మీ అంతరాత్మకు జవాబు చెప్తున్నారా ? - స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’
ఈ ప్రపంచంలో స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండడం చాలా ధైర్యంతో కూడుకున్న పని అని నేనంటాను. స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉండాలనుకునే వ్యక్తికి ఏమాత్రం భయంలేని ‘‘నిర్భయత్వం’’ పునాదిగా ఉండాలి.
ఈ విషయంలో ప్రపంచమంతా నన్ను వ్యతిరేకించినా నాకు ఏమాత్రం బాధ లేదు. ఎందుకంటే, నా అనుభవమే నాకు అత్యంత విలువైనది. అందుకే అది నాకు చాలా ముఖ్యం.
అంకెల లెక్కలను నేను ఏమాత్రం లెక్కచెయ్యను. ఎంతమంది నాతో ఉన్నారనేది నాకు ముఖ్యంకాదు. నా అనుభవానికి ఉన్న విలువనే నేను ఎప్పుడూ గమనిస్తాను. చిలక పలుకుల్లా నేను ఇతరులు చెప్పిన మాటలనే చెప్తున్నానా లేక నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్న దానిని చెప్తున్నానా అనేది నాకు చాలా ముఖ్యమైన విషయం.
నేను స్వయంగా అనుభవించి తెలుసుకున్న దానిని చెప్తున్న పక్షంలో అది నా రక్తంలో, ఎముకల మూలుగులలో భాగమైనట్లే.
అప్పుడు ఈ ప్రపంచమంతా ఏకమై నన్ను వ్యతిరేకించినా నేను ‘‘ప్రపంచానిదే తప్పని, నేను చెప్పినదే- అది ఏమైనా కావచ్చు- వాస్తవమని’’ అంటాను. అందుకు నాకు ఎవరి మద్దతు అవసరం లేదు. ఇతరుల అభిప్రాయాలను స్వీకరించేవారికే ఇతరుల మద్దతు అవసరమవుతుంది.
కానీ, ఇంతవరకు మానవ సమాజం అదే తీరులో పనిచేస్తూ మిమ్మల్ని తన అధీనంలో ఉంచుకుంది. దానికి కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వాటిని మీరుకూడా అనుభవించక తప్పదు. అదెలా ఉంటే మీరు కూడా అలాగే ఉండాలి.
అంతేకానీ, మీలో ఏమాత్రం తేడారాకూడదు. ఎందుకంటే, మీలో ఏమాత్రం తేడావచ్చినా మీరు ఏదో ప్రత్యేకతతో కూడిన స్వతంత్రులైనట్లే. అలాంటి వ్యక్తులంటే సమాజానికి చాలా భయం. ఎందుకంటే, మీరు దేనికీ తలవంచరు. అప్పుడు దాని దేవుళ్ళు, దేవాలయాలు, పూజారులు, పవిత్రగ్రంథాలు దిక్కులేకుండాపోతాయి.
ఎందుకంటే, హాయిగా ఆడుతూ, పాడుతూ జీవించేందుకు, మరణించేందుకు మీదారి మీరు చూసుకున్నారు. అంటే మీరు మీ ఇంటికి చేరుకున్నట్లే. కాబట్టి, గుంపులో ఉన్నంతవరకు మీరు మీ ఇంటికి ఎప్పుడూ చేరుకోలేరు. కేవలం ఒంటరిగా మాత్రమే మీరు మీ ఇంటికి చేరుకోగలరు.
మీ అంతర్వాణిని వినండి:
ఎందుకురా ఎప్పుడూ బుర్రగోక్కుంటున్నావు? అన్నాడు తండ్రి కొడుకుతో.
‘‘నా దురద ఎక్కడుందో నాకే తెలుస్తుంది నాన్నా’’అన్నాడు కొడుకు.
అదే మీ అంతర్వాణి.
అది మీకు మాత్రమే తెలుస్తుంది తప్ప, ఇతరులకు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే, అది బయటకు కనిపించే వస్తువుకాదు. మీకు తలనొప్పి వచ్చినా, సంతోషమొచ్చినా అది మీకుమాత్రమే తెలుస్తుంది. దానిని మీరు ఒక వస్తువులా ఇతరులకు చూపించలేరు.
మీ అంతర్వాణి మీ లోలోపల ఎంత లోతుల్లో ఉంటుందంటే, అది నిజంగా మీలో ఉన్నట్లు మీరు ఏమాత్రం నిరూపించలేరు. అందుకే విజ్ఞానశాస్త్రం దానిని చాలా అమానుషంగా ఖండిస్తుంది.
అయినా అది మీలోఉన్నట్లే. దాని విలువ దానికి ఎప్పుడూ ఉంది. ఎందుకంటే, ఒక వస్తువుగా ఇతరులకు చూపించలేని ‘ప్రేమభావన’ తనలో ఉన్నట్లు శాస్తవ్రేత్తకు కూడా తెలుసు. కానీ, శాస్ర్తియపరమైన శిక్షణ పట్ల అందరూ తమ అంతర్వాణిపై నమ్మకాన్ని కోల్పోయారు. అందుకేవారు ఇతరులపై ఆధారపడతారు. ఎవరైనా మీతో ‘‘మీరు చాలా అందంగా ఉంటారండి’’ అనగానే మీరు చాలా సంతోష పడతారు.అవునా కాదా?
Source - Whatsapp Message

No comments:
Post a Comment