Monday, March 16, 2020

ఎదుటివారి ఈర్ష్య ద్వేషం ను ఏ విధంగా స్వీకరించాలి

ఎదుటివారి ఈర్ష్య ద్వేషం ను ఏ విధంగా స్వీకరించాలి

విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి.

వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి.

తరువాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి.

ఐనా అది తట్టుకొని ఎదిగి వృక్షంలా మారితే..

ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తల దాచుకుంటాయి.

అదేవిధంగా మన ఎదుగుదల చూసి ఈర్ష్య పడినవారే నీ సాయం కోరతారు,
అప్పటివరకు మనం చేయవలసినది ఒక్కటే, ప్రతీ విషయానికి నవ్వుతూ సమాధానం ఇవ్వాలి,
మన లోపల ఆ భావం ఉండకూడదు, నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ, ప్రేమ, క్షమ, ఓర్పు, తో ఉండాలి....

🙏 సమస్త లోకా సుఖినోభివంతు.🙏

No comments:

Post a Comment