Saturday, January 2, 2021

సంసారంలో ఉంటూ నిర్వాణం పొందాలి - పత్రీజీ

Life Change Messages Every Day 6:50pm In Light Workers Group

🙏సంసారంలో ఉంటూ నిర్వాణం పొందాలి - పత్రీజీ 🙏

♻️మరొకరితో కలిసి చక్కగా జీవిస్తూ సుఖమయ సంసారాన్ని పొందుతూనే మనం మనతో కూడా కలిసి జీవిస్తూ ఆత్మానందమయ నిర్వాణాన్ని పొందాలి అంటే .. ధ్యానసాధన అన్నది ప్రతి ఒక్కరికీ చిన్నతనం నుంచే అలవడాలి.

♻️నేను భార్యా పిల్లలను ప్రేమగా చూసుకుంటూనే .. ఉద్యోగ ధర్మాన్ని బాధ్యతగా నిర్వహిస్తూనే .. ఇతరులకు ధ్యానప్రచారం చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడిని.

♻️మీరు ధ్యానసాధన ద్వారా మీ దగ్గర ఉన్న పరమాత్మ తత్త్వాన్ని గుర్తించుకోవడానికి మీరు వచ్చారు.

♻️మీలో ఉన్న సహనాన్నీ, శ్రద్ధనూ, సబూరీనీ, ఎరుకనూ పెంపొందించుకోవడానికి వచ్చారు.ఇవన్నీ దైవీలక్షణాలు!

♻️ఈ దైవీలక్షణాలు లేనివాడు .. బాధకలిగితే .. ఆ బాధను తనకంటే బలహీనులయిన వాళ్ళమీద వెళ్ళగ్రక్కుతూ వాళ్ళను హింసిస్తూంటాడు. పై అధికారి ఆఫీసులో తనను ఏదో అన్నాడన్న ఉక్రోషాన్ని ఇంటికి వచ్చి భార్యమీద చూపిస్తాడు .. అది జీర్ణ్ంచుకోలేని ఆ దొడ్డఇల్లాలు కోపంతో తన చిన్న పిల్లల్ని చావబాదుతుంది. ఇదొక అసంకల్పిత చైన్ రియాక్షన్!

♻️ఇలాంటి ఎరుకలేని అసంకల్పిత గొలుసు – కట్టు చర్యల్లోంచి బయటపడాలి అంటే .. మనలో ధ్యాన చైతన్యాన్ని పెంచుకోవడం ఒక్కటే మార్గం!

♻️మన స్వంత కల్యాణం కోసం చేసే ప్రాపంచిక కార్యాలు మనకు కర్మలుగా పరిణమించేందుకు అవకాశాలు కలిగి వుంటే .. సమిష్టి కృష్టితో ఇలా అందరికోసం చేసే ధ్యాన కార్యక్రమాలు లోకకల్యాణానికి కారణభూతం అవుతూ .. కొద్దో, గొప్పో మిగిలిన కర్మభారాలను కూడా పూర్తిగా దగ్ధం చేసేస్తాయి!

ఆధ్యాత్మిక పుస్తకాలు, పిరమిడ్స్, భారతదేశం, ఇతర దేశాలకి కూడా కావాలి అంటే కొరియర్ చేయబడును. సంప్రదించండి 9032596493, 9491557847

లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004

👍 VicTorY oF LiGhT🎇

💚🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe💓🌟🌕✨💥☣

Source - Whatsapp Message

No comments:

Post a Comment