[11/28, 03:12] +91 73963 92086: 🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..
🌹ఈరోజు 82 ,వ మహర్షులు సనక , సనందన, సనత్కుమార , సనత్సుజాత, మహర్పులు గురించి తెలుసుకుందాం.🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌿ఇప్పుడు మనం చదవబోయే మహర్షులు సనక , సనందన , సనత్కుమార , సనత్సుజాత , మహర్షులు . వీళ్ళని నలుగుర్ని కలిపి సనకాదులు అని పిలుస్తారు .
🌸వీళ్ళు బ్రహ్మగారి మనస్సు నుండి పుట్టి , బ్రహ్మమానస పుత్రులుగా పిలవబడుతున్నారు . బ్రహ్మ సనకాదుల్ని తనకు సృష్టి కార్యంలో సాయం చెయమన్నాడు .
🌿నువ్వు భగవధ్యానామృతంలో మునిగి మమ్మల్ని సృష్టించావు . కాబట్టి , మాక్కూడ అదే వచ్చింది . మేము సృష్టి కార్యంలో నీకు సాయం చెయ్యలేం . నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నీకు మేలు చేస్తాం అన్నారు సనకాదులు .
🌸సనకాదులు వాళ్ళిష్టం వచ్చినట్లు అన్నిలోకాలు తిరిగుతూ వైకుంఠానికి వచ్చారు . అక్కడ శ్రీమహావిష్ణువుని చూడాలనుకుంటే జయవిజయులనే ద్వారపాలకులు అడ్డగించారు .
🌿శ్రీ మహావిష్ణువుని చూడనివ్వలేదనే కోపంతో వాళ్ళని భూలోకంలో పుట్టమని శపించారు . ఈ గొడవకి లక్ష్మీనారాయణులు బయటికి వచ్చారు . సనకాదులు వాళ్ళిద్దర్ని రెప్పవాల్చక చూస్తూ వుండిపోయారు .
🌸ఆనందంతోనూ భక్తితోనూ లక్ష్మీనారాయణులకి స్తోత్రం చేశారు . గోవిందుడు సనకాదుల్ని నా ద్వారపాలకులికి మంచి శిక్ష వేశారు . వీళ్లు భూలోకంలో పుట్టి నాకు శత్రువులై నాతో యుద్ధం చేసి నా చక్రానికి ఆహుతై తిరిగి నా దగ్గరికే వస్తారు .
🌿తర్వాత వాళ్ళకి చావు పట్టుకలుండవు అన్నాడు నారాయణుడు . సనకాదులు ఆనందభాష్పాలో ఆ దివ్యమంగళ విగ్రహానికి మళ్ళీ మళ్ళీ మ్రొక్కి , లక్ష్మీదేవిని స్తుతించి విడవలేక , వెళ్ళలేక తమ ఆశ్రమానికి వెళ్ళారు .
🌸గొప్ప హరిభక్తుడు , బ్రాహ్మణ పూజ చేసేవాడు , ప్రజలకిష్టమయ్యేలా పరిపాలన చేసేవాడయిన పృథు చక్రవర్తి దగ్గరకి ఆకాశమార్గంలో బాలసూర్యుల్లా , సిద్ధవర్యులు , గొప్ప జ్ఞానవంతులయిన సనకాదులు వచ్చారు .
🌿పృథు చక్రవర్తి ఎంతో ఆనందంతో ఎదురెళ్ళి ఆర్ఘ్య పాద్యాలిచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి వారి పాదాలు కడిగి తలమీద చల్లుకుని యోగీశ్వరేశ్వరులారా ! నెనెంత పుణ్యం చేసుకున్నానో మిమ్మల్ని చూడగలిగాను .
🌸చాలా అనందంగా వుంది . ఈ సంసారంలో దేనివలన నాకు మోక్షం కలుగుతుందో చెప్పండన్నాడు .
🌿రాజా ! శ్రద్ధ , భగవద్ధర్మ చర్య , భగవంతుడి గురించి తెలుసుకోవాలనే కోరిక , నారాయణ కథలు వినడం , అహింస , ఎప్పుడూ భక్తి మార్గాన్నే అనుసరించడం మోక్ష సాధనాలు .
🌸ధర్మార్థకామాలు మూడు విడిచిపెట్టి పరమ పురుషార్థమైన మోక్షానే కోరుకుంటే తప్పకుండా మోక్షం కలుగుతుందని పృథుణ్ణి ప్రశంసించి ఆకాశమార్గంలో అందరూ చూస్తుండగా వెళ్ళిపోయారు సనకాదులు .
🌿ఒకసారి ఈశ్వరుడు సనత్కుమార మహర్షి దగ్గరికి వచ్చాడు . మహర్షి ఈశ్వరుడికి ఉపచారాలు చేసి త్రిలోచనా ! ఏం చెయ్యమంటారో చెప్పండి చేస్తానన్నాడు .
🌸నీతో మాట్లాడిపోదామని వచ్చానన్నాడు ఈశ్వరుడు . ఇంకా ఇలా అన్నాడు . ధ్యానంలో చూడ తగ్గది ఏది ? తత్వాలెన్ని ? సాంఖ్యమంటే ఏమిటి ? ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలెన్నో తెలుసుకుందామని వచ్చానన్నాడు శివుడు .
🌿సనత్కుమారుడు తత్త్వములు ఇరవై అయిదు . అవి భూతములు అయిదు , వాటి గుణాలు పది , ఇంద్రియాలు అయిదు , మనస్సు , బుద్ధి అహంకారము ప్రకృతి మొత్తం ఇరవయి నాలుగు .
🌸ఇంకొక తత్త్వం దేహమందుండే పురుషుడు . కాష్టంలో వుండే నిప్పులా శరీరంలో పురుషుడుంటాడు . అతణ్ణి చూడగలగడమే అమృతార్థతత్త్వం . దీన్ని చూసినవాడు మృత్యువుని కూడా జయిస్తాడు .
🌿ఇవన్నీ కలిసి చూడడమే ఏకత్వమంటే . దీన్నే బ్రహ్మాన్ని చూడడం అంటారు . తనను తానే చూసుకోగలిగివాడు జ్ఞాని . జిహ్వయందు సోముడు , వాణియందు అగ్ని , ప్రాణమందు వాయువు , బలంలో కౌశికుడు , బుద్ధియందు ఈశానుడు , అపానం
లో సూర్యుడు , సమానంలో
🌸అప్సరసలు , కళ్ళల్లో సూర్యుడు , శరీరంలో అంఘ్రలు , చెవుల్లో శేషుడు , ఉపస్థంలో ప్రజాపతి , బుద్ధియందు బ్రహ్మ ఈ అన్నింటితో కలిసి ఆత్మ వుంటుంది .
🌿ఆత్మని చూడగలిగినవాడే యోగి అన్నాడు సనత్కుమారుడు . యోగి అయినవాడు జనాలెవరూ తిరగని చోటు చూసుకుని ఇంద్రియాల్ని మనస్సుతో లాగిపట్టి ఆకలిదప్పులు మర్చిపోయి హృదయంలో దేవుణ్ణి చూస్తాడు అని చెప్పాడు సనత్కుమారుడు .
🌸సనత్కుమారుడు ఈశ్వరుడికి సాంఖ్య యోగాన్ని గురించి కూడా చెప్పాడు . ఈశ్వరా ! ఇన్నెందుకు ? సంగమే బంధము . సర్వసంగ పరి త్యాగమే మోక్షం .
🌿ఇది పరమ రహస్యం , పరమ తత్త్వం కూడా . శివుడు సనత్కుమారుడు చెప్పినవన్నీ విని సంతృప్తి పొంది తన కైలాసానికి వెళ్ళిపోయాడు . సనకాదులు స్వేచ్ఛా విహారానికి ఆకాశవీధిలో వెళ్లారు .
🌸రావణుడు సర్వలోక దిగ్విజయ యాత్రచేసి సనత్కుమారుడి దగ్గరికి వెళ్ళి మహాత్మా ! అనాది మధ్యలయుడెవ్వరు ? ఎవరితో విశ్వసృష్టి జరిగింది ? ఎవర్ని స్మరిస్తే బంధ విముక్తి అవుతుంది ? ఇలాంటి సందేహాలు తీర్చమనడిగాడు .
[11/28, 03:13] +91 73963 92086: 🌿రావణా ! అనఘుడు , అవ్యయుడు మొదలైన గుణాలతో వున్న శక్తే బ్రహ్మం . ఆ బ్రహ్మమే నారాయణ , కృష్ణ , హరి , విష్ణు , గోవింద అనే పేర్లతో పిలవబడుతోంది . హరి చేతిలో మరణించిన వారందరి గురించి రావణుడికి చెప్పాడు సనత్కుమారుడు .
🌸మహార్షీ ! నాకా యోగం వుందా ? అనడిగాడు రావణుడు . కృతయుగం చివర్లో హరి భూలోకంలో రాముడనే పేరుతో మనిషిగా పుట్టినప్పుడు నువ్వు అతనికి విరోధివై యుద్ధంలో అతని చేతిలో మరణించి మోక్షాన్ని పొందుతావని చెప్పి సనత్కుమారుడు అదృశ్యుడయిపోయాడు .
🌿మార్కండేయుడు పితృదేవతల మహిమ గురించి తెలియచెయ్యమని సనకాదుల్ని అడిగాడు . ఇదంతా మనం మార్కండేయ మహర్షి కథలో తెలుసుకున్నాం . మార్కండేయుడి సందేహాలన్నీ తీర్చి అతనికి వరాలిచ్చి దివ్యదృష్టి , సర్వవిజ్ఞానము పొందేలా చేశాడు సనత్కుమారుడు .
🌸రైభ్య మహర్షికి సనత్కుమారుడు విశ్వమంతా వ్యాపించి వున్న తన విశ్వరూపం చూపించి అతనికి గయాశ్రాద్ధ ఫలము , ఫల్గునీ నదీస్నాన ఫలితాల గురించి వివరంగా చెప్పాడు .
🌿ఒకసారి నారదుడు సనత్కుమారుణ్ణి తనకు జ్ఞానబోధ చెయ్యమని ప్రార్ధించాడు . సనత్కుమారుడు నీకు తెలిసినవి చెప్పు , తెలియనవి నేను చెప్తానని , నారదుడు చెప్పినవన్నీ విని వీటిన్నిటికన్నా ఆత్మజ్ఞానమే గొప్పదని చెప్పి అతనికి ఆఖండ ఆత్మజ్ఞానం ఉపదేశించాడు .
🌸నైమిశారణ్యంలో మునులందరూ సనత్కుమారుణ్ణి రుద్రమహాత్మ్యం గురించి చెప్పమని అడిగారు . అలా వివరించిన గ్రంథాన్నే ' సనత్కుమార సంహిత ' అన్నారు .
🌿ఆ గ్రంథంలో బ్రహ్మ విష్ణూత్పత్తి , హరి విరించి సంవాదం , సప్తద్వీప సప్తవర్ష చరిత్ర , శివలింగపూజ , శివలింగప్రళయోత్పత్తి , శివాష్టకం , జ్ఞానప్రశంస , మోక్షవిచారం మొదలైనవన్నీ ఉన్నాయి .
🌸సనత్కుమార మహర్షి మహాయోగి , మహాజ్ఞాని అయినా కూడా మనకోసం ' గృహవాస్తు శాస్త్రం ' , ' శిల్ప శాస్త్రం ' రాశాడు . ఒకనాడు నారదుడు సనత్సుజాతుడ్ని విష్ణుతత్త్వం గురించీ , సకలజీవుల్ని పుట్టించేవాడు , నడిపించేవాడు , తనలో లయంచేసుకునేవాడు అయిన శ్రీహరిని గురించి చెప్పమని అడిగి తెలుసుకున్నాడు.
🌿వృత్రాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేసి పడిపోయినప్పుడు రాక్షసులు అతణ్ణి శుక్రాచార్యుడి దగ్గరికి తీసికెళ్ళారు . గురుశిష్యుల ప్రార్థన విని సనత్కుమారుడు విష్ణుతత్వాన్ని , కర్మఫలం ఎలా అనుభవిస్తాడు .
🌸జీవుడు మొదలైన విషయాలు వివరంగా చెప్పగా విన్నారు . అమృతంలాంటి అతడి మాట పరిశుద్ధమైన మనస్సుతో ప్రాణాలు విడిచి విష్ణువుని చేరాడు వృత్తాసురుడు .
🌸ధృతరాష్ట్రుడు విదుర నీతినంతా విని ఇంకా ధర్మాల గురించి చెప్పమన్నాడు విదురుణ్ణి . నేను శూద్రుణ్ణి కనుక ఇంతకంటే చెప్పేందుకు అర్హత లేదు . బ్రహ్మర్షి సనత్కుమారుడు వివరంగా చెప్తాడని మహర్షిని ప్రార్ధించి ధృతరాష్ట్రుడికి మృత్యుతత్వాన్ని గురించి చెప్పమన్నాడు విదురుడు .
🌿జీవికి మృత్యువనేది లేదు . అంతరాత్ముడైన పురుషుడు బొటన వేలంత వుండి శరీరంలో వుంటాడు . అజ్ఞానులు ఇతనిని చూడలేరు . బ్రహ్మవిద్యా నిష్ణాతుడైన మానవుడు ప్రజ్ఞరూపుడై తన లోపలగల పరమాత్ముణ్ణి తెలుసుకుంటే అతడు శరీరాన్ని విడిచిపోనేపోడు .
🌸అలాంటి వాడికి చావులేదు , మోక్షము లేదు . బ్రహ్మతోనే సంబంధం . నేను అన్నది ఆత్మ . సర్వం ఆత్మ . ఉన్నది లేనిది ఆత్మే . మనలో ఉన్న భగవంతుడు అంటే ఆత్మ ఒక్కడే సత్యం .
🌿ఎవరికీ ఎవరూ ఏమికారు . లోకమంతా నిండివున్నది ఆత్మే . నాకు చావు పుట్టుకలు లేవు , నేనే ఆత్మ , నెనెప్పుడూ ఆనంద స్వరూపుడే అనుకుని నిష్ఠగా , నియమంగా ఉండేవాడు ఎన్నివేల సంవత్సరాలయినా బ్రతకగలడని చెప్పి సనత్సుజాతుడు ఆకాశమార్గంలో అంతర్థానమయ్యాడు .
🌸ఈ విధంగా సనక , సనందన , సనత్కుమార , సనత్సుజాత మహర్షులు ఆకాశ మార్గంలో తిరుగుతూ , ఏలోకానికి కావాలంటే ఆలోకానికి వెళ్తూ అడిగిన వాళ్ళందరికి మోక్షమార్గం ఉపదేశిస్తూ దివ్యతేజస్సుతో వెలిగిపోతూ వుంటారు .
🌿ఇదే ! మన సనక సనంద సనత్కుమార సనత్సుజాత మహర్షుల కథ !! అద్భుతంగా వుంది కదూ .... !
రేపు మరో మహర్షుల గురించి తెలుసుకుందాం స్వస్తీ..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌿🌿
No comments:
Post a Comment