Friday, January 1, 2021

"పాపం" (Sin) "సర్ధుబాటు" (adjustments)"పశ్చాత్తాపం" (repentance)

🟢 పితామహ పత్రీజీ 13-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 13-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"పాపం" (Sin) "సర్ధుబాటు" (adjustments)
"పశ్చాత్తాపం" (repentance)

" విశ్వంలో చట్టం మరియు క్రమం లేవు అని అనుకుంటే అది సర్వోత్కృష్టమైన ప్రజ్ఞ పట్ల పాపానికి ఒడిగట్టినట్లే అవుతుంది. ప్రతి ఒక్కరికీ, ఏదో ఒక రకమైన చట్టం లేదా మేధస్సు పట్ల నమ్మకంతో కూడిన కనీస జ్ఞానం ఉంటుంది. మనిషి తన ఉనికికి మరియు మేధస్సుకు సృష్టికర్త అయిన భగవంతుడిని ఏ రూపంలో పూజించినప్పటికీ, తన ఉన్నతత్వానికి మూలమైన మనస్సాక్షికి, విధి నిర్వహణకు, బాధ్యతకు సర్వోత్కృష్టమైన ప్రజ్ఞనే ఆరాధిస్తాడు."

" పాపాలు క్రమబద్ధతకు ఆటంకాలు, అవి స్వయంచాలకం (automatic) గా సర్థుబాట్లను అనుసరిస్తాయి."

" సర్థుబాట్లు మనిషి లోపల తలెత్తుతాయి మరియు తక్షణమే ఆలోచనలోనే సమతుల్యత అంశంను తీసుకువస్తాయి, ఇంకా అవి సంఘటనల రూపంలో బాహ్యతలంలో బాహ్యీకరణ చెంది మనస్సాక్షి సంతృప్తి చెందేంతవరకు ఆ సమత్వ అంశం కొనసాగుతుంది."

" ఈ సంతృప్తి, ఒకే సమయంలో, విశ్వంలోని సర్థుబాటు (universal adjustment) కు మరియు ఈ విశ్వంలో క్రమము (order) ను సంరక్షించే విధంగా ఉంటుంది."

" నిజమైన పశ్చాత్తాపం, తప్పు చేసినట్లు గుర్తించటం ద్వారా వస్తుంది; దానిని అంగీకరించి, నిబద్ధతతో కష్టానికి ఓర్చి పరిహారం చెల్లించటమో లేక వారి విధులను సక్రమంగా నిర్వర్తించటం ద్వారానో సర్థుబాటు జరుగుతుంది."

" మోక్షము (salvation) అంటే పాపపు ఆలోచనల ద్వారా వచ్చే పరిణామాలు యొక్క నిరంతర బాహ్య వ్యక్తీకరణల ప్రవాహం నుంచి విడుదల."

" ఇది కేవలం సర్థుబాటు ద్వారా మాత్రమే వచ్చే పరిణామము. పశ్చాత్తాపము ద్వారా పాపాలను క్షమించి, ముక్తిని ప్రసాదించటం అనే దానికి అర్థమే పశ్చాత్తాపానికి సంబంధించిన సిద్ధాంతాల సారాంశం."

💖 ఎస్ పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment