Tuesday, April 21, 2020

సృష్టి రహస్యం

సృష్టి రహస్యం
""""""""""""""

ప్రకృతిని సృష్టించిన తరువాత భూమ్మీద వున్న ఘన పదార్థాలన్నీటిని కలిపి పురుషుడికి ప్రాణం పోశాడంట బ్రహ్మ.

ఒంటరిగా కొన్ని రోజులు తిరిగిన పురుషుడికి ఏమీ తోచక బ్రహ్మ దగ్గరికి వెళ్లి 'నాకేమి తోచడం లేదు అన్నాడట'.

'సరే... నీకు తోడు కావాలి కదా! అలాగే ఇస్తాను' అని చెప్పి,

సృష్టిలోని అద్భుతాలన్నీ మేళవించి అద్బుతమైన 'స్త్రీ'కి ప్రాణం పోశాడట.

వారం రోజులు గడిచాక బ్రహ్మ దగ్గరకి పరుగెత్తుకొచ్చిన మగవాడు
"స్వామి...! మీరు తోడుగా ఇచ్చిన జీవి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది....

విరామం లేకుండా మాట్లాడుతోంది.

నాకు ఏకాంతం లేకుండా చేస్తోంది...

నేనామెతో కలిసి బతకలేను....
ఈ జీవిని వెనక్కి తీసుకో" ఆన్నాడట.

చురునవ్వుతో ఆ యువతిని వెనక్కి తీసుకున్నాడట బ్రహ్మ.

రెండు రోజులు గడవక ముందే మళ్ళీ పరుగెత్తుకొచ్చిన పురుషుడు....

"దేవా...!

ఆ జీవి నాకు దూరం అయినప్పటి నుంచి జీవితంలో ఉత్సాహం పోయింది.

సంతోషం కరువయింది.

తక్షణమే ఆమె నాకు కావాలి...

ఆమె లేకుండా జీవించలేను" వేడుకున్నాడట.

"చూడు నాయన ఇప్పటి కైన తెలిసిందా...
'స్త్రీ' అంటే ఏమిటో....
స్త్రీలు లేని చోట శోభ కొరవడుతుంది.
వారు లేకపోతే ప్రేమతత్వం వికసించదు. నిండుదనం లోపిస్తుంది ...
అందం, ఆనందం ఉండదు"

అని చెప్పి బ్రహ్మ అదృశ్యమయ్యాడట.

No comments:

Post a Comment