Saturday, January 2, 2021

*"గతజన్మల యొక్క ఆలోచనలు"* (Thought's of one's Past lives) *"విశ్వప్రణాళికలో జోక్యం"* (Interference with the plan of the Universe)

🟢 పితామహ పత్రీజీ 19-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 19-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"గతజన్మల యొక్క ఆలోచనలు"
(Thought's of one's Past lives)

"విశ్వప్రణాళికలో జోక్యం"
(Interference with the plan of the Universe)

"వంశపారంపర్యత, అదే విధి."

"శారీరకపరంగా మనం ఎన్నో, అత్యంత విలువైన అంశాలను కలిగి ఉన్నాము. యుక్త వయసులో ఇంకా కొన్ని అలవాట్లు, గుణగణాలు, లక్షణాలు చాలా స్పష్టంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించినట్లుగా అనిపిస్తుంది కాని, చివరికి ఈ శారీరక వైవిధ్యాలు, అలవాట్లు లేక లక్షణాలు, ఉదాహరణకు బట్టతల, దృష్టిలోపాలు, వంకరపోయిన పాదాలు లేక దృఢత్వం లేని ఎముకలు, ఇవన్నీ కూడా గత జన్మల ఆలోచనల యొక్క వ్యక్తీకరణలు."

"తల్లిదండ్రుల మాదిరిగా అనిపించే విషయాలు, సవరణలు లేక ప్రాముఖ్యతను కలిగి ఉండవచ్చు కాని అన్నీ కూడా వారి వారి ఆలోచనల వల్లనే నియత్రించబడతాయి."

"నూతన శరీరం ఆరోగ్యంగా లేక అనారోగ్యంగా ఉందా అనే విషయం, గతంలో శరీరాన్ని సంరక్షించారా లేక దుర్వినియోగ పరిచారా అనే దానిపై ఆధారపడుతుంది. శరీరం ఆరోగ్యంగా ఉందంటే దానిని గతంలో జాగ్రత్తగా, శ్రద్ధగా చూసుకున్నట్లు అర్థం చేసుకోవాలి; కాని అనారోగ్యంతో ఉందంటే తిండిపోతుగా, త్రాగుబోతుగా, బద్ధకంతో శరీరం పట్ల అశ్రద్ధ వహించారని అర్థం. ఈ జన్మ పూర్తి అయినప్పటికి, ఏమైనా అనారోగ్యాలు, రుగ్మతలు ఉంటే తదుపరి జన్మలో పుట్టుకతో లేక కొంత కాలానికి అవి శరీరంలో వ్యక్తమౌతాయి. దీనినే వంశపారంపర్యతగా వ్యవహరిస్తారు."

"ఎవరయితే ఇతరులను అపకీర్తి పాలు చేసే విధంగా, వారిని గురించి అబద్ధపు ప్రచారాలు చెయ్యటం లేక తప్పుడు సాక్ష్యాలు ఇవ్వటం, అసత్యాలను, అబద్ధాలను ఇష్టపూర్వకంగా విని వాటికనుగుణంగా నడుచుకున్నారో, వారు చెవిటి లేక మూగవారుగా పుట్టవచ్చు."

"అంగవైకల్యం, బలహీనతలు, బాధలు అనేవి అనుకోని విధంగా వరాలుగా ఇవ్వబడతాయి. వీటిని ఏ విధంగా తీసుకోవాలంటే, వారు వేటినయితే చేయాలని అభిలాషించారో, చేయగలరో వాటిని చేయడం ద్వారా, ప్రపంచంలో అది తను చేయదగ్గ విధి నిర్వహణ (duty) గా, సరిచేసుకోవలసిన (checks) విషయాలుగా గుర్తించాలి."

"ఈ సరిచేసుకోవలసిన విషయాలు, శరీరి- నేను కు పరిశీలించుకోవటానికి, కోలుకొని బయటపడటానికి, స్వసుఖాల పట్ల వ్యామోహం, ఇంకా ఇతరుల అవసరాలు మరియు హక్కులను విస్మరించటం లాంటివి తగ్గించుకోవటానికి అవకాశాలుగా భావించాలి."

"దాతృత్వం మరియు అందం అనేవి బాహ్యీకరణ చెందిన ఆలోచనల యొక్క రూపాలే. అందం రెండు రకాలుగా ఉంటుంది. శరీర ఆకృతి లేక మొహం అందంగా ఉన్నవాళ్ళందరి ఆలోచనలు తప్పక అందంగా ఉంటాయని కాదు, తరచు ఇది తలక్రిందులుగా ఉంటుంది. చాలామంది యుక్తవయస్కులైన స్త్రీ, పురుషుల అందం ప్రకృతిపరమైన మౌళికమైన అందం (elemental beauty), దానిని సరాసరి కాంతి యొక్క మేధస్సును కలిగి ఉండటంగా భావించలేము."

" ఆలోచనా విధానం ప్రకృతికి విరుద్ధంగా లేనపుడు, శరీర ఆకృతి యొక్క తీరుతెన్నులు ఎంతో అందంగా, హుందాగా ఉంటాయి. ఇదే మౌళికమైన అందం; ఇది ఒక చామంతి లేక గులాబి పువ్వు యొక్క అందంవంటిది, పసితనం మరియు యుక్తవయసులో ఉండే సహజసిద్ధమైన అందం. ఈ అందానికి మరియు శక్తివంతమైన మేధస్సుకు సంబంధించిన చర్యల ద్వారా వ్యక్తమయ్యే అందానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఇటువంటి అందాన్ని చాలా తక్కువగా చూస్తాము. ఈ రెండు సుదూర అంశాల మధ్య ... సహజసిద్ధమైన అందానికి ప్రశాంతత మరియు జ్ఞానంతో వచ్చిన అందానికి మధ్య ... ఎన్నో దశలలో, ఎంతో అంతరముంటుంది."

"శరీరంలోని అవయవాలు, కాళ్ళు, చేతులు విశ్వానికి ఉపయోగపడే ఎంతో శక్తివంతమైన సాధనాలు (instruments) ఎవరూ కూడా వీటిని దుర్వినియోగపరచటం లేదా వినియోగించకుండా ఉండటం ద్వారా పరిహారం చెల్లించకుండా తప్పించుకోలేరు, ఎందుచేతనంటే ఇవి విశ్వం యొక్క శక్తివంతమైన సాధనాలు, ప్రతి ఒక్కరికి విశ్వం యొక్క లక్ష్యసాధనలో సహకరించటానికి ఈ అవయవాలు ఇవ్వబడ్డాయి మరియు విశ్వానికి, తన శరీరానికి ఉన్న సంబంధం పట్ల ఎరుక కలిగి ఉండాలి. ఈ అవయవాలను దుర్వినియోగపరచినా లేక ఇతరులకు హాని కలిగించటానికి ఉపయోగించినా, ఇది కనిపించే దానికన్నా చాలా గంభీరమైన విషయంగా అవగాహన చేసుకోవాలి. ఇది అన్నింటిని పరిగణలోనికి తీసుకోకుండా, సంపూర్ణతకు వ్యక్తిగతంగా నిరోధం కల్పించటమే, ఇదే విశ్వ ప్రణాళికలో జోక్యం చేసుకోవడంగా గుర్తించాలి."

"వెనువెంటనే కనబడే భౌతిక కారణాలు, వాస్తవానికి మౌళికమైనవి కావు. ఇవి కేవలం కనబడే కారణాలు మాత్రమే. ఎవరి విషయంలోనైనా, ఒక శస్త్ర చికిత్స నిపుణుడి పొరపాటు ద్వారా ఏ అవయవమో పోగొట్టుకోవలసి వస్తే, వెనువెంటనే అది ప్రమాదవశాత్తు లేక నిర్లక్ష్యం వల్లనో జరిగిందని అనుకుంటారు కాని నిజమైన కారణం వారి గత చర్యలలో లేక అక్రియలలో ఉంటుంది. ఇదే నిర్లక్ష్యం కారణంగా బాహ్యీకరణ చెందుతుంది."

"ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా ఇతరులను గాయపరుస్తారో, ఎవరైతే ఇతరులను పధకం ప్రకారం లేక ఒత్తిడి తీసుకురావడం ద్వారా, గొడవల ద్వారా శారీరక బాధలకు గురి చేస్తారో మరియు ఈ తప్పుడు పనుల ద్వారా లబ్ధి పొంది, అక్రమంగా సంపాదించి, పేరు ప్రతిష్టలను పొంది ఆనందిస్తుంటారో వారు ఈ జన్మలో కష్టనష్టాల నుండి తప్పించుకోవచ్చు కాని ఆ తప్పుడు ఆలోచన ఇంకా వారిలో ఉంది; వాని ఆలోచన ఇంకా బాహ్యీకరణ చెందలేదు, దీని నుంచి తప్పుంచుకునే అవకాశమే లేదు."

"ఈ వర్తమాన జన్మలో కాని లేక గత జన్మలో కాని ఎవరైతే దురాశ, దుర్భుద్ధి లేక తటస్థంగా వ్యవహరించడం ద్వారా ఇతరుల స్వేచ్ఛను అన్యాయంగా హరించారో అటువంటి వారు అన్యాయంగా దోషిగా విచారించబడి, నిర్ధారించబడి, జైలుపాలు అవుతారు. అతడు ప్రతికూల పరిస్థితులలో చిక్కుకుని, భయంకరమైన వ్యాధులకు గురి అవుతాడు, శరీరం అశక్తంగా తయారవుతుంది, నైతిక విలువలు లేకుండా ఉంటాడు తద్వారా అటువంటి వారి పట్ల దయతో మెలగాలని, నిందారోపణలు చేయకూడదని, ఇతరుల స్వేచ్ఛను, ఆరోగ్యాన్ని హరించే విధంగా మసలుకోకూడదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు."

"ఒక ప్రత్యేకమైన సందర్భంలో, పుట్టుకతో వచ్చేది శిక్షగా భావించవచ్చు. అనేకానేక గతజన్మలలో వ్యామోహాలకు బానిసలై, కేవలం తమ స్వసుఖాలకు ప్రాముఖ్యతనిచ్చి, అన్ని పనులలో రుణాలే కాని ఇచ్చిన దాఖలాలు లేకపోవటం యొక్క ఫలితమే నేటి పరిస్థితిగా గుర్తించాలి."

💖 ఎస్. పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment