Monday, November 28, 2022

ఆదియోగి…ఆదిపరాశక్తులు ఒకేచోట నెలకొన్న పవిత్ర క్షేత్రమే శ్రీశైలము

 🌹ఆదియోగి…ఆదిపరాశక్తులు ఒకేచోట నెలకొన్న పవిత్ర క్షేత్రమే శ్రీశైలము 🌹
🔱🍁🔱🔱🍁🔱🍁🔱🍁

ఈ క్షేత్రం విశిష్టత  సందర్శన స్థలాలు పూర్తిగా నిక్షిప్తా సమాచారం
🌻🌻🌻🌻🌻🌻🌻🌻

శంభో శంకర
పరమశివుడు మల్లికార్జునుడుగా, పార్వతీదేవి భ్రమరాంబికగా కొలువుదీరిన శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో గలదు. ఈ పూణ్యక్షేత్రాన్ని భూలోక కైలాసంగా కూడా అభివర్ణిస్తారు. ఆధ్యాత్మికతకు నెలవుగా ఉండే ఈ క్షేత్రం పర్యాటక పరంగా కూడా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో, కృష్ణానది ఒడ్డున జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే చోట నెలకొని ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగంగా పరమశివుడు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠంగా భ్రమరాంబికాదేవి రూపంలో పార్వతీమాత శ్రీశైల క్షేత్రంలో దర్శనమిస్తారు. దశ భాస్కర క్షేత్రాల్లో ఒకటిగా కూడా  క్షేత్రానికి పేరు 

స్కాందపురాణంలో శ్రీశైలానికి సంబంధించిన గాథ ప్రచారంలో ఉన్నది. శిలాదుడనే మహర్షికి మహాశివుడి కటాక్షం వలన నందికేశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారట. ఈశ్వర భక్తి పరాయణులైన వారిద్దరూ పరమేశ్వరుడి ప్రసన్నత కొరకు దీక్ష చేపట్టి కఠోర తపస్సు ఆచరించారట. శంభో అనినంతనే వరాలిచ్చే శివుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఎదుట ప్రత్యక్షమైన మహాదేవుడిని దర్శించి పరవశుడైన నంది తాను ఈశ్వరుడి వాహనంగా ఉండాలన్న అభీష్టాన్ని వ్యక్త పరిచాడు. దానికి పరమేశ్వరుడు అనుజ్ఞ ఇవ్వడం ముక్కంటి వాహనంగా నంది మారడం జరిగిపోయాయి. ఇక మరో పరమ భక్తుడు పర్వతుడికి సైతం తన దర్శన భాగ్యాన్ని పరమేశ్వరుడు కల్పించాడు. స్వామి దర్శనం కలిగిన ఒకక్షణంలోనే కొండంత సంతోషం లభిస్తే, ఆ సంతోషాన్ని శాశ్వతం చేసుకోవాలని సంకల్పించిన పర్వతుడు, తనను ఒక కొండగా మార్చి ఆదిదంపతులిరువురూ ఎల్లప్పుడూ తనపై కొలువుదీరి ఉండాలనే కోరిక కోరాడట. భక్తుడి కోరిక మేరకు పర్వతుడిని కొండగా మార్చి దాని పైనే ఈశ్వరుడు స్వయంభువుగా కొలువుదీరాడనీ, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగం ఇదేనని పురాణ కథనం.
ఆహ్వానం లేకుండా దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్లి తండ్రిచే అవమానితురాలైన సతీదేవి అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నది. సతీదేవి మృత శరీరాన్ని శివుడు భుజాన వేసుకుని విలయతాండవం చేయగా సంభవించిన ప్రళయాన్ని ఆపి మహాదేవుడిని యదాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా వెలియగా, మెడభాగం శ్రీశైలంలో పడింది. ఇక్కడ గల శక్తిపీఠంలో అమ్మవారు భ్రమరాంబికా దేవి రూపంలో కొలువుదీరి ఉంటారు. శివుడు, శక్తి ఒకేచేట భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తుండడం వలన ఈ క్షేత్రానికి శివశక్తి క్షేత్రమనే పేరు కూడా వచ్చింది 
మల్లికార్జునుడి పేరు వెనుక గల కథ

పూర్వం కృష్ణానదీ తీరంలో బ్రహ్మగిరి రాజధానిగా చంద్రకేతుడు రాజ్యపాలన చేస్తుండేవాడు. అతని కుమార్తె అయిన చంద్రావతి పరమశివుని భక్తురాలు. సర్వవేళలా ఈశ్వర ధ్యానంలోనే గడిపేది. ఈశ్వార్చనలో భాగంగా నిత్యం మల్లెపూల దండలతో పూజించేంది. చంద్రావతి భక్తికి మెచ్చిన భోళా శంకరుడు పార్వతీమాత సమేతంగా దర్శనభాగ్యం కలిగించి ఆమెను ఏం వంరం కావాలో కోరుకోమన్నాడట. అప్పుడు చంద్రావతి తాను శివలింగంపై ఉంచిన మల్లెపూల దండ ఎప్పటికీ వాడిపోకుండా ఉండే వరాన్ని ప్రాసాదించాలని కోరిందట. తన భక్తురాలి కోరికను మన్నించిన ఈశ్వరుడు ఆ మల్లెపూల దండను తన శిరస్సు పైన గల గంగ మరియు చంద్రవంకల మధ్య ధరించాడట. తన శిరస్సుపై మల్లెపూల దండ ధరించిన స్వామికి మల్లికార్జునుడనే నామధేయం సార్ధకమైనట్లుగా పురాణ గాథ ఒకటి ప్రచారంలో కలదు.


భ్రమరాంబిక దేవి పేరు వెనుక గల కథనం

శ్రీశైలంలో ఆదిపరాశక్తిగా కొలువుదీరిన భ్రమరాంబిక అమ్మవారికి ఆ పేరు రావడానికి వెనుక ఆసక్తికర కథనాలు ప్రచారంలో ఉన్నవి. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు గాయత్రీ మంత్ర జపఫలం కారణంగా మృత్యువు లేని వరాన్ని పొందాడట. ఈ విషయం తెలిసిన దేవతలు జగన్మాతను ప్రార్థించగా, గాయత్రీ మంత్ర జపం చేస్తున్నంత కాలం అరుణాసురుడికి ఎదురుండదని మాత చెప్పిందట. దాంతో ఎలాగైనా అరుణాసురుడిచే గాయత్రీ మంత్ర జపం మాన్పించాలని పథకం వేసి, దేవ గురువైన బృహస్పతిని అతడి దగ్గరకు పంపారు. బృహస్పతి తాను కూడా గాయత్రీమాత భక్తుడినని అరుణాసురుడితో చెప్పడం వలన దేవతలు చేసే అమ్మవారి జపాన్ని తాను చేయనని చెప్పి అప్పటి నుండి అరుణాసురుడు గాయత్రీ మంత్ర జపాన్ని ఆపేశాడట. అందుకు ఆగ్రహించిన ఆదిపరాశక్తి భ్రమరం(తుమ్మెద) రూపం ధరించి అసంఖ్యాకమైన భ్రమరాల సృష్టిచేయగా అవి అరుణాసురుడినీ, అతడి సైన్యాన్ని సంహరించాయట. అప్పటి నుండి పరాశక్తి అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు వచ్చిందట.

శ్రీశైలక్షేత్రం వెలసిన కాలానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలైతే ఏవీ లేవనేది పురాణకారుల అభిప్రాయం. అయితే అష్టాదశ పురాణాల్లో, మహాభారతం, రామాయణం మొదలైన ఇతిహాసాల్లో శ్రీశైలానికి సంబంధించిన ప్రస్తావనలైతే కనిపిస్తాయి. సంస్కృత, ఆంధ్ర, కన్నడ, మరాఠీ భాషలకు సంబంధించిన కవులు చేసిన పలు రచనల్లో ఈ క్షేత్రానికి సంబంధించిన వర్ణనలు మాత్రం గోచరిస్తున్నాయి. స్కాందపురాణంలోని శ్రీశైల ఖండం ఈ క్షేత్రానికి సంబంధించిన మహత్యం గురించి తెలియజేస్తున్నది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కొంతకాలం ఈ క్షేత్రంలో తపస్సునాచరించి “శివానంద లహరి’ రచనతో ఈశ్వరుడిని అర్చించడమే కాకుండా, భ్రమరాంబికా మాత సన్నిధిలో శ్రీ చక్రాన్ని కూడా ప్రతిష్ఠించారనడానికి ఆధారాలు కలవు. తెలుగు, సంస్కృతం, కన్నడ భాషల్లో రచించబడిన అనేక కావ్యాల్లో శ్రీశైల క్షేత్రం అత్యంత సుమనోహరంగా వర్ణించబడింది.

ఆలయ నిర్మాణము

మల్లికార్జునాలయ ప్రాకారము లోపలి భాగంలో నాలుగు మండపములతో అపురూపమైన శిల్ప సంపదను కలిగి ఉండి చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడి ప్రధాన గర్భాలయంలో ఎటువంటి శిల్పకళ లేకుండా చూడడానికి సాధారణ నిర్మాణంగా దుర్బేధ్యమైన రక్షణ కవచంతో నిర్మించినట్లుగా ఉంటుంది. ఇక భ్రమరాంబికా అమ్మవారి ఆలయంలో మాత్రం అందమైన శిల్పకళా తోరణాలను కలిగిన స్తంభాలు దర్శనమిస్తాయి. ఇక్కడి గర్భాలయానికి గల వెనుక భాగంలో ఉన్న గోడకు చెవిని ఆనిస్తే ఝుమ్మనే భ్రమరనాధం వినవచ్చును. అడుగుభాగం సైతం కనిపించే స్వచ్ఛమైన నీరు కలిగి ఉన్న మనోహర గుండము ఇక్కడ ఉన్నది. ఈ క్షేత్రం ఎంతో ఎత్తయిన ప్రదేశమైనప్పటికీ ఇక్కడి రాళ్ళలో ఇంత స్వచ్ఛత కలిగి సహజసిద్ధమైన నీరు ఉండటం వీక్షకులకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

వృద్ధ మల్లిఖార్జున లింగం ప్రత్యేకత

పూర్వం ఒకనాడు పార్వతీ మాత పరమేశ్వరుడితో తన వివాహం జరగాలని స్వామిని కొలిచి తపస్సు చేయగా ఆ తల్లి తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ఒక వృద్ధుని రూపంలో ప్రత్యక్షమయ్యాడట. వృద్దరూపంలో వచ్చిన స్వామిని చూసి అమ్మవారు ఈ అవతారం ఏమిటి స్వామి అని ప్రశ్నింగా, దానికి స్వామి నేను అనాదినుండీ ఉన్నవాడను కావున నా రూపం ఇదే విధంగా ఉంటుంది. ఈ రూపంలో ఉన్న నేను నీకు ఇష్టమైతే వివాహం చేసుకో అన్నాడట. దానికి పార్వతీమాత పరమేశ్వరా మీ తత్వం నాకు తెలియదా, మీరు ఏ రూపంలో ఉన్నా కూడా నాకు సమ్మతమే అని మహాదేవుడిని వివాహమాడిందట. అలనాడు పార్వతీ మాతకు సాక్షాత్కారమైన వృద్ద మల్లిఖార్జునుడు శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి కుడివైపున నేడు వృద్ధ లింగ రూపంలో దర్శనమిస్తాడు.

శ్రీశైల క్షేత్రాన్ని పంచపాండవులు దర్శించుకున్నారనడానికి నిదర్శనంగా ప్రధాన దేవాలయానికి వెనక భాగంలో ఒక్కొక్కరి పేరుమీదుగా ఒక్కో ఆలయం నిర్మించి, అందులో శివ లింగాలు ప్రతిష్టించబడిన ఐదు శివాలయాలు దర్శనమిస్థాయి 
ఆలయ విశిష్టత

ఈ ఆలయాన్ని వీరశైవులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వీరశైవులు మల్లికార్జునుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు. మల్లికార్జునుడి పూజాకార్యక్రమాలు వీరశైవానికి చెందిన అర్చకులు, అదేవిధంగా భ్రమరాంబకు సంబంధించిన పూజా కార్యక్రమాలు బ్రాహ్మణ అర్చకులు నిర్వర్తిస్తారు. ఇటువంటి విశిష్ట సాంప్రదాయం ఈ ఆలయంలో మాత్రమే గోచరిస్తుంది. ఆరాధ్యులు శివపార్వతుల కల్యాణాన్ని జరిపిస్తారు. ఇక్కడి పరివార దేవతలకూ, ఉత్సవమూర్తులకు సంబంధించి వస్త్రాలంకరణను చెంచులు విధిగా జరుపుతారు. ఇతర ఏ శైవక్షేత్రంలో లేని ప్రత్యేకతలు శ్రీశైల ఆలయంలో గోచరిస్తాయి.

ఆలయంలో పూజా సమయంలో చెప్పే సంకల్పంలో శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కులో కూర్చొని భగవదారాధన చేస్తున్నదీ విధిగా పేర్కొనడండమనేది ఇక్కడి ప్రమాణానికి నిదర్శనం. పాతాళగంగ అనే పేరుతో కృష్ణానది ఉత్తరవాహినిగా, బ్రహ్మ విష్ణు రుద్ర గిరులనబడే పర్వతాలను తాకుతూ ఇక్కడ ప్రవహిస్తున్నది.

శ్రీశైల క్షేత్రానికి నాలుగు రకాలైన ప్రధాన ద్వారాలు కలవు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో గల త్రిపురాంతకాన్ని తూర్పుద్వారం అనీ, జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రముఖ శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ క్షేత్రాన్ని పశ్చిమద్వారం అనీ, కడప జిల్లాలో గల సిద్ధవటంను దక్షిణద్వారం అనీ, మహబూబ్ నగర్ జిల్లాలో గల ఉమామహేశ్వరాన్ని ఉత్తరద్వారం అని పిలుస్తారు. ఆగ్నేయంగా పుష్పగిరి, నైరుతిదిశలో సోమశిల, వాయువ్యంలో సంగమేశ్వర, ఈశాన్యంలో ఏకేశ్వర క్షేత్రాలు కొలువుదీరి ఉన్నవి.

ఆలయ బ్రహ్మోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో ప్రతి సంవత్సరం రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి సమయంలో ఒకసారి, మహాశివరాత్రి సందర్భంగా మరొకసారి ఉత్సవాలు జరుగుతాయి. తొలిరోజు సాయంవేళ ధ్వజారోహణ, భేరీపూజ, దేవతాహ్వనాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు నుండి ప్రతిరోజు ఆదిదంపతులను పలు రకాల వాహనాలపై కొలువుదీర్చి సేవలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ ఘడియల్లో వేద పండితులూ, అర్చకులచే మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం జరుపబడుతుంది. ఆ తరువాత శివపార్వతుల కల్యాణం వైభవోపేతంగా నిర్వహిస్తారు. కళ్యాణోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రభోత్సవం, తెప్పోత్సవాలను నిర్వహిస్తారు.

క్షేత్ర అభివృద్ధి – చారిత్రక ఆధారాలు

లభించిన శిలాశాసనాలు, చారిత్రక ఆధారాల ద్వారా పూర్వకాలం నుండే అనేక రాజవంశీయులు శ్రీశైలక్షేత్రాన్ని సేవించినట్లు తెలుస్తున్నది. శాతవాహనులు, ఇక్ష్వాక, విష్ణుకుండిన, పల్లవ, రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ, రెడ్డిరాజ్య, విజయనగర తదితర రాజ్యాల పాలకులు శ్రీమల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవీ అమ్మవార్లను ఆరాధించేవారనడానికి చారిత్రక సాక్షాలు కలవు. ఆలయంలో అనేక ప్రాకారాలు నిర్మింపజేసి, అశేష వస్తుసంపదలు సమర్పించారనడానికి అనేక ఆధారాలు కూడా కలవు. ఆరవ శతాబ్దం నాటిదని భావిస్తున్న మైసూరు కదంబరాజుల తాల్గుండి శాసనంలో శ్రీశైలక్షేత్ర ప్రస్తావన కలదు. పద్నాల్గవ శతాబ్దంలో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన శాసనంలో కూడా శ్రీశైలక్షేత్ర పూర్వ చరిత్రకు సంబంధించి మూలాలు కలవు. ఈ శాసనం ప్రస్తుతం చెన్నైలోని మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నది.

ప్రస్తుతం శ్రీశైల క్షేత్రం ఉన్న ప్రాంతాన్ని కదంబ మయూర వర్మ ఆరో శతాబ్దంలో పాలించాడు. అదే విధంగా ఏడవ శతాబ్దంలో చాళుక్యులూ, పదవ శతాబ్దం వరకూ రాష్ట్రకూటుల ఏలుబడిలో ఈ ప్రాంతం ఉండేది. అప్పట్లో జరిగిన యుద్ధాల కారణంగా తరువాత కాలంలో ఈ క్షేత్రం వెలనాటి ప్రభువుల అధీనంలోకి వచ్చింది. ఇక కాకతీయుల పరిపాలన ప్రారంభమైనప్పటి నుండి యావత్ తెలుగుప్రాంతం ఏకీకృతమవడంతో శ్రీశైల క్షేత్రం మరింత ప్రభావవంతమైన క్షేత్రంగా వర్ధిల్లింది. కడపటి కాకతీయ చక్రవర్తులైన గణపతి దేవుడు, రుద్రమ, రెండవ ప్రతాపరుద్రుల కాలంలో ఈ క్షేత్రం పరిపూర్ణమైన అభివృద్ధికి నోచుకొన్నది. కాకతీయుల అనంతరం రాజ్యస్థాపన చేసిన రెడ్డిరాజుల కాలంలో ప్రోలయ వేమారెడ్డి పాలనలో శ్రీశైలం ప్రాభవం ఉచ్ఛస్థితికి చేరింది. ఆ తరువాత విజయనగర రాజుల కాలంలో రెండో హరిహరరాయలు ఈ క్షేత్రానికి దక్షిణ గోపుర ద్వారాన్నీ, ముఖమంటపాన్నీ నిర్మింపజేశాడు. తుళువంశంలో ప్రముఖుడైన శ్రీకృష్ణదేవరాయలు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఒక గాలిగోపురాన్ని నిర్మించి, శ్రీశైల క్షేత్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించి నిత్యం ఈ క్షేత్రాన్ని దర్శించేవాడు. మహారాష్ట్ర సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహరాజ్ తన పరిపాలనా కాలంలో శ్రీశైలం ఉత్తర దిక్కున ఒక గాలిగోపురాన్ని నిర్మింపజేశాడనడానికి ఆధారాలు కలవు. ఆ తరువాత పాలించిన మహ్మదీయ పాలకులు సైతం ఈ క్షేత్ర పవిత్రతను గుర్తించి మల్లికార్జునుడికి మాన్యాలూ, ఆస్తులు సమర్పించారు.

భారతదేశంలో బ్రిటీష్ వారి పాలన ప్రారంభమైన తరువాత దేవాలయ నిర్వహణ పుష్పగిరిమఠం ఆధీనంలోకి వచ్చింది. ఆలయ అభివృద్ధికిగాను 1929లో ఒక ప్రత్యేకమైన మేనేజ్ మెంట్ బోర్డు రూపొంచారు. భారతదేశ స్వాతంత్ర్యానంతరం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ ఆధీనంలోకి వచ్చిన ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తుల పాలిట కల్పతరువుగా వెలుగొందుతున్నది.

 దర్శనీయ ప్రదేశాలు

శ్రీశైల క్షేత్ర పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలు కలవు. శ్రీశైల యాత్రకు వెళ్ళిన వారు తప్పకుండా దర్శించాల్సిన కొని దేవాలయాలు గలవు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. భక్తులకు ఇక్కడి ఆలయాలు తమవైన అనుభూతులను మిగులుస్తాయి.

1. సాక్షిగణపతి ఆలయం

ఇక్కడి గణపతి పరమశివుడి భక్తుల భక్తికీ, వారు చేసిన శ్రీశైల యాత్రకు మొదటి సాక్షిగా నిలుస్తాడని భక్తుల విశ్వాసం. భక్తులు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు కనుక ఈ స్వామి సాక్షి గణపతిగా ప్రసిద్ది చెందాడు. అందుకే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించేందుకు వెళ్ళిన భక్తులు సాక్షిగణపతిని మొదట సందర్శించి ఆ తరువాతనే శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలనీ, అప్పుడు సాక్షి గణపతి ఈ యాత్రను నమోదు చేసి తన తల్లిదండ్రులకు తెలియజేస్తాడనినే కథనం ప్రచారంలో ఉన్నది. శ్రీశైలంలో కొలువుదీరిన మల్లిఖార్జున సమేత భ్రమరాంబికా దేవిల దర్శనం పొందిన వారికి కైలాస ప్రవేశానుమతి లభిస్తుందని, మోక్షార్హతను నిర్ణయించేది సాక్షి గణపతి అని కూడా భక్తుల నమ్మకం. తాము ఇక్కడి క్షేత్రాన్ని సందర్శించినట్లు ఈ గణపతి సాక్షిభూతమని నమ్ముతారు. సాక్షి గణపతి ఆలయం శ్రీశైలం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉటుంది.

2. భీముని కొలను

సాక్షిగణపతి ఆలయం తరువాత వచ్చే పాపనాశన తీర్థానికి ఎదురుగా కాలిబాట ద్వారా వెళితే భీముని కొలనుకు చేరవచ్చు. ఈ మార్గం ద్వారా ఒక కిలోమీటరు తరువాత ఒక మహాద్వారం ఎదురవుతుంది. ఇక్కడ వందల అడుగుల లోతులో ఉన్న లోయల మధ్య, త్రివేణీ, త్రిపర్వత శ్రేణుల మధ్య రెండు పాయలుగా జారే సెలయేళ్లు జలపాతాలుగా కిందికి పడడం రమణీయ దృశ్యంగా గోచరిస్తుంది. ఈ జలపాతాల కింద ఉండే నీటి కొలనుని భీముని కొలను అంటారు.

ఈ కొలను ఏర్పడడానికి ఒక ఆసక్తికర పురాణ కథనం ప్రచారంలో కలదు. మహాభారత కాలంలో లోమశ మహర్షితో కలిసి పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి చేరుకోగానే వారి ధర్మపత్ని ద్రౌపదికి దాహం వేయడంతో ఇక్కడి పరిసరాలలో భీముడికి ఎక్కడా నీటి జాడ లభించలేదనట. అప్పుడు లోమశ మహర్షి ఒక శిలను భీముడికి చూపి దానిని బద్దలుకొడితే నీరుంటుందని తెలిపాడట. భీముడు తన గదతో ఆ శిలను పగుల గొట్టగానే అందులో నుండి నీటి ధారలు పైకి ఉబికి వచ్చి ఆ నీటితో ఒక కొలను ఏర్పడిందట. ఆ విధంగా భీముడి వలన ఏర్పడిన కొలను భీముని కొలనుగా ప్రసిద్ధి చెందిది. ఇదే ప్రదేశంలో భీముడు ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. ఆ లింగమే భీమలింగంగా పూజలు అందుకుంటున్నది.

3. హటకేశ్వరం

శ్రీశైలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో హటకేశ్వరం ఉన్నది. కేశప్ప అనే భక్తుడిని స్వర్ణలింగ రూపంలో ఈశ్వరుడు అనుగ్రహించిన ప్రదేశమే హటకేశ్వరంగా ప్రసిద్ధి. ఇక్కడ కొత్త కుండ పెంకులో స్వయంభూ బంగారు శివలింగం దర్శనమిస్తుంది. కుండలు తయారు చేసే ‘అటిక’లో ఈశ్వరుడు వెలిసినందున అటికేశ్వరంగా పిలువబడి కాలక్రమేణా హటకేశ్వరంగా ప్రసిద్ధిగాంచింది. ఇదే ప్రదేశంలో బ్రహ్మధార, విష్ణుధార, రుద్రధార, చంద్రధార, దేవధార అనే పంచ ధారలు నిత్యం జాలువారుతూ ఉంటాయి. వీటిని పంచధారగా పిలుస్తారు. ఇదే ప్రదేశంలో కొండలపై నుండి పడుతున్న నీరు పరమశివుడి లలాటాన్ని తాకి కిందికి జాలువారే ధారను ఫాలధారగా పిలుస్తారు. ఆదిశంకరాచర్యుల వారిచే పావనం చేయబడిన ఫాలధార, పంచధారలు పర్యాటకులకు సుందర దృశ్యాలుగా గోచరిస్తాయి.

4. శిఖరేశ్వరం

శ్రీశైలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శిఖరం ఉంటుంది. శిఖరేశ్వరం అనే ఈ కొండ పైనున్న నంది కొమ్ముల మధ్య నుండి చూసినపుడు శ్రీశైల శిఖర దర్శనం కలిగితే పునర్జన్మ ఉండదనేది భక్తుల విశ్వాసం. ఇక్కడి నుండి లభించే శ్రీశైల శిఖర దర్శనం సర్వ పాపహరణమనేది కూడా భక్తుల నమ్మకం.

5. పాతాళగంగ

శ్రీశైల క్షేత్ర దర్శనార్ధమై వెళ్ళిన భక్తులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో పాతాళగంగ ఒకటి. కొండ పైభాగం నుండి కనిపించే లోయలో పాతాళగంగ ఉండడం వలన అక్కడికి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంటుంది. పాతాళగంగ కింది నుంచి పైకి వెళ్లే మార్గాన్ని చూస్తే ఆ పేరు ఈ ప్రాంతానికి ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. ఈ సందర్శన పర్యాటకులకు ఒక మంచి అనుభూతినిస్తుంది.

6. అక్కమహాదేవి గుహలు

కృష్ణానదికి ఎగువ భాగంలో అక్కమహాదేవి గుహలు కలవు. ఇక్కడికి చేరుకోవలంటే కృష్ణానదిలో బోటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ గుహలు పూర్వ చారిత్రక యుగానికి చెందినవనే ఆధారాలు కూడా కలవు. ఇవి సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు. కర్ణాటక ప్రాంతానికి చెందిన గాయని మరియు వేదాంతి అయిన అక్కమహాదేవి ఈ గుహల్లో గల శివ లింగానికి తపస్సు, పూజలు చేసి శివుడే తన సర్వస్వంగా భావించింది. అందువల్ల ఈ గుహలకు అక్కమహాదేవి గుహలు అనే పేరు స్థిరపడినది.

7. ఇష్టకామేశ్వరిదేవి ఆలయం:

దేశంలో ఈ పేరుతో శ్రీశైలక్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం లేదు. శ్రీశైలం కూడలి నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రదేశంలో ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి ఆలయం నెలకొని ఉంటుంది. అటవీ ప్రాంతంలో వెలసిన ఈ అమ్మవారు పూర్వం కేవలం సిద్ధులచే మాత్రమే కొలవబడేది. ఈ ప్రదేశం అటవీశాఖ వారి ఆధీనంలో ఉండడం వలన ఉదయం నుండి సాయంత్రం వరకు పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. శ్రీశైలం నుండి ఈ ప్రదేశానికి చేసే ప్రయాణం సాహసంతో కూడుకొని ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని సేవించి ఏవైనా కోరికలు కోరుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయనే బలమైన నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఉంటుంది. చతుర్భుజాలు కలిగి రెండు చేతులలో తామర మొగ్గలు; ఒక చేతిలో శివలింగం, మరో చేతిలో రుద్రాక్షమాలతో జపం చేస్తున్నట్లుగా అమ్మవారి విగ్రహం ఉంటుంది. గుహలాగా అనిపించే దేవాలయంలో దీపాల వెలుతురులో అమ్మవారిని దర్శించుకోవడం మరిచిపోలేని ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది.

8. శ్రీశైలం డ్యామ్

శ్రీశైల క్షేత్రం నుండి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిపై ఈ డ్యామ్ నిర్మితమై ఉన్నది. పాతాళగంగ స్నానఘట్టానికి ఒక కిలోమీటరు దూరంలో దిగువన ఈ డ్యామ్ ఉంటుంది. ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనిపై నుండి చూస్తే పరవళ్ళు తొక్కుతున్న కృష్ణానది పర్యాటకులను పరవశింపజేస్తుంది.

శ్రీశైల క్షేత్రానికి సమీపంలో చెంచులక్ష్మి గిరిజన ప్రదర్శన శాల, కదలీవనం, శివాజీ సాంస్కృతిక స్మారక భవనము, ఆది శంకరాచార్యుల తపోవనము లాంటివి దర్శ నియస్థలాలు వున్నాయి 🙏


🔥సర్వేజనసుఖినోభవంతు 🔥

ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు ......!!

 🔥ఆదిదేవుని ప్రమధ గణాలు ఎవరు ......!! 🔥

🌼🏵️🌼🏵️🌼🏵️🌼🏵️🌼

🌸'ప్రమథ' అంటే బాగా మథించగలిగె వారని అర్థం. వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి గలవారు. దేవతలను కూడా శిక్షించ గలవారు. 
వీరంటే దేవతలకు భయము, మరియు భక్తి. దేవతలు తప్పు ద్రోవ పడితే వారిని నిగ్రహించే వారు ప్రమథులు. వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులై సంచరిస్తాడు.
 రుద్ర సూక్తం లోని ఏకాదశ అనువాకంలో " సహస్రాణి సహస్రశో యే రుద్రా అది భూమ్యాం .." అంటే వీరు అన్నిచోట్లా వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు. కోట్లకొలది గణాలు ఉంటారు. 

మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాయుజ్యం పొంది రుద్ర గణాలుగా ఉండి పోతారని ప్రతీతి.

🌸 అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు. వీరిలో ముఖ్యులు:

🌷వీరభద్రుడు: 🌷

దక్షయజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి, విష్ణ్వాది దేవతలను శిక్షించిన శివ జటోధ్భవుడు. తిరుగు లేని పరాక్రమవంతుడు. 

🌸సాక్షాత్ శివస్వరుపంగా పోగడబడే వాడు. అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి.

🌷ఆది వృషభం: 🌷

ధర్మదేవత. శివున్ని మోయ గలిగె వరం పొంది, అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభ మూర్తి. విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మ దేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు.

🌷 నందీశ్వరుడు:🌷

🌸 శిలాదుని పుత్రుడు. అది వృషభం యొక్క అవతారం. శివునికి రక్షగా, ఆంతరంగికునిగా ఉండే గణ మూర్తి. కైలాసానికి ఎవరు వచ్చినా ఇతని అనుమతి పొందితే గానీ శివదర్శనం లభించదు.

🌷 భృంగి:🌷

శివుని యొక్క పరమ భక్తుడు. భ్రమరము లాగా శివుని చుట్టూ ప్రదక్షణం చేయడం పనిగా ఉన్న వాడు కాబట్టి భృంగి అని పిలవబడ్డాడు.

🌸 కేవలం శివున్ని ఆరాధిస్తూ పార్వతీ దేవిని విస్మరించి శాపగస్తుడై తల్లి వల్ల వచ్చే రక్త, మాంసములను కోల్పోయి పడిపోతే శివుడు మూడవ కాలు ప్రసాదించాడు. 

🌷స్కందుడు: 🌷

కుమారస్వామి శివకుమారుడు. దేవసేనాధిపతి. బ్రహ్మజ్ఞాని.

🌸 పై ఐదుగురు వీరమహేశ్వర గురువులు. వారి గోత్ర పురుషులు. నేటికీ వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు.

 రేణుక, దారుక, ఘంటకర్ణ, విశ్వకర్ణ, ధేనుకర్ణ: 

🌸శివుని పంచముఖాల నుండి ఉద్భవించిన గణశ్రేష్ఠులు. భూమిపైకి అయోనిజులై లింగమునుంది వచ్చి పంచ మఠములను స్థాపించి, శివాద్వైతాన్ని బోధించారు. మరల లింగైక్యు లయ్యారు.

🌷కాలాగ్నిరుద్రుడు లేదా కాలభైరవుడు: 🌷

బ్రహ్మ ఐదవ తలను తీసేసిన రుద్రుడు. కపాల హస్తుడు. కాశీ పురాధీశుడు

🌷రిటి: 🌷

ఉద్దాలకుని పుత్రుడు. శివకృప చేత పరమ జ్ఞానిగా మారి శివ గణములలో చేరాడు.

🌷బాణుడు: 🌷

🌸శివుని పరమభక్తుడు. శివునితోనే యుద్ధం కోరాడు. తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు. శ్రీ కృష్ణునితోయుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు. నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణ లింగాలని పిలువ బడతాయి.

🌷 చండీశుడు: 🌷

🌸ఒక గోప బాలుడు. శివపూజకు గుడిలో అనుమతించరు అని, గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రె పాలతో పూజించాడు. భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్న తన తండ్రి కాలినే నరికేసాడు. కైలాసం నుండి శివుడు పరుగున వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని, శివ ఉచ్చిష్టంపై అధికారాన్ని కలిగించాడు. శివ నింద చేసేవారికి అతడు చండశాసనుడు.

🌸ఇలా ఎందరో ప్రమథ నాయకులు.
దదీచి, అగస్త్యుడు, ఉపమన్యుడు, పప్పిలాదుడు, దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినారు. అంతే గాక విభూతి, రుద్రాక్షలు, శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతో మంది శివయోగులు కూడా ప్రమథ కులము వారే.

🌸 బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు, అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు. కేవలం శివకర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు. 
అనన్యశివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము. ఈనాటికీ వీరు వీరమాహేశ్వరులని, జంగమదేవతలని పిలువబడతారు.

🌸 ఇక జంగమలు గురుపరంపరలో ఉంటే, శిష్య పరంపర చెందిన శివశరణలు కూడా గణములలో స్థానం పొందారు. ఎంతో మంది స్త్రీలు శరణలయ్యారు. అక్క మహాదేవి, హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు. 12వ శతాబ్దానికి చెందిన బసవ, అల్లమ ప్రభు, చెన్నబసవ, సిద్ధరామ ఇత్యాది శరణలెళ్లరు శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతుంది.

🌸గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది. కొందరు శివ సారూప్యం తో ఉంటారు, కొందరు ఇచ్చాధార రూపాలతో ఉంటారు. రకరకాల ముఖాలతో, రక రకాల శరీరాలతో, అవయవాలలో వింతగా ఉంటారు ప్రమథ గణాలు. వీరి శక్తుల, లీలల గురించి తెలుసుకోవాలంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే!! వీరి పేర్లు తలచుకోవడమే మహా ప్రసాదము.
సర్వం శివమయం.. హరహర మహాదేవ శంభోశంకరా.🙏

🔱సర్వేజనాసుఖినోభవంతు 🔱

శ్రీరమణీయం "సత్యాన్ని మాటల ద్వారా విని మనసుతో సులభంగా కనిపెట్టటం సాధ్యమే కదా ?"

 శ్రీరమణీయం

"సత్యాన్ని మాటల ద్వారా విని మనసుతో సులభంగా కనిపెట్టటం సాధ్యమే కదా ?"

"సత్యం వాక్కుకు, మనసుకి అందనిది. ఒక శాస్త్రవేత్త చాలాకాలం పరిశోధన చేసి ఒక కొత్త విషయం కనుక్కుంటాడు. కొత్త విషయం ఎక్కడి నుండో వచ్చి పడలేదు. అది మనసులో నుంచే ఉద్భవించింది. తన మనసులో నుండే వచ్చింది కాబట్టి అది అంతకుముందే వచ్చి ఉండవచ్చు కదా ! కానీ అది అలా జరగదు. సత్యం తనంతట తానుగా స్ఫురించే వరకు మనం వేచి ఉండాల్సిందే. శాస్త్రవేత్తకు సైన్స్ పరంగా తనలోనే ఒక నూతన అంశం ఎలా ఆవిష్కరించబడిందో, ఒక సాధకుడు పొందాలనుకునే భగవదానుభవం కూడా ఏదో ఒకరోజు తనలోనే ఆవిష్కరించబడుతుంది. శాస్త్రవేత్త అయినా, సాధకుడైనా సత్యాన్వేషణ కోసం ప్రయత్నం చేస్తూ పోతే ఏదో ఒక రోజు ఫలితం దానంతట అదిగా వ్యక్తమవుతుంది. అంతేగాని ఏ సాధనలోనైనా ఫలితం మనసుకి వాక్కుకి ముందుగానే గోచరించేది కాదు !"

"దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటంలో సాధకుడు ప్రధానంగా ఎదుర్కొనేవి ఏమిటి ?"

"1.దైవం తనలోనే ఉన్నట్లు సత్యం తెలియకపోవడం. 2.దైవానుభవం అంటే తన హృదయంలో జరిగేదేనన్న విశ్వాసం కలుగకపోవటం. 3.దైవానుభవం జరిగేవరకు సహనం వహించే ఓపిక లేకపోవటం !"

"దైవం అంటే సత్యం. సత్యం అంటే ఉన్నదని అర్ధం. దైవం అనే సంపద మనలోనే ఉంది. ఈ విషయంలో మనందరం ఆస్థిపరులమే. కానీ అనుభవపరులమే ఇంకా కాలేదు. దైవం విషయంలో జ్ఞానం కలుగకపోయినా, ఆ దైవం మనలోనే ఉన్నదనే సత్యంపై విశ్వాసం రావాలి. మనలోనే ఉన్న ఆస్థి ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు మనకు తెలియకుండా పోదన్న ధీమా ఉండాలి. అలాంటి స్వాంతన వచ్చినప్పుడు దైవం అనుభవంలోకి రాలేదన్న వెలితి పోతుంది. దైవాన్ని త్వరగా తెలుసుకోవాలన్న ఆదుర్దా తగ్గుతుంది. అప్పుడు సాధన ప్రశాంతంగా సాగుతోంది !"

::: ధ్యానం అంటే విసర్జన:::

 *::: ధ్యానం అంటే విసర్జన:::*
   ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో,ఎంత సహజమో
ఎంత సౌఖ్యమో, విసర్జన కూడా అంతటిదే .
    భౌతిక విసర్జన మనకు ఇష్టం వున్నా లేకున్నా,అప్రయత్నంగా
జరిగి పోతుంది. కాని 
మానసిక విసర్జన అలా కాదు.
    *మానసిక విసర్జన అనగా ఏమిటి ???*
  మనం అనేక  మానసిక విషయాలు( నచ్చడం, నచ్చక పోవడం), బోలుడంత  జ్ఞానం సంపాదిస్తాం,(అభిప్రాయాలు, విశ్వాసాలు)  కావాల్సినంత  మానసిక జ్ఞాపకాలు(నాకు అలా అయింది,ఇలా అయింది) పోగుచేస్తాం,  అనేక అనుభవాలు (భయాలు, చికాకులు, ఆందోళన)అందుకుంటాం,
   ఇవన్నీ వర్తమాన  మానసిక, స్వేచ్ఛా జీవితానికి ఉపయోగపడవు. పైపెచ్చు అడ్డు పడతాయి.
     కనుక మరచి పోవాలి. నెమరు వేసుకోరాదు. ప్రాముఖ్యత ఇవ్వరాదు. అప్పుడు తొలగిపోతాయి. అనగా విసర్జించినట్లే .
   అపుడే జీవితం నూతనంగా, తాజాగా, యవ్వనంగా, పునః నిర్మితం అవుతూ వుంటుంది. *ధ్యాన స్థితికి ఏదీ అంటదు*
*షణ్ముఖానంద9866699774*.
 ప్రేమ కొంచెం అయినా మనసుకు కలిగే సంతోషం ఎక్కువ... సాయం చిన్నదైనా అది ఇచ్చే తృప్తి ఎక్కువ... పరుష మాట చిన్నదైనా మనసును గాయ పరుస్తోంది... అబద్దం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది..... అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది... రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది...
      ఇలా మనం తెలిచో, తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్లు పెనుభూతంగా అనగా చెడు కర్మలుగా మారి దుఃఖ సహిత జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు... చిన్న చిన్న చెడు అలోచనలు అనే మర్రి గింజంతంగ ఉన్నవి మహా వట వృక్షంగా ఎదిగి జనన మరణ చక్రబందంలలో ఇరుక్కొని ప్రతి జన్మ రక రకాల కష్టాలతో జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు... ఇవన్నీ మనసు మాయగాడు అడే వింత నాటక చదరంగంలో మానవులు పావులుగా అనగా రాజు, మంత్రి, ఏనుగు, గుర్రం,శకటం, బటుడు పాత్రాలను పోషిస్తారు.. అందమైన జీవితాన్ని సుందరంగా,ఆనందంగా జీవించాలి అంటే మనసుకు పగ్గాలు వేసి ఆత్మ జ్ఞానం పొంది అందరిలోనూ ఉన్న ఆత్మను పరమాత్మగా మార్చుకునే అవకాశం అందరికీ ఉంది... అదే సరైన సాధన.. సరైన సాధన ద్వారా త్రికాల జ్ణానం పొంది అనగా భూత వర్తమాన భవిష్యత్ తెలుసుకొని నిరంతరం ఎరుకతో దుఃఖ రహిత జీవితం అనుభవిస్తూ దుఃఖ రహిత సమాజం కొరకు కృషి చేస్తారు... సాధన మొదలు పెట్టండి బ్రహ్మ ముహూర్తంలో 3.35 నుండి మొదలు.... అంతులేని అనంతమైన విశ్వ శక్తిని పొందండి.
బ్రహ్మ ముహూర్తంలో సాధన చేసి ఈ సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తున్నాను.
పసుపుల పుల్లారావు, ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం
9849163616

దెబ్బకు ఏడుమంది (మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్యకథ)

 *దెబ్బకు ఏడుమంది (మిమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్యకథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒకూరిలో ఒక పిల్లోడు వుండేటోడు. వాడు పెద్ద సోమరిపోతు. ఎప్పుడూ ఏ పనీ చేయకుండా గప్పాలు కొట్టుకుంటా ఊరంతా తిరిగేటోడు. ఒక రోజు వాడు ఇంట్లో కూచోని, వాళ్ళమ్మ చేసిన నేతిలడ్లు తింటా వుంటే... ఆ కమ్మని వాసనకు ఎక్కడెక్కడి ఈగలన్నీ వచ్చి రయ్యమని ముసురుకున్నాయి. ఎన్నిసార్లు తోలినా అవి మళ్ళీ మళ్ళీ రాసాగినాయి. దాంతో వానికి బాగా కోపమొచ్చింది. ఇట్లాగయితే లాభం లేదనుకోని ఈసారి ఈగలన్నీ వాలగానే ఒక్కసారిగా రెండుచేతులతో పట్టుమని ఒక్కటి కొట్టినాడు. అంతే దెబ్బకి ఏడు వచ్చి కిందబన్నాయి. వాటిని చూసి వాడు “అబ్బ... నేనెంత వీరున్ని ఒక్కదెబ్బకి ఏడింటిని చంపేశాను" అని సంబరపడినాడు. వెంటనే ఒక బట్టలు కుట్టే దర్జీ దగ్గరికి పోయి భుజమ్మీద నుండి నడుము వరకు వేలాడేటట్టు ఒక పెద్ద పట్టీని కుట్టిచ్చుకున్నాడు. దాని మీద “దెబ్బకి ఏడుమంది" అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించి అంగీ మీద తగిలించుకున్నాడు. అట్లా తగిలిచ్చుకొనేసరికి వానికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది.
వానికి తన బలం ఆవూరి మహారాజుకి చూపించి అక్కడ ఏదయినా మంచి వుద్యోగం సంపాదించాలనిపించింది. రాజుండేది పక్క ఊరిలో, మధ్యలో పెద్ద అడవి వుంది. దాన్ని దాటాల. దాంతో వాడు దారిలో ఆకలయితే తినడానికని జేబు నిండా లడ్లు వేసుకొని బైలుదేరినాడు. అట్లా అడవిలో పోతావుంటే, దారిలో ఒకచోట ఒక గద్ద ఒక పిట్టను పట్టుకోవడం కనిపించింది. వెంటనే వీడు అయ్యో పాపమని జాలిపడి
వెంటనే ఒక రాయి తీసుకోని గద్దను ఈడ్చి ఒక్కటి పెరికినాడు. ఆ దెబ్బకు అది అదిరిపడి అక్కడికక్కడే పిట్టను వదిలి పారిపోయింది. వాడు ఆ పిట్టను తీసుకోని దానికి నీళ్ళు తాపి, గింజలు పెట్టి భద్రంగా జేబులో వేసుకొని పోసాగినాడు.
ఆ అడవి మధ్యలో ఇద్దరు పెద్ద పెద్ద రాక్షసులున్నారు. వాళ్ళకి అడవిలో ఎవరయినా మనిషి కనబడితే చాలు వెంటబడి చంపి తినడం అలవాటు. అందుకే అటువైపు ఎవరూ వెళ్ళేటోళ్ళు కాదు.
కానీ వీనికి ఆ రాక్షసుల సంగతి తెలీదు. దాంతో అట్లాగే పోయినాడు.
చానా రోజుల నుంచి మనుషులెవరూ దొరకక అల్లాడతావున్న రాక్షసులు వీన్ని చూడగానే లొట్టలేస్తా ఎగురుకుంటా వచ్చి “రేయ్ ఎవడ్రా నువ్వు. మా అడవిలోకి రావడానికి ఎంత ధైర్యం నీకు" అన్నారు గట్టిగా. వాళ్ళని చూడగానే మనోనికి గుండె గుభేలుమనింది. కాళ్ళు, చేతులు వణికిపోయినాయి. అయినా ధైర్యం కూడగట్టుకోని "నేనెవరినా, ఇదిగో చూడండి" అంటూ పట్టీని చూపించినాడు. దాని మీద దెబ్బకి ఏడుమంది అని వుంది గదా... అది చూసి రాక్షసులు ఆచ్చర్యపోయి “మా మోకాలెత్తు లేవు. నీవు దెబ్బకి ఏడుమందిని చంపినావా మేము నమ్మము" అన్నారు. దానికి వాడు నవ్వి “సరే... అయితే ఏదయినా పోటీ పెట్టుకుందాం. సరేనా" అన్నాడు. ఆ రాక్షసులిద్దరూ 'సరే' అన్నారు.
మొదట ఒక రాక్షసుడు ఒక రాయి తీసుకోని "నువ్వు నాలాగా రాయిని చేత్తో ముక్కలు చేయాల. చేస్తావా" అంటూ రాయిని గట్టిగా నొక్కినాడు. వాని బలానికి అది ముక్కలు ముక్కలు అయ్యింది. అది చూసి మనోనికి ఏం చేయాల్నో అర్థం కాలేదు. అంతలో జేబులో వున్న లడ్డు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ రాక్షసులకు కనబడకుండా అది బయటికి తీసి అరచేతిలో దాచి పెట్టుకోని “రాయిని ముక్కలు ముక్కలు చేయడం ఏం గొప్పతనం. ఆ మాత్రం పని ఏ గొట్టంగాడయినా చేస్తాడు. నన్ను చూడు ఏకంగా రాయిలోంచి నూనెను గూడా పిండగలను" అంటూ ఒక రాయి తీసుకోని గట్టిగా పిసకసాగినాడు. ఆ చేతిలోనే నేతిలడ్డు గూడా వుంది గదా... దాంతో గట్టిగా ఒత్తేసరికి అందులోనించి కొన్ని నేతిచుక్కలు కారి కిందబడినాయి. అది చూసి రాక్షసులు అదిరిపడి "అబ్బో వీడెవ్వడోగానీ నిజంగానే మనకన్నా బలవంతునిలాగున్నాడే" అనుకున్నారు.
అయినా అనుమానం తీరక, రెండో రాక్షసుడు "సరే ఇందులో నువ్వే గెలిచినావుగానీ ఇంకొక పోటీ పెట్టుకుందాం. మనిద్దరమూ చెరొక రాయి విసురుదాం. ఎవరిది దూరంగా పడితే వాళ్ళు గెలిచినట్టు" అన్నాడు.
"సరే నువ్వు ముందు విసురు" అన్నాడు వాడు.
రాక్షసుడు ఒక రాయి తీసుకోని తన బలమంతా వుపయోగించి వేగంగా విసిరినాడు. అది సర్రున చానా దూరం పోయి దబ్బుమని చప్పుడు చేస్తూ ఒకచోట పడింది. 
తరువాత వీడు విసరాల గదా. రాక్షసునికన్నా దూరం ఎలా విసరాలబ్బా అని ఆలోచిస్తా వుంటే జేబులో వున్న పిట్ట గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ రాక్షసులకు కనబడకుండా జేబులోని పిట్టను తీసి "ఆ మాత్రం దూరం ఏ గొట్టంగాడయినా విసురుతాడు. నేను చూడు కనీసం చిన్న చప్పుడు గూడా వినిపించనంత దూరం విసురుతా" అంటూ ఆ పిట్టను విసిరినాడు. అంతే అది సర్రున ఆగకుండా ఎగిరిపోయింది. అది చూసి రాక్షసులు అదిరిపడి “అబ్బో... వీడెవడో నిజంగానే మనకన్నా బలవంతునిలాగున్నాడే" అనుకున్నారు. 
వెంటనే "నువ్వే మా కన్నా బలవంతునివి అని ఒప్పుకుంటాం. ఇప్పటికే బాగా చీకటి పడింది. ఈరోజు రాత్రికి మా ఇంటికి వచ్చి మేమిచ్చే విందు తీసుకోని మా ఇంట్లోనే పడుకో. రేప్పొద్దున్నే పోదువుగాని” అన్నారు. వాడు సరేనంటూ దగ్గర్లోనే వున్న వాళ్ళ ఇంటికి పోయినాడు.
రాక్షసులు వానికి ఆ రాత్రి మంచి మంచి పిండివంటలు పెట్టి తిన్నాక పండుకోడానికి ఒక పెద్ద గది చూపించినారు. దాంట్లో పెద్ద మంచమూ, మెత్తని పరుపులూ వున్నాయి. పోయి పండుకున్నాడుగానీ వానికి రాక్షసుల పైన నమ్మకం కుదరలేదు. కాసేపున్నాక చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటా ఆ రాక్షసులున్న గదికాడికి వచ్చినాడు. అప్పుడే ఒక రాక్షసుడు ఇంకో రాక్షసునితో “ఒరేయ్ ఇంతవరకూ వీడు తప్ప మనలని ఎదిరించి నిలబడిన వీరుడెవడూ లేడు. వీన్ని ఇట్లాగే వదిలేసినామంటే విషయం అందరికీ తెలిసి మన మర్యాద పోతాది. అందుకే ఎట్లాగయినా సరే... ఈ రాత్రే వాన్ని పండుకున్నోన్ని పండుకున్నట్టు ఇనుపస్తంభాలతో కొట్టి చంపేద్దాం" అన్నాడు. రెండోవాడు 'సరే' అన్నాడు.
కిటికీ పక్క నుండి ఆ మాటలన్నీ విన్న ఆ పిల్లోడు "ఓహో! ఇదా సంగతి" అనుకోని పరుగుపరుగున గదిలోనికి పోయి మంచం మీద దిండ్లన్నీ వరుసగా పెట్టి, వాటి మీద దుప్పటి నిండుగా కప్పి దీపాలన్నీ అర్పి ఒక మూలన దాక్కొని చూడసాగినాడు.
అర్ధరాత్రి కాగానే ఆ రాక్షసులిద్దరూ తలా ఒక కడ్డీ లావుది చేత పట్టుకోని గదిలోకి వచ్చినారు. గదంతా చీకటిగా వుండటంతో మంచమ్మీద వున్నది మనిషే అనుకున్నారు. చెరో పక్కన చేరుకోని ధనధనధన దెబ్బ మీద దెబ్బ... దెబ్బ మీద దెబ్బ వేసినారు. అంతే... ఆ దెబ్బలకు అంత లావు మంచం విరిగి తునాతునకలయ్యింది. "దెబ్బకు కిక్కురుమనకుండా చచ్చినాడు వెధవ. వీనితో మనకు పీడా పోయింది" అనుకుంటా వాళ్ళు సంబరంగా వెళ్ళిపోయినారు.
తరువాత రోజు పొద్దున్నే రాక్షసులిద్దరూ ఇంటిబైట కూచోని వేపమొద్దుతో పండ్లు తోముకుంటా వుంటే వాడు ఒళ్ళు విరుచుకుంటా వాళ్ళ మధ్యలోకి వచ్చినాడు. వాన్ని చూసి ఆ రాక్షసులిద్దరూ అదిరిపడినారు. చిన్న రాక్షసుడు భయంతో వణికిపోతా "ర... ర్ర... ర్ర... రాత్రి నీకు నిద్ర పట్టిందా అనడిగినాడు. 
"ఆ... ఆ... బాగానే పట్టింది.
కానీ అర్ధరాత్రి ఎలుకలు మీద తిరుగుతా తోకలతో కొట్టి కొంచం అల్లరి చేసినాయ్" అన్నాడు. 
అంతే ఆ రాక్షసులు “ఓరినాయనోయ్... వీడు మామూలోడు కాదు. ఇనుప కడ్డీల దెబ్బలు ఎలుకతోక దెబ్బలని అనుకుంటా వున్నాడు. మనం వీన్ని చంపాలనుకున్న విషయంగానీ తెలిసిందంటే మనల్ని ప్రాణాలతో వదలడు" అని వాడు పిలుస్తావున్నా ఆగకుండా అన్నించి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినారు. వాడు నవ్వుకుంటా నెమ్మదిగా నడుస్తా పక్కనే వున్న రాజ్యానికి చేరుకున్నాడు.
ఆ రాజ్యం పొలిమేరల్లో ఇంకో ఇద్దరు రాక్షసులున్నారు. వాళ్ళు చానా చెడ్డోళ్ళు. ప్రతిరోజూ పొద్దున్నే ఊరి మీద పడి దొరికినోన్ని దొరికినట్లు చంపి తినేటోళ్ళు. రాజు ఎంతమంది సైనికులని వాళ్ళ మీదకు పంపించినా అందరూ వాళ్ళ చేతిలో చచ్చేటోళ్ళేగానీ వాళ్ళని ఏమీ చేయలేక పోయేటోళ్ళు. దాంతో రాజుకు ఏం చేయాల్నో పాలుపోక "ఎవరయితే ఆ రాక్షసులని చంపుతారో వాళ్ళకి తన రాజ్యంలో సగభాగమిస్తానని దండోరా వేయించినాడు. ఆ దండోరా విన్న పిల్లోడు రాజుని కలవడానికని పోయినాడు. సైనికులు వాన్ని బయటనే ఆపి "ఎవరు నువ్వు ... ఏం కావాల" అనడిగినారు. 
దానికి వాడు కోపంగా “నేనెవరినా. దెబ్బకు ఏడు మందిని చంపిన మొనగాన్ని. చూడండి" అంటూ అంగీ మీద వేసుకున్న పట్టి చూపించినాడు. దాంతో వాళ్ళు భయపడి రాజు దగ్గరికి తీసుకోనిపోయినారు. వాడు రాజుతో “ఓరాజా! నేను ఆ రాక్షసులను చంపి వస్తాను. నీవు మాట నిలబెట్టుకుంటావా?" అన్నాడు. "అలాగే" అన్నాడు రాజు. దాంతో వాడు ఆ రాక్షసులు రాజ్యానికి ఏ పక్కనున్నారో కనుక్కోని అటువైపు పోయినాడు.
ఊరిబైట ఒక పెద్ద మర్రిచెట్టు వుంది. ఆ చెట్టు కింద రాక్షసులిద్దరూ పండుకోని గురకలు పెడ్తా కనబడినారు. వాళ్ళని ఎట్లా చంపాలబ్బా అని ఆలోచించి కొన్ని రాళ్ళు తీసుకోని జేబులో వేసుకోని చప్పుడు గాకుండా చెట్టు పైకి ఎక్కి కనబడకుండా కొమ్మల నడుమ కూచున్నాడు. ముందుగా ఒక రాయి తీసుకోని పైనుంచి ఒక రాక్షసుని తల
మీద ఈడ్చి ఒక్కటి పెరికినాడు. ఆ దెబ్బకి వాడు అదిరిపడి లేచినాడు. చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు. పక్కనే పడుకున్న రాక్షసుడే కొట్టి ఉంటాడనుకోని వాన్ని లేపి... 'నేను కొట్టలేదు' అన్నా వినకుండా "ఏంరా... హాయిగా పండుకోని వుంటే రాయితో కొట్టి మళ్ళీ ఏమీ తెలీనోని మాదిరి గమ్మున పండుకుంటే నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా... ఇదిగో ఇంకొకసారి గనుక ఇట్లా చేసినావంటే వుంటాది చూడు. ఏమనుకుంటా వున్నావో" అని అరిచి పండుకున్నాడు.
మరలా కాసేపటికి వాడు పైనుంచి ఇంకొక రాయి తీసుకోని మరలా అదే రాక్షసుని మొగమ్మీద ఈడ్చి ఒక్కటి పెరికినాడు. అంతే... వాడు అదిరిపడి మళ్లీ లేచినాడు. 
కోపంతో బుసలు కొడతా పక్కనున్నవాన్ని నిద్ర లేపి “ఏంరా... ఒళ్ళుగాని కొవ్వెక్కిందా. ఒకసారి చెబితే అర్ధంగాదా" అంటూ ధనధనధన నాలుగు గుద్దులు గుద్దినాడు. దాంతో వానికి గూడా చానా కోపమొచ్చింది. “అరే... నేను కొట్టలేదంటావున్నా వినకుండా నన్నే తంతావా. ఏం నీవేనా తన్నేది. నేను తన్నలేనా. దా చూసుకుందాం" అంటూ లేచి ఎగిరి వాని మీదకు దుంకినాడు. 
ఇంగ చూడు నా సామిరంగా! ఇద్దరూ పెద్ద పెద్ద బండరాళ్ళు తీసుకోని కిందామీదా పడి కొట్టుకోసాగినారు. కాసేపటికి ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలి రక్తం కారీ కారీ ఆఖరికి ఇద్దరూ చచ్చిపోయినారు.
వెంటనే వాడు చెట్టు పైనుండి దిగి రాజు దగ్గరికి పోయినాడు. “రాజా! నీకు చెప్పినట్టే ఆ రాక్షసులిద్దరినీ చంపి వచ్చినాను. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో" అన్నాడు. రాజు ఆచ్చర్యపోయి అడవిలోనికి పోయి చూస్తే ఇంకేముంది ఇద్దరూ చచ్చిపడి కనిపించినారు. వెంటనే రాజు సంబరంగా వాన్ని బంగారు పల్లకీలో కూచోబెట్టి తప్పెట్ల నడుమ వూరంతా తిప్పినాడు. అన్నమాట ప్రకారం అర్ధరాజ్యం ఇవ్వడమేగాక, తన కూతురిని గూడా ఇచ్చి అంగరంగవైభోగంగా పెండ్లి చేసి అల్లున్ని చేసుకున్నాడు.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *షేర్* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.

పైల మహర్షి గురించి తెలుసుకుందాం..

 🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..

🌹🙏ఈరోజు 49 వ పైల మహర్షి గురించి తెలుసుకుందాం..🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఇప్పుడు మనం పైల మహర్షి గురించి తెలుసుకుందాం .ఈ మహర్షి గురించి ఎక్కడ కూడా వారి ప్రస్తావన లేదు వారి గురించి చాల తక్కువ సమాచారం అందింది...

🌸ఈయన తల్లితండ్రులెవరో తెలియదు . వ్యాసభగవానుడికి శిష్యుడు పైల మహర్షి . 

🌿శిష్యులకి ఋగ్వేదం చెప్తుండేవాడు . ఈయన్ని ఋగ్వేదధ్యాపకుడంటారు . వ్యాస మహర్షి తన దగ్గరుంచుకుని విద్యలన్నీ నేర్పించాడు . 

🌸పైలుడు విద్యలన్నీ నేర్చుకున్నాక గొప్ప తపస్సు చేసి పైల మహర్షి అయ్యాడు . భగవంతుడు సత్యవతీదేవి యందు పరాశరుడుగా పుట్టి వేదరాశిని ఋగ్వేదము , యజుర్వేదము , సామవేదము , అధర్వవేదము అని నాలుగు భాగాలుగా విభజించి ,

🌿పైల మహర్షికి ఋగ్వేదం , వైశాంపాయనుడికి యజుర్వేదం , జైమినికి సామవేదం , సుమంతునికి అధర్వవేదం ఉపదేశించాడు .

🌸 పైలమహర్షి నేర్చుకున్న ఋగ్వేదం చాలా ఋక్కుల్తో కూడుకుని వుండటంచేత " బ్రహ్వృచశాఖ ” అని పేరు పొందింది . పైలుడు ఈ వేదాన్ని ఇంద్రప్రమితి , పాష్కలుడు అనే శిష్యులకి చెప్పాడు . 

🌿ఇంద్రప్రమితి తనకొచ్చింది మాండూకేయుడికి చెప్పాడు . మాండూకేయుడు దేవమిత్రుడికి , దేవమిత్రుడు సౌభరికి , సౌభరి తన కొడుకు శాకల్యుడికి చెప్పారు .

🌸శాకల్యుడు తాను నేర్చుకున్నది అయిదు భాగాలుగా చేసి వాత్స్యుడు , శాలీయుడు , మౌద్గల్యుడు , గోముఖుడు , శిశిరుడు మొదలైన వాళ్ళకి చెప్పాడు .

🌿 శిశిరుడు తన శిష్యులకి , పాష్కలుడు నాలుగు విభాగాలుగా నలుగురుకి చెప్పాడు . ఈ విధంగా ఋగ్వేదం చాలామంది ఋషులు నేర్చుకున్నారు . పైల మహర్షి ఋగ్వేదం నాలుగువైపులా వ్యాపించేలా చేశాడు . 
గొప్ప ఆదర్శ మాహర్షిగా ప్రసిద్ధి చెందారు.

🌸ఇదండీ మనకు పైలమహర్షి గురించి మనకు తెలిసిన విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

సనక , సనందన, సనత్కుమార , సనత్సుజాత, మహర్పులు గురించి తెలుసుకుందాం

 [11/28, 03:12] +91 73963 92086: 🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..

🌹ఈరోజు 82 ,వ మహర్షులు సనక , సనందన, సనత్కుమార , సనత్సుజాత, మహర్పులు గురించి తెలుసుకుందాం.🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఇప్పుడు మనం చదవబోయే మహర్షులు సనక , సనందన , సనత్కుమార , సనత్సుజాత , మహర్షులు . వీళ్ళని నలుగుర్ని కలిపి సనకాదులు అని పిలుస్తారు .

🌸వీళ్ళు బ్రహ్మగారి మనస్సు నుండి పుట్టి , బ్రహ్మమానస పుత్రులుగా పిలవబడుతున్నారు . బ్రహ్మ సనకాదుల్ని తనకు సృష్టి కార్యంలో సాయం చెయమన్నాడు .

🌿నువ్వు భగవధ్యానామృతంలో మునిగి మమ్మల్ని సృష్టించావు . కాబట్టి , మాక్కూడ అదే వచ్చింది . మేము సృష్టి కార్యంలో నీకు సాయం చెయ్యలేం . నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నీకు మేలు చేస్తాం అన్నారు సనకాదులు .

🌸సనకాదులు వాళ్ళిష్టం వచ్చినట్లు అన్నిలోకాలు తిరిగుతూ వైకుంఠానికి వచ్చారు . అక్కడ శ్రీమహావిష్ణువుని చూడాలనుకుంటే జయవిజయులనే ద్వారపాలకులు అడ్డగించారు . 

🌿శ్రీ మహావిష్ణువుని చూడనివ్వలేదనే కోపంతో వాళ్ళని భూలోకంలో పుట్టమని శపించారు . ఈ గొడవకి లక్ష్మీనారాయణులు బయటికి వచ్చారు . సనకాదులు వాళ్ళిద్దర్ని రెప్పవాల్చక చూస్తూ వుండిపోయారు .

🌸ఆనందంతోనూ భక్తితోనూ లక్ష్మీనారాయణులకి స్తోత్రం చేశారు . గోవిందుడు సనకాదుల్ని నా ద్వారపాలకులికి మంచి శిక్ష వేశారు . వీళ్లు భూలోకంలో పుట్టి నాకు శత్రువులై నాతో యుద్ధం చేసి నా చక్రానికి ఆహుతై తిరిగి నా దగ్గరికే వస్తారు .

🌿తర్వాత వాళ్ళకి చావు పట్టుకలుండవు అన్నాడు నారాయణుడు . సనకాదులు ఆనందభాష్పాలో ఆ దివ్యమంగళ విగ్రహానికి మళ్ళీ మళ్ళీ మ్రొక్కి , లక్ష్మీదేవిని స్తుతించి విడవలేక , వెళ్ళలేక తమ ఆశ్రమానికి వెళ్ళారు .

🌸గొప్ప హరిభక్తుడు , బ్రాహ్మణ పూజ చేసేవాడు , ప్రజలకిష్టమయ్యేలా పరిపాలన చేసేవాడయిన పృథు చక్రవర్తి దగ్గరకి ఆకాశమార్గంలో బాలసూర్యుల్లా , సిద్ధవర్యులు , గొప్ప జ్ఞానవంతులయిన సనకాదులు వచ్చారు . 

🌿పృథు చక్రవర్తి ఎంతో ఆనందంతో ఎదురెళ్ళి ఆర్ఘ్య పాద్యాలిచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి వారి పాదాలు కడిగి తలమీద చల్లుకుని యోగీశ్వరేశ్వరులారా ! నెనెంత పుణ్యం చేసుకున్నానో మిమ్మల్ని చూడగలిగాను . 

🌸చాలా అనందంగా వుంది . ఈ సంసారంలో దేనివలన నాకు మోక్షం కలుగుతుందో చెప్పండన్నాడు .

🌿రాజా ! శ్రద్ధ , భగవద్ధర్మ చర్య , భగవంతుడి గురించి తెలుసుకోవాలనే కోరిక , నారాయణ కథలు వినడం , అహింస , ఎప్పుడూ భక్తి మార్గాన్నే అనుసరించడం మోక్ష సాధనాలు .

🌸ధర్మార్థకామాలు మూడు విడిచిపెట్టి పరమ పురుషార్థమైన మోక్షానే కోరుకుంటే తప్పకుండా మోక్షం కలుగుతుందని  పృథుణ్ణి ప్రశంసించి ఆకాశమార్గంలో అందరూ చూస్తుండగా వెళ్ళిపోయారు సనకాదులు .

🌿ఒకసారి ఈశ్వరుడు సనత్కుమార మహర్షి దగ్గరికి వచ్చాడు . మహర్షి ఈశ్వరుడికి ఉపచారాలు చేసి త్రిలోచనా ! ఏం చెయ్యమంటారో చెప్పండి చేస్తానన్నాడు .

🌸నీతో మాట్లాడిపోదామని వచ్చానన్నాడు ఈశ్వరుడు . ఇంకా ఇలా అన్నాడు . ధ్యానంలో చూడ తగ్గది ఏది ? తత్వాలెన్ని ? సాంఖ్యమంటే ఏమిటి ? ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలెన్నో తెలుసుకుందామని వచ్చానన్నాడు శివుడు . 

🌿సనత్కుమారుడు తత్త్వములు ఇరవై అయిదు . అవి భూతములు అయిదు , వాటి గుణాలు పది , ఇంద్రియాలు అయిదు , మనస్సు , బుద్ధి అహంకారము ప్రకృతి మొత్తం ఇరవయి నాలుగు .

🌸ఇంకొక తత్త్వం దేహమందుండే పురుషుడు . కాష్టంలో వుండే నిప్పులా శరీరంలో పురుషుడుంటాడు . అతణ్ణి చూడగలగడమే అమృతార్థతత్త్వం . దీన్ని చూసినవాడు మృత్యువుని కూడా జయిస్తాడు .

🌿ఇవన్నీ కలిసి చూడడమే ఏకత్వమంటే . దీన్నే బ్రహ్మాన్ని చూడడం అంటారు . తనను తానే చూసుకోగలిగివాడు జ్ఞాని . జిహ్వయందు సోముడు , వాణియందు అగ్ని , ప్రాణమందు వాయువు , బలంలో కౌశికుడు , బుద్ధియందు ఈశానుడు , అపానం
లో సూర్యుడు , సమానంలో

🌸అప్సరసలు , కళ్ళల్లో సూర్యుడు , శరీరంలో అంఘ్రలు , చెవుల్లో శేషుడు , ఉపస్థంలో ప్రజాపతి , బుద్ధియందు బ్రహ్మ ఈ అన్నింటితో కలిసి ఆత్మ వుంటుంది . 

🌿ఆత్మని చూడగలిగినవాడే యోగి అన్నాడు సనత్కుమారుడు . యోగి అయినవాడు జనాలెవరూ తిరగని చోటు చూసుకుని ఇంద్రియాల్ని మనస్సుతో లాగిపట్టి ఆకలిదప్పులు మర్చిపోయి హృదయంలో దేవుణ్ణి చూస్తాడు అని చెప్పాడు సనత్కుమారుడు .

🌸సనత్కుమారుడు ఈశ్వరుడికి సాంఖ్య యోగాన్ని గురించి కూడా చెప్పాడు . ఈశ్వరా ! ఇన్నెందుకు ? సంగమే బంధము . సర్వసంగ పరి త్యాగమే మోక్షం . 

🌿ఇది పరమ రహస్యం , పరమ తత్త్వం కూడా . శివుడు సనత్కుమారుడు చెప్పినవన్నీ విని సంతృప్తి పొంది తన కైలాసానికి వెళ్ళిపోయాడు . సనకాదులు స్వేచ్ఛా విహారానికి ఆకాశవీధిలో వెళ్లారు . 

🌸రావణుడు సర్వలోక దిగ్విజయ యాత్రచేసి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి మహాత్మా ! అనాది మధ్యలయుడెవ్వరు ? ఎవరితో విశ్వసృష్టి జరిగింది ? ఎవర్ని స్మరిస్తే బంధ విముక్తి అవుతుంది ? ఇలాంటి సందేహాలు తీర్చమనడిగాడు .
[11/28, 03:13] +91 73963 92086: 🌿రావణా ! అనఘుడు , అవ్యయుడు మొదలైన గుణాలతో వున్న శక్తే బ్రహ్మం . ఆ బ్రహ్మమే నారాయణ , కృష్ణ , హరి , విష్ణు , గోవింద అనే పేర్లతో పిలవబడుతోంది . హరి చేతిలో మరణించిన వారందరి గురించి రావణుడికి చెప్పాడు సనత్కుమారుడు .

🌸మహార్షీ ! నాకా యోగం వుందా ? అనడిగాడు రావణుడు . కృతయుగం చివర్లో హరి భూలోకంలో రాముడనే పేరుతో మనిషిగా పుట్టినప్పుడు నువ్వు అతనికి విరోధివై యుద్ధంలో అతని చేతిలో మరణించి మోక్షాన్ని పొందుతావని చెప్పి సనత్కుమారుడు అదృశ్యుడయిపోయాడు .

🌿మార్కండేయుడు పితృదేవతల మహిమ గురించి తెలియచెయ్యమని సనకాదుల్ని అడిగాడు . ఇదంతా మనం మార్కండేయ మహర్షి కథలో తెలుసుకున్నాం . మార్కండేయుడి సందేహాలన్నీ తీర్చి అతనికి వరాలిచ్చి దివ్యదృష్టి , సర్వవిజ్ఞానము పొందేలా చేశాడు సనత్కుమారుడు . 

🌸రైభ్య మహర్షికి సనత్కుమారుడు విశ్వమంతా వ్యాపించి వున్న తన విశ్వరూపం చూపించి అతనికి గయాశ్రాద్ధ ఫలము , ఫల్గునీ నదీస్నాన ఫలితాల గురించి వివరంగా చెప్పాడు . 

🌿ఒకసారి నారదుడు సనత్కుమారుణ్ణి తనకు జ్ఞానబోధ చెయ్యమని ప్రార్ధించాడు . సనత్కుమారుడు నీకు తెలిసినవి చెప్పు , తెలియనవి నేను చెప్తానని , నారదుడు చెప్పినవన్నీ విని వీటిన్నిటికన్నా ఆత్మజ్ఞానమే గొప్పదని చెప్పి అతనికి ఆఖండ ఆత్మజ్ఞానం ఉపదేశించాడు .

🌸నైమిశారణ్యంలో మునులందరూ సనత్కుమారుణ్ణి రుద్రమహాత్మ్యం గురించి చెప్పమని అడిగారు . అలా వివరించిన గ్రంథాన్నే ' సనత్కుమార సంహిత ' అన్నారు . 

🌿ఆ గ్రంథంలో బ్రహ్మ విష్ణూత్పత్తి , హరి విరించి సంవాదం , సప్తద్వీప సప్తవర్ష చరిత్ర , శివలింగపూజ , శివలింగప్రళయోత్పత్తి , శివాష్టకం , జ్ఞానప్రశంస , మోక్షవిచారం మొదలైనవన్నీ ఉన్నాయి .

🌸సనత్కుమార మహర్షి మహాయోగి , మహాజ్ఞాని అయినా కూడా మనకోసం ' గృహవాస్తు శాస్త్రం ' , ' శిల్ప శాస్త్రం ' రాశాడు . ఒకనాడు నారదుడు సనత్సుజాతుడ్ని విష్ణుతత్త్వం గురించీ , సకలజీవుల్ని పుట్టించేవాడు , నడిపించేవాడు , తనలో లయంచేసుకునేవాడు అయిన శ్రీహరిని గురించి చెప్పమని అడిగి తెలుసుకున్నాడు.

🌿వృత్రాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేసి పడిపోయినప్పుడు రాక్షసులు అతణ్ణి శుక్రాచార్యుడి దగ్గరికి తీసికెళ్ళారు . గురుశిష్యుల ప్రార్థన విని సనత్కుమారుడు విష్ణుతత్వాన్ని , కర్మఫలం ఎలా అనుభవిస్తాడు .

🌸జీవుడు మొదలైన విషయాలు వివరంగా చెప్పగా విన్నారు . అమృతంలాంటి అతడి మాట పరిశుద్ధమైన మనస్సుతో ప్రాణాలు విడిచి విష్ణువుని చేరాడు వృత్తాసురుడు . 

🌸ధృతరాష్ట్రుడు విదుర నీతినంతా విని ఇంకా ధర్మాల గురించి చెప్పమన్నాడు విదురుణ్ణి . నేను శూద్రుణ్ణి కనుక ఇంతకంటే చెప్పేందుకు అర్హత లేదు . బ్రహ్మర్షి సనత్కుమారుడు వివరంగా చెప్తాడని మహర్షిని ప్రార్ధించి ధృతరాష్ట్రుడికి మృత్యుతత్వాన్ని గురించి చెప్పమన్నాడు విదురుడు .

🌿జీవికి మృత్యువనేది లేదు . అంతరాత్ముడైన పురుషుడు బొటన వేలంత వుండి శరీరంలో వుంటాడు . అజ్ఞానులు ఇతనిని చూడలేరు . బ్రహ్మవిద్యా నిష్ణాతుడైన మానవుడు ప్రజ్ఞరూపుడై తన లోపలగల పరమాత్ముణ్ణి తెలుసుకుంటే అతడు శరీరాన్ని విడిచిపోనేపోడు . 

🌸అలాంటి వాడికి చావులేదు , మోక్షము లేదు . బ్రహ్మతోనే సంబంధం . నేను అన్నది ఆత్మ . సర్వం ఆత్మ . ఉన్నది లేనిది ఆత్మే . మనలో ఉన్న భగవంతుడు అంటే ఆత్మ ఒక్కడే సత్యం . 

🌿ఎవరికీ ఎవరూ ఏమికారు . లోకమంతా నిండివున్నది ఆత్మే . నాకు చావు పుట్టుకలు లేవు , నేనే ఆత్మ , నెనెప్పుడూ ఆనంద స్వరూపుడే అనుకుని నిష్ఠగా , నియమంగా ఉండేవాడు ఎన్నివేల సంవత్సరాలయినా బ్రతకగలడని చెప్పి సనత్సుజాతుడు ఆకాశమార్గంలో అంతర్థానమయ్యాడు . 

🌸ఈ విధంగా సనక , సనందన , సనత్కుమార , సనత్సుజాత మహర్షులు ఆకాశ మార్గంలో తిరుగుతూ , ఏలోకానికి కావాలంటే ఆలోకానికి వెళ్తూ అడిగిన వాళ్ళందరికి మోక్షమార్గం ఉపదేశిస్తూ దివ్యతేజస్సుతో వెలిగిపోతూ వుంటారు . 

🌿ఇదే ! మన సనక సనంద సనత్కుమార సనత్సుజాత మహర్షుల కథ !! అద్భుతంగా వుంది కదూ .... !
రేపు మరో మహర్షుల గురించి తెలుసుకుందాం స్వస్తీ..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌿🌿

చాణ‌క్య నీతి: జీవితంలో ఎప్పుడూ మోస‌పోకుండా ఉండాలంటే ఈ ఐదు విష‌యాలు గుర్తుపెట్టుకోండి

 #చాణ‌క్య నీతి: జీవితంలో ఎప్పుడూ మోస‌పోకుండా ఉండాలంటే ఈ ఐదు విష‌యాలు గుర్తుపెట్టుకోండి

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాల‌ని కలలుకంటారు. ఇందుకోసం పెద్దల సలహాలు కూడా తీసుకుంటారు. కొన్నిసార్లు మ‌నం చేసే ప‌నుల్లో అప‌జ‌యం ఎదుర‌వుతుంటుంది. అలాగే కొంద‌రి చేతుల్లో మోసపోవ‌డం కూడా జ‌రుగుతుంటుంది. ఇలా మోస‌పోకుండా ఉండేందుకు, తెలివిగా మెలిగేందుకు చాణక్య నీతి ప్రతి మనిషికి ఎంత‌గానో ఉపయోగపడుతుంది. ఆచార్య చాణక్యుడు తెలిపిన జీవ‌న‌ విధానాల‌ను అనుసరించడం ద్వారా, ఒక సాధారణ వ్యక్తి కూడా జీవితంలో మోస‌పోకుండా, అన్ని రంగాలలో విజయం సాధించగలుగుతాడు.  జీవితంలో మోస‌పోకుండా ఉండాలంటే ప్ర‌తీ మ‌నిషి గుర్తుంచుకోవాల్సిన ఐదు కీలక విషయాలను ఆచార్య.. చాణ‌క్య నీతిలో తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పరిస్థితుల‌ను ధైర్యంగా ఎదుర్కోవాలి

పనిలో ఆటంకాలు అనివార్యం. అయితే ఇవి ఒకస్థాయి దాటితే ఎవ‌రైనా స‌రే భయాందోళనలకు లోన‌వుతారు. ఈ భయాందోళనలను అధిగమించడానికి, అడ్డంకులను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాల‌ని ఆచార్య‌ చాణక్య‌ సలహా ఇచ్చారు. చాణక్యనీతిలోని వివ‌రాల ప్ర‌కారం ఎవ‌రైనా.. భయంతో సమస్యల‌ను త‌ప్పించుకునేందుకు ప్రయత్నిస్తే అది పిరికితనానికి సంకేతం అవుతుంది.

ఇతరుల తప్పుల నుండి నేర్చుకోండి

ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, ముందుకు సాగాలని చాణక్యుడు తెలిపాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటే, తాను తప్పులు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

కృషితోపాటు సరైన వ్యూహం

కష్టపడి పనిచేయడమే కాకుండా, జీవితంలో విజయవంతం కావడానికి త‌గిన‌ వ్యూహం కూడా చాలా ముఖ్యం. చాణక్య‌నీతి ప్రకారం, సరైన వ్యూహాన్ని రూపొందించడంతోపాటు లక్ష్యం వైపు ముందుకు సాగితే అనుకున్న‌ది సాధించడం సులభం అవుతుంది.

తప్పులు సరిదిద్దుకోవ‌డం

చాణక్య నీతి ప్రకారం, తప్పు అనేది మానవ స‌హ‌జం. తప్పులు ఏ రకంగానైనా జ‌ర‌గ‌వ‌చ్చు. మనిషి తన తప్పును సరిదిద్దుకోవడానికి ఎల్ల‌ప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వల్ల జీవితంలో ఎదుర‌య్యే అనేక రకాల మోసాలను సులభంగా అధిగమించవచ్చు.

అంకిత‌భావంతో ప‌నిచేయాలి

చాలామంది తాము చేయ‌ద‌ల‌చుకున్న ప‌నిని ఎంతో ఉత్సాహంతో ప్రారంభిస్తారు. అయితే కొంత సమయం తర్వాత పనిపై శ్ర‌ద్ధ త‌గ్గిపోతుంది. విసుగు మొద‌ల‌వుతుంది. దీంతో పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే పనిలో విజయం సాధించాలంటే ఆ పని చేస్తున్నంత సేపు పూర్తి ఉత్సాహంతో ఉంటూ, అంకిత‌భావంతో చేయాల‌ని అప్పుడే విజ‌యం సొంత‌మ‌వుతుందని ఆచార్య చాణక్య తెలిపారు.

ధర్మనిర్ణయం

 _*ధర్మనిర్ణయం*_

_పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు. గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలో తెలియక ఆ రాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది. ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది !_

_గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు._

_ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే- శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం. సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో, ఈ ఉదాహరణ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ కథలో ఓడిన రాజు ఖాండిక్యుడు ; గెలిచినవాడు కేశిధ్వజుడు. *కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.*_

_తన యజ్ఞ సంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సంప్రదాయం. *ఓడిన రాజుకు ఓర్మి ఎంత ప్రధానమో- గెలిచిన రాజుకు సంయమనం, ధర్మ సంప్రదాయ పరిరక్షణ అంతే అవసరం.* ఈ అవకాశాన్ని చేజిక్కించుకున్న ఖాండిక్యుడు తాను కోల్పోయిన రాజ్యం తిరిగి గురుదక్షిణగా కావాలన్నా ఇచ్చేయడానికి కేశిధ్వజుడు సిద్ధపడతాడు. ఇక్కడే ఓ చిత్రం చోటుచేసుకుంటుంది. రాజ్యసంపద అయాచితంగా వచ్చిపడుతున్నా ఖాండిక్యుడు కాదంటాడు ! తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు._

_ఖాండిక్యుడి నిర్ణయం కేశిధ్వజుణ్ని విస్మయానికి గురిచేస్తుంది. ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు ఖాండిక్యుడు అంటాడు- *‘రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు. వాటిని కష్టంతో, శారీరక శ్రమతో సాధించుకోవాలి. అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకోకూడదు. కష్టపడి సాధిస్తేనే, వాటి విలువ తెలుస్తుంది.* నా కంటే బలవంతుడి చేతిలో ఓడిపోయాను. అందులో సిగ్గు పడాల్సింది ఏముంటుంది ? తిరిగి పుంజుకొని ధర్మమార్గంలో, క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి. అది ఒప్పుతుంది గాని, దొడ్డిదారిన పొందితే పాపమవుతుంది’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు !_

_ఇలాంటి కథల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా నిర్ణయిస్తే, వారి బాల్యాన్ని అవి ధార్మిక పథంలోకి నడిపిస్తాయి. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఉచితాల కోసం తాపత్రయపడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని వారికి అలవరుస్తాయి._

_ఆముక్తమాల్యదలోని ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం- ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి ? ఆ కథలోని ధార్మిక నేపథ్యం, ప్రబోధ గుణం. గెలుపు ఓటముల విషయంలో, కర్తవ్య నిర్వహణలో, అయాచిత అవకాశాల తిరస్కరణలో ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది._

_లోకంలో ఇలాంటి కథలు ఒళ్ళు మరిపించడమే కాదు, కళ్ళు తెరుచుకొనేలా చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప ఆదరువు._

నీతి కథలు ఏనుగుపిల్ల

 💦 *నీతి కథలు - 172*

*ఏనుగుపిల్ల*

ఓ అడవిలో ఎన్నో జంతువులు ఉండేవి. అవన్నీ దాహం తీర్చుకోవడానికి మధ్యలో ఉన్న చెరువుకి వెళ్లేవి. ఆ చెరువు చాలా పెద్దది. అందులో చేపలు, తాబేళ్లు, మొసళ్లు ఉండేవి.

అక్కడకు వచ్చే ఏనుగుల గుంపులో ఉండే పిల్ల ఏనుగుకు వెలక్కాయంత తిక్కుంది. తన బలం ముందు ఎవరూ సరిపోరని విర్రవీగుతూ, కోరి తగువులు తెచ్చుకుని ఏడిపించేది. చెరువు నీటిలో దాగి కాళ్లతో రొప్పుతూ బురద రేపేది. తొండంతో నీటిని జల్లి అలజడి సృష్టించేది. అలా చేయకూడదని చెప్పిన పెద్ద మొసలితో తగువు తెచ్చుకుని ‘దొంగతనంగా నీటిలో దాగి, గుటుక్కున మింగేసే కపట బుద్ధి మీది. నాకు నీతులు చెబుతావా’ అని ఎగతాళి చేసింది.

ఆ మాటలకు అన్ని మొసళ్లూ బాధపడ్డాయి. చేపలు, తాబేళ్లు వాటిని ఓదార్చాయి.

అది మొదలు పిల్ల ఏనుగు చెరువుకి వచ్చిన ప్రతిసారీ మరింత రెచ్చిపోయి చేపల్ని, తాబేళ్లని భయపెట్టి మొసళ్లని తిట్టి వెళ్లేది. రోజూ

జరుగుతున్నది చూసిన ఓ కుర్ర మొసలికి పిల్ల ఏనుగుకి బుద్ధి చెప్పాలనిపించి పిల్ల ఏనుగు వచ్చినప్పుడు ‘కొండంత బలమున్న పిల్ల ఏనుగా! బాగున్నావా? ఓడిపోతానని తెలిసి నీతో పందెం కాయాలని ఉంది. నా కోరిక తీరుస్తావా?’ అని అడిగింది కుర్ర మొసలి.

తాతల కాలంలో మొసలి చేతిలో భంగపడిన మచ్చ ఎలాగూ తమ జాతికి ఉంది. అది పోయే అవకాశం, సమయం వచ్చాయేమో అనుకున్న పిల్ల ఏనుగు పందెం గురించి అడిగింది. కుర్ర మొసలి ‘బలమైన తాడుకి ఒక చివర నేనూ రెండో వైపు నువ్వూ లాగుదాం. నా బలం నీటిలోనే కాబట్టి చెరువు అడుగుకి వెళతాను. నీ బలం ఉపయోగించి తాడు గుంజి ఒడ్డు మీదకి నన్ను రప్పించు. నువ్వు గెలిస్తే నీ మాట వింటాను. నేను గెలిస్తే మొసళ్లని ఏమీ అనకూడదు. నీటిని పాడు చేయకూడదు’ అంది.

‘ఇంతేనా సరే’ అంది పిల్ల ఏనుగు.

పొలంలో ఉన్న రైతు దగ్గర్నించి తాడు తెచ్చింది కోతి. ఎలుగుబంటి ఏనుగు తరఫున, తాబేలు మొసలి తరుఫున న్యాయనిర్ణేతలుగా నిలబడ్డారు. తర్వాత రోజు పోటీ జరిగింది. బోలెడన్ని జంతువులు, పక్షులు పోటీని ఆసక్తిగా చూశాయి. తాడుకొస నోటితో పట్టుకుని నీట్లోకి వెళ్లింది కుర్ర మొసలి. రెండో కొస పట్టుకుని తొండంతో బలమంతా ఉపయోగించి తాడు లాగింది పిల్ల ఏనుగు. అంగుళమన్నా కదిలించలేకపోయింది. అలసిపోయింది తప్ప ఫలితం కనబడలేదు. పిల్ల ఏనుగు ఓటమిని ఒప్పుకొంది. తాబేలు వెళ్లి కుర్ర మొసలిని పిలిచింది.

కుర్ర మొసలి ‘నీకూ చాలా బలముంది. ఒక దశలో ఓడిపోతానని అనుకున్నా’ అంది. ఆ మాటలకు పిల్ల ఏనుగు పొంగిపోయి బుద్ధిగా ఉంటానని మాట ఇచ్చింది.

మొసళ్లు, చేపలు, తాబేళ్లు కుర్ర మొసలిని అభినందించి ‘నీలో ఇంత బలముందని ఊహించలేదు’ అన్నాయి. కుర్ర మొసలి నవ్వుతూ ‘గెలిచింది బలంతో కాదు తెలివితో’ అంది. అదెలా అని ఆశ్చర్యపోయి చూశాయి. అంతలో తాబేలు ‘మొసలన్నయ్య ఏం చేశాడో చెబుతా. నీళ్ల అడుగున బలమైన పురాతన చెట్టు మొదలు ఉంది కదా. దానికే తాడు కొసను కట్టేసి హాయిగా కూర్చున్నాడు. నేను రమ్మనగానే తాడు విప్పి నీటి మీదకు వచ్చాడు’ అంది.

విషయం తెలియగానే కుర్ర మొసలి తెలివికి ఆశ్చర్యపోయి ‘ఎలాగైతే నేం పిల్ల ఏనుగు తిక్క కుదిర్చి బుద్ధి చెప్పావని’ అభినందించాయి మొసళ్లు.
          💦🐋🐥🐬💦

Sunday, November 27, 2022

:::: స్వతంత్ర వ్యవస్థ::::

 *::::: స్వతంత్ర వ్యవస్థ:::::*
       ఇంద్రియ సంబంధం లేకుండా  విషయ జ్ఞానం కలిగే అవకాశమే లేదు.
   అయితే  ఇంద్రియాల పరిది, పాత్ర  మాత్రం విషయానికి సంబంధించిన సమాచారాన్ని మోసుకురావడం వరకే. 
     విషయ సమాచారం విజ్ఞానంగా మారేది  సంజ్ఞ(perception), వేదన(sensation and feeling) సంఖారం(mental formation). వలన.
   స్వతంత్ర మైనటువంటి వీటిని,  స్వతంత్ర మైనవి కావు, నాకు చెందినవి అని అనుకున్నప్పుడు, రాగ ద్వేష మోహాలు కలుగుతాయి.బంధం ఏర్పడుతుంది. 
    అలా కాక మనసులో కలిగే ఈ సంజ్ఞ , వేదన లను, మానసిక ప్రక్రియగా, స్వతంత్రమైనవిగా, గుర్తించి తటస్థంగా వుంటే స్థితప్రజ్ఞత పొందినట్లే. ఇదే ధ్యానం అంటే.

*షణ్ముఖానంద9866699774*

శ్రీ శంకర భగవత్పాద విరచిత భజగోవిందం - తాత్పర్య సహితం ౹ "మోహ ముద్గరం"

శ్రీ శంకర భగవత్పాద విరచిత భజగోవిందం - తాత్పర్య సహితం ౹ "మోహ ముద్గరం"

1. భజగోవిన్దం భజగోవిన్దం, గోవిన్దం భజమూఢమతే౹ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే౹౹

Pray the Almighty by reciting Govinda, Govinda, Govinda. Foolish man! When time comes to depart the world, nothing, like your expertise in grammer will save you.

గోవిందా, గోవిందా, గోవిందాయని గోవిందుని భజించుము. ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు.

2. మూఢ జహీహి ధనాగమతృష్ణాం, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్౹ యల్లభసే నిజకర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తమ్౹౹

O, unwise man! Get rid of the thirst of earning wealth. Control your mind to be good and positive. Be satisfied with whatever you got as you were deserved to get.

మూర్ఖుడా! ధన సంపాదననే దాహాన్ని వర్జించుము. మనస్సును సంబాళించుకుని సద్బుద్ధిని అలవర్చుకొనుము. నీకు కర్మానుసారం లభించిన అదృష్టంతో తృప్తిచెందుము.

3. నారీస్తనభర నాభీదేశం, దృష్ట్వా మాగామోహావేశమ్౹ ఏతన్మాంసావసాది వికారం, మనసి విచిన్తయ వారం వారమ్౹౹

Do not get lusty desires just by seeing the women's breast or novel region. Think again and again that these are nothing but the sickening flesh and meat.

స్త్రీల నాభి-స్తనాదులను చూచి కామ, మోహ వికారాలలో మునిగిపోకుము. అవి విరక్తిని కల్గించు మాంసమేయని మరల మరల మనసున తలచుకొమ్ము!

4. నలినీదలగత జలమతితరలం, తద్వజ్జీవితమతిశయచపలమ్౹ విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తమ్౹౹

Like droplets of water slip away on the lotus leaf, this life is very unstable and slippery.The entire world is filled with sorrows due to sufferings, diseases and ego.

తామరాకుపై నీటి బిందువువలె ఈ జీవితం గర్వంతో నిలకడలేనిది. సమస్తలోకమూ బాధ, రోగము, దురభిమానములనే దుఃఖములో మునిగియున్నది.

5. యావద్విత్తోపార్జన సక్తః, స్తావన్నిజ పరివారో రక్తః౹ పశ్చాజ్జీవతి జర్జర దేహే, వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే౹౹

So long as you are able to earn, your family shows affection. But once you get old, they dislike even to talk to you.

నీవు సంపాదించి పెట్టినంతకాలం నీకుటుంబం నిన్ను అభిమానిస్తుంది. వృద్ధుడవైన తర్వాత నీతో మాట్లాడటానికే వారు ఇష్టపడరు.

6. యావత్పవనో నివసతి దేహే, తావత్పృచ్ఛతి కుశలం గేహే౹ గతవతి వాయౌ దేహాపాయే, భార్యా బిభ్యతి తస్మిన్కాయే౹౹

So long as you are alive, your family cares for you. But, once you are dead, even your wife will be afraid to see the body.

నీవు బ్రతికున్నంతవరకే నీ కుటుంబం నీ గురించి పట్టించుకుంటుంది. ప్రాణంపోయిన మరుక్షణమే నీ భార్యకూడా శవంచూచి భయపడుతుంది.

7. బాలస్తావత్క్రీడాసక్తః, తరుణస్తావత్తరుణీసక్తః౹ వృద్ధస్తావచ్చిన్తాసక్తః, పరే బ్రహ్మణి కోఽపి న సక్తః౹౹

Playing during childhood, liking young women when young, and worries when old finishes off the life. There is no time or opportunity to show interest in the Almighty, the Parabrahmam.

బాల్యం ఆటపాటలతోను, యవ్వనం స్త్రీలంటే వ్యామోహంతోను, వృద్ధాప్యం చింతలతోను మనిషి గడిపేస్తాడు. దైవమంటే ఎప్పటికీ ఆసక్తి ఉండదు.

8. కాతే కాన్తా కస్తే పుత్రః, సంసారోఽయమతీవ విచిత్రః౹ కస్య త్వం కః కుత ఆయాతః, తత్త్వం చిన్తయ తదిహ భ్రాతః౹౹

Who is wife, who is the son? This world is extreamely peculier and strange! Brother, indulge in deep thoughts like, who am I and where from I came!

భార్య ఎవరు, పుత్రుడెవరు? నేనెవర్ని, ఎక్కడనుంచి వచ్చాను? ఈ సంసారం చిత్రాతిచిత్రమైంది! ఈ ఇహ తత్వాన్ని గూర్చి ఆలోచించు సోదరా!

9. సత్సఙ్గత్వే నిస్స్ఙ్గత్వం, నిస్సఙ్గత్వే నిర్మోహత్వమ్౹ నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః౹౹

The company of good people rids one of bondings, that rids the passion, which in turn rids one of ficklemindedness. The focus on Paramatma yields relief and liberation from the life bonds.

మంచి స్నేహముల వలన బంధనలు పోతాయి, దానివలన మోహం తొలగిపోతుంది, దానివలన చపలత్వం పోతుంది. ఈ నిశ్చలతత్వం వలన భవబంధాలనుండి విముక్తి, మోక్షము లభిస్తుంది.

10. వయసిగతే కః కామవికారః, శుష్కే నీరే కః కాసారః౹ క్షీణేవిత్తే కః పరివారః, జ్ఞాతే తత్త్వే కః సంసారః౹౹

Like a dried up pond, lust vanishes with age. When prospirty is lost, relatives avoid you.If you understand this, there will be no familial feeings.

నీరులేని తటాకంవలె, వయస్సు నశించంగానే కామ వికారమూ నశిస్తుంది.నీ సంపదపోతే బంధువులూ నిన్ను వదిలేస్తారు. ఈ తత్వం అవగతమైతే ఇంక ఈ సంసారబంధాలు ఉండవు.

11. మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్కాలః సర్వమ్౹ మాయామయమిదమఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా౹౹

Don't be proud of prospirity, friends and youthful arrogance. All these will vanish in no time. The unverse is an illusion. The knowledge about Paramatma tarva only will take care of you.

సంపద, స్నేహితులు, యౌవ్వన మదములతో మిడిసి పడకుము. ఇవన్నీ ఒకే ఒక్క నిమిషకాలంలో మటుమాయమైపోతాయి. ఈ జగత్తు అంతా మాయామయం.పరబ్రహ్మ వివేకమే నీకు హితమైనది.

12. దినయామిన్యౌ సాయం ప్రాతః, శిశిరవసన్తౌ పునరాయాతః౹ కాలః క్రీడతి గచ్ఛత్యాయుః, తదపి న ముఞ్చత్యాశావాయుః౹౹

The gaint wheel of time repeatedly brings the day-night and seasons cycles. In this game played by the time, one gets aged and dies. Even then, the cyclone of greed does not cease. పగలు-రాత్రి, ఉదయం-సాయంత్రం, శిశిరము-వసంత ఋతువులు తిరిగి వస్తునే ఉంటాయి. కాలం ఆడే ఈ ఆటలో ఆయుష్షు తీరిపోతుంది. ఐననూ, అత్యాశ యనే తుఫాను మాత్రం తగ్గదు.

13. ద్వాదశమఞ్జరికాభిరశేషః, కథితో వైయాకరణస్యైషః౹ ఉపదేశో భూద్విద్యానిపుణైః, శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః౹౹

This boque of twelve sanskrit stanzas were rendered by Shri Sankaracharya, the great learned saint to enlighten the aged Sanskrit Grammer pundit of Benaras.

ఈ పన్నెండు శ్లోకములను పూలగుత్తిని, యదార్థమైన విద్యాపారంగతుడైన శ్రీ శంకర భగవత్పాదులవారు (కాశీనగరమందు డుకృణ్) వ్యాకరణ పండితునకు ఉపదేశించిరి.

14. కాతే కాన్తా ధన గతచిన్తా, వాతుల కిం తవ నాస్తి నియన్తా౹ త్రిజగతి సజ్జన సంగతిరైకా, భవతి భవార్ణవతరణే నౌకా౹౹

Why do you always worry about women and wealth? Is there nobody to guide you? The only ship to cross the ocean of life is the company of good people.

ఓయీ! స్త్రీ, ధనముల గురించి ఎందులకు అంత ఆలోచన? నీకు సరైన బోధనలు చేయువాడు లేడా? సంసార సాగరాన్ని దాటేందుకు ఈ మూడు లోకములలో నీకున్న ఒకే సాధనం, సజ్జన సాంగత్యమే!

11. మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్కాలః సర్వమ్౹ మాయామయమిదమఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా౹౹

Don't be proud of prospirity, friends and youthful arrogance. All these will vanish in no time. The unverse is an illusion. The knowledge about Paramatma tarva only will take care of you.

సంపద, స్నేహితులు, యౌవ్వన మదములతో మిడిసి పడకుము. ఇవన్నీ ఒకే ఒక్క నిమిషకాలంలో మటుమాయమైపోతాయి. ఈ జగత్తు అంతా మాయామయం.పరబ్రహ్మ వివేకమే నీకు హితమైనది.

12. దినయామిన్యౌ సాయం ప్రాతః, శిశిరవసన్తౌ పునరాయాతః౹ కాలః క్రీడతి గచ్ఛత్యాయుః, తదపి న ముఞ్చత్యాశావాయుః౹౹

The gaint wheel of time repeatedly brings the day-night and seasons cycles. In this game played by the time, one gets aged and dies. Even then, the cyclone of greed does not cease. పగలు-రాత్రి, ఉదయం-సాయంత్రం, శిశిరము-వసంత ఋతువులు తిరిగి వస్తునే ఉంటాయి. కాలం ఆడే ఈ ఆటలో ఆయుష్షు తీరిపోతుంది. ఐననూ, అత్యాశ యనే తుఫాను మాత్రం తగ్గదు.

13. ద్వాదశమఞ్జరికాభిరశేషః, కథితో వైయాకరణస్యైషః౹ ఉపదేశో భూద్విద్యానిపుణైః, శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః౹౹

This boque of twelve sanskrit stanzas were rendered by Shri Sankaracharya, the great learned saint to enlighten the aged Sanskrit Grammer pundit of Benaras.

ఈ పన్నెండు శ్లోకములను పూలగుత్తిని, యదార్థమైన విద్యాపారంగతుడైన శ్రీ శంకర భగవత్పాదులవారు (కాశీనగరమందు డుకృణ్) వ్యాకరణ పండితునకు ఉపదేశించిరి.

14. కాతే కాన్తా ధన గతచిన్తా, వాతుల కిం తవ నాస్తి నియన్తా౹ త్రిజగతి సజ్జన సంగతిరైకా, భవతి భవార్ణవతరణే నౌకా౹౹

Why do you always worry about women and wealth? Is there nobody to guide you? The only ship to cross the ocean of life is the company of good people.

ఓయీ! స్త్రీ, ధనముల గురించి ఎందులకు అంత ఆలోచన? నీకు సరైన బోధనలు చేయువాడు లేడా? సంసార సాగరాన్ని దాటేందుకు ఈ మూడు లోకములలో నీకున్న ఒకే సాధనం, సజ్జన సాంగత్యమే!

18. కురుతే గఙ్గాసాగరగమనం, వ్రతపరిపాలనమథవా దానమ్౹ జ్ఞానవిహినః సర్వమతేన, ముక్తిం న భజతి జన్మశతేన౹౹

One may go to Gangasagar, observe fasts, and give away riches in charity ! Yet, devoid of jnana, nothing can give mukthi even at the end of a hundred births.

గంగలోను, సముద్రమందును స్నానం చేసినా, వ్రతములను ఆచరించినా, దానములను చేసినప్పటికిని ఆత్మజ్ఞానము లేనిచో నూరుజన్మలకైనను, ఏమతము పాటించిననూ మానవుడు మోక్షము పొందలేడు.

19. సుర మందిర తరు మూల నివాసః, శయ్యా భూతల మజినం వాసః౹ సర్వ పరిగ్రహ భోగ త్యాగః, కస్య సుఖం న కరోతి విరాగః౹౹

Take your residence in a temple or below a tree, wear the deerskin for the dress, and sleep with mother earth as your bed . Give up all attachments and renounce all comforts . Blessed with such vairgya, could any fail to be content ?

దేవాలయంలో చెట్టుక్రింద నివాసముంటూ, భూమి మీద పడుకొంటూ, జింక చర్మమునే ధరించి, అన్ని భోగములను వదలి, వైరాగ్యముతో భగవంతుని ధ్యానిస్తూ జీవించినచో ఎవరికి సుఖము కలుగకుండును? 

20. యోగరతో వాభోగరతోవా, సఙ్గరతో వా సఙ్గవీహినః౹ యస్య బ్రహ్మణి రమతే చిత్తం, నన్దతి నన్దతి నన్దత్యేవ౹

One may take delight in yoga or bhoga, may have attachment or detachment . But only he whose mind steadily delights in Brahman enjoys bliss, no one else.

యోగాసక్తుడైనా లేదా భోగాసక్తుడైనా; వాంఛాసక్తుడైనా లేక కోరికలయందు విరక్తుడైనా; ఎవని చిత్తము పరబ్రహ్మము నందు స్థిరత్వము కలిగి ఉండునో, అతడు ముమ్మాటికిని ఆనందమును పొందును.

21. భగవద్ గీతా కిఞ్చిదధీతా, గఙ్గా జలలవ కణికాపీతా౹ సకృదపి యేన మురారి సమర్చా, క్రియతే తస్య యమేన న చర్చా౹౹

Let a man read but a little from giitaa, drink just a drop of water from the ganges, worship but once muraari . He then will have no altercation with Yama .

ఎవరు భగవద్గీతను కొంచమైనను గౌరవించునో, బహు కొంచెమైనా గంగాజలమును త్రాగునో, ఒక్క పర్యాయమైనను భగవంతుని పూజించునో, అట్టి వానిని గూర్చి యముడు తలవడు (అనగా అతనికి పాపములంటవు).

22. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనమ్౹ ఇహ సంసారే బహుదుస్తారే, కృపయాఽపారే పాహి మురారే౹౹

Born again, death again, again to stay in the mother's womb ! It is indeed hard to cross this boundless ocean of samsaara . Oh Murari ! Redeem me through Thy mercy.

మరల పుట్టుట, మరల చచ్చుట, మరల మరల తల్లి గర్భమునందు పరుండుట - ఈ బాధలతో కూడి, తరింపరాని/దాటరాని ఈ అపార సంసారము నుండి ఓ పరమాత్మా ! దయతో కాపాడుము.

23. రథ్యా చర్పట విరచిత కన్థః, పుణ్యాపుణ్య వివర్జిత పన్థః౹ యోగీ యోగనియోజిత చిత్తో, రమతే బాలోన్మత్తవదేవ౹౹

There is no shortage of clothing for a monk so long as there are rags cast off the road . Freed from vices and virtues, onward he wanders . One who lives in communion with god enjoys bliss, pure and uncontaminated, like a child and as an intoxicated.

వీథులందు దొరికే గుడ్డపీలికలతో తయారైన బొంతలతో తృప్తిచెందువాడును, పాపపుణ్యాల ప్రసక్తిలేని త్రోవలో వెళ్ళువాడునూ, యోగములో లగ్నమైన మనస్సుగల విరక్తుడు, బాలునివలె, పరబ్రహ్మములో తేలియాడుచుండును.

24. కస్త్వం కోఽహం కుత ఆయాతః, కా మే జననీ కో మే తాతః౹ ఇతి పరిభావయ సర్వమసారమ్, విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్౹౹

Who are you ? Who am I ? From where do I come ? Who is my mother, who is my father ? Ponder thus, look at everything as essenceless and give up the world as an idle dream.

నీవెవడవు ? నేనెవరిని ? ఎక్కడ నుండి వచ్చాము ? ఈ తల్లి ఎవరు ? తండ్రి ఎవరు ? - అనే ఆలోచనలతో, ఇది అంతయు కలవలె అసత్యమని తెలిసికొని, ఈ బాహ్య ప్రపంచముపు వ్యామోహములను విడిచి, సత్యమగు పరబ్రహ్మమును ఆశ్రయించవలెను. 

25. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః, వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః౹ భవ సమచిత్తః సర్వత్ర త్వం, వాఞ్ఛస్యచిరాద్యది విష్ణుత్వమ్౹౹

In me, in you and in everything, none but the same Vishnu dwells . Your anger and impatience is meaningless . If you wish to attain the status of Vishnu, have samabhaava, equanimity, always.

నీయందు, నాయందు అందరిలోనూ ఒకే పరమాత్మ నిండియున్నాడు. ఐననూ నాయందు కోపం వహించడం వృధా కాదా? విష్ణుపథం పొందాలంటే, అందరియొడలా ఎల్లప్పుడూ సమభావము కలిగియుండుము.

26. శత్రౌ మిత్రే పుత్రే బన్ధౌ, మా కురు యత్నం విగ్రహసన్ధౌ౹ సర్వస్మిన్నపి పశ్యాత్మానం, సర్వత్రోత్సృజ భేదాజ్ఞానమ్౹౹

Waste not your efforts to win the love of or to fight against friend and foe, children and relatives . See yourself in everyone and give up all feelings of duality completely.

బంధువులు, మిత్రులు, పుత్రులతో అతి ప్రియతను, శత్రువులతో వైరములు చేయుటలోనూ ప్రయాస పడకుము. అందరిలోనూ నీ ఆత్మనే చూడుము. అందరియెడలా భేదమనే అజ్ఞాన భావమును త్యజించుము.

27. కామం క్రోధం లోభం మోహం, త్యక్త్వాఽత్మానం భావయ కోఽహమ్౹ ఆత్మజ్ఞాన విహీనా మూఢాః, తే పచ్యన్తే నరకనిగూఢాః౹౹

Give up lust, anger, infatuation, and greed . Ponder over your real nature . Fools are they who are blind to the Self . Cast into hell, they suffer there endlessly.

వాంఛలనూ, కోపాలనూ, స్వార్థాన్నీ, మోహాలనూ, అహంభావాన్నీ వదిలివేయుము. ఆత్మజ్ఞానం లేని మూర్ఖుడు నరకానికి పోయి నానాబాధలూ పడతాడు.

28. గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్౹ నేయం సజ్జన సఙ్గే చిత్తం, దేయం దీనజనాయ చ విత్తమ్౹౹

Regularly recite from the Gita, meditate on Vishnu in your heart, and chant His thousand glories . Take delight to be with the noble and the holy . Distribute your wealth in charity to the poor and the needy.

ఎల్లప్పుడూ భగవద్గీతను పఠిస్తూ, విష్ణువు యొక్క వేయి నామాలలోగల రూప, గుణాలను ఆకళింపు చేసుకొనుము. సజ్జన సాంగత్యంలో మనసుపెట్టి, నీ సంపదను దీనజనులకు దానంచేయుము.

29. సుఖతః క్రియతే రామాభోగః, పశ్చాద్ధన్త శరీరే రోగః౹ యద్యపి లోకే మరణం శరణం, తదపి న ముఞ్చతి పాపాచరణమ్౹౹

He who yields to lust for pleasure leaves his body a prey to disease . Though death brings an end to everything, man does not give-up the sinful path.

సుఖ, భోగలాలసత్వంతో చేసే పనుల వలన శరీరం రోగాలపాలై, అంతమౌతుంది. ఈలోకంలో మరణం అనివార్యమైనా, మనషి పాపాలను చేయటం మానడు.

30. అర్థమనర్థం భావయ నిత్యం, నాస్తితతః సుఖలేశః సత్యమ్౹ పుత్రాదపి ధన భాజాం భీతిః, సర్వత్రైషా విహిఆ రీతిః౹౹

Wealth is not welfare, truly there is no joy in it . Reflect thus at all times . A rich man fears even his own son . This is the way of wealth everywhere.

సంపద వలన అనర్థాలు కలుగుననీ, అది కొంచెమైననూ సుఖమివ్వదనే నిజాన్ని ఎల్లప్పడూ నమ్ముము. ధనవంతులకు తమ పుత్రులనుంచికూడా కీడు జరుగవచ్చును. ఇది సర్వత్రా గల రీతి.

31. ప్రాణాయామం ప్రత్యాహారం, నిత్యానిత్య వివేకవిచారమ్౹ జాప్యసమేత సమాధివిధానం, కుర్వవధానం మహదవధానమ్౹౹

తాత్పర్యము: ప్రాణాయామము (గాయత్రి మంత్ర పూర్వకముగా ఊపిరిని క్రమముగా పీల్చి, బంధించి, నిదానముగా విడుచు ఒక యోగ ప్రక్రియ), ప్రత్యాహారము (బాహ్యేంద్రియములను నిగ్రహించి, అంతర్ముఖము చేయు ఒక యోగ ప్రక్రియ) శాశ్వతమైన మరియు అశాశ్వతమైన వస్తువివేకము, తత్వ విచారణ, మంత్ర జపములను ఏకాగ్రతతో, బహు జాగ్రత్తగా అవలంబింపుము.


32. గురుచరణామ్బుజ నిర్భర భక్తః, సంసారాదచిరాద్భవ ముక్తః౹ సేన్ద్రియమానస నియమాదేవం, ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవమ్౹౹

Oh devotee of the lotus feet of the Guru ! May thou be soon free from Samsara . Through disciplined senses and controlled mind, thou shalt come to experience the indwelling Lord of your heart !

గురు చరణారవిందములనే నమ్ముకుని, వెంటనే సంసారమునుండి విముక్తి పొందుము. ఇంద్రియములను, మనస్సును నియమితము చేసుకుంటే మాత్రమే, నీ హృదయంలోనేయున్న పరమాత్మ దర్శనమౌతుంది.

33. మూఢః కశ్చన వైయాకరణో, డుకృఞ్కరణాధ్యయన ధురిణః౹ శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై, బోధిత ఆసిచ్ఛోధితకరణః౹౹

Thus a silly grammarian lost in rules cleansed of his narrow vision and shown the Light by Shankara's apostles.

సంస్కృత వ్యాకరణమందు నేర్పు మాత్రమే పరమావధియనుకొన్న ఆత్మజ్ఞానములేని ఓ పండితుడు, భగవంతునికి శిష్యుడైన శ్రీ ఆది శంకరులవారిచే అంతఃకరణ శుద్ధి గూర్చి ఈ విధముగా బోధింపబడెను.

34. భజగోవిన్దం భజగోవిన్దం, గోవిన్దం భజమూఢమతే౹ నామస్మరణాదన్యముపాయం, నహి పశ్యామో భవతరణే౹౹

Worship Govinda, worship Govinda, worship Govinda, Oh fool ! Other than chanting the Lord's names, there is no other way to cross the life's ocean.

గోవిందా, గోవిందా, గోవిందాయని గోవిందుని భజించుము. ఓ మూఢుడా! ఈ జీవితమనే సముద్రమును దాటుటకు భగవన్నామ స్మరణమును మించిన ఉపాయము వేరేదీ లేదు.

Reference https://te.m.wikisource.org/wiki/%E0%B0%AD%E0%B0%9C%E0%B0%97%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B0%82