🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..
🌹🙏ఈరోజు 49 వ పైల మహర్షి గురించి తెలుసుకుందాం..🙏🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿ఇప్పుడు మనం పైల మహర్షి గురించి తెలుసుకుందాం .ఈ మహర్షి గురించి ఎక్కడ కూడా వారి ప్రస్తావన లేదు వారి గురించి చాల తక్కువ సమాచారం అందింది...
🌸ఈయన తల్లితండ్రులెవరో తెలియదు . వ్యాసభగవానుడికి శిష్యుడు పైల మహర్షి .
🌿శిష్యులకి ఋగ్వేదం చెప్తుండేవాడు . ఈయన్ని ఋగ్వేదధ్యాపకుడంటారు . వ్యాస మహర్షి తన దగ్గరుంచుకుని విద్యలన్నీ నేర్పించాడు .
🌸పైలుడు విద్యలన్నీ నేర్చుకున్నాక గొప్ప తపస్సు చేసి పైల మహర్షి అయ్యాడు . భగవంతుడు సత్యవతీదేవి యందు పరాశరుడుగా పుట్టి వేదరాశిని ఋగ్వేదము , యజుర్వేదము , సామవేదము , అధర్వవేదము అని నాలుగు భాగాలుగా విభజించి ,
🌿పైల మహర్షికి ఋగ్వేదం , వైశాంపాయనుడికి యజుర్వేదం , జైమినికి సామవేదం , సుమంతునికి అధర్వవేదం ఉపదేశించాడు .
🌸 పైలమహర్షి నేర్చుకున్న ఋగ్వేదం చాలా ఋక్కుల్తో కూడుకుని వుండటంచేత " బ్రహ్వృచశాఖ ” అని పేరు పొందింది . పైలుడు ఈ వేదాన్ని ఇంద్రప్రమితి , పాష్కలుడు అనే శిష్యులకి చెప్పాడు .
🌿ఇంద్రప్రమితి తనకొచ్చింది మాండూకేయుడికి చెప్పాడు . మాండూకేయుడు దేవమిత్రుడికి , దేవమిత్రుడు సౌభరికి , సౌభరి తన కొడుకు శాకల్యుడికి చెప్పారు .
🌸శాకల్యుడు తాను నేర్చుకున్నది అయిదు భాగాలుగా చేసి వాత్స్యుడు , శాలీయుడు , మౌద్గల్యుడు , గోముఖుడు , శిశిరుడు మొదలైన వాళ్ళకి చెప్పాడు .
🌿 శిశిరుడు తన శిష్యులకి , పాష్కలుడు నాలుగు విభాగాలుగా నలుగురుకి చెప్పాడు . ఈ విధంగా ఋగ్వేదం చాలామంది ఋషులు నేర్చుకున్నారు . పైల మహర్షి ఋగ్వేదం నాలుగువైపులా వ్యాపించేలా చేశాడు .
గొప్ప ఆదర్శ మాహర్షిగా ప్రసిద్ధి చెందారు.
🌸ఇదండీ మనకు పైలమహర్షి గురించి మనకు తెలిసిన విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment