగా తర్వాత వివరించు కుందాము.

🍇🍐🌽🍄🥑🥕🌶️🍌🍍

🥝నోటు:- మానవుల ఆహారము శాఖాహారం.

🍅 ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అంటే శాకాహారమే భుజింప వలెను.

🙋 ప్రతివ్యక్తి ప్రతిరోజు "శ్వాస పై ధ్యాస" పెట్టి "ధ్యానం "చేయాలి.

🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️🧘‍♀️


🦚🐉🐲🦃🦜🐍🦎🐛

ప్రకృతి ని పరి రక్షిధ్ధాం

పర్యావరణమును కాపాడు కుందాం

ధ్యానం శరణం గఛ్ఛామి

🌴🌾🌲🌱🌳🌵🎋🎄

వృక్షో రక్షతి రక్షితః

🐏🐄🐬🐟🐪🐓🐐🕊️

శాకాహారమే -- అమృతాహారం

అహింసా పరమో ధర్మః

జీవా సమస్తా స్సుఖినో భవంత్

శాకాహారం శరణం గఛ్ఛామి

🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️🧚‍♀️🧚‍♂️
🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️🧘‍♀️🧘‍♂️_

Source - Whatsapp Message

మిత్రులు - శత్రువులు

సమాజంలో మనచుట్టూ ఉన్న మనుషులందరూ మనకు మిత్రులు కాలేరు. మన అభిప్రాయాలతో కలిసి, మనకు చేదోడు వాదోడుగా ఉన్నవారినే మనకు మిత్రులుగా భావిస్తాం. మన అభిప్రాయాలతో సరిపడని వారిని, మనతో విభేదించే వారిని శత్రువులుగా చూస్తాం.

మిత్రులు - శత్రువులు
శత్రువుల్లో భౌతిక శత్రువులు, అంతశ్శత్రువులని రెండు రకాలు. భౌతిక శత్రువుల్లో అనుకూలురు, అననుకూలురని మళ్ళీ రెండు రకాలు. అనుకూల శత్రువులంటే మన మాటలతోనో, అభిప్రాయాలతోనో విభేదించవచ్ఛు కులం వల్ల, మతం వల్ల, ప్రాంతీయత వల్ల వాళ్ళతో మనం విభేదించవచ్ఛు వీళ్ళతో అభిప్రాయ భేదాలొచ్చినా, కలిసి మెలిసి సర్దుకుపోయే తత్వం ఉంటుంది.

అననుకూల శత్రువులంటే భూ, గృహ, ఆస్తి పంపకాల వల్లగానీ, రాజకీయ, మత వైషమ్యాల వల్లగానీ, ఈర్ష్యాసూయల వల్లగానీ ఒకరి ఉన్నతిని మరొకరు సహించలేకపోవడం వల్ల అవతలివారి అంతాన్ని కూడా చూడాలన్న స్థాయికి ఎదిగిన శత్రుత్వం. వీరుగాక ఆగర్భ శత్రువులు, అకారణ శత్రువులు కూడా ఉంటారు.

దేవదానవులు ఆగర్భశత్రువులు. కౌరవ పాండవులు ఆస్తిమూలక శత్రువులే అయినా ఆగర్భ శత్రువులే! ఇక అకారణ శత్రువులు కొందరు ఉంటారు.

గడ్డి తినే బతికే జింకలకు బోయవాని వల్ల, నీటిలో ప్రశాంతంగా సంచరించే చేపలకు జాలరుల వల్ల, సజ్జనులకు దుర్జనుల వల్ల శత్రుత్వానికి కారణం ఉందా? అకారణం కదా!

ఈ శత్రుత్వాలను మనిషి తలచుకుంటే నివారించుకోగలడు. సహజగుణం పెంపొందించుకున్నప్పుడు పొరుగువారి అభ్యున్నతిని చూసి ఓర్చుకోగలిగినప్పుడు మనిషిలో శాంతగుణం అధికమవుతుంది. శాంతం పెరిగినప్పుడు ప్రేమతత్వం హెచ్చుతుంది. ప్రేరణలోనే దైవత్వం ఉంది. దైవత్వం వల్ల మనిషిలో మంచి గుణాలు పెరిగి శత్రువులు సైతం మిత్రులు కాగలరు. ఈ రకంగా భౌతికంగా శత్రువులను నివారించుకోవచ్ఛు

మిగిలింది, అంతశ్శత్రువులు.

అంటే మనకు తెలియకుండానే మనల్ని చెడు వర్తన వేపు మరల్చేవి. అరిషడ్వర్గాలు- కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కామం ఎంతటివారినైనా ప్రలోభ పెడుతుంది. కామం అంటే కోరిక. కోరికలు రకరకాలు. ప్రపంచంలో తానే సర్వోన్నతుడిగా గుర్తింపు పొందాలని, తనకే అన్ని సంపదలూ సమకూరాలని, తానే అందరికీ అధిపతిని కావాలనుకునే స్థాయిలోవి కొన్ని. వాటిని తలదన్నేది- లభించినదానితో తృప్తిచెందకపోవడం. ‘తృప్తి చెందని మనుజుడు సప్తద్వీపంబునైన చక్కంబడునే?’ అన్నారందుకే. తృప్తిపడినవాడికి గంజిమెతుకులు లభించినా పరమాన్నంగానే భావిస్తారు.

కామం అంటే స్త్రీలోలత్వం. ఈ కాముకత్వం వల్ల ఎంతోమంది మహానుభావులు దిగజారిపోయారు. క్రోధం అంతకంటే ప్రమాదం. కోపం, ఉబ్బిపోవడం, గర్వం, సహించలేకపోవడం, నిర్వ్యాపారత్వం... వీటిని కాపురుష గుణాలన్నారు. ఈ గుణాలు ఎంత గొప్పవారినైనా కిందకు తొక్కేస్తాయి. వాటి పాలబడకూడదంటే మంచి అలవాట్లను చిన్నప్పటినుంచీ పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మిక తత్వాన్ని అలవరచుకుని, భగవచ్ఛింతన కలిగి ఉండాలి. మితాహారం, సాత్వికాహారం తీసుకుంటూ పెందలకడనే లేచి స్నానాదులు ముగించి పుస్తక పఠనం సాగించాలి. సద్గ్రంథ పఠనం వల్ల బుద్ధి వక్రమార్గాన పడదు. మనో నైర్మల్యం కలిగి మంచివాడిగా ఎదుగుతాడు. ఈ రకంగా మనిషి తనలోని శత్రువులను తరిమి అందరినీ మిత్రులుగా చేసుకుని, అందరికీ మిత్రుడు కాగలడు!

Source - Whatsapp Message

భారతదేశంలో హిందువులకు ప్రాతినిధ్యం వహించే హక్కును బిజెపి / ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎవరు ఇచ్చారని కాంగ్రెస్ అడుగుతుంది ....కోరాలో నీల్ మెక్సీ యొక్క సమాధానం చదవండి

భారతదేశంలో హిందువులకు ప్రాతినిధ్యం వహించే హక్కును బిజెపి / ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎవరు ఇచ్చారని కాంగ్రెస్ అడుగుతుంది ......
కోరాలో నీల్ మెక్సీ యొక్క సమాధానం చదవండి:
...
ఏకైక కుటుంబం / స్వపక్ష రాజవంశం - గాంధీలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని భారతీయ ప్రజలకు బహుమతిగా / దాతృత్వంగా దొంగిలించడానికి మరియు దావా వేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, చంద్రశేకర్ ఆజాద్, సుబాష్ చంద్రబోస్ వంటి సామూహిక వీరులు, లక్షలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఎగతాళి చేయడం, తెల్లగా కడగడం, ఎగతాళి చేయడం లేదా?

60 సంవత్సరాలు భారతదేశాన్ని దోచుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీ స్వపక్ష కుటుంబం తర్వాత అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులకు పేరు పెట్టడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? భారతదేశం మీ వ్యక్తిగత ఆస్తినా?

భారతీయ ప్రజల అనుమతి తీసుకోకుండా భారతదేశం యొక్క భూమి కోకో దీవులను ఇతర దేశాలకు దానం చేయడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? భారతదేశం యొక్క భూమి మీ వ్యక్తిగత ఆస్తినా?

పార్సీలు, జైనులు, యూదులు, బౌద్ధులు అసలు మైనారిటీలు మరియు ముస్లింలు రెండవ అతిపెద్ద మెజారిటీ ఉన్నప్పుడు ముస్లింలను మైనారిటీగా ప్రకటించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?

హిందు దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలకు పన్ను చెల్లించడానికి మరియు డబ్బును అన్ని మతాల కోసం ప్రభుత్వానికి మరియు ఖర్చులకు ఉపయోగించుకునే హక్కును ఎవరు ఇచ్చారు, కాని ముస్లిం మరియు క్రైస్తవ మందిరాలపై పన్నును మినహాయింపు పేరిట మినహాయింపు ఇచ్చారు? మీరు హిందువులైనందుకు హిందు విశ్వాసులను శిక్షిస్తున్నారా?

అందరికీ ఉద్దేశించిన సాధారణ చట్టాలను వేరు చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? మీరు హిందూ చట్టాన్ని సంస్కరించారు మరియు ఇతర మతాల చట్టాన్ని తాకలేదా?

ముస్లింలను బహుభార్యాత్వం మొదలైనవాటిని అభ్యసించడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు, కాని ఇతర విశ్వాసాలను దీన్ని నిషేధించారు, లౌకిక పార్టీ అనే నెపంతో ఒక మతం అనుచరుల పట్ల ఈ పరిపూర్ణమైన వంచన / బహిరంగ పక్షపాతం కాదా?

ఇతర మత అనుచరుల విద్యకు మీరు అదే మొత్తంలో నిధులు చెల్లించనప్పుడు భారతీయ పన్ను చెల్లింపుదారుల డబ్బును మదర్సా మత విద్య కోసం ఖర్చు చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు?

ఇతర విశ్వాసాలకు వారి మందిరాన్ని సందర్శించడానికి లేదా జెకె లేదా కాశ్మీరీ పండితులకు మైనారిటీ కోటాను మైనారిటీలో ఉన్న మైనారిటీ కోటాను అందించడానికి మీరు హజ్ సబ్సిడీలకు నిధులు సమకూర్చడానికి, మైనారిటీ కోటా ఇవ్వడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు?

బ్రిటీష్ సౌత్ కోస్ట్‌లో తన వ్యక్తిగత సామర్థ్యంలో నెహ్రూ తన ప్రేమ ఆసక్తితో ఎడ్వినా మౌంట్ బాటెన్ సముద్రం ఖననం చేయడానికి దండ వేయడానికి భారతీయ నావికాదళ యుద్ధనౌకను పంపడానికి / ఉపయోగించడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? భారతీయ నేవీ యంత్రాలు, మీ కుటుంబ సభ్యులు వ్యక్తిగత ఆస్తినా?

భారతీయ న్యాయస్థానం చేత నరహత్యకు పాల్పడినట్లు మరియు అదుపులో ఉంచబడిన యూనియన్ కార్బైడ్ సిఇఒ క్రిమినల్ వారెన్ అండర్సన్కు రహస్య / సురక్షితమైన మార్గాన్ని అందించడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు?

భోపాల్ గ్యాస్ ట్రేడిజీలో లక్షలాది మంది వ్యక్తుల కంటిచూపు మరియు మరణాలకు కారణమైన కస్టడీ నుండి పారిపోవడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? తరాల తరువాత ఎవరి తరం ఇప్పటికీ వైకల్యంతో బాధపడుతోంది మరియు వారి నుండి ఎటువంటి పరిహారం పొందలేదు. భారతదేశానికి మీ ద్రోహం మరియు నేరపూరితమైనది కాదా?

దిగ్విజయ్ సింగ్, సంజయ్ నిరుపమ్ వంటి వారి నుండి 26/11 విషాదం, సరిహద్దు వద్ద దాడులు మొదలైనవి ఎగతాళి చేయడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు?

ఈ ప్రశ్నలన్నింటికీ రాజవంశం కుటుంబం సమాధానం చెప్పగలిగినప్పుడు, వారు ఇతరులను ప్రశ్నించడాన్ని ఇబ్బంది పెట్టవచ్చు.


Source - Whatsapp Message

"ఆనందం ఖరీదు - ఆలోచన" - గొల్లపూడి మారుతిరావు

అరుణాచలం:
నాకు నచ్చింది చాలా !!
మీకూ నచ్చుతుందనుకుంటా !!
ఓ ఐదు నిముషాలుj వినియోగించగలరా .
దీన్ని చదవడంలో !!!

💐💐"ఆనందం ఖరీదు - ఆలోచన"💐💐
( గొల్లపూడి మారుతిరావు )

చాలామంది ఆనందానికీ, ఖరీదుకీ లంకె వుంటుంది. ఖరీదయిన కారూ, ఖరీదయిన సూటూ, ఖరీదయిన భోజనం,ఖరీదయిన పరుపూ- మీ యిష్టం -
ఏదయినా దాని చివర వున్న చీటీని బట్టి మనస్సులో ఆనందానికి తూకం వుంటుంది. మా ఆవిడ షాపులో చీరెల రంగులూ, నాణ్యాన్ని చూసే ముందు ధరని చూస్తుంది. ఖరీదు నాలుగంకెల్లో వున్నాక-
ఆమెకి మెల్లగా చీరె నచ్చడం ప్రారంభిస్తుంది.
ఆ తరువాతే రంగు, మన్నికా వగైరా. ఓసారి నేను తెచ్చిన చీరెని ఆనందంగా అందుకుంది. తృప్తిగా కట్టుకుంది. ఖరీదుని దాచి నెలరోజుల తర్వాత చెప్పాను-ఫలానా మార్కెట్లో చవకగా తీసుకున్నానని.
ఆ క్షణం నుంచీ ఆ చీరెమీద ఆమెకి మక్కువ పోయింది.

మా పెద్దబ్బాయి అన్నిటా వాళ్ళమ్మ పోలిక. ఓసారి బూట్లు దరిద్రంగా వున్నాయన్నాను. నన్ను జాలిగా చూసి-ఆవి ఫలానా బ్రాండువి- యింగ్లండులో ఆక్స్ ఫర్డ్ స్ట్రీట్ లో 10 రూపాయలకి కొన్నానని గర్వపడ్డాడు. మొన్న స్విట్జర్లాండు నుంచి వస్తూనే ఓ కళ్ళజోడు చూపించాడు.
“దీని ఖరీదు చెప్పు?” ఆన్నాడు- కంటి మీద అటూ యిటూ తిప్పుతూ. మా ఆవిడ సంగతి తెలిసినవాడిని కనుక పదివేల దగ్గర మొదలెట్టాను. మా వాడు తప్పిపోయిన అనాధని చూస్తున్నట్టు నన్ను క్షమిస్తూన్నట్టు నవ్వాడు.
ఇది ఫలానా వీధిలో ఫలానా షాపులో కొన్నానన్నాడు. దాని ఖరీదు 75వేల రూపాయలు. బ్రిటిష్ ప్రధాని గార్డెన్ బ్రౌన్ దగ్గర్నుంచి మెడోన్నా దాకా అంతా అక్కడే కళ్ళజోళ్ళు కొంటారట. అసలు స్విట్జర్లాండు నుంచి తిరిగి వస్తూ లండన్లో ఆగడానికి కారణం- ఆ కళ్ళజోడుని ఖరీదు చెయ్యడం.

ఓసారి బదరీనాధ్ నుంచి కారులో ఢిల్లీ చేరాం. ఉదయం చెన్నై విమానం. ఆ రాత్రి మా అబ్బాయితో ఐదు నక్షత్రాల హొటల్లో వున్నాను. రాత్రి 11 గంటలకి కేవలం పెరుగూ అన్నం తెప్పించుకున్నాను. దాని బిల్లు చూశాక అన్నం నోటికి పోలేదు. బిల్లు 750 రూపాయలు! అయితే- ఆ మాట విన్నాక మావాడికి ఆ హొటల్ మీద మోజు పెరిగింది.

అనుభవించే ప్రతి వస్తువూ ముందు ఆలోచనల్లో అనందాన్ని పంచాలి- చాలామందికి.
ఏ ఖరీదూ అక్కరలేని చందమామ వెన్నెల బొత్తిగా చవకగా వుంటుంది. ఆల్ఫ్స్ ని చూస్తూ-డాలర్ల ఖర్చుతో హొటల్ గది వరండాలోకి తొంగిచూసే వెన్నెలకి మాత్రమే ఆ రుచి వుంటుంది.

నేనూ ఏ వస్తువయినా కొనేముందు ధరని చూస్తాను-అర్ధంలేని ఖరీదునీ, అవసరంలేని స్థాయినీ మించిపోతుందేమోనని.
పదివేల రూపాయల లండన్ బూట్లు నా కాళ్ళను కరుస్తాయి. అంతకంటె వెయ్యిరూపాయల విశాఖపట్నం బూట్లు నమ్మకంగా నాకు సుఖాన్ని పంచి నాలుగుసార్లు కొత్తవి కొనుక్కునే వనర్లని జేబులో మిగులుస్తాయి.

కొందరు విమానాల్లొ క్లబ్ క్లాసుల్లో ప్రయాణాలు చేస్తారు. నేను ప్రయత్నించి మరీ “ఎకానమీ” లో కూర్చుంటాను. సుఖం కంటె తన అంతస్థు “లేబుల్” వారిని ఆనందపరుస్తుంది. అంతకంటె గర్వపరుస్తుంది.

ఉపాధికీ, పట్టెడన్నానికీ నోచుకోలేని కోట్లాదిమంది వున్న మన సమాజంలో-
ఈ ’లేబుల్’ కాస్త ఎబ్బెట్టుగా, హాస్యాస్పదంగా వుంటుంది. అయితే చాలామందికి సుఖం అన్నది వస్తువు చివర అంటించిన ధర చీటీ. అవసరాన్ని తీరిస్తే చాలదు. తమ అతిశయాన్ని రెచ్చగొట్టగలగాలి.

విచిత్రమేమిటంటే- ఒక్క భారతదేశంలోనే పేదరికానికి చాలా సంపన్నమయిన అర్ధం వుంది. డబ్బు లేకపోవడం అంటే మరే దేశంలోనయినా దరిద్రానికి గుర్తే.
కాని ఒక్క భారతదేశంలోనే దాని అర్ధం వేరు. ఇక్కడ ’లేమి’కి అర్ధం వైభవం. ఆ వైభవం స్థాయి-ఆ వ్యక్తి స్థాయి, సంస్కారం, మానసిక పరిపక్వతని బట్టి పెరుగుతుంది. పరమాచార్య వుంటిమీద బట్ట ఖరీదు పట్టుమని పదిరూపాయలుండదు.
భగవాన్ రమణ మహర్షి – మనిషికీ పశువుకీ తేడాని తెలిపే చిన్న ఆఛ్ఛాదన- కౌపీనం చాలునని తను జీవించి నిరూపించారు.

అడవిలో, ఆశ్రమంలో కందమూలాలు తిని తపస్సు చేసుకునే భరద్వాజ మహర్షి- శ్రీరాముడిని రాజ్యానికి ఆహ్వానించడానికి భరతుడు సైన్యంతో తరలి వచ్చినప్పుడు-అందరికీ మృష్టాన్న భోజనంతో విందుని చేశాడు. కందమూలాలు తిని బతికే బైరాగి చేసిన ఘనమయిన విందు ’భరద్వాజ విందు’గా పురాణాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. కోరుకుంటే తను ప్రతీ రోజూ ఆ స్థాయిలో విందుని అనుభవించ వచ్చుకదా? ఆ అవసరం- ఆ పరిపక్వ దశలో ఆ ఋషికి అనవసరం. కాని దేశాన్ని పాలించే మహారాజుకీ, అయన పరివారానికీ అది మర్యాద.

అస్థి, అంతస్థు, అర్ధంలేని కీర్తి, సౌఖ్యం- అన్నీ పతనానికి దారితీస్తాయి. మార్లిన్ మన్రో దగ్గర్నుంచి నిన్న మొన్నటి మైకేల్ జాక్సన్ దాకా ఎన్నయినా ఉదాహరణలున్నాయి. అందుకే టాటాలూ, బిర్లాలూ గుడులు కట్టించీ, ట్రస్టులు నెలకొల్పీ ఎప్పటికప్పుడు తమ దృక్పధాన్ని సంస్కరించుకుంటూంటారు

.
చూపు బేధంలోనే ఆనందపు రహస్యం వుంది. కాలికి తొడుక్కునే లండన్ బూట్లలో కాదు. అమెరికాలో పీటర్ జి.పీటర్సన్ ఆనే వ్యాపారికి నడిమంత్రపు సిరి ఎత్తుకుని కోట్లు సంపాదించాడు. ఆయన ఈ మధ్య ప్రజా సేవకి బిలియన్ డాలర్ల ట్రస్టుని ఏర్పాటు చేశాడు. ఆయన ఎప్పుడూ ఆనందంగా,తృప్తిగా కనిపించే తన డ్రైవర్ని అడిగాడట:
“ఎప్పుడూ ఆడిటర్లతో, పన్నుల ధ్యాసతో, బాంకుల చెక్కుబుక్కులతో నేను సతమతమవుతూంటాను. నువ్వు ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావ”ని.
డ్రైవరు నవ్వి అన్నాడట:”మీకు లేనిది- ఒకదాన్ని నేను సమృద్ధిగా సంపాదించుకున్నాను సార్” ఆని.

“ఏమిటది?”
“ఇంకచాలు అనే ఆలోచనని” అన్నాడట.

ఆనందాన్నీ,తృప్తినీ, సుఖాన్నీ- ఆలోచనలో ఎంత గొప్పస్థాయిలోనయినా నిలుపుకోవచ్చు.

దానికి భగవాన్ రమణ మహర్షి, పీటర్సన్ డ్రైవరూ-
యిద్దరూ రెండు రకాలయిన ఉదాహరణలు.

( సేకరణ :-- గొల్లపూడి మారుతీరావు జీవన్ కాలమ్ నుండి )

Source - Whatsapp Message

Monday, August 17, 2020

భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యోతి

వేదం 90% శాతం మంది భారతీయులకు అసలు ఆ పదం గాని, అవి ఎన్నో కూడా తెలియదు..

మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని..

వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట నేను చెప్పటం లేదు.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది..

శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!

జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి"

ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది.
ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు!

రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన - ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.

తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు.అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు.

ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధిపొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.

దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!

బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు.

తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.

దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభైరూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడువందల రూపాయలవంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబపింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అదికూడా ఆగిపోయింది!

అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం.

దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.

ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది..

అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం.. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి..

భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యోతి

Source - Whatsapp Message