Sunday, March 15, 2020

మంత్రాల శక్తి- రావణుడు



మంత్రాల శక్తి- రావణుడు

ఒక సాయంత్రం, ప్రతి మంత్రం యొక్క శబ్థంలోని అర్ధాన్ని ఋషి వివరిస్తున్నారు. సీత ఆయన చెప్తున్నప్పుడు మధ్యలో ఈ విధంగా ప్రశ్నించింది. "కేవలం ఆ మాటలను మన మనసులో అనుకుంటే సరిపోదా? వాటిని బయటకు ఎందుకు ఉచ్చరించాలి?"

గార్గి ఋషి అక్కడికి ప్రవేశించి, సీత పక్కన కూర్చున్నారు. 'సీత! మనం భౌతిక తలంలో జీవిస్తున్నాం. ఉన్నత తలాలలో
కేవలం ఆలోచన ఉంటే, కావలసింది ప్రత్యక్షీకరణ జరుగుతుంది. కానీ ఇక్కడ భౌతిక తలంలో ప్రత్యక్షీకరణ అనేది కేవలం ధ్వని యొక్క ప్రకంపన, 'ఓం' అనే ప్రకంపన ద్వారానే సాధ్యం. ఈ జ్ఞానులు సరిగ్గా చెప్పారు: ఉచ్చారణ కీలకమైనది. సరైన ప్రకంపనతో అమరికలో ఉండటం చాలా కష్టం. తమ ఆలోచన శృతిలో లేకపోతే, ధ్వని కూడా సంపూర్ణ అమరికలో ఉండలేదు. ఆలోచన ధ్వని యొక్క మార్గాన్ని నిర్దేశిస్తుంది. స్వచ్ఛమైన మనసు అవసరం. కనీసం క్రమశిక్షణతో కూడిన మనసు అవసరం. అందువల్లే చాలా కొద్ది మంది మాత్రమే మంత్రం యొక్క శక్తిని అనుభూతి చెందగలరు. పూర్వకాలంలో వర్షాలు రావాల్సిన సమయంలో రాకపోయినా, మంత్రం ద్వారా భూమికి మేలు చేకూరేది.

సీత తనకు తెలిసిన కొంత మంది ఉన్న ధ్యాన పద్ధతుల్లో నిపుణులైన సమూహం వైపుకు తిరిగి చూసింది. నేను జన్మించక ముందు విదేహలో చాలా కాలం కరువు ఉంది. అప్పుడు మంత్రాలు వర్షాలను ఎందుకు తీసుకురాలేదు?

గార్గి మహర్షి చిన్నగా సమాధానం ఇచ్చారు. "ఒక శక్తివంతమైన వ్యక్తి ఉన్నారు సీత, తాను మంత్రాల ప్రభావాన్ని కూడా అడ్డుకోగలరు. ఇది చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఆ సమయంలో జరిగింది."

సీత ఒకరి తరువాత ఒకరిని చూసింది. 'అటువంటి దుఃఖానికి కారకులైన వారు ఎవరు మరియు ఎందుకు చేసారని నాకు తెలియాలి' అని కోరింది.

తన పేరు రావణుడు అని గార్గి మహర్షి చెప్పారు. 'తను ఒకప్పుడు గొప్ప పండితుడు మరియు మహాదేవుడు- శివుని భక్తుడు. దీర్ఘమైన మరియు గాఢమైన తపస్సు ద్వారా ఎన్నో శక్తులను సాధించారు.'

తన తల్లి ఒక శక్తివంతమైన అసుర. కానీ తన తండ్రి మాత్రం వేదాలను గౌరవించే పండితుడు. తను రెండిటిలో ఏ మార్గమైనా ఎంచుకోవచ్చు. కానీ తన గర్వం మరియు అహంకారం కారణంగా మూడు ప్రపంచాలను చేజిక్కించుకోవాలని కోరుకున్నాడు. భూమి మీద ఎన్నో భాగాలను ఆక్రమించాడు. అదే విధంగా ఎన్నో రకాలుగా మభ్య పెట్టి, లక్ష్యాన్ని సాధించటం నేర్చుకున్నాడు.

తనకు లభించిన శక్తులను సంభాళించుకోవటానికి తను సిద్ధంగా లేడు. ఆ శక్తి సరికాని వ్యక్తికి లభించింది సీత. ఇది ఎంతో నష్టాన్ని కలిగించగలదు.


Reference:
ఎస్ పత్రి

🌎 బ్రహ్మర్షి పితామహ పత్రీజీ 15-3-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🌎

🌷 "Vellore"🌷
🌹 "15-3-2020"🌹

దేనా మరియం రచించిన “THE UNTOLD STORY OF SITA” అనే పుస్తకం నుండి కొన్ని రచనలు.

No comments:

Post a Comment