నిజమైన సంపద.
పెద్దపెద్ద భవంతులు, ఎకరాలకొద్దీ పొలాలు, విలాసవంతమైన జీవితం, ఖరీదైన వాహనాల్లో ప్రయాణం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం సంపదగా పరిగణిస్తాం. డబ్బుతోనే గొప్పతనం, గౌరవం వస్తాయనే ఆలోచన కొంతవరకు వాస్తవమే అయినా నిజమైన సంపద ఇది కాదు!
మనిషి ఏదైనా సాధించడానికి శరీరమనే ఉపాధి కావాలి. ఇది ఉన్నంతవరకే మనమేమి చేయాలనుకున్నా, ఏ లక్ష్యాన్ని చేరాలనుకున్నా సాధ్యమయ్యేది. అందువల్ల దీన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. ఇహపర సాధనకు సాధనం ఈశరీరమే.
కష్టకాలంలో మన పక్కన స్నేహితులను కలిగి ఉండటమన్నది, ఎంతో గొప్ప సంపద. సంస్కారవంతులుగా, జ్ఞానవంతులుగా మనల్ని తీర్చిదిద్దేది చదువు. విచక్షణ, వివేకాలనే చక్షువులనిచ్చి మనిషిని సన్మార్గంలో పయనించేటట్లు చేస్తుంది. తన పుట్టుకకు ఇతర ప్రాణుల పుట్టుకకు భేదాన్ని తెలుసుకునే మేధనిస్తుంది. ఈ సకల చరాచర సృష్టిలో తన స్థానాన్ని, ప్రాముఖ్యాన్ని, కర్తవ్యాన్ని మనిషికి బోధపరచేది చదువే. అది చాలా విలువైన సంపద.
మనిషి ఒంటరిగా జీవించలేడు. ఎదుటివారితో ఎలా మసలుకోవాలో, ఎలా సంభాషించాలో ప్రథమంగా తన కుటుంబ సభ్యులనుంచి, తన పెద్దలనుంచి గ్రహించాలి. వారి సత్ప్రవర్తనను అలవరుచుకోవాలి. అది సమాజంలో తోటివారితో ప్రవర్తించే తీరుపై ప్రతిబింబించి సత్ఫలితాలనిస్తుంది. సంబంధ, బాంధవ్యాలను నిలుపుకొనే విధంగా మన ప్రవర్తన ఉండాలి. అప్పుడే మన బంధాలు హాయిగా సాగిపోతాయి. అందరినీ కలుపుకొనే స్నేహపూర్వక ప్రవర్తన మనకు ఐశ్వర్యం లాంటిదే.
సంపదంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించడం కాదు. మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడం అంతకన్నా కాదు. అలాగని ఎక్కువగా పొదుపు చేయడమూ కాదు! సంపాదన ఒక స్థాయికి చేరుకున్న తరవాత ఇక సంపాదించవలసిన అవసరంలేదన్న భావన కలగడం. దాన్నే తృప్తి అంటారు. అది మనిషికి కలగనినాడు అశాంతికి గురవుతాడు. మనశ్శాంతి కరవవుతుంది. కంటిమీద కునుకే ఉండదు. తృప్తి కొంతమందికే దక్కే అరుదైన సంపద.
తమ సృజనతో అద్భుతమైన రచనలు చేసేవారు, నిష్ణాతులైన కళాకారులు, రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులు, ప్రయోగశాలలో అహరహం పరిశోధనలు చేస్తూ మానవాళికి ఉపకరించే అనేక వస్తువులకు రూపకల్పన చేసే శాస్త్రవేత్తలు, భావితరాలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని రక్షించే సైనికులు... ఏ దేశానికైనా విలువైన సంపద.
మహాపురుషులందించిన జ్ఞానసంపద, మన పూర్వీకులందించిన విజ్ఞానం, పెద్దలు మనకోసం ఏర్పరచిన సదాచారాలు, సత్సంప్రదాయాలు, మన జీవితానికొక క్రమశిక్షణను, పథాన్ని ఇస్తాయి. వాటిని పాటిస్తూ, వారు చూపిన ధర్మపథంలో కొనసాగడమే ఆ వారసత్వ సంపదకు మనమివ్వగలిగే నిజమైన గౌరవం. అది ఘనమైన సంపద.
దాస్యశృంఖలాలను బద్దలుచేసి దేశమాతకు స్వేచ్ఛా ఊపిరులూదడంలో తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయిన ఎందరో త్యాగధనులు తరతరాలు మనసులో నిలుపుకోవలసినవారు. వారు జాతికి అమూల్యమైన సంపద.
‘మనిషి కడవరకు తోడు ఉండాల్సిదేమిటి?’ అని యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజును అడుగుతాడు. మనోబలమని సమాధానమిస్తాడు యుధిష్ఠిరుడు. మనవెంట ఎవరున్నా, ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు. మనిషి తుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద.
సంపద అనగానే మనకు వచ్చే లౌకిక దృష్టి, భావనల నుంచి బయటపడి నిజమైన సంపదను గుర్తెరగాలి. జీవితానికొక ఔన్నత్యం చేకూరేదప్పుడే.
సేకరణ. మానస సరోవరం
Source - Whatsapp Message

No comments:
Post a Comment