Saturday, January 30, 2021

స్వకార్యం, స్వామికార్యం వ్యత్యాసాలు ఏమిటి ?

🌸స్వకార్యం, స్వామికార్యం వ్యత్యాసాలు ఏమిటి ?*🌸

మనకు మన స్వకార్యం కనిపిస్తుంది కానీ స్వామికార్యం కనిపించటంలేదు. మన పని భగవంతుని పని కలిసే సాగుతున్నాయి. బండి చక్రాలు తిరిగేది కనిపిస్తుంది కానీ అది ఎడ్లు లాగటం వల్లనే. అలాగే మన ప్రతిపనిలోనూ దైవం చేస్తున్న పని గమనించటమే శ్రద్ధ, సాధన, ధ్యానం, యోగం. మనము ఏదైనా వస్తువును ఫలానా అని గుర్తించేందుకు ముందు దాన్ని చూడాలి. ఆ చూపు స్వామికార్యమైతే గుర్తించటం మనకార్యం. సువాసనైనా, దుర్వాసనైనా గుర్తించాలంటే ముందు మనకు వాసనచూసే ఘ్రాణశక్తి ఉండాలి. ఆ ఘ్రాణశక్తి స్వామికారణమైతే ఫలానా వాసన అన్న వివేచన మనకార్యం. ముందు పిలుపు వినిపిస్తే ఆ తర్వాత ఫలానావాళ్ళు పిలిచారని గుర్తిస్తాం. పిలుపు వినిపించిన శ్రవణశక్తి స్వామికార్యమైతే అది ఎవరి పిలుపో నిర్ణయించడం మన స్వకార్యం. ఇలా ప్రతి ఇంద్రియ కార్యంలోనూ శుద్ధ ఎరుకగా ఉన్న తొలిగ్రహింపు రూపంలో దైవం మనతోనే ఉంటుంది. మన నిత్యనైమిత్తిక కార్యాలను గమనిస్తే ఈ ఎరుకను గుర్తుపట్టవచ్చు .

👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment