Monday, January 25, 2021

ధైర్యమున్న చోటే దాపరికం ఉండదు - జీవితం మార్మికమైనది

🌹. ధైర్యమున్న చోటే దాపరికం ఉండదు - జీవితం మార్మికమైనది 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀)

📚ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం

✍️ మురళీ మోహన్

🤔 ప్రార్థన కూడా చివరికి ఒక ప్రయోజనం కోసమే అన్నట్లుగా తయారైంది. ప్రతి క్షణం జీవితం ఎలాసాగితే అలా సాగనివ్వడమే ప్రమాదకరంగా, ప్రమోదంగా జీవించడమంటే. ప్రతి క్షణానికి ‘‘దాని విలువ’’దానికుంది. అయినా మీరు ఏమాత్రం భయపడరు. ఎందుకంటే, మృత్యువు ఉందని, దానినుంచి ఎవరూ తప్పించుకోలేరని మీకు తెలుసు. ఆ సత్యాన్ని మీరు అంగీకరిస్తారు.

నిజానికి, మీరు- శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా- ప్రతిక్షణం మృత్యువును చాలా ఆనందంగా ఎదుర్కొంటున్నారు. అందువల్ల అలా ఆనందించే క్షణాలలోనే మృత్యువు సాక్షాత్కరించే క్షణమొకటి వస్తుంది. కాబట్టి, కేవలం ఆనందించే క్షణాలలోనే మీరు మృత్యువును నేరుగా కలుసుకుంటారు. అదే ప్రమాదంలో ప్రమోదంగా జీవించడమంటే.

కేవలం ధైర్యమున్న వ్యక్తులు మాత్రమే ఎప్పుడూ ప్రమాదకరమైన వాటి కోసం అనే్వషిస్తారు. అందుకే వారు ఏమాత్రం ఆలోచించకుండా చాలా దురుసుగా ప్రమాదాలలోకి ప్రవేశిస్తారు. వారి జీవిత పరమార్థం బీమా సంస్థల కోసం కాదు. వారు హిమాలయ శిఖరాలను మాత్రమే కాదు, అంతరంగ శిఖరాలను కూడా అధిరోహిస్తారు. అలాగే వారు సముద్ర కెరటాలపై మాత్రమే కాదు, అంతరంగ తరంగాలపై కూడా విహరిస్తారు.

కానీ, ఒక విషయం గుర్తుంచుకోండి: ‘‘అపాయాన్ని ఆహ్వానించే కళ’’ గురించి ఎప్పుడూ మర్చిపోకండి. ఎప్పుడూ అలాంటి సామర్థ్యంతోనే ఉండండి. అపాయాన్ని ఆస్వాదించే అవకాశం ఎక్కడ ఉన్నా, దానిని వదులుకోకండి. దానివల్ల మీరు కోల్పోయేది ఏదీ ఉండదు. నిజానికి, కేవలం అపాయం మాత్రమే వాస్తవంగా జీవించే వారికి లభించే హామీ.

🌷. జీవితం మార్మికమైనది: 🌷

‘‘వివరించలేనిదేదో ఉంది’’అనే భావనను అంగీకరించేందుకు మనసుకు కాస్త సమస్యగానే ఉంటుంది. చాలా విరుద్ధంగా, గందరగోళంగా ఉండేవన్నీ మీ మనసును కలవరపెట్టేవే.

ధార్మిక, వేదాంత, విజ్ఞాన, గణాంక చరిత్రలన్నింటికీ ఉన్నది అదే మూలం, అదే మనసు, అదే దురద. మీరు మీ దురదను మీకు నచ్చినట్లు గోక్కుంటే, ఇతరులు వారి దురదను వారికి నచ్చినట్లు గోక్కుంటారు.

కాబట్టి, ఇక్కడ దురద గురించి-అది ఏమిటో, ఎలాంటిదో- సరిగా అర్థం చేసుకోవాలి. ‘‘అస్తిత్వం మార్మికమైనది కాదు’’అనే నమ్మకమే ‘దురద’. కాబట్టి, అస్తిత్వ మర్మాన్ని ఏదో విధంగా ఛేదించినప్పుడే ఆ దురదపోయి మనసుకు సౌకర్యంగా ఉంటుంది.

దేవుడు, దేవుని ఏకైక కుమారుడు, పవిత్ర పిశాచి- వీరిని సృష్టించడం ద్వారా నమ్మకం విషయంలో క్రైస్తవ మతం ఎంత చెయ్యాలో అంతా చేసింది. అలాగే ఇతర మతాలు కూడా వాటికి తోచినట్లు చేశాయి. అలా అన్ని మతాలు వాటి పద్ధతులలో మూయలేని బిలాన్ని మూసే ప్రయత్నం చేశాయి.

కానీ, ఎంత చేసినా ఆ బిలం ఇంకా కనిపిస్తూనే ఉంది. నిజానికి, దానిని ఎంత ఎక్కువగా మూసేందుకు ప్రయత్నిస్తే అది అంత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. పైగా, అలా మూసేందుకు మీరుచేసే ప్రయత్నం ‘‘ఆ బిలాన్ని ఎవరైనా చూస్తారేమో’’అని మీరు భయపడుతున్నట్లు స్పష్టం చేస్తుంది.

మానసిక ప్రపంచంలోని శాఖలన్నీ ప్రత్యేకించి గణితశాస్త్ర పద్ధతిలో చిన్న చిన్న అతుకులతో ఆ బిలాన్ని మూసే పని చేస్తున్నాయి. ఎందుకంటే, గణితశాస్త్రం పూర్తిగా మనసుతో ఆడే ఆట.

దేవుడున్నాడని భావించే వేదాంతులున్నట్లే ‘‘అది కాదు’ ’అని భావించే గణిత శాస్తవ్రేత్తలున్నారు. వారికి ‘‘దేవుడు’’ అనేది కేవలం ఒక భావన మాత్రమే.

🌹 🌹 🌹 🌹 🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment