Friday, January 29, 2021

బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక్క గుడి, ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...

👍🙏👌

ఇది నిజంగా రోమాలు
నిక్క పొడుచుకొనేలా చేసే
నిజ జీవితంలోని
జరిగిన సంఘటన...

చరిత్రలో నిలిచిన కథ.

నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు,

ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది.

ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని,
అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని
ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు.

ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా
పరమ శివుడు కనిపించాడు.

నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది.

ఈమె భార్యది మరియు ఈయనది నిజంగా అదృష్టమే.

1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు,
“ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్
అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు.

ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. .

కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు.

ఆమె పేరు మేరీ.

ఇలా కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది.

అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదానికి గురి అయింది.

ఎప్పుడు భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది.

ఆమె రాత్రి పగల్లు తన భర్త కోసం తపిస్తూ బాధ పడుతూ ఎదురు చూడసాగింది.

అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేద మంత్రాలు విని, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది.

అక్కడ పూజారులు
మహా శివుణ్ణి పూజించడం ఈమె గమనించింది.

ఆ పూజారులు
“ఈమె మనసులో ఏదో బాధలో ఉందని”
గ్రహించి పలకరించారు.

ఆ పూజారులు
“ఏమైంది తల్లి నీకు అని అడగగనే,
వెంటనే ఆమె భర్త
‘కల్నల్ గురించి చెప్పి,
భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని,
వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది.

ఆ పూజా రులు ఆమెని ఓదారుస్తూ

“మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు.

ఆమె గుడిలో
మహా శివునికి మొక్కీ ఇంటికి వెళ్లింది తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ
“లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది.

భక్తితో ఆరాధిస్తూ ఆమె “తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది.

11 రోజుల జపం చేసిన తర్వాత,
ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది.

ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు.

పతాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని,
ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని.

అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ
ఒక భారతదేశపు
మహా యోగి వెలుగుతూ కనిపించాడని.

ఆయన పులి చర్మం ధరించి,
మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని,
ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు.

ఆయన శక్తికి,
తేజస్సుకి పతాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు.

ఈ యోగి వల్లే మేము విజయం సాధించమని అన్నాడు.

ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని,
ఆ మహా యోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ,
నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు.

కొన్ని వారాల తర్వాత,
కల్నల్ ఇంటికి చేరుకున్నారు.

తర్వాత కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు.

కల్నల్ గుడిలో ఉన్న
మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నాడు.

అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ
“మహా శివునికి” అపార భక్తులు అయ్యారు.

ఆ తర్వాత బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు.

జన్మ ధన్యం చేసుకున్నారు.

ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్ద రి పేర్లు ఉన్నాయి.

బ్రిటిష్ వాళ్ళు కట్టిన
ఒకే ఒక్క గుడి ఇదే.

ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...

👍👏👌

Source - Whatsapp Message

No comments:

Post a Comment