Wednesday, January 27, 2021

సమస్య-సమాధానం!

సమస్య-సమాధానం!
----------------------------------
-- దండమూడి శ్రీచరణ్

సమస్య మంచిదే!సమస్య లేని జీవితం లేదు.సమస్యలు లేని వ్యక్తులు లేరు!!అసలు చెప్పాలంటే సమస్యకు సమాధానంగానే,సమస్యలు పరిష్కరిస్తూనే మనిషి మనిషిగా ఎదుగుతాడు.నిత్యం ఎదుర్కొనే ఆహార సమస్యను ఎదుర్కొనే క్రమంలోనే ప్రతీ ప్రాణీ నిమగ్నమై ఉంటుంది.ఆదిమ మానవుడు కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నాడు.అయితే మనిషికీ,ఇతర జీవజాలానికీ బేధం ఏమిటంటే,మనిషి తన సమస్యను పరిష్కరించుకునేందుకు సృజనాత్మకంగా ఆలోచించాడు.వైవిధ్యంగా ప్రవర్తించాడు.అలా మనిషి నేటి స్థాయికి పురోగమించాడు.
సమస్య ప్రతీ వ్యక్తి జీవితంతో ముడిపడి ఉన్న కీలకాంశం.సమస్యే లేని యెడల మనిషి ముందుకు పోలేడు. సమస్య పరిష్కరించకుండా మనిషి ఏమీ నేర్చుకోలేడు. అసలు ఎదగలేడు.
అయితే కొన్ని సమస్యలు తక్షణం పరిష్కరించుకోవాల్సినవి ఉంటాయి.కొన్ని సమయానుకూలంగా ఎదుర్కోవలసినవి ఉంటాయి.ఎప్పుడు ఏ సమస్యకు సమాధానం ఇవ్వాలో తెలుసుకోవడమే విజ్ఞత!
కొందరు సమస్యకు అతిగా స్పందిస్తారు.కొందరు సమస్యను దాటవేస్తారు.రెండూ సమస్యాత్మకమే!!
సమస్యలు పరిష్కరించుకునే క్రమంలోనే అనుభవం ఒనగూడుతుంది. ఆ అనుభవాన్ని విశ్లేషించుకొని,అవగాహన చేసుకొని,రాబోయే సమస్యలను అంచనా వేసుకొని,వాటిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచించుకోవడమే తెలివిడితనం.సమస్యకు కొందరు బెంబేలు పడిపోతారు.మరి కొందరు సమస్యను అసలు పట్టించుకోరు.రెండూ సరైనవి కావు.
సమస్యలు మనకు జీవిత పాఠాలు నేర్పుతాయి.సమస్యలు మనం ఎదిగేందుకు తోడ్పడతాయి.సమస్యే విజయానికి తొలి మెట్టు.సమస్యలు పరిష్కరించడమే జీవిత సాఫల్యతకు సోపానం!!
-- దండమూడి శ్రీచరణ్
9866188266

Source - Whatsapp Message

No comments:

Post a Comment